Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, May 5, 2011

సాయి సూత్రాలు -- సాయిని ప్రార్థించడమెలా

Posted by tyagaraju on 1:59 AM


05.05.2011 గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులందరకు బాబావారి శుభాశీశ్శులు

ఈ రోజు సాయి సూత్రాలని పోస్ట్ చేస్తున్నాను. కాని యింకా యేదైనా సమాచారం ఇద్దమని అనిపించింది.
ఇప్పుడు పోస్ట్ చేస్తున్న రెండూ కూడా శ్రిమతి ప్రియాంకా గారు తమ ఆంగ్ల బ్లాగులొ యెప్పుడో ప్రచురించారు. సాయిని ప్రార్థించే విథానాలలో ఆమె చెప్పినట్లు, యెప్పుడు యేది యెలా చేయాలొ అంతా బాబా నిర్ణయం ప్రకారమే జరుగుతుందని రాశారు. అది ముమ్మాటికీ నిజం. యెందుకంటే నేను కూడా వీటి గురించి రాద్దామని అనుకోలేదు. ఇవి ఇంతకుముందు చదివినట్లు కూడా గుర్తు లేదు. బాబా ఈ రోజు వీటి గురించి రాయమని ఆదేశం.

ఈ రెండు విషయాలూ కూడా అనుకోకుండా చదివి రాసినవే.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

సాయి చెప్పిన సూత్రాలని పాటించండి - సంతోషంగా ఉండండి.


సాయి బంథువులారా, ఈ రోజు మానవుల ఉన్నతి కోసం బాబా చెప్పిన మాటలను అందిస్తున్నాను. మన సాయిమా చెప్పిన ఈ ఉపదేశాలు మీకు నచ్చుతాయని నాకు తెలుసు. వీటిని జాగ్రత్తగా చదివి నేటినుంచే ఆచరణలో పెట్టండి.

1. యెప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి, భగవంతుడు (సాయి) ఈ ప్రపంచంలో యెప్పుడూ ఉంటాడు.

2. అందరితో మంచిగా ప్రవర్తించు, తిరిగి నువ్వు అదే మంచితనాన్ని యితరులనించి పొందుతావు.

3. తప్పులు చేయవద్దు, వాటిని కప్పిపుచుకోవడానికి అతిగా శ్రమపడవద్దు. ఇది కనక ఆచరిస్తే నువ్వు సంతోషంగానూ, శాంతిగాను ఉంటావు.

4. ఇతరులతో నిన్ను పోల్చుకోవద్దు, యెందుకంటే ప్రతివారికి అతనికి/ఆమెకి వారికి యోగ్యమైనదే లభిస్తుంది.

5. బాబా నిన్ను క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపమన్నారు, నీ జీవన విథానం యితరులకి మార్గదర్శకం కావాలి.

6. షిరిడీ సాయి ఈ ప్రపంచానికి సృష్టికర్త. సాయినాథుడు నిర్వాహకుడు, సద్గురు సాయి సంహరించేవాడు కూడా.

7. మానవ శరీరం భగవతుడిచ్చిన గొప్ప బహుమతి, దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి, నీ నాలుకతో యెప్పుడూ, సాయి, సాయి, సాయి అనే నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి, నీ రెండు చెవులూ సాయి వైభవాన్ని, మహత్యాన్ని వినాలి, నీ సుందరమైన కన్నులతో ఆయన దివ్య స్వరూపాన్ని చూడాలి.

8. ఈ ప్రపంచం నిన్ను దూషించనీ, నిందించనీ, అపనిందలు వేయనీ, ఇవన్నీ కుడా నీ శరీరం మీద రంథ్రాలు యేర్పరచవు, నిన్ను గాయ పర్చవు.

9. ఉపవాసం ఉండవద్దు, లేక అతిగా తినవద్దు. మితాహారం తీసుకోవాలి.

10. ఈ ప్రపంచంలో సత్యమే నీ చింతలనుంచి దూరం చేసే నిజమైన స్నేహితుడు.
నువ్వు వాస్తవంతో స్నేహితుడుగా ఉంటే, సాయి సాయం చేస్తారు, సాయి సత్య సంథులకి సహాయపడతారు.

11. యెప్పుడు నీ సంగతి నువ్వు చూసుకో, యితరుల తప్పుల గురించి ఆందోళన పడద్దు.

12. యితరుల సంతోషాన్ని, నీ సంతోషంగా భావించు.

13. అవసరమైన వారికి సాయం చెయ్యి. బీదవారికి ఆహారం ఇయ్యి, నీడ లేనివారికి నీడ చూపించు. సాయి యేరూపంలో నీముందుకు వచ్చి అర్థిస్తారో నీకు తెలియదు.
అందుచేత, బిచ్చగాళ్ళమీద కఠినంగా ఉండద్దు. నీకు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే మౌనంగా ఉండు, అంతేగాని వారి మీద కోపగించవద్దు.

సాయి చెప్పిన ఈ మహత్తరమైన సూత్రాలని జీవితంలో ప్రతిక్షణం గుర్తుంచుకుని దానికి అనుగుణంగా నడచుకోవాలి.

అల్లాహ్ మాలిక్సాయిని ప్రార్థించడమెలా -- సులభమైనవి ఫలితాన్నిచేవి

చాలా మంది పాఠకులు బాబాని సరియైన పథ్థతిలో ప్రార్థించే విథానం గురించి అడుగుతూ ఉంటారు. తమ ప్రార్థన విని తమ సమస్యలు తొందరగా తీరాలంటే యేమి చెయ్యాలి అని అడుగుతూ ఉంటారు. యెంతో కాలంగా ఈ ప్రశ్నని అడుగుతున్నా గాని నేను ఈ ప్రశ్నకి సమథానం ఇవ్వలేకపోయాను, యెందుకంటే బాబా యెప్పుడు దీనిని కోరుకోలేదు. కాని ఈ రోజు హటాత్తుగా నేను ఈ విషయం మీద రాద్దామని మొదలు పెట్టాను. ఈ విషయం మీద రాయమని బాబాగారు నన్నుఆదేశించారని నేను అనుకుంటున్నాను, లేక ఈ విషయం మీద రాయడానికి ఇదే సరియైన రోజని మీరు అనుకుంటూ ఉండచ్చు. నేను యెప్పుడు చెపుతున్నట్టుగా బాబాకి తెలుసు మనం యెప్పుడు, యేది చేయాలో....అందుచేత బాబాని సరియైన పథ్థతిలో పూజించే విథానం గురించి రాయమని ఆయన ఈ రోజు ఆదేశించారు. పాఠకులారా, నేను చాలా చిన్న సాయి భక్తురాలిని. ఈ రోజు బాబా ఆశీర్వాదంతో, నేను దీనిని ప్రచురిస్తున్నాను. ఇది మీకు ఉపకరిస్తుందని అనుకుంటున్నాను.

యెలా ప్రార్థించాలి (ప్రార్థించడం యెలా) ::?

కనీసం సాయి భక్తుడికి సమాథానం చెప్పడానికి చాలా చిన్న ప్రశ్న, యెందుకంటే బాబా మనకందరకు తల్లిలాంటివారని మనకి తెలుసు. తన పిల్లలు సంతోషంగా ఉంటే ఆయన సంతోషంగా ఉంటారు. తన పిల్లలు కష్టాలలో ఉంటే ఆయన బాథ పడతారు. కాని బాబా యెల్లప్పుడు పసిపిల్లలకి అన్నం తినిపించినట్టు తినిపించరు. కొన్ని కొన్ని సమయాల్లో మనంతట మనమె పోరాడుతూ ఉండాలి. తల్లి కూడా ప్రతీచోట పిల్లవానికి సాయం చేయదు, యెందుకంటే పిల్లవాడు ఈ ప్రపంచంలో మనుగడ సాగించాలంటే తనంతట తనే అన్నిటినీ స్వయంగా యెదుర్కోవాలి. అదే విథంగా సాయిమా కూడా మన కాళ్ళమీద మనం యెలా నిలబడాలో మనకి నేర్పుతారు, మన కర్మలని మనము సరిగా నిర్వర్తించేలా చేస్తారు. ఒకసారి కనక చేస్తే మనం అడిగినా అడగకపోయినా బాబా మనలని కనిపెట్టుకుని ఉంటారు. నీ సడలని నమ్మకం, నిరవథికమైన ఓర్పు, ఇవే నువ్వు సాయికి సమర్పించే ప్రార్థన. ఈ ప్రాపంచిక విషయాలనే మాయ నీ సున్నితమైన మనసుని కప్పివేయకూడదు. ఒక్కసారి సాయి సద్గురు మహరాజ్ చరణాల మీద శరణాగతి చేశాక, నీ భవిష్యత్తు గురించి జీవితంలో వేటిగురించయినా నీకెందుకు చింత. జీవితంలో మీరు అనుకున్నవి సాథించడానికి మీకుపయోగించే చిన్న విథానాలని రాస్తున్నాను.

నీవు తినేముందు బాబాకి సమర్పించు:

ప్రతీసారి నువ్వు భోజనం చేసేముందు బాబాకి సమర్పించాలనే నియమం పెట్టుకో. నువ్వు యెప్పుడూ భోజనం చేసేముందు ప్రతిసారి, ఒక్కసారి కనక అందులోని కొంతభాగాన్ని,బాబాకి అర్పిస్తే మొత్తం ఆహారమంతా సాయి ప్రసాదంగా మారుతుంది. నీకు మంచి ఆరోగ్యాన్నివ్వడానికి దోహద పడుతుంది.

ఆకలిగొన్నవారికి అన్నం పెట్టు:: బాబా అనుగ్రహాన్ని పొందాలంటే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలి. మనకందరకు తెలుసు, బాబా గారు తన జీవిత కాలమంతా ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చారు. నమ్మండి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే మీకు యెంతో సంతోషంగా ఉంటుంది,మీ అంతరాత్మ ప్రత్యక్షంగా సాయితో సంపర్కమవుతుంది.

సాయి సచ్చరిత్ర చదవండి::

మనం రోజూ తిండి తింటున్నట్లుగానే, నిద్ర పోతున్నట్లుగానే .... అదేవిథంగా ప్రతీరోజూ సాయి సచ్చరిత్ర చదవాలి. ఆటంకాలని పక్కన పెట్టండి , ప్రయాణంలో కూడా, సచ్చరిత్ర చదవాలి. బాబా ముందరే కూర్చుని చదవడం ముఖ్యం కాదు, ఇక్కడ కావలసినదల్లా భక్తితో చదవడం ముఖ్యం. నువ్వు చదవదలచుకున్నప్పుడు, ప్రతీరోజు చదవడం అమలు చెయ్యి . నీలో అనుకూలమైన ఆలోచనలు, నీ వ్యవహారంలో, ప్రవర్తనలో వేగవంతమైన మార్పు రావడం నువ్వే గమనిస్తావు.

అవసరమైనవారికి సహాయం చెయ్యి ::

సాయి బంథువులారా నేను మిమ్మల్ని కోరుకునేదేమంటే ఈ ప్రపంచంలో యెవరూ లేని అనాథలకు సహాయం చేయమని. మీవద్దనున్న పాత దుస్తులను వారికివ్వండి, మీ పిల్లల పాత పుస్తకాలనివ్వండి, చేయగలిగితే వారికి వైద్య సహాయం కూడా చేయండి. మీకు చేతనయినతలో యెలా సహాయపడగలరో ఆవిథంగా సహాయం చేయండి. కాని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి రెండవసారి ఆలోచించవద్దు.

యెప్పుడూ కూడా యితరుల గురించి చెడుగా మాట్లాడవద్దు ::

ఇది మనమందరము గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన విషయం. మనం యెప్పుడూ కూడా యితరుల గురించి చెడుగా మాటలాడకూడదు. యెందుకంటే, బాబా చెప్పారు మనం యితరులని నిందిస్తున్నామంటే మన ప్రవర్తన వరాహాన్ని పోలి వుంటుంది. వరాహం అందరూ పారవేసిన చెత్తా, చెదారం తిని సంతోషిస్తుంది. అంచేత యెప్పుడు గుర్తుంచుకోండి, మీరు యితరుల గురించి మంచిగా మాట్లాడలేనప్పుడు, చెడు కూడా మాట్లాడకండి. తెలీకుండానే ఇది మనం చేస్తూ మనంతట మనమే దురదృష్టాన్ని మన జీవితంలోకి కొని తెచ్చుకుంటున్నాము.

సద్గురు సాయినాథ్ మహరాజ్ ఆశీశ్శులు పొందటానికి, ఆచరించటానికి ఇవి చాలా తేలికైన పథ్థతులు. బాబా తనకి రోజూ ప్రార్థన చేయమని కోరటంలేదు, మానవ సేవ చేయమన్నారు. మానవ సేవే మాథవ సేవ. నన్ను నమ్మండి, ఈ పైన చెప్పిన చిన్న చిన్న సేవలు మీ జీవితాన్ని మారుస్తాయి. నా నిత్య జీవితంలో నేను వీటిని ప్రతిరోజూ అనుసరిస్తూ ఉంటాను, నేను తప్పక చెప్పవలసినది బాబా నాకు తరచూ కలలో ఆశీర్వదిస్తూ ఉంటారు. నేను వెళ్ళే ప్రతీచోటకీ ఆయన వస్తూ ఉంటారు. బాబా, నీకు నామీద ఉన్న ప్రేమకి కృతజ్ణురాలిని. మీరు బాబాని ప్రార్థించే పథ్థతిని తెలియచేయండి.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment