సాయి హనుమాన్02.03.2011 బుథవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
గత రెండు రోజులుగా బాబా లీలలు ఇవ్వలేకపోయాను. ఈ రోజు ఒక బాబా లీల గురించి తెలుసుకుందాము.
రమౌడయినా, కృష్నుడయినా, హనుమంతుడయినా, అన్నీ బాబాగారే. బాబాని నమ్ముకున్నవారందరికీ ఈ విషయం గురించి మరలా చెప్పనవసరం లేదు.
ఈ రోజు మనము ఒక హమంతుని భక్తుని బాబా గారు యేవిథంగా అనుగ్రహించారో తెలుసుకుందాము.ఈ లీల చూడండి. బాబా గారి లీల యెటువంటిదో. ఆయన లీలని అనుభవించినవారు దాన్ని నిలుపుకునే ప్రయత్నం కూడా చేయాలి. అంటే దాని అర్థం ఇంక బాబా చరణాలని వదలకుండా ఆయననే నమ్ముకుని ఉండాలి.
విశాఖపట్నంలో ఒక ఆంజనేయ దేవాలయంలో సత్యనారాయణగారనే పూజారి గారు ఉన్నారు. ఆయన ఆంజనేయ భక్తులు కూడా. గుడిలొ పూజాదికాలు పూర్తికాగానే ప్రతిరోజు హనుమన్ చాలీసా 11 సార్లు చదువుతూ ఉండేవారు. ఒకసారి ఆయనకు పెద్ద ఆపరేషన్ అయి, రెండు నెలలు సెలవు పెట్టారు. తన సెలవు కాలంలో గుడిలో పూజాదికాలు నిర్వర్తించడానికి ఒకతనిని నియమించారు. కోలుకున్న తరువాత గుడిలో కి తిరిగి ప్రవేశించడానికి రాగా, ట్రస్టీ వారి ఆయన అవసరం లేదని చెప్పడంతో హతాసులయ్యారు. అప్పుడు పూజారి గారు " నేను నా ఆపరేషన్ కాలంలో యెటువంటి ఇబ్బంది లేకుండా మరొకతనిని నియమించాను కదా, నేనిప్పుడు బాగానే కోలుకున్నాను, పూజాదికాలన్ని ఇదివరకటిలాగే నిర్వర్తించగలను. నన్ను యెందుకు వద్దంటున్నారు" అని ట్రస్టీ గారితో అన్నారు. కాని ట్రస్టీ గారు అంగీకరించక ఆయనని తిప్పి పంపివేశారు.
ఈ పూజారిగారు శుభకార్యాలకి, పెళ్ళిళ్ళకి, వాటికీ వంటలు కూడా చేస్తూ ఉంటారు. ఒకరోజు ఒకాయన, తన ఇంట్లొ శుభకార్యం నిమిత్తమై ఈయనను వంటకి పిలిచారు. పూజారి గారు ఆహార పదార్థాలన్నిటినీ తయారు చేసి, వారి ఇంటికి శుభకార్యము రోజున తీసుకుని వెళ్ళారు. ఇంటినించి బయలుదేరేముందు పూజారి గారి అబ్బాయి, నాన్నా, నువ్వు ఈ రోజు బాబా గుడికి యెందుకు రావు, అని అడిగాడు. పూజారి గారు కోపంతో " నేను జీవితంలో యెప్పుడూ బాబా గుడికి రాను" అన్నారు. కొంత చర్చ జరిగిన తరువాత పూజారి గారుతాను చేసిన పదార్థాలన్నిటినీ తీసుకుని ఆర్డరు ఇచ్చినవారి ఇంటికి వెళ్ళారు. కాని ఆయన వారి ఇంటికి వెళ్ళేసరికి, విందు ఆర్డరు ఇచ్చిన వ్యక్తి మరణించాడు. ఈ సంఘటనకి బాగ కలత చెంది, తయారు చేసిన పదార్థాలన్నిటిని, బీదలకి, అనాథ శరాణాలయంలోనూ ఇచ్చివేశాదు. పూజారిగారికి తన కొడుకుమీద చాల కోపం వచ్చింది. ఆ రోజు బాబా గుడికి రమ్మన్నాడు, అందుకే ఇలా జరిగింది అని అనుకున్నాడు. ఇంటికి వచ్చాక కొడుకుతో " నేను ఆంజనేయ భక్తుడిని, నేనిప్పుడూ ఆయననె పూజిస్తాను, నన్నెప్పుడూ బాబాగుడికి రమ్మనకు"" అని చెప్పాడు. కొద్ది నెలలవరకు ఆనయకి పని యేమీ దొరకలేదు. చాలా నిరాశ చెందాడు. ఒకరోజు ఒకాయన ఈయనని తన ఇంట్లొ శుభకార్యం నిమిత్తం వంటకి పిలిచాడు. విందు అంతా ముగిశాక, ఆ వ్యక్తి పూజారిగారితో, " అయ్యా, తమరు బాబా గుడిలో పూజారిగా ఉంటారా?" సాయి మందిరంలో పూజారి యెవరూ లేరు, ఇప్పుడున్న పూజారి వెళ్ళిపోతున్నారు" అన్నాడు. పూజారి గారు, " నేను హనుమాన్ గుడిలో 7 సంవత్సరాలనించి పూజారిగా ఉన్నాను, నాకు బాబా పూజ యెల్లా చేయాలో తెలియదు" అన్నారు. అప్పుడావ్యక్తి, "దాని గురించి మీరు చింత పడవద్దు, ఇప్పుడున్న పూజారి మీకు బాబా పూజ యెలా చేయాలో 4 రోజులలొ నేర్పుతారు, తరువాత అంతా మీకే అర్థమౌతుంది" అని చెప్పారు. పూజారి గారు ఆలోచించుకోవడానికి కొంత సమయం అడిగారు.
