Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, November 20, 2011

సాయి.బా.ని.స. డైరీ

Posted by tyagaraju on 7:44 AM

20.11.2011 ఆదివారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు శుభాసీస్సులు

సాయి.బా.ని.. డైరీ తరువాయి భాగము

2 భాగము

25.05.1992 సోమవారము

నా కుమార్తె చి.సౌ. హేమలత వివాహానికి నాలుగు నలల ముందు నా యింటికి పిల్లి వచ్చి మా యింట పెంపుడు పిల్లిగా మారిపోయిందై. యింటిల్లపాదికి పెంపుడు పిల్లి అంటే చాలా ఇష్ఠము. దానికి "చిల్లి" అని ముద్దు పేరు పెట్టినాము. రోజు చిల్లి పాలు గ్రాగలేదు. కాలు కాలిన పిల్లిలాగ యిల్లు అంతా తిరగసాగినది. రాత్రి కోపముతో దానిని బయటకు పంపించి వేసినాను.

26.05.1992 మంగళవారము

నిన్నటి రోజున నా కుమార్తె వివాహము జరిగి 16 రోజులు అయింది. 16 రోజుల పండగ చేయలేదు. రోజు అంతా చిల్లి కోసము ఎదురు చూసినాము. కాని చిల్లి ఇంటికి రాలేదు. మనసులో చిల్లి గురించి ఆలోచిందసాగినాను. శ్రీ సాయి నా కుమార్తె వివాహము సవ్యముగా జరిగేటట్లు చూడటానికి పిల్లి రూపములో నా యింట ఉన్నారా? వివాహము అయిన 16 . రోజున మా అందరినీ విడిచి వెళ్ళిపోవాలి అనే బెంగతో పాలుకూడ త్రాగకుండ వెళ్ళిపోయినారా? అనే పరిపరి ఆలోచనలతో సాయి సత్ చరిత్ర చదవసాగినాను. 40 . అధ్యాయములో శ్రీ బీ.వీ.దేవుగారి యింటికి శుభకార్యానికి శ్రీ సాయి సన్యాసి రూపములో వెళ్ళి భోజనము చేసిన సంఘటనను హేమాద్రిపంతు వర్ణించుతూ అన్న మాటలు "భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో, వారు తమ భక్తుల యిండ్లలో శుభకార్యములును సవ్యముగా నెరవేరునట్లు జూచెదరు" జ్ఞాపకానికి వచ్చినవి.

10.06.92

నిన్న రాత్రి కలలో శ్రీ సాయి నిడమర్తి కొండలరావు గారి రూపములో దర్శనము ఇచ్చి - "నేను నెలరోజుల క్రితము బయటి ఊరికి వెళ్ళినాను. యింక తిరిగి నీ యింట రోజూ జరిపే ఫంక్షన్ మొదలుపెట్టు" అన్నారు. బహుశ 10.05.1992 నాడు నేను ఆపుచేసిన శ్రీ సాయి సత్ చరిత్ర నిత్య పారాయణ తిరిగి 10.06.92 నాడు ప్రారింభించమని ఆదేశించినారు అని భావించి - శ్రీ సాయి సత్ చరిత్ర నిత్య పారాయణ తిరిగి ప్రారంభించినాను. తర్వాత ఇంకొక కలలో శ్రీ సాయి చూపిన దృశ్యము... నాకు నా భార్యకు నా మామగారి విషయములో గొడవలు జరుగుతున్నాయి - నా భార్య మెదడు మొద్దుబారిపోయినది. మెదడులో పొరలు పేరుకొని పోయినవి. శ్రీ సాయి చీమల రూపములో మెదడులోనికి వ్రవేశించి మొద్దు బారిపోయిన పొరలను తొలగించుచున్నారు. ఈ కల చాల విచిత్రముగా అనిపించినది. సాయంత్రము ఆఫీసునుండి వచ్చి శ్రీ అమ్ముల సాంబశివరావుగారు వ్రాసిన సాయిబాబా ఎవరు? అనే పుస్తకము చదువుతున్నాను. 36 . పేజిలో వ్రాసిన వాక్యాలు నన్ను ఆశ్చ్ర్యపరచినవి. అవి " ప్రక్కన చూడు చీమలు దోషపూరితమైన పొరలను ఎలా తినుచున్నవో" - అని కనిపించినవి.

