

07.06.2011 మంగళవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయినాథుడే నాకు జన్మించాడు
సాయి బంథువులందరకు బాబా వారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రిమతి ప్రియాంకా గారి బ్లాగులో ప్రచురింపబడిన ఒక సాయి లీలను తెలుసుకుందాము. ఈ లీలను మలేసియా నించి శ్రీమతి రిమ్మీ గారు పంపించారు. ఈ అనుభవం వారి మాటలలోనే తెలుసుకుందాము. ఈ లీల చదివితే బాబా కి అసాథ్యమన్నది లేనే లేదు, అసాథ్యాలని కూడా సుసాథ్యం చేయగలరని తెలుస్తుంది. నమ్మలేని అద్భుతం ఈ సాయి లీల.
అమ్మాయి ప్రియాంకా సాయిరాం,
మలేసియానించి నేను రిమ్మీని. గడచిన రెండు మూడు నెలలనుంచి నేను మీ బ్లాగును క్రమం తప్పకుండా చదువుతున్నాను. నీ బ్లాగు, నా స్వీయానుభూతిని మైల్ చేయమని నాకు ప్రేరణ కలిగించింది. నీకిది మైల్ చేసే ముందు నేను సంధిగ్థావస్తలో ఉన్నాను, యెందుకంటే ఈ కథ చాలా రహశ్యమైనదీ, మా కుటుంబానికి సంబంథించి వ్యక్తిగతమైనది. కాని ప్రపంచ వ్యాప్తంగా అందరి అనుభూతులను చదివిన తరువాత, నేను కూడా ఈ విచారకరమైన నా కథను కూడా రాయాలని నిశ్చయించుకున్నాను.
ప్రియాంకా, మాది భారత దేశంలోని పంజాబు. 35 సంవత్సరాల క్రితమే మేము మలేసియాలో స్థిరపడ్డాము. మా జీవితంలో ప్రతీదీ చాలా చక్కగా జరుగుతున్నాయి. మాకు యిద్దరు అబ్బాయిలు, చాలా విలాసవంతమైన జీవితం వారిది. నిజానికి మంచి జీవితం గడపడానికన్న యెక్కువే ఉంది. మా యిద్దరబ్బాయిలకీ రెండు సంవత్సరాల తేడా ఉంది. వాళ్ళిద్దరూ కూడా చదువులో మనచి తెలివితేటలు కలవారు.
ఒక్ రోజున నేను, మా పెద్ద అబ్బాయి, బజారుకు వెళ్ళాము. తిరిగి వచ్చేటప్పుడు మా కారు కి చాలా పెద్ద ప్రమాదం జరిగింది. నాకు తెలివి తప్పిపోయింది. ఆరోజున మాకు యేమి జరిగిందో కూడా నాకు సరిగా తెలియదు. రెండు రోజుల తరువాత నాకు స్పృహ వచ్చి, నా భర్తని అబ్బాయి గురించి అడిగాను. ఆయన, అబ్బాయికి బాగానే ఉందని యింట్లో నిద్ర పోతున్నాడని అందుచేత ఆందోళన పడద్దు అని చెప్పారు. నేను నిద్రపోయాను. నిద్రలో నేనొక కల గన్నాను, అందులో బాబా మా అబ్బాయిని తీసుకుని వెడుతూ చెప్పారు, విచారించద్దు నేను నీ కొడుకుగా ఉంటాను. ఈ కల చాలా చిన్నది. హటాత్తుగా నేను నిద్ర లేచి బెల్ కొట్టాను. ఒక నర్స్ వచ్చి యేంజరిగిందని అడిగింది. నేను నాకు వచ్చిన కల గురించి చెప్పి యేడవడం మొదలుపెట్టాను. నర్స్ కూడా నాతోపాటు యేడవడం మొదలుపెట్టిది, అబ్బాయి మరణించిన విషయం తనకు తెలుసును.
ఆమె కన్నీళ్ళు నాకు సమాథానం చెప్పాయి. నేను మళ్ళీ తెలివితప్పిపోయాను. 3 గంటల తరువాత నాకు స్పృహవచ్చాక, నన్ను యింటికి తీసుకుని వెళ్ళమని మా ఆయనని అడిగాను. డాక్టర్ దగ్గిర ప్రత్యేకంగా అనుమతి తీసుకుని నన్ను యింటికి తీసుకుని వెళ్ళాను. మా చిన్నబ్బాయి కూడా షాక్ లో ఉన్నాడు. రికీ లేడనే విషయాన్ని నమ్మలేక నేను పిచ్చిదానిలా అయిపోయాను. యేమైనప్పటికీ బాబా దయవల్ల కోలుకున్నాను, కాని మానసికంగా కృంగిపోయాను. నేనెప్పుడు నిద్ర పోయినా నాకు ఆ కలే వస్తూ ఉండేది. ఒకరోజున నేను ఈ కల గురించి మా ఆయనకు చెప్పాను. అప్పుడాయన, చూడు, రిమ్మీ అది ఒక కల మాత్రమే. నీకిప్పుడు మెనోపాజ్ కూడా వచ్చింది నీకింక పిల్లలు పుట్టరు. నేనాయనక మాటలకి నిజమే అనుకున్నాను. కాని బాబా కల అబథ్థం అవడానికి వీలు లేదు.
రెండు నెలల తరువాత ఒక రోజున నాకు వికారంగా అనిపించింది. బహుశా వేపుళ్ళు తినడం వల్ల అయి ఉండచ్చనుకున్నాను, యెందుకంటే సాథారణంగా అలాంటి వేపుడు పదార్థాలు తిన్నప్పుడు నాకు అలా ఉంటూ ఉండేది. కాని ఆ వికారం యింకా అలాగే ఉండటంతో డాక్టర్ వద్దకు వెళ్ళాను. డాక్టర్ గారు అన్ని పరీక్షలూ చేశారు. కాని 56 సంవత్సరాలున్న స్త్రీ గర్భవతి అవుతుందని యెన్నడూ అనుకోడు. ఓహ్ ...మై గాడ్ ... ప్రియాంకా అదే బాబా చేసిన అద్భుతం. నేను మా ఆయనకి గర్భవతినైన విషయం చెప్పినప్పుడు తను కూడా నమ్మడానికి సిథ్థంగా లేరు. సరే యింక ఈ పెద్ద కథని కుదించేస్తాను. జనవరి 25, 2007 సంవత్సరంలో నాకు అబ్బాయి పుట్టాడు. నేను గర్భంతో ఉన్న సమయంలో నా వయసు రీత్యా నాకు యెటువంటి సమస్యలు రాలేదు. ఈ 9 నెలలూ యెలా గడిచాయో కూడా నాకు తెలియదు.
బాబా తన మాటని నిలబెట్టుకుని మాయింట జన్మించి నాకు కొడుకుగా వచ్చారు. మేము మా అబ్బాయిని సాయినాథ్ అని పిలుస్తాము, మాకు ఆశ్చర్యం కలిగించిన విషయమేంటే, వాడికి మాటలు వచ్చేముందు, మాట్లాడిన మొట్టమొదటి మాట మామా కాదు పాపా కాదు బాబా ... బాబా.. బాబా.
యిప్పుడు మా పెద్ద అబ్బాయి వయస్సు 23 సంవత్సరాలు. చిన్న అబ్బాయి వయస్సు 3 సంవత్సరాలు. సాయినాథ్ జన్మించాక నాకు మళ్ళి ఆ కలరాలేదు, యెందుకంటే బాబాయే మాయింటిలో మా కొడుకుగా ఉన్నారు.
ప్రియాంకా నువ్వు ఈ బ్లాగుకు చేస్తున్న సేవకు నేను చాలా ముగ్థురాలినయ్యాను. నాకింకా నీ బ్లాగంటే ఇష్టం యెందుకంటే యిందులో ఉన్న కథలన్నీ యదార్థాలు. యెప్పుడు ఇలాగే యింకా తరచూ యిటువంటివి ప్రచురిస్తూ ఉండు.
శుభాకాంక్షలు మరియు దీవెనలతో
నీ రిమ్మీ ఆంటీ.
చూశారా, యిప్పుడు బాబా చేసిన ఈ అద్భుత లీల గురించి మనమేమి చెప్పగలం. యిటువంటి అద్భుతమైన సాయి లీలను రాసినందుకు నేను రిమ్మీ ఆంటీని అభినందిస్తున్నాను. నీకు నీ కుటుంబమంతటికి నా అభినందనలు.
అల్లా మాలిక్
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment