Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, August 11, 2020

భగవంతుని దూత

Posted by tyagaraju on 7:40 AM
         Pin by เทวดา Ling on Sai Baba Shirdi | Sai baba wallpapers, Hindu ...
         Free download Beautiful Yellow Roses Widescreen HD Wallpaper ...


11.08.2020  మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ కృష్ణజన్మాష్టమి శుభాకాంక్షలు

రోజు మీకొక అధ్భుతమయిన విషయాన్ని అందిస్తున్నాను.  రోజు బాబాని ఏదయిన ఆసక్తికరమయిన విషయాన్ని చూపించమని అడిగాను.  రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభసందర్భంగా దానికి తగినట్లుగానే  సాయిపదానంద మాసపత్రికలో కనిపించింది.  మీరు కూడా చదివి ఆధ్యాత్మికానందంలో విహరించండి.

దీనికన్న ముందుగా మరొక బాబా సందేశం.
నా సందేహాలకు బాబా వారి సమాధానాలలో మరొక భాగమ్

దాదాపు 15 సంవత్సరాల క్రితం నేను శ్రీ శ్రీ రవిశంకర్ గారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ మొదటి భాగం నరసాపురంలో ఉండగా నేర్చుకొన్నాను.  ఇప్పుడు ఆగస్టు 13 .తేదీనుండి మూడు రోజుల పాటు అడ్వాన్స్ కోర్స్ ఆన్ లైన్ ద్వారా నేర్పుతున్నారని తెలిసి బాబాని ధ్యానంలో అడిగాను.  అందులో మంత్రోపదేశం ఉండదనే భావంతో, బాబా ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్చుకోమంటారా వద్దా అని 09.08.2020 న అడిగాను.  బాబా ఈ రోజు అనగా 11..08.2010న సమాధానమిచ్చారు.  (బాబాని నమ్ముకున్నవాళ్ళకు ఎటువంటి మంత్రోపదేశాలు అవసరం లేదు)  
బాబా ఇచ్చిన సమాధానమ్ -  “  84  “


ఇక ధ్యానంలోనుండి లేచి, శ్రీ ప్రత్తి నారాయణరావుగారు రచించిన శ్రీ సాయి సత్ చరిత్ర 84 .పేజీ తీసి చూసాను….
పేజీ మొదట్లోనే బాబా సందేశం ఉంది

సంసారమనే సాగరమును దాటుటకు సద్గురువనే సరంగుపై పూర్తి నమ్మకముంచవలెను.  భక్తులయొక్క యంతరంగమున గల భక్తిప్రేమలను బట్టి, సద్గురువు వారికి జ్ఞానమును, శాశ్వతానందమును ప్రసాదించును.”

ఇది చాలదా ఆయన ఎందుకని వద్దని చెప్పారో.  ఒక సద్గురువును నమ్ముకున్నప్పుడు ఆయన మీదే మనం విశ్వాసముంచి ఆయననే ధ్యానించుకోవాలి.  ఇక వేరే మంత్ర తంత్రాలేమీ అవసరం లేదు. ఇక ఈ రోజు అధ్భుతమయిన భగవంతుని లీలను చదవండి.

భగవంతుని దూత

శ్రీ ఆర్. శేషాద్రి గారు ఆంగ్లంలో వ్రాసినదానికి తెలుగు అనువాదమ్
శ్రీ సాయిలీల.అర్గ్ లోని సాయిపదానంద మాసపత్రిక ఏప్రిల్, 2017 సంచికనుండి గ్రహింపబడినది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు,
నిజాంపేట, హైదరాబాద్
                                                    
ఆత్మ జ్ఞానం సంప్రాప్తించాలంటే ధ్యానం అవసరం.  కోరికలు లేకుండా అనగా నిష్కామంగా సర్వప్రాణులలో ఉన్నటువంటి భగవంతుని మీదనే మనసు లగ్నం చేసినపుడే మన లక్ష్యాన్ని సాదించగలము.
                                            S.Y. G. ఆచార్య

నాయొక్క ప్రధమ గురువు మా తండ్రిగారయిన శ్రీ S.Y.G. ఆచార్యగారేనని మా బంధువులందరికీ తెలుసు.  ఆయన బెంగళురు, చెన్నైలలో ఉన్నప్పుడల్లా శ్రీ రాధాకృష్ణస్వామీజీ గారిని కలుసుకుంటూ ఉండేవారు.  డిసెంబరు 1965.సంవత్సరంలో స్వామీజీ శ్రీ ఆచార్యగారి దగ్గరకు భగవంతునినుండి దూతగా ఒక సందేశాన్ని తీసుకొని వెళ్ళారు.  దాని గురించి ఆచార్యగారు విధంగా వివరిస్తున్నారు.
       10.5 Radhakrishna Swamiji | By taking complete refuge in Him… | Flickr
   (శ్రీ రాధాకృష్ణ స్వామీజీ)

నేను 1965 .సంవత్సరంలో బెంగళూరు వెళ్ళాను. ఒకరోజు నేను (జనవరి 26.తేదీ 1966 .సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని) పడుకునేముందు భగవంతుడిని ప్రార్ధించుకొన్నాను.  తెల్లవారుజామున ఒక కల వచ్చింది.  కలలో ఒక సందేశం ఆంగ్లంలో కనిపించింది.  నేను దానిని చదవలేకపోవడంతో అక్షరాలను కాస్త పెద్దవిగా స్పష్టంగా కనిపించేలా చేయమని ప్రాధేయపడ్డాను.  ఆ వెంటనే అక్షరాలు చాలా పెద్దవిగా స్పష్టంగా కనిపించాయి.
నువ్వు మరణాన్నుండి తప్పించుకొన్నావు

నేను వెంటనే లేచి నాకు వచ్చిన కలగురించి మా అబ్బాయి శేషాద్రికి చెప్పాను.  ఇది విన్నతరువాత మా అబ్బాయి చాలా సంతోషించాడు. వాడితోపాటు  నేను కూడా చాలా సంతోషించాను.

నవంబరు, 1965.సంవత్సరంలో నేను మద్రాసుకు తిరిగి వచ్చాను.  నాకు జ్యోతిష్యం తెలుసు.  నాజాతకంలో గ్రహాల ప్రభావం ఎలా ఉందోనని  అందులో నిజమెంతోనని పరిశిలించాను.  చూడగానే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది.  దశ అంతర్దశలే కాక, గోచారాల పరంగా కూడా గ్రహాలన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి.  అది పూర్తిగా పరిశీలించిన తరువాత నామనసంతా అల్లకల్లోలమయింది.

నవంబరు 28.తారీకు రాత్రి బరువెక్కిన హృదయంతో శ్రీ కృష్ణుడిని చాలాసేపు ప్రార్ధించుకుని నిద్రకుప్రక్రమించానునాప్రార్ధనలకి ఏమీ సమాధానం రాలేదునామనస్సు మరింతగా కలవర పడింది.

ఒక వారం తరువాత డిసెంబరు 5.తారీకున బెంగళూరునుంచి శ్రీరాధాకృష్ణ స్వామీజీ గారు వచ్చారు.  ఆయన గురువయ్యూర్ నుండి శ్రీకృష్ణుని నుంచి ఒక సందేశాన్ని నాకోసం తీసుకువచ్చానని అన్నారు.
       பொன்மழை பொழியும் கனகதாரை | Krishna statue ...
      White Butter (Safed Makhan) – How to make Safed Makhan at home?
 మీరు గాని శ్రీకృష్ణుడిని ప్రార్ధించారా అని నన్ను ప్రశ్నించారు.  జనవరి, 26, 1966.సంవత్సరంలో జరగబోయే ప్రాణ గండాన్నుంచి తప్పించి, నాకు ఆయుష్షును ప్రసాదించమని నవంబరు, 28.తారీకున రాత్రి ప్రార్ధించినట్లుగా చెప్పాను.  ఆయన భగవంతుడు పంపించిన సందేశాన్ని నా చేతిలో పెట్టారు.  నేను రాత్రి ప్రార్ధించుకున్న తేదీ, సందేశం వచ్చిన తేదీ రెండూ ఒక్కటే కావడంతో మేమిద్దరం చాలా ఆశ్చర్యపోయాము.  జనవరి, 26, 1966 నుండి నా ఆయువు ఇంకా పొడిగింపబడిందనే విషయం ఆ పరమాత్ముడు పంపించిన సందేశం ద్వారా నిర్ధారణయింది.

నా శరీరంలో ఒకవిధమయిన వణుకు మొదలయింది.  స్వామీజీకి సాష్టాంగపడ్డాను.  నాకు కొండంత ధైర్యం వచ్చింది.  ఆయన ఇచ్చిన సందేశం కాగితం తీసుకుని నాపూజాగదిలో ఉన్న కృష్ణుని పాదాలముందు పెట్టి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకొన్నాను.  ఇక సందేశం ఎలా వచ్చిందని నేను స్వామీజీని అడిగాను. 

ధర్మపరాయణుడయిన ఒక గుజరాతీ భక్తుడు ఒకవారం రోజులపాటు తన కారును ఉపయోగించుకోమని స్వామీజీకి ఇచ్చాడు.

అపుడు స్వామీజీ మరికొంతమంది భక్తులతో కలిసి కారులో గురువయ్యూర్ వెళ్ళి నవంబరు, 28, 1965 శ్రీకృష్ణుని దర్శనం చేసుకొన్నారు.  ఆరోజు రాత్రి పడుకున్న తరువాత కలలో శ్రీకృష్ణుడు దర్శనమిచ్చి సందేశాన్ని నాకు ఇమ్మని చెప్పాడట.  వెంటనే స్వామీజీ లేచి ఆసందేశాన్ని ఒక కాగితం మీద వ్రాసుకొన్నారు.  సందేశాన్ని ఇపుడు నాకు ఇచ్చారు.”

స్వామీజీ గురువయ్యూర్ లో ఉండగా నవంబరు, 28, 1965 శ్రీకృష్ణపరమాత్మ ఇచ్చిన సందేశం

ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారిని విధి ఏమీ చేయలేదు.  మానవుడు తాను విపత్తులు, అనారోగ్య పరిస్థితుల వలలో చిక్కుకొని ఉన్నప్పుడు వాటినుండి బయటపడలేక తన విధివ్రాతను నిందించుకొంటూ ఉంటాడు.  వాస్తవంగా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా కావలసినంత శక్తి, భగవంతునిపై విశ్వాసం లేకపోవడమే విధంగా విధిని నిందించడానికి గల కారణం.  కాని భగవంతుని కృపమీదనే ఆధారపడి ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నవారు దేనికీ భయపడనవసరం లేదు.  అంతే కాదు, నేడు కలుషితమయిన వాతావరణానికి కూడా భయపడనవసరం ఎంతమాత్రం లేదు.  ఎంతో మెళకువగా ఆ కలుషితానికి గురికాకుండా దానినుంచి మనం దూరంగా ఉండాలి.”

శ్రీ కృష్ణపరమాత్మ చూపించిన అద్భుతానికి మేమిద్దరం చాలా ఆశ్ఛర్యపోయాము.  ఆమరుసటిరోజే స్వామీజి తిరిగి బెంగళురుకు వెళ్ళిపోయారు.
          Adi Kumbeswarar Temple, Kumbakonam - Wikipedia
ఆఖరి రెండు, మూడు సంవత్సరాలు శ్రీ ఆచార్యగారు మాతోపాటే బెంగళూరులోనే ఉండి స్వామీజీని కలుసుకుంటూ ఉండేవారు.  ఎన్నో పవిత్ర దేవాలయాలకు నిలయం,  కావేరీ, చక్కర ఘాట్ లు ఉన్న కుంభకోణంలో తనను వదిలిపెట్టమని 1983.సంవత్సరంలో ఆయన నన్నడిగారు.  ఆయన అక్కడ ప్రార్ధనలు, ధ్యానం చేసుకుంటూ కొన్ని నెలలు మాత్రమే ఉన్నారు.  అష్టాక్షరిని శ్రవణం చేస్తూ ప్రశాంతంగా ఆయన తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టారు.

(ఈ లీల ద్వారా భగవంతుడు తలచుకుంటే జాతకాలలో ఉన్న గ్రహస్థితులను కూడా మార్చగలడు.  అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నవే కదా.)
(భగవంతుడు ఏవిధంగా ముందే హెచ్చరించాడో గమనించండి.  నేడు కరోనాతో ప్రపంచం మొత్తం కలుషితమయిపోయింది.  భగవంతుని కృపను మనం పొందడానికి నిరంతరం ఆయననే స్మరిస్తూ, ఆ కరోనా మనకి అంటకుండా మన జాగ్రత్తలో మనముండాలి.... అది అంటకుండా ఉండాలంటే మన ఇంటిలో మనం సురక్షితంగా ఉండాలి.  ఈనాడు ప్రతివారు మనకి తెలియ చేస్తున్న సూక్తి..ఇదేగా... STAY HOME STAY SAFE ... త్యాగరాజు )

(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List