ఒకరోజు రాత్రి పూజారిగారికి కల వచ్చింది. అందులో ఒకవైపు బాబా గారు, మరొకవైపు సింథూరం, లెక్కలేనన్ని తమలపాకులు ఉన్నట్లుగా కనిపించింది. అప్పుడాయనకు ఆంజనేయస్వామి, బాబాగారు ఒకరే అనిపించింది. ఆయన, బాబా గుడిలో పూజారిగా ఉండటానికి తన సమ్మతిని తెలిపారు. కాని మనసులో కొంచెం సంథిగ్థం ఉంది. కాని డబ్బు కోసం, రోజు రోజుకీ తన ఆర్థిక పరిస్థితి దిగజారుతూ ఉండటంతో అంగీకరించక తప్పలేదు. ఒకరోజున ఒకవ్యక్తి వచ్చి , ఈ పూజారిగారికి లక్ష రూపాయలు ఇచ్చాడు. పూజారి గారు ఆశ్చర్య పోయారు. ఆ వ్యక్తి, పూజారిగారితో" కొంతకాలం క్రితం మీ వద్ద మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి మీ వద్ద యెక్కువ వడ్డీకి అప్పు తీసుకున్నాను, తరువాత నేను ఊరు విడిచి వెళ్ళిపోయాను. చాలా సంవత్సరాల తరువాత ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు మీ డబ్బుని వడ్డీతో సహా ఇస్తున్నాను" అని చెప్పాడు.
పూజారిగారి కి ఆడబ్బుమీద వ్యామోహం లేదు. ఆ సొమ్మంతా పట్టికెళ్ళి తన భార్యకు ఇచ్చారు. ఆయ్యన భార్యతో, " నీకు మగళసూత్రాలు తప్ప నగలు యేమి చేయించలేకపోయాను. ఈ డబ్బంతా నువ్వే తీసుకో, నువ్వేమి ఖర్చుపెట్టుకున్న సరే. నాకీ సొమ్ము అవసరం లేదు" అని చెప్పారు.
బీ.యెస్.సీ. చదువుతున్న వారి పెద్దాబ్బాయి కంప్యూటర్ కోర్స్ కోసం 30,000/- అడగ్గా ఆమె పెద్దబ్బాయికి ఇచ్చింది. యింటర్మీడియెట్ చదువుతున్న వారి రెండవ అబ్బయికి, వారి ఆర్థిక పరిస్థితి వల్ల కాలేజ్ వారు కొంత కన్సెషన్ ఇచ్చారు. రెండవ అబ్బాయికి ఫీజు కట్టింది. మిగిలిన సొమ్ముతో కొన్ని బంగారు నగలు కొనుక్కుంది.
పూజారిగారికి బాబా గుడిలో సంపాదన బాగానే ఉంది. మిగతా రోజులలో ఆయన నెలకు 2000/- దాకా సంపాదిస్తున్నారు. బాబా మీద ఆయన నమ్మకం బలపడ సాగింది. ఆయన హనుమాన్ చాలీసా చదవడం మానేశారు. బాబా గుడిలో చదవవచ్చా లేదా అనే సంశయం ఉండేది ఆయనలో.
ఒకరోజు ఆయనకి, బాబా గారు, యేం? హనుమన్ చాలీసా చదవడం మానేశావు ఇక్కడ. నాకు హనుమాన్ కి భేదం లేదు. నేను సాయి హనుమాన్ ని" అని బాబా చెపుతున్నట్లుగా దృశ్యం కనిపించినట్లయింది. దీనితో ఆయన కళ్ళు తెరుచుకున్నట్లయింది. బాబా,హనుమాన్ ఒక్కరే అని ఆయనకు అర్థమైంది.
(ఈ విషయమంతా సత్యనారాయణ గారు మాతోడల్లుడుగారి ఇంటికి వచ్చి చెపుతున్నప్పుడు యెంతో భావోద్వేగానికి లోనయ్యారు.)
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment