10.01.2011 సోమవారం
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
సాయి బంధువులారా మీకందరికీ సాయి అనుగ్రహం లబించాలని బాబాని వేడుకుంటున్నాను.
బాబా లీలలు ప్రతిరోజు వ్రాసే భాగ్యాన్ని నాకు, చదివే అదృష్టాన్ని మీకు కలగచేసినందులకు మనం బాబాకు యెల్లప్పుడు కృతజ్ఞలమై ఉండాలి. సాధ్యమైనంతవరకు తెలుగులోకి తర్జుమా చేస్తున్నాను. ఒకవేళ తెలియక పొరపాట్లు యేమయినా ఉంటే దయచేసి తెలియపర్చండి.
మనకు సాథారణంగా ఒక అలవాటు ఉంది. అపరహ్ణంవేళ యెవరు వచ్చినా భిక్ష వెయ్యకూడదు అని. ఒకవేళ అపరాహ్ణంవేళ బాబాగారు భిక్షకుని రూపంలో వచ్చి ఉండవచ్చు
*****************************************************************************
ఈ బాబా లీల శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారు తమ బ్లాగ్లో పోస్ట్ చేసినది. దానియొక్క అనువాదం ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాను.
మన అందరికీ కూడా బాబా గారి దర్శనం కావాలనే కోరిక ఉంటుంది. మన సద్గురు సాయినాథుని అనుగ్రహం కోసం మనం యెన్నోవిథాలయిన పూజలు వ్రతాలు అన్నీకూడా మనకు తెలిసినంతలో చక్కగా చేస్తాము. కాని బాబాగారు మన ఇంటికి యేదోరూపంలో వచ్చారనే సంగతి మనం గ్రహించలేము. బిక్షకుని రూపం కావచ్చు, సాధువు రూపంలో కావచ్చు, శునకం లేక పక్షి రూపంలో నైనా వచ్చిఉందవచ్చు. కాని మనం మానవమాత్రులంకదా అందుచేత గుర్తించలేము. నేను కొంతమందిని గమనించాను. వారు యేమంటారంటే, బాబాగారు నాకు దర్శనం ఇవ్వలేదు, నాప్రార్థనలకి జావాబు ఇవ్వలేదు, బాబాగారు నామీద కోపగించారా? ఇటువంటి నిందలకు అంతుండదు. కాని మనం ఆత్మ్మ విమర్శ చేసుకోవడం మర్చిపోతాము. నా మనసులోఉన్న ఇదే విషయం మీద ఒక భక్తురాలియొక్క అనుభవాన్ని మీకు చెపుతాను.
ఇది చాలా, హ్రుదయానికి హత్తుకునే నిజంగా జరిగిన సంఘటన.
ఆగస్టులొ ఢిల్లీనుంచి మా కజిన్ వచ్చ్చాడు. ఆమరునాడు మేము ఉంటున్నసిటీలోనే తన స్నేహితుడిని కలవాలనుకున్నాడు. తన స్నేహితుడి ఇంటికి నన్నుకూడా తోడుగా రమ్మనమని అడిగాడు. నాకు ఇష్టం లేకపోయిన తన కోరికని కాదనలేకపోయాను. అతనింటికి వెళ్ళగానే నాకు ఆఇంటిలో ఒక విథమయిన నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు అనిపించింది. ఆ నెగటివ్ ఫోర్స్ వల్ల నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. 5 నిమిషాల తరువాత అతనితల్లి 70 సం.వయస్సు ఉన్న విథవావిడ వచ్చింది. వారింటికి వెళ్ళడం నాకు ఇదే మొదటిసారి కాబట్టి మాటలాడటనికి యేమీలేక ఊరికె కూర్చున్నాను. హటాత్తుగా ఆమె మా అమ్మాయి పేరు ఆడిగింది. మా అమ్మాయి పేరు "సాయినా" అని చెప్పాను. మరలా ఆమె ప్రశ్నించక ముందే, నేను సాయి భక్తురాలిని అందుచేత ముందర సాయి అని వచ్చేటట్లు పేరు పెట్టానని చేప్పాను. బాబా వలననే మా అమ్మాయి రక్షింపబడింది అని చెప్పాను. నేను మాట్లాడుతున్నానే గాని యేదో తెలియని
శక్తి నన్ను బయటికి ఆ ఇంటిలోనించి వెళిపొమ్మన్ని చెపుతున్నట్లుగా అనిపించింది. కాని అక్కడే కూర్చుని మా కజిన్ అతని స్నేహితుల సంభషణలను వింటూ కూర్చున్నాను. అతని తల్లి నావయిపే దీక్షగా చూడడం గమనించాను. నేను ఆఇంటిలో నాలుగువయిపులా పరికించి చూడడం మొదలుపెట్టాను. హటాత్తుగా నాదృష్టి ఫ్రిజ్ మీద అంటించిన బాబా స్టికర్ మీద పడింది. నాకు బాగుందనిపించింది. మా కజిన్ స్నేహితుడిని మీరు బాబా భక్తులా అని అడిగాను. నా ప్రశ్న వినగానే అతని తల్లి తాము యెంతటి దురదృష్టవంతులో చెప్పింది. బాబా గారు తమ ఇంటికి వచ్చినా గుర్తించలేకపోయాము. అప్పటినుంచి చాలా కస్టాలు పడుతున్నామని చెప్పింది. ఇదివినగానే యేమి జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి నాలో పెరిగింది. జరిగినదంతా చెప్పమని ఆంటీని అడిగాను. 6 నెలలక్రితం ఒక ఫకీర్ మధ్యాహ్నం ఒంటిగంటవేళ వచ్చి యేమయిన ఆహారం పెట్టమని అడిగాడు. గడచిన 2 -3 రోజులనుంచీ యేమీ తిండి తినలేదని చెప్పాడు. ఆమె అతను చెప్పినదేమీ పట్టించుకోకుండా నిర్దయగా వెళ్ళిపొమ్మని చెప్పింది. కాని ఆ ఫకీరు బిక్ష అడుగుతూ అక్కడే నుంచున్నాడు. ఆ ఫకీరు, వెళ్ళిపొయేటప్పుడు, ఇంక యెవరింటికీ కూడా బిక్షకు వెళ్ళకపోవడం గమనించింది. ఆరోజునుంచి వారికి ప్రతీరోజు కష్టాలు మొదలయ్యాయి. ఇలా రోజులు, వారాలు, నెలలు గడిచిపోయాయి. ఒకరోజున ఒక ముసలి ఫకీరు వచ్చి ఆంటీతో, బాబా గారు మీఇంటికి, మీ బాథలు, కర్మలూ అన్నీ పోగట్టటానికి వచ్చారు అని బాబా గారు వచ్చిన నెల తేదీ, సమయం అన్నీ చెప్పారు. కాని మీరు చాలా దురదృష్టవంతులు, ఆయనని గుర్తించలేదు అని చెప్పాడు. ఆంటీ మరోమాట మాట్లాడకముందే ఆఫకీరు మాయమయ్యాడు. ఆంటీ మ్రాంపడిపోయింది. ఇక వేరేదారి లేక ఆమె బాబాని క్షమించమని ప్రార్థించి, మరలా తిరిగిరమ్మని వేడుకుంది.
ఇదంతా చెప్పి ఆంటీ చిన్నపిల్లలా యేడవడం మొదలుపెట్టింది. నేను ఆమెని ఓదార్చడానికి ప్రయత్నించాను. కాని లాభం లేకపోయింది. ఆఖరిగా ఆమెకు ఊదీ పాకెట్ ఇచ్చి బీదవారికి అన్నదానం చేయమని చెప్పాను.
ఓర్పు, సహనంతో ఉండండి, బాబాగారు మరలా వస్తారు అని ఓదార్చాను. కాని ఆమె కన్నీటిని ఆపడం నాకు సాథ్యం కాలేదు. వాళ్ళబ్బ్బాయికి నా బాబా బ్లాగ్ గురించి తెలుసు కనక, భిక్షకు యెవరు వచ్చినా లేదు పొమ్మని కసిరి కొట్టగుండ ఈ విషయమంతా బ్లాగ్లో పోస్ట్ చెయ్యమని చెప్పాడు. అతని తల్లి ఇప్పటికీ ఆఫకీర్ మరలా వస్తాడని బయట కుర్చీ వేసుకుని యెదురుచూస్తు ఉందిట.
అందుచేత మీఇంటికి యెవరు వచ్చినా సరే కసిరి కొట్టవద్దు. ఇవ్వడం ఇస్టం లేకపోతే మర్యాదగా వెళ్ళిపొమ్మని చెప్పండి. బాబాగారు యేరూపంలోనయినా రావచ్చు. బాబా గారు చెప్పినదిదే.
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment