Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, May 23, 2011

జీవితాన్ని నిలబెట్టిన బాబా

Posted by tyagaraju on 8:10 AM
23.05.2011 సోమవారము

జీవితాన్ని నిలబెట్టిన బాబా

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

ఈ రోజు సాయి సేవకులైన శ్రీ సీ. సాయిబాబా గారు చెప్పిన అద్భుతమైన లీల ఒకటి తెలుసుకుందాము. ఈ లీల శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారి ఆంగ్ల బ్లాగులో కొన్నాళ్ళ క్రితం ప్రచురింపబడింది. ఈ రోజు మీకు అందిస్తున్నాను. బాబా ప్రత్యక్షంగా వచ్చి శ్రీ సాయిబాబా వారిని యెలా అనుగ్రహించారో చదివితే ఒడలు గగుర్పొడుస్తుంది. ఆయన చూపిన దయకి మనసు ఆయనకి దాసోహమంటుంది. యెంత అద్భుతమైన రీతిలో బాబా వారు వచ్చారో చదవండి.

చాలా సార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, మన ప్రియమైన సాయిమా ప్రతీవారిని ఒకే సమయంలో యెలా కనిపెట్టుకుని వుంటారా అని. ఆయన ప్రేమ అనుగారం యెటువంటిదంటే ఆయన ప్రేమయొక్క లోతును కొలవడం అసాథ్యం. రోజు నేను శ్రీ సీ. సాయిబాబా గారి, హృదయాన్ని సూటిగా తగిలేటటువంటి అనుభూతిని మీకు చెపుతాను. రోజు సాయిబాబా గారు ఇలా ఉన్నారంటే అంతా బాబా వలననే. ఇక్కడ ఆయన మెయిల్ ని ఇస్తున్నాను.

ప్రియాంకా బేటీ సాయిరాం. మీరు మన సాయికి యెంతో సేవ చెస్తున్నారు. సాయి మిమ్ములను దీవుంచుగాక. నవీన్ గారి అనుభూతిని చదివాక, బాబా నన్నుకూడా తన మార్గంలోకి యెలా లాక్కున్నారో చెప్పాలనిపించింది. వీలయితే దీనిని మీ బ్లాగులో పబ్లిష్ చేయండి.

