Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, July 20, 2011

ఆశ - నిరాశ

Posted by tyagaraju on 2:15 AM

20.07.2011 బుథవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులకు బాబా వారి శుభాశీస్సులు


ఆశ - నిరాశ


మానవుని జీవితం విచిత్రమైనది. జీవితం ఆశ నిరాశల మథ్య ఊగిసలాడుతూ ఉంటుంది. ఒకోసారి తీవ్రమైన నిరాశలో ఉన్నప్పుడు జీవితం నీద ఆసక్తి సన్నగిల్లుతుంది. అటువంటి పరిస్తితుల్లో నిరాశలో కొట్టుమిట్లాడుతున్న ఒక వ్యక్తి అడవికి వెళ్ళి తనువు చాలిద్దామనే ఉద్దేస్యంతో ఉన్నాడు. అప్పుడు భగవంతునికి, వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణను గమనించండి.

నిరాశలో ఉన్నప్పుడు మనం అథైర్య పడకుండా భగవంతుని నమ్ముకుని మన ఆలోచనలను సక్రమ మార్గంలో కనక పెట్టినట్లయితే నిరాశనించి బయటపడతాము.

ఈ రోజు మనము ఒక చిన్న ఆథ్యాత్మిక కథను తెలుసుకుందాము. ఈ చిన్న కథను అమెరికానుంచి శ్రీమతి సుప్రజగారు పంపించారు.
--------------------------

ఒకరోజున ఒకానొక వ్యక్తి నిరాశలో ఉండి...ఉద్యోగాన్ని వదిలేద్దామనుకున్నాడు, బంథాలని , ఆథ్యాత్మికతని అన్నిటినీ తెంచేసుకుందామనుకుని .ఆఖరికి జీవితాన్ని అంతం చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. భగవంతుడితో ఆఖరుసారిగా మాట్లాడదామని అడవికి వెళ్ళాడు. దేవుడితో ఇలా అన్నాడు. "దేవుడా ! నేను జీవితాన్ని అంతం చేసుకోకుండా ఉండాలంటే యేదైనా ఒక మంచి కారణం చెపుతావా ? దేవుడు ఇచ్చిన జవాబుకి ఆశ్చర్యపోయాడు. దేవుడిలా అన్నాడు...నీ చుట్టూ చూడు. ఫెర్న్ మొక్కని, (అడవిలో పెరిగే ఒక జాతి మొక్క, పశువులకి ఆహారం),
వెదురు మొక్కని చూశావా? "చూశాను" ఆన్నాడా వ్యక్తి. "ఫెర్న్ మొక్క, వెదురు మొక్కల విత్తనాలను నాటేటప్పుడు నేను చాలా జాగ్రత్తలు తీసుకుని వాటిని బాగా సం ర క్షించాను. వాటికి వెలుతురునిచ్చాను, నీరు పోశాను." అన్నాడు దేవుడు.

ఫెర్న్ మొక్క భూమినుండి చాలా తొందరగా పెరిగింది. అది యెంతో అందంగా పచ్చదనంతో నేలంతా పరచుకుంది. కాని వెదురు విత్తనం నించి యేమీ రాలేదు. కానీ నేనా వెదురు విత్తనం గురించి పట్టించుకోకుండా వదలివేయలేదు. రెండొ సంవత్సరంలో ఫెర్న్ యింకా చక్కగా బాగా పెరిగింది.

యింకా వెదురు విత్తనం నించి యేమీ రాలేదు. "కాని నేను వెదురు విత్తనాన్ని వదిలేయలేదు". దేవుడు అన్నాడు. " మూడవ సంవత్సరంలో కూడా వెదురు విత్తనం నించి యేమీ రాలేదు" అని. కాని నేను దానిని వదిలివేయలేదు. నాలుగవ సంవత్సరంలో కూడా యేమీ రాలేదు. అయినా గానీ నేను దానిని వదలివేయలేదు. అంటే దానికింకా వెలుతురు, నీరు ఇచ్చాను . అప్పుడు అయిదవ సంవత్సరంలో భూమిలోనించి చిన్న మొలక వచ్చింది.

ఫెర్న్ మొక్కతో పోలిస్తే అది చాలా చిన్నది,అల్పమైనది. ....కాని 6 నెలల తరువాత అది 100 అడుగులకు పైగా ఎదిగింది. అది లోపల వేళ్ళు పెరగడానికి 5 సంవత్సరాల కాలం తీసుకుంది. ఆ వేళ్ళు దానికి అది బతకడానికి అవసరమైన బలాన్ని చేకూర్చింది. నేను సృష్టించినదానిని దేనిని కూడా వ్యర్థమని వదిలేయను. దేవుడతనితో అన్నాడు .."యిన్నాళ్ళుగా నువ్వు పడుతున్న కష్టాలు, బాథలు అంటే నీకు తెలుసా, నిజానికి నువ్వు వేళ్ళను పెంచుకుంటున్నావు. వెదురుని నిర్లక్ష్యం చేయనట్లుగానే నేను నిన్ను కూడా నిర్లక్ష్యం చేయలేదు. వెదురుకి ఫెర్న్ కన్నా , వేరే కారణం , రెండిటికీ భేదం ఉంది. కాని రెండూ కూడా అడవిని అందంగా తయారు చేశాయి." "నీకూ సమయం వస్తుంది" దేవుడతనితో అన్నాడు. "నువ్వు ఉన్నతంగా యెదుగుతావు" "యెంత యెత్తుకు యెదుగుతాను?" అన్నడా వ్యక్తి. "వెదురు మొక్క యెంత యెత్తుకు యెదిగింది? " దేవుడు తిరిగి అడిగాడు. "అది యెంత యెత్తుకు యెదిగిందో అంత ఎత్తుకా?" ఆ వ్యక్తి ప్రశ్నించాడు. "అవును" అన్నాడు దేవుడు. "నువ్వు యెదగగలిగినంత యెత్తుకు యెదిగి నాకా వైభవాన్నివ్వు" అనగానే ఆ వ్యక్తి అడవిని వదలి యింటి దారి పట్టాడు.

అంటే ఈ కథలోని అర్థమేమిటంటే మానవుడు యెన్నో కోరికలతో ఉంటాడు. భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. కొన్ని అదృష్టాన్ని బట్టి తీరుతూ ఉంటాయి. కొన్ని తీరడానికి ఆలశ్యం కావచ్చు. యెప్పుడు తీరతాయో తెలీదు. అటువంటి పర్తిస్తితుల్లోనే నిరాశ వస్తుంది. ఇన్నాళ్ళుగా దేవుడిని కొలుస్తున్నామే, పూజ చేస్తున్నామే, నా మొఱ ఆయన యెందుకని ఆలకించటంలేదు, అనుకోవడం మానవ సహజం. అప్పుడే మనకి యింకా భక్తి భావం పెంపొంది మనసులో దేవునిమీద భక్తి గట్టి పునాదిగా యేర్పడాలి. నిరాశ పడకుండా యింకా యెక్కువ భక్తితో ఆయనని కొలవాలి. కష్టాలలో కూడా మొక్కవోని ధైర్యంతో నిలబడగలగాలి. మనలని సృష్టించిన ఆ భగవంతుడు మనలని ఆదుకోడా? ఈ సందర్భంలో యింతకుముందు నేను ప్రచురించిన "పాదముద్రలు" మరొకసారి చదవండి.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
Kindly Bookmark and Share it:

1 comments:

chaitanya on July 20, 2011 at 11:11 AM said...

Jai sai ram

I request moderators/users to publish such kind of stories so that it helps in bring the life in a useful manner. And also baba's experiences also.

Thanks and Regards
sai chaitanya.

Post a Comment