Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, August 7, 2011

సాయి సచ్చరిత్ర 9 వ. అథ్యాయం

Posted by tyagaraju on 8:32 AM


08.07.2011 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులందరికీ బాబా వారి శుభాశీస్సులు

సాయి సచ్చరిత్ర 9 వ. అథ్యాయం

ఓం శ్రీ సాయినాథాయనమహ

తార్ఖడ్ కుటుంబం వారి అనుభవాల భాండాగారాన్ని నేను మీముందు తెరిచాను. యివన్నీ చదివిన తరువాత బాబా మీద మీ నమ్మకం రెట్టింపవుతుందని నాకు బాగా తెలుసు. యిపుడు మనం సాయి సచ్చరిత్రలోని అనుభవాలు చూద్దాము.

సాయి సచ్చరిత్రలోని 9 వ. అథ్యాయం వైపు నేను మీ దృష్టిని మరల్చుదామనుకుంటున్నాను. మన పాఠకులందరూ కూడా ఈ పవిత్రమైన పుస్తకంలో యెంతో జ్ఞానవంతులని నేను భావిస్తున్నాను. వారు ఒక్కసారయిన చదివి ఉంటారు. ఒకవేళ యెవరయినా అలా చేయకపోతే, నా వినమ్రమైన అభ్యర్థన యేమంటే దయచేసి చదవండి. అది షిరిడీ సాయిబాబా వారి జీవితాన్ని గురించి చాలా చక్కగ వివరిస్తుంది. అనేకమైన లీలలను ఆయన షిరిడీలో తను ఉన్న కాలంలో తన భక్తులకు దర్శింపచేశారు.

ఈ పవిత్ర గ్రంథంలోని 9 వ. అథ్యాయం యెక్కువ భాగం తార్ఖడ్ కుటుంబానికేచెందుతుంది. అంటే మా నానమ్మగారు, మాతాతగారయిన రామచంద్ర ఆత్మారాం తార్ఖడ్ అనబడే బాబా సాహెబ్ తార్ఖడ్, యింకా మానాన్నగారు జ్యోతీంద్ర రామచంద్ర తార్ఖడ్. యింతకు ముందు వివరించినట్లుగా తార్ఖడ్ కుటుంబం విపరీతమయిన ప్రార్థనా సమాజ్ వాదులు. వారు విగ్రహారాథనని నమ్మరు. ఆ కారణం చేత వారికి దేవునియందు నమ్మకం లేదు. యేమయినప్పటికీ వారి అదృష్టం వారిని షిర్డీ సాయిబాబాతో బంథం యేర్పడటానికి తీసుకు వచ్చింది. అప్పుడది ఒక గొప్ప మార్పు. అందుచేత ప్రముఖ ఆరతి కూడా చేప్పేది ఆయన నాస్తికుణ్ణి కూడా ఆస్తికుడిగా మార్చగలదని (నాస్తికానహీ తూ లావిషినిజ భజని) తార్ఖడ్ కుటుంబంలో యిది అనుభవ పూర్వకంగా నిరూపితమయింది.

సాయి సచ్చరిత్ర రచయిత స్వర్గీయ శ్రీ అన్న సాహెబ్ ధబోల్కర్ గారు తన 9వ అథ్యాయంలో, గొప్ప భక్తుడైన కుమారుడు ఉన్నందుకు బాబా సాహెబ్ తార్ఖడ్ గారు చాలా అదృష్టవంతులని చెప్పారు. మా నాన్నగారు ఉదయం 4 గంటలకే లేచి, స్నానంచేసిన తరువాత యింటిలో తమ మందిరంలో ఉన్న బాబా ఫొటోకి చందనం అద్ది, బాబాకి ఆరతి యిస్తూ ఉండేవారు. ఆయన అయిదు వత్తులవెండి దీపాన్ని (నిరంజన్) వెలిగించి అందులో బాబా యిచ్చిన ఒక పైసా నాణాన్ని ఉంచేవారు. ప్రతిరోజూ ప్రసాదంగా పటిక బెల్లాన్ని సమర్పిస్తూ ఉండేవారు. మథ్యాన్న భోజన సమయంలో దానిని వారందరూ తింటూ ఉండేవారు.

పూజ అయిన తరువాత తండ్రీ, కొడుకులిద్దరూ బైకుల్లాలోని టెక్స్ టైల్ మిల్ కి వెడుతూ ఉండేవారు. బాబా దయవల్ల ఆ రోజుల్లో మాతాతగారు నెలకు రూ.5,000/- మా నాన్నగారు నెలకు రూ.2,000/- జీతం సంపాదిస్తూ ఉండేవారు. ఒక సారి మా తాతగారికి, బాబాగారు కఫ్నీలు కుట్టించుకోవడానికి కాటన్ తానులు పంపిద్దామనే కోరిక కలిగింది. ఆయన జోతీంద్రతో, తల్లితో కూడా షిరిడీ వెళ్ళి బాబాకి సమర్పించి రమ్మని సూచించారు. కాని యింటిలో పూజ ఎవరుచేస్తారనే కారణం చేత జ్యోతీంద్రగారు యిష్టపడలేదు.

అపుడు మాతాతగారు ఆబాథ్యతను తాను తీసుకుని జ్యోతీంద్ర చేసినట్లే తాను కూడా చేస్తాననీ అందులో యెటువంటి లోటు జరగనివ్వననీ హామీ ఇచ్చారు. ఆ హామీతో మా నాన్నగారు తన తల్లితో షిరిడీకి బయలుదేరారు. తరువాత రెండు రోజులు బాగానే గడిచాయి. కాని, ముడవరోజున మా తాతగారు పూజా సమయంలో కలకండ పెట్టడం మరచిపోయారు. భోజనం చేసే సమయంలో తన పళ్ళెంలో కలకండ లేకపోవడంతో మధ్యాన్నానికి గుర్తు వచ్చింది. ఆయన వెంటనే లేచి షిరిడీలో ఉన్న జ్యోతీంద్ర కి తాను చాలా పెద్ద తప్పు చేసానని బాబాగారిని క్షమించమని అడగమని కోరుతూ ఉత్తరం వ్రాశారు. అక్కడ షిరిడీలో అదే సమయంలో ఒక ఆసక్తికరమయిన సంఘటన జరిగింది. ద్వారకామాయిలో మథ్యా న్న ఆరతి అయిన తరువాత, మా నానమ్మగారు, బాబా గారి దగ్గరకు ఆయన ఆశీర్వాదములు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, బాబా మా నానమ్మగారితో "అమ్మా ! ఈ రోజు నాకు చాలా ఆకలిగా ఉంది.. యెప్పటిలాగే నేను బాంద్రా వెళ్ళాను. తలుపుకి తాళం వేసి ఉండటం చుశాను. కాని నన్నెవరూ ఆపలేదు యెందుకంటే తలుపుకి ఉన్న చిన్న ఖాళీ గుండా ప్రవేశించాను. కాని తినడానికి యేమీ లేకపోవడంతో పూర్తిగా నిరాశ చెంది ఖాళీ కడుపుతో తిరిగి రావాల్సి వచ్చింది." అన్నారు. బాబా చెపుతున్నదేమిటో మానాన్నమ్మగారికి అర్థం అవలేదు. కాని మానాన్నగారు, ఉదయం పూజా సమయంలో బాబాకి ప్రసాదం పెట్టడం తన తండ్రి మరచిపోయి ఉంటారని అర్థం చేసుకున్నారు. ఆయన బాబాని తన తండ్రి చేసిన పెద్ద తప్పుకు మన్నించమని కోరారు. వెంటనే ముంబాయి వెళ్ళడానికి అనుమతినివ్వమని అడిగారు. బాబా అనుమతినివ్వక యింకా కొన్ని రోజులు ఉండమన్నారు. యేమయినా గాని, మా నాన్నగారు అస్థిమితంగా ఉన్నారు. ఆయన బాబా చెప్పిందంతా వివరంగా తన నాన్నగారికి ఉంత్తరం వ్రాశారు. రెండు ఉత్తరాలూ ఒకదానికొకటి దాటుకుని వారికి చేరగానే వాటిని చదివిన తరువాత తండ్రీ కొడుకులిద్దరికీ కన్నీరొచ్చింది. తమ మీద బాబాకున్న అపరిమితమైన ప్రేమ తెలిసివచ్చింది. బాబా యింకా ఆ ఫోటో ఫ్రేములో తాను సజీవంగా ఉన్నాననీ ప్రతిరోజూ వారు సమర్పించే నైవేద్యాలని తప్పకుండా స్వీకరిస్తున్నట్లు గుర్తు చేశారు.


ఒకసారి వారు షిరిడీలో ఉన్నప్పుడు, మా నానమ్మగారు భోజనం చేసేముందు, ఒక కుక్క తోకాడించుకుంటూ వచ్చింది. మా నానమ్మగారు దానికి ఒక చపాతీ ముక్క పెట్టారు. ఆ కుక్క సంతోషంతో తిని అక్కడినుంచి వెళ్ళిపోయింది. కొంచెం సేపటి తరువాత అక్కడికి ఒళ్ళంతా పెంటతో నిండి ఉన్న వరాహం ఒకటి అక్కడికి వచ్చింది. సాథారణంగా అటువంటి అసహ్యకరమైన ప్రాణిని చూసినప్పుడు యెవరికి గొంతులోఉన్న ముద్దని కిందకు దించుకోలేరు. కాని మా నాన్నమ్మగారు చాలా దయ కలవారు. దేవుడంటే భయం కలది. ఆవిడ ఆ అసహ్యకరమైన వరాహానికి కూడా చపాతీ ముక్కని పెట్టారు. ఆ వరాహం చపాతీ ముక్కను తిని వెళ్ళిపోయింది. తరువాత ఆ రోజున వారు ద్వారకామాయికి వెళ్ళి బాబాకి దగ్గరగా వెళ్ళారు. బాబా ఆమెతో "అమ్మా ! ఈ రోజు నువ్వు నీ చేతులతో దివ్యమైన విందు భోజనం పెట్టావు. నాకింకా త్రేనుపులు వస్తున్నాయి" అన్నారు. అది విని మా నాన్నమ్మగారు ఆశ్చర్యపోయారు. ఆమె బాబాతో "బాబా మీరు పొరబడ్డారు. షిరిడీలో నేను మీకెప్పుడూ భోజనం పెట్టలేదు. నేనిక్కడ వంట కూడా వండలేదు. నిజానికి నేనిక్కడ, సగుణ నడిపే హోటలులో డబ్బు చెల్లించి భోజనం చేస్తాను. " అన్నారు. అప్పుడు బాబా "అమ్మా ! ఈ రోజు మధ్యాన్నం నువ్వు భోజనం చేసేముందు ఒక కుక్కకి ఆ తరువాత వచ్చిన అసహ్యకరమైన వరాహానికి తిండి పెట్టలేదూ? ఆ ఆహారం నాకు చేరింది" అన్నారు. అప్పుడు మా నాన్నమ్మగారు "బాబా, దీనర్థం నీవు ప్రాణుల రూపాలలో వచ్చి నీ భక్తులను పరీక్షిస్తూ ఉంటావు" అన్నారు. బాబా ఆమెతో అన్నారు "అమ్మా ! దయ చేసి ఈ ప్రాణులమీద అలాగే దయ చూపుతూ ఉండు, భగవంతుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. భగంతుడు నీ యింటిలో ఆహారానికి కొరత లేకుండా చూస్తాడు"


యిప్పటికి తార్ఖడ్ కుటుంబం యితర సాయి భక్తులతో యెక్కువ సాన్నిహిత్యం పెంచుకున్నారు. వారిలో శ్రీ ధబోల్కర్, శ్రీ పురందరే, శ్రీ తెండుల్కర్. వీరంతా బాంద్రాలో వీరింటికి దగ్గరి దూరంలోనే ఉంటారు. వారు ఒకరికొకరు కలుసుకుంటూ బాబాతో తమకు కలిగిన అనుభవాలని చెప్పుకుంటూ ఉండేవారు. యెప్పుడయినా వారు షిరిడీ వెళ్ళాలనుకున్నప్పుడు దానిని ఆ భక్తుని తరపున చేరవేస్తూ ఉండేవారు. దీని వెనకనున్న వారి ఉద్దేశ్యం బాబామీద తమకున్న స్వచ్చమైన భక్తిని, ప్రేమను తెలిపేటందుకే. ఒకసారి పురందరేగారు తమ కుటుంబంతో సహా షిరిడీ వెడుతున్నపుడు మా నానమ్మగారు, పురందరే భార్యకు రెండు పెద్ద నల్లవంకాయలనిచ్చి ఒక కాయతో పెరుగు పచ్చడి, రెండవదానితో వంకాయ ముక్కల వేపుడు చేసి బాబాగారికి భోజనంలో వడ్డించమని చెప్పింది.


మొదటి రోజున పురందరే భార్య వంకాయ పెరుగు పచ్చడి చేసి, మిగతా పదార్థాలతోపాటు బాబా భోజన పళ్ళెంలో వడ్డించింది. బాబా వంకాయ పెరుగు పచ్చడి భుజించి వంకాయ వేపుడు కావాలనే కోర్కెను తెలియచేశారు. షిరిడీలోని (స్థానికంగా ఉండే భక్తురాలు) రాధాకృష్ణమాయి, ఈమె బాబాగారికి భోజన యేర్పాటులన్ని చూస్తూ ఉండేది. ఆమెకేమీ తోచలేదు. ఆమె అక్కడ ఉన్న ఆడవారినందరినీ అడిగి పురందరుని గారి భార్య వంకాయ పచ్చడిని తెచ్చిందని తెలుసుకుంది. యేమయినప్పటికీ అది వంకాయల కాలంకాదు కనక షిరిడిలో వంకాయలు దొరకడం కష్టం. (అంచేత రాథాకృష్ణమాయి వంకాయలు యెక్కడ దొరుకుతాయో కనుక్కొవడానికి పురందరే భార్యవద్దకి పరిగెత్తుకుని వెళ్ళింది.అప్పుడామె తన దగ్గిర ఒకటుందనీ, దానిని మరునాడు బాబాకి వంకాయ వేపుడు చేసి పెట్టడానికని ఉద్దేశించినట్లు చెప్పింది. అపుడు రాథాకృష్ణమాయి ఆ వంకాయను తీసుకొని వెళ్ళి, తొందరగా బాబాకి వేపుడు చేసి పెట్టాకే బాబా వాటిని స్వీకరించి భోజనం ముగించి లేచారు. యిప్పుడిది బాబా తన భక్తులపై స్వచ్చమైన ప్రేమను తెలియచేసే సంఘటన యింకా యేమిటంటే అతన్నినించి/ఆమెనించి వారి భక్తిని స్వీకరించారన్నదానికి నిర్థారణ. పురందరే భార్య బాంద్రాకు తిరిగి వచ్చిన తరువాత ఈ సంఘటన గురించి మా నాన్నమ్మకి చెప్పినపుడు, ఆవిడ యెంతో సంతోషించి, తన హృదయాంతరాళలోనించి బాబావారికి థన్యవాదాలు తెలుపుకున్నారు.


యిదే విథంగా ఒక సాయంత్రం గోవిందజీ (బాలక్ రాం కుమారుడు) తార్ఖడ్ గారి యింటికి వచ్చి తాను, ఆరాత్రికి షిరిడీ బయలుదేరి వెడుతున్నానని చెప్పాడు. తాను, స్వర్గీయుడైన తన తండ్రి అస్థికలను నాసిక్ లో నిమజ్జనం చేయడానికి వెడుతున్నాననీ, అక్కడినించి షిరిడీ వెడతాననీ చెప్పాడు. అతను చాలా తొందరలో ఉన్నందు వల్ల మా నానమ్మగారికి బాబాకు పంపించడానికి సరైనదేదీ దొరకలేదు. చందనపు మందిరంలో బాబా చిత్రపటం ముందు వుంచబడిన ప్రసాదం కుండలో ఉన్న ఒక "కోవా" దొరికింది. ఆవిడ అతనితో తనకు లోపల యిష్టం లేకపోయినప్పటికీ దానినే యిస్తున్నాననీ కారణం యింతకుముందే దానిని బాబాకు ప్రసాదంగా పెట్టాననీ చెప్పారు. అంతే కాకుండా గోవిందజీ, అస్థికలను నిమజ్జనం చేసే కార్యక్రమానికి తోడు, షిరిడీకి కూడా యాత్రను పెట్టుకున్నారు. భక్త శబరి రాములవారికి తాను రుచి చూసిన రేగిపళ్ళను సమర్పించి భక్తిభావాన్ని చాటుకున్నట్లుగా, తన భక్తి భావం ముందు యిటువంటి న్యాయ సమ్మతం కానటువంటి ఆలోచనలన్నిటినీ పక్కకు నెట్టేశారు.


గోవిందజీ తన మిగతా కార్యక్రమాలన్నిటినీ పూర్తి చేసుకుని ద్వారకామాయిని చేరుకున్నపుడు అతను కోవా గురించి మర్చిపోయాడు. బాబా అతనిని తనకోసం యేమయినా తెచ్చావా అని అడిగారు. గోవిందజీ తేలేదని చెప్పాడు అప్పుడు బాబా తనకిమ్మనమని ఒకరు యేదో యిచ్చారని అతనికి గుర్తు చేశారు. గోవిందజీ శిలలా మొహం పెట్టి మరలా లేదని చెప్పాడు. బాబా ఇపుడు కోపంతో అరుస్తూ అన్నారు. "ఏయ్ ! నువ్వు బొంబాయినుండి బయలుదేరేటప్పుడు మా అమ్మ నాకుయిమ్మని ఏదో ఇచ్చింది కదా, ఏది అది?"

గోవిందజీకి యిప్పటికి తెలిసింది. అతను తనున్న చోటకి పరిగెత్తుకుని వెళ్ళి కోవా తెచ్చి బాబాకిచ్చాడు. బాబా వెంటనే దానిని తిని గోవిందజీతో అది చాలా మథురంగా ఉందని అమ్మకి చెప్పమని అన్నారు.

ప్రియమైన సాయి భక్త పాఠకులారా, దైవాంశసంభూతమైన ప్రేమానురాగ దృష్టాంతాలు స్వర్గీయ అన్నా సాహెబ్ ధాబోల్కర్ గారు సాయి సచ్చరిత్ర 9 వ అథ్యాయంలో యెంతో మనోజ్ఞంగా వర్ణించారు. మా నాన్నగారు వాటిని మాకు వివరించి చెబుతూ ఉన్నప్పుడు ఆయన కళ్ళనుండి కన్నీరు కారుతూ ఉండేది.ఆ విథంగా భగవంతుడినించి తిరిగి పొందినపుడు అలా స్పందించకుండా యే భక్తుడూ ఉండడని నాకనిపిస్తుంది.

నేను ఒకదానికి బాథపడుతున్నాను."యెక్కడికి వెళ్ళారు ఆ ప్రజలంతా (వారందరికీ నమస్కారాలు) ఆ భక్తులంతా యెక్కడ ఉన్నారు? అటువంటి భక్తి ఈ రోజు యెక్కడ ఉంది? కాని బాబా ప్రేమ తనభక్తుల మీద యెల్లపుడూ వ్యాపించి ఉంటుంది.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List