13.03.2012 మంగళవారము
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈరోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 7వ. భాగాన్ని చదువుకుందాము.
సాయి.బా.ని.స. డైరీ - 1995 (07)
నిన్నరాత్రి కలలో విచిత్రమైన దృశ్యాన్ని చూపించినారు శ్రీసాయి. వాటి వివరాలు.
"అది ఆదివారము సంత. ఆసంతలో వజ్రాలు రాశులుగా పోసి అమ్ముతున్నారు.
గొప్పగొప్ప వాళ్ళు వచ్చి వజ్రాలు కొంటున్నారు. ఒక బీదవానికి ఆ వజ్రాలపై మనసుకలిగినది. ఒక వజ్రాన్ని దొంగిలించి పారిపోసాగినాడు. గొప్పవాళ్ళు అతని వెంట పరిగెడుతు అతన్ని పట్టుకొని కొట్టండి అని అరుస్తున్నారు. బీదవాడు ప్రాణభీతితో పరిగెడుతున్నాడు. నేను ఆ గుంపులో ఉన్నాను. నాకు ఆబీదవానిపై జాలి వేసినది. భగవంతుడా ఆబీదవాడు ఈగండమునుండి బయట పడితే నేను నీకొండకు వచ్చి నాతల నీలాలు సమర్పించుతాను తండ్రి అని మ్రొక్కుకుంటాను. నేను ఈవిధముగా ప్రార్ధించుతుంటే గొప్పవాళ్ళు వచ్చి నాకు దేహ శుధ్ధి చేసినారు. ఒక్కసారిగా నిద్రనుండి మెలుకువ వచ్చినది. ఈవిధమైన కలకు అర్ధము ఏమిటి అని ఆలోచించసాగినాను. నా ఆలోచనలకు సమాధానము దొరకలేదు. నేను ఎవరిమీద జాలి చూపాలి. భగవంతుడు ఎవరిని కాపాడాలి. ఈప్రశ్నలకు ఏనాటికైన శ్రీ సాయి సమాధానము యివ్వగలరు అనే ఆశతో ఎదురు చూస్తాను.
20.03.1995
చనిపోయినపుడు మనవాళ్ళు మనతోరారు. మనము సంపాదించిన సంపద మనతోరాదు. అటువంటపుడు "నావాళ్ళు నాది అనే వ్యామోహము లేకుండ యుండే మార్గము చూపు తండ్రి" అని శ్రీసాయిని వేడుకొన్నాను.
శ్రీ సాయిచూఫిన దృశ్యాల వివరాలు.
నా జీవితములో నాకు సర్వ సుఖాలు పంచి యిచ్చిన స్త్రీ నేడు శారీరక రోగలతో బాధపడుతున్నది. ఆమె శరీరము అస్తిపంజరములాగ మారిపోయి రేపో, మాపో మట్టిలో కలసిపోవటానికి కొన ఊపిరితో యున్నది. నేను ఆమెను కనీసము ముట్టుకోవటానికి వెనకాడుతున్నాను. ఏమీ చేయలేని స్తితిలో యున్నాను. ఆ సమయములో ఒక సన్యాసి నాదగ్గరకు వచ్చి "యిన్నాళ్ళు నావాళ్ళు నావాళ్ళు అన్నావే ఈనాడు వారిని తాకడానికి వెనకాడుతున్నవే యింక వాళ్ళు నావాళ్ళు అని ఎలాగ అనగలవు. అదే విధముగా నీవు సంపాదించిన ఈ యిల్లు, ఆస్థిపాస్థులు కాల ప్రవాహములో మట్టిలో కలసిపోవలససినదే. యిన్ని తెలిసియుండి యింకానావాళ్ళు, నాఅస్తిపాస్తులు అనే వ్యామోహము కలిగి యుండటములో అర్ధము ఏమిటి ఆలోచించు". ఈ విధమైన మాటలకు నిద్రనుండి ఉలిక్కిపడి లేచినాను.
21.03.1995
నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి "సాయినాధ ప్రశాంత జీవితానికి మార్గము చూపు తండ్రి అని వేడుకొన్నాను. శ్రీసాయి రెండు దృశ్యాలు చూపించి ప్రశాంత జీవితానికి మార్గము చూపబడదు. నీకు నచ్చిన మార్గమును నీవే ఎన్నుకోవాలి అన్నారు. శ్రీసాయి చూపిన రెండు మార్గాలు 1) కొంతమంది జీవితములో ధన సంపాదనే ధ్యేయముగా పెట్టుకొని తమ బరువు బాధ్యతలను సరిగా నిర్వహించక, మత్తు మందులకు బానిసగా మారి ఆమత్తులో శాశ్వత నిద్రపొందుతారు.
2) మరికొంత మంది జీవితములో తమబరువు బాధ్యతలను సరిగా నిర్వర్తించి అలసిపోయి సుఖముగా నిద్రపోతు ఆనిద్రలో శాశ్వత నిద్ర పొందుతారు.
26.03.1995
నిన్నటిరోజున ఋణానుబంధము, ఖర్మ, యోగము అనే విషయాలపై చాలా సేపు ఆలోచించినాను. రాత్రి నిద్రకుముందు శ్రీసాయికి నమస్కరించి వివరణకోరినాను. శ్రీసాయి దృశ్యరూపములో యిచ్చిన వివరణ.
1) ఎనిమిది సంవత్సరాల బాలుడి ఊపిరి తిత్తులలో యింకొక చిన్న బాలుడు పెరుగుతున్నాడని డాక్టర్స్ ఆపరేషన్ చేసి పెరుగుతున్న ఆపిండాన్ని బయటికి తీసివేసినారే మరి యిది గత జన