రాత్రి కలలో చూపిన దృశ్యమునకు అర్థము ఉన్నది అని తెలియచేయటానికి శ్రీ సాయి మాటలను శ్రీ అమ్ముల సాంబశివరావు గారి పుస్తకము ద్వారా నిర్థారణ చేసినారు.

12.06.92 శుక్రవారము

రోజు బక్రీదు బండగ. మధ్యాహ్న్నము 12.30 నిమిషాలకు నా యింటిముందు తెల్లని మేక వచ్చి నిలబడినది. నేను ప్రేమతో రెండు రొట్టెలు పెట్టినాను. మేక రొట్టెలు తింటు ఉంటే శ్రీ సాయి సత్ చరిత్ర 42 . అధ్యాయములో శ్రీ సాయి అన్న మాటలు కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుటవంటిది. కుక్కకు కూడ ఆత్మ కలదు. ప్రాణులు వేరుకావచ్చు. కాని అందరి ఆకలి ఒక్కటే".

17.06.92 బుధవారము

నిన్న రాత్రి నాకుమార్తె దగ్గరనుండి ఉత్తరాలు రావటము లేదు అనే చింతతో నిద్రపోయినాను. శ్రీ సాయి నారిస్థితి అర్థము చేసుకొని చూపిన దృశ్యము - "ఒకస్త్రీ , ఒక పురుషుడు ఆకాశమునుండి ప్యారాచూట్ సాయముతో కొండమీదకు దిగినారు. వారు ఉభయులూ కొండపై సంతోషముగ గడిపి తిరిగి ప్యారాచూట్ సాయముతో కొండమీదనుండి భూమిపైకి దిగినారు." సంతోషముతో తెలివి వచ్చినది. సమయములో ఎవరో నన్ను శ్రీ గణేష్ పూజ చేయమని చెబుతున్న అనుభూతి కలిగినది. ఉదయము 8 గంటలకు సికంద్రాబాద్ గణేష్ గుడికి వెళ్ళి పూజ చేసుకొని అక్కడి దగ్గరలో ఉన్న పాండురంగని గుడికి వెళ్ళి పూజ చేసుకొన్నాను. పాండురంగని గుడిలో నా వెనకాల మధ్యవయస్సు వ్యక్తి నల్లని గెడ్డము నుదుట విభూతి పట్టి చినిగిన చొక్క ప్యాంటు ధరించి ఉన్నాడు. పూజారిగార్కి దక్షిణ ఇస్తున్న సమయములో వ్యక్తిలో శ్రీ సాయిని చూడగలిగినాను. ఒక రూపాయి దక్షిణగా ఆవ్యక్తికి ఇచ్చినాను. వ్యకి చిరునవ్వుతో రూపాయిని స్వీకరించి నవ్వుతూ వెళ్ళిపోయినాడు. యింటికి 10 గంటలకు చేరుకొన్నాను. ప్రక్క యింటిలోని ఫోన్లో శ్రీ గజ్జల సుదర్శ న్ రావుగారు నాతో మాట్లాడాలని నన్ను పిలిపించినారు. శ్రీ సుదర్శన్ రావు గారు నంద్యాల్ నుండి ఉదయము హైదరాబాద్ చేరుకొని నాకు ఫోన్ చేసి నంద్యాలలో నా కుమార్తె చి.సౌ. హేమలత అల్లుడు రామకృష్ణ కులాసాగ ఉన్నారు వాళ్ళ కొత్త కాపురము సంతోషముగా జరుగుతున్నది అనే మాట చెప్పినారు. నేను రాత్రి నా మనసులోని బాధ శ్రీ సాయికి విన్నవించుకొన్నాను. రాత్రి కలలో దృశ్యరూపములోను ఉదయము 10 గంటలకు టెలిఫోన్ లో మంచి మాట రూపములోను శ్రీ సాయి నాబాధను తొలగించినారు.

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment