07.08.2020 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు మరొక అధ్బుతమయిన బాబా చూపించిన లీలను ప్రచురిస్తున్నాను.
రాజమండ్రీలోని ప్రముఖ
న్యూరో సర్జన్ డా.ఎమ్. ఫణికుమార్ గారికి బాబాతో వారికి కలిగిన అనుభవం సాయిలీల ద్వైమాసపత్రిక నవంబరు –డిసెంబరు నెలలో ప్రచురితమయింది. (Saibaba answered our prayer by
His Love and care on us). బాబా
తన భక్తులను అన్నివేళలా కనిపెట్టుకుని ఉంటూ ఏవిధంగా సహాయం చేస్తారో ఈ లీల ద్వారా మనకు అర్ధమవుతుంది.
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
నిజాంపేట, హైదరాబాద్
ఫోన్ .
9440375411 & 8143626744
బాబా చేసే సహాయం అనూహ్యం
2018వ.సంవత్సరం సెప్టెంబరు, 27వ.తారీకున నేను, నాభార్య డా.ప్రగతి ఇద్దరం మా అమ్మాయి అక్షర పుట్టినరోజు సందర్భంగా తనకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపడానికి రాజమండ్రినుండి విజయవాడ వెళ్ళాము.
మా
అమ్మాయి గుంటూరులోని S R M యూనివర్శిటీ అమరావతి లో
బి.టెక్. చదువుతోంది.
ఆ తరువాత తిరుగు తిరుగుప్రయాణంలో జాతీయ రహదారి మీద 20 కి.మీ.దూరం ప్రయాణించిన తరువాత మా కారు టైరు పంక్చర్ అయింది.
అపుడు
మధ్యాహ్నం 3 గంటలయింది.
ఎండ
తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.
ఎక్కడా
మనుష్యసంచారం
లేదు. రహదారంతా
నిర్మానుష్యంగా
ఉంది.
సహాయంచేయడానికి ఎవ్వరూ కనిపించటంలేదు. నేను, నాభార్య ఇద్దరం ఒంటరిగా నిలబడిపోయాము. నాభార్యకు షిర్దీ సాయిబాబాయందు ప్రగాఢమయిన భక్తిప్రపత్తులు ఉన్నాయి.
సహాయంచేయడానికి ఎవ్వరూ కనిపించటంలేదు. నేను, నాభార్య ఇద్దరం ఒంటరిగా నిలబడిపోయాము. నాభార్యకు షిర్దీ సాయిబాబాయందు ప్రగాఢమయిన భక్తిప్రపత్తులు ఉన్నాయి.
తను రహదారిమీద వెళ్ళేవాళ్లని సహాయం అడగడానికి ప్రయత్నించింది.
కాని
ఎవ్వరూ తమ వాహనాలను ఆపలేదు.
మమ్మల్ని
ఎవరూ పట్టించుకోలేదు.
ఒక
ట్రక్ డ్రైవర్ మాకు సహాయం చేయడానికి ఆగాడు.
పంక్చర్
అయిన టైర్ తీసేసి స్టెఫినీ మారుస్తానని చెప్పాడు.
అది అంతకుముందే ఒకసారి పంక్చరయిన స్టేఫినీ. తనవద్ద
ఉన్న పనిముట్లతో పంక్చర్ అయిన టైర్ తీయడానికి ప్రయత్నించాడు.
కాని
ఎంతప్రయత్నించినా
వాటి స్కౄలు రాలేదు.
స్కౄల
థ్రెడ్స్ బాగా అరిగిపోయినందువల్ల రెంచికి అసలు పట్టు దొరకటంలేదు.
ఇక
లాభంలేదని చెప్పి అక్కడినుండి 5 కి.మీ.దూరంలో ఉన్న పంక్చర్ షాప్ కి టెంపోలో వెళ్ళి అక్కడినుండి ఎవరయినా
మెకానిక్ ని తీసుకురమ్మని చెప్పాడు. ఆసమయంలో
ఏమిచేయాలో నాకేమీ అర్ధం కాని పరిస్థితి.
ఎటూ
నిర్ణయించుకోలేకుండా
ఉన్నాను. నాభార్య
వంటినిండా బంగారు ఆభరణాలున్నాయి.
ఆమెని
ఇంకా అక్కడె ఉన్న ట్రక్ డ్రైవర్ దగ్గర వదలి అయిష్టంగానే టెంపోలో ఎక్కి, పంక్చర్
షాప్ కి బయలుదేరాను. అది ఎక్కడుందో కూడా తెలీదు. 5 కి.మీ.ప్రయణించిన తరువాత ఒక పంక్చర్ షాపు కనిపించింది.
అక్కడ
ఉన్న మెకానిక్ సమస్యంతా విని అది బాగుచేయడం కుదిరే పని కాదన్నాడు. షోరూమ్ వారికి ఫోన్ చేసి వాళ్ళ సహాయం తీసుకోమని చెప్పాడు. 30 కి.మీ. దూరంలో విజయవాడలో తప్ప దగ్గరలో షోరూమ్ ఎక్కడా లేదు.
నాభార్యను రాజమండ్రి పంపిస్తే బాగుంటుందనే ఆలోచనతో కాబ్ బుక్ చేసాను.
నేను ఆగిపోయి షో రూమ్ నుండి వచ్చే వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉందామనుకున్నాను. ఈ విధంగా ఆలోచిస్తూ టెంపోలో తిరిగి వెనక్కి వచ్చాను.
నేను
పంక్చర్ షాప్ కి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి 30 నిమిషాలు పట్టింది.
టెంపోలో తిరిగి వెనుకకి వస్తున్నంత సేపు నా ఆలోచనలన్ని ఒంటరిగా కారువద్దే ఉన్న నా భార్యమీదనే ఉన్నాయి. ఆమె క్షేమం గురించే నా ఆందోళనంతా. మనసంతా అస్థిమితంగాను భయంగాను ఉంది.
మాకారు
ఆగిపోయిన చోటుకి చేరుకున్నాను. అక్కడ కనిపించిన దృశ్యం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడ ట్రక్ డ్రైవర్ తో ఇద్దరు కుఱ్ఱవాళ్లు కనిపించారు.
అప్పటికే
పంక్చర్ అయిన టైర్ తీసేసి స్టెఫినీ మార్చేసారు.
నాభార్య
జరిగినదంతా చెప్పింది.
నేనక్కడినుంచి బయలుదేరిన తరువాత హైవే పెట్రోల్ కారు వచ్చింది.
వారు
నాభార్యని సమస్య ఏమిటని అడిగారు.
వారు
కూడా టైరు మార్చడానికి ప్రయత్నించారు కాని, సాధ్యం కాలేదు.
ఇక
ఆఖరికి షొరూమ్ వాళ్ళకి ఫోన్ చేసి మెకానిక్ ని రప్పించమని వారు కారుని తాడుతో కట్టి తీసుకువెళ్ళాల్సిందేనని చెప్పారు.
ఈలోగా
నాభార్యని కారులోనే కూర్చోమని, డొర్స్ లాక్ చేసుకొని
AC వేసుకోమని
చెప్పి వెళ్ళిపోయారు.
ఇది జరిగిన 10 నిమిషాల తరువాత
అప్పటికి
నేనింకా టెంపోలో వస్తూ ఉన్న
సమయంలోనె, అనుకోకుండా
ఎక్కడినుంచి
వచ్చారో ఇద్దరు కుఱ్ఱవాళ్ళు ఎదురు దిశనుండి నేరుగా
మాకారు దగ్గరకు వచ్చారు.
వారు
నాభార్యను ఏమన్నా సహాయం కావాలా అని అడిగారు.
నాభార్య
వాళ్ళని పంక్చర్ షాపునుంచి నేనే పంపించాననుకుంది.
కాని
ఆమె ఊహ తప్పు.
నేనెవరినీ
పంపించలేదు. నా
భార్య అడిగిన మీదట వారు ఎదర ఉన్న ఒక బైక్ షో రూమ్ నుండి తాము వస్తున్నామని చెప్పారు.
వెంటనే
ఆ ఇద్దరూ సంచీలోనుంచి తమ వద్ద ఉన్న కొన్ని పనిముట్లను తీసారు.
అయిదు
నిమిషాలలోనే
టైరు మార్చారు.
ట్రక్ డ్రైవర్ ఇంకా అక్కడే ఉన్నాడు. ఆ ఇద్దరు కుఱ్ఱవాళ్ళు అంత లాఘవంగా అయిదు నిమిషాలలోనే టైర్ మార్చడం ట్రక్ డ్రైవర్ కు ఒక మాయాజాలంలా అనిపించింది.
నా
భార్య వాళ్ళిద్దరికి రూ.100/- ఇచ్చింది.
నేనక్కడికి
చేరుకునేటప్పటికి
వాళ్ళిద్దరు
అప్పుడే పనిముగించుకొని వెళ్ళడానికి సిధ్ధంగా ఉన్నారు.
నేను వారికి కృతజ్ఞతలు చెప్పి ప్రతిఫలంగా నా పర్సులోనుండి డబ్బుతీసి ఇవ్వబోయాను.
నాభార్య
తను డబ్బు ఇచ్చేసానని చెప్పింది.
స్టెఫినీ
టైర్ కూడా అప్పటికే పంక్చర్
అయింది కాబట్టి నేను ముందుకు ప్రయాణం చేయవచ్చా అని అడిగాను.
20 కి.మీ.దూరంలో ఏలూరు వస్తుందని, అక్కడి షోరూమ్ లొ నాలుగు టైర్లూ మార్పించి రాజమండ్రికి వెళ్లమని సలహా ఇచ్చారు ఆ ఇద్దరు కుఱ్ఱవాళ్ళు.
ఆ తరువాత వాళ్ళిద్దరూ తాము వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోతూ మాయమయ్యారు.
వాళ్ళిద్దరు చెప్పినట్లుగా మేము ఏలూరుకు క్షేమంగా చేరుకొన్నాము.
నేను
తిన్నగా M R F షోరూమ్ కు వెళ్ళి కారుకు అన్ని టైర్లు మార్చమని చెప్పాను.
చాలా
ఆశ్ఛర్యకరమయిన
విషయం ఏమిటంటే వాళ్ళు తమ వద్ద ఉన్న పనిముట్లతో ఎంత ప్రయత్నించినా ఏ చక్రానికి ఒక్క స్కౄ కూడా
ఊడి రాలేదు.
ఇక
పనిముట్లతో సాధ్యంకాదని స్కౄలన్నిటిని విరగగొట్టి తీయాల్సిందేనని చెప్పారు.
ఇక
అంతకన్నా వేరే మార్గం లేదన్నారు.
ఆఖరికి
16 స్కౄలను విరగగొట్టటానికి ఒక గంట సమయం పట్టింది.
సాయిబాబా వెంటనే స్పందించి నామీద నాభార్యమీద తమ అనుగ్రహాన్ని కురిపించారు.
ఆయన
కన్నుమూసి కన్ను తెరిచేంతలో కారుటైర్లు మార్పించారు. ఆ తరువాత ఏమి చేయాలో కూడా మంచి సలహా ఇచ్చారు.
అంత అకస్మాత్తుగా భగవంతుడె పంపించాడా అన్నట్లుగా పనిముట్లతో ఇద్దరు కుఱ్ఱవాళ్ళు నిర్మానుష్యమయిన రహదారి మీదకు ఎలా వచ్చారు? చూసేవాళ్ళకి దిగ్భ్రమ కలిగేలా క్షణంలోనే పని పూర్తిచేసారు.
చాలా
చిన్న మొత్తం కేవలం వందరూపాయలతో సంతృప్తి చెంది వెళ్ళిపోయారు.
సెప్టెంబరు 27 వ.తారీకున ఊహించని రెండు సంఘటనలను జరిగాయి. వాటిని తిరిగి ఇపుడు గుర్తుకు తెచ్చుకుంటే చాలా అధ్బుతమనిపించాయి.
ఆ
రోజున రాజమండ్రినుండి మేము బయలుదేరేముందు, రాజమండ్రిలో నిర్మింపబడుతున్న షిరిడీ సాయిబాబా మందిరానికి చిన్నమొత్తం రూ.50,000/- విరాళంగా ఇచ్చాము. సాయిబాబా మందిరం తాలూకు కరపత్రాన్ని కూడా నాతోపాటే తీసుకుని వచ్చాను.
ఆరోజున మేము ప్రయాణమయే సమయంలో నాస్నేహితుడు మాకు షిరిడీ ప్రసాదం, చిన్న బాబా విగ్రహం ఇచ్చాడు.
అతను
ఈమధ్యనే షిరిడీ యాత్రచేసి వచ్చాడు.
మేము
అతనిచ్చిన ప్రసాదం బాబా విగ్రహం ప్రయాణంలో మాతోబాటే కారులో ఉన్నాయి. అమూల్యమయిన ఈ
రెండు సంఘటనలు మా ఇద్దరి హృదయాలలో కలకాలం నిలిచిఉంటాయి.
సాయిబాబా మాయోగక్షేమాలను కనిపెట్టుకుంటూ మమ్మల్ని దయతో కాపాడుతూ మాప్రార్ధనలను ఆలకించారు.
ఆయన చరణారవిందాలకు మేము శిరసువంచి నమస్కారం చేసుకొంటున్నాము.
డా.ఎమ్.ఫణికుమార్
న్యూరో సర్జన్
54-9-8
సత్య క్లాసిక్స్,
502,
అద్దేపల్లి కాలనీ
ఎ.వి.
అప్పారావు రోడ్
రాజమండ్రి – 533 103
ఫోన్. 9959687272
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
1 comments:
This is an evidence that He is always looking after His children.
Post a Comment