నేను ఈష్ట్ కోస్ట్ రైల్వే లో పూరీ రైల్వే స్టేషన్ లో 2004 నుంచి పని చేస్తున్నాను. నేను ఖుర్దా రోడ్ లో ని డివిజినల్ హెడ్ క్వార్టర్స్ లో 2004 వరకూ బాథ్యతాయుతమైన పదవిలో 12 సంవత్సరాలు ఉన్నాను. కొన్ని విజిలెన్స్ అలిగేషన్స్ వల్ల నాకు పూరీ బదిలీ అయింది. నాపేరు సాయిబాబా అయినప్పటికీ 50 సంవత్సరాల జీవిత కాలంలో నేను బాబా గుడికి కాని షిరిడీకి కాని వెళ్ళడం అరుదు. నేను షిరిడీ వెళ్ళినా మామూలుగా వెళ్ళడం తప్ప, భక్తితో కాదు. నాకు పూరీ కి బదిలీ అయిన తరువాత, ఖుర్దాలో నాకు యిల్లు, కుటుంబం ఉండడం వల్ల, ఖుర్దా నించి పూరీ కి వెడుతూ ఉండేవాడిని. రోజుల్లో నేను పూర్తిగా నిరాశలో ఉన్నాను. సెప్టెంబరు 2005 లో హృద్రోగం వచ్చి,ఆంజియో ప్లాస్టీ కూడా అయింది. నా ఆర్థిక పరిస్తితి కూడా దిగజారడం మొదలైంది, నా ఉద్యోగంలొ కష్టమైన పరిస్థితుల వల్ల, ఆర్థిక సమస్యలవల్ల, అనారోగ్య పర్తిస్తుతులవల్ల, లోకాన్ని విడిచి పెడదామనే స్తితిలో ఉన్నాను. 2007 మే నెలలో ఆత్మహత్య చేసుకుందామని బలమైన కోరిక కలిగింది. మథ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఒక పూట పని చేశాక జేబులో 15/- రూ. పెట్టుకుని భోజనం చేద్దామని హోటలికి వెడుతున్నాను. తెల్లని కుర్తా, పైజామా థరించి పొడవుగా ఉన్న ఒకపెద్దమనిషి నన్ను దాటుకుంటూ వెళ్ళి నా పేరుతో "సాయీ" అని పిలిచేంతవరకు నేను గమనించలేదు. కొంచెం ఆశ్చర్యంతో తిరిగి చూశాను, పెద్దమనిషికి 70 - 75 సంవత్సరాల వయసు ఉంటుంది. మొహంలో సమ్మొహనకరమైన చిరునవ్వుతో, స్వచ్చమైన హిందీ లో "నాకు 20/- రూ.ఇవ్వగలవా" అని అడిగాడు. అతనికి నాపేరు యెలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాను, 20/- రూ. అడిగేటప్పటికి యింకా ఆశ్చర్యం వేసింది. అతని సమ్మోహనకరమైన చురునవ్వు చూసి నేను లేదు అని చెప్పలేకపోయాను. కొద్ది మీటర్ల దూరంలోనే ఉన్న నా ఆఫీసుకి వెళ్ళనిస్తే నేను 20/- ఇవ్వగలనని చెప్పగా అతను వెంటనే ఒప్పుకున్నాడు. అతను నాతో కూడా ఆఫీసుకి వచ్చాడు. నేనతనికి 20/-రూ. ఇచ్చాను. అతడు దానిని ఒక బైండు పుస్తకంలో పెట్టుకున్నాడు.
యింకా ఆశ్చర్యంలోనే నిండివున్న నేను, అతను వెళ్ళబోయేముందు, నాపేరు యెలా తెలుసని అడిగాను. మరలా అదే చిరునవ్వు. " సాయి ! నాది షిరిడీ. నాకు ప్రతీవారు సాయి " బదులిచ్చాడు. అతనింకా చెప్పాడు "నువ్విప్పుడు చాలా కష్టాలను యెదుర్కొంటున్నావు. 20/- రూ.తిరిగి తీసుకో, రుద్రాక్ష కూడా. నేను కొంచెం తిట్టుకున్నాను. నేనింకా ఇలా ఆలోచించాను, బహుశా నాగురించి యెవరో చెప్పి ఉంటారు, అంచేత ఆపూజలనీ, పూజలనీ యింకా డబ్బు అడుగుతాడేమోనని. అతనింకా అన్నాడు "సాయీ ! నీ కష్టాలన్ని తీరిపోయిన తరువాత నేను మీ యింటికి వచ్చి 20/- రూ.తీసుకుంటాను." నేనతనిని మథ్యలో వారించి, "నీకు మాయిల్లు యెలా తెలుసు" అని అడిగాను. అతని వదనంలో అదే చిరునవ్వుతో "నేను నీకు చెప్పాను, నేను షిరిడీ నించి వస్తున్నానని, నా కన్నీ తెలుసు " అని బదులిచ్చాడు. నేనతనిని సగం అపనమ్మకంతోను, మిగతా సగం తిట్టుకుంటూ గమనిస్తున్నాను. అతనింకా యిలా చెప్పాడు " యిరవై రూపాయలతో సరుకులు కొని నువ్వు మాత్రమే పాయసం తయారు చెయ్యి, వచ్చే నెల మొదటి మూడు గురువారములు ఒక నల్ల ఆవుకు తినిపించు, నీకంతా బావుంటుంది."నేనింకా ఆశ్చర్యంలో ఉండగానే అతను వెళ్ళిపోయాడు. నేను మళ్ళి అతనిని చూడలేదు. నేనిదంతా నా కుటుంబ సభ్యులతో చర్చించాను. నా తమ్ముడు సత్య సాయి భక్తుడు. యిది షిరిడి సాయిబాబా లీల తప్ప మరేమీ కాదు అన్నాడు. ఆయనే దక్షిణ అడిగి తీసుకుని మరలా తిరిగి ఇస్తారు. యిటువంటి దృష్టాంతాలెన్నో సాయి సచ్చరిత్రలో కనిపిస్తాయి అని చెప్పాడు. నాకు తెలుగులో సాయి సచ్చరిత్ర ఇచ్చి, యిటువంటి దృష్టాంతాలు తెలుసుకోవాలంటే చదవమన్నాడు. 2007, జూన్ 5 కు ముందు మొదటి గురువారం రెండు సార్లు పారాయణ పూర్తి చేశాను. 2007, జూనె 5 ఉదయం, 20 రూపాయలతో కొన్న సరుకులతో పాయసం చేసి అరటి ఆకులో పెట్టాను. నా స్కూటర్ మీద నల్లటి ఆవుకోసం రెండు గంటలు తిరిగాను, కాని లాభం లేకపోయింది. అపరిచితులని నమ్మినందుకు నన్ను నేను తిట్టుకుంటూ యింటిలో కూర్చుని టీ.వీ చూస్తుండగా, మా చిన్నమ్మాయి గట్టిగా అరుస్తూ యింటిముందర నల్లటి ఆవు వచ్చిందని చెప్పింది. అది నాకోసమే యెదురు చూస్తున్నట్టుగా ఉంది. నా కళ్ళనించి కన్నీరు జాలువారింది. నా అజ్ణానానికి నన్ను నేను తిట్టుకున్నాను. నేను వెంటనే ఆవుకు పాయసాన్ని తినిపించాను. అది ఆకుతో సహా తినేసింది. అప్పటినించి యిక వెనుకకు తిరిగి చూడలేదు. పోయిన ఆత్మ విశ్వాసంతిరిగి వచ్చింది. నా కష్టాలన్ని తగ్గిపోవడం మొదలుపెట్టాయి. అంతా సాయి. ఆయనే ఇప్పుడు నాకు మార్గ దర్శకుడు. ఆయనే నా జీవితం, అన్ని ఆయనే. యెల్లప్పుడూ సాయి సేవలో. సీ. సాయిబాబా.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తుKindly Bookmark and Share it:

0 comments:

Post a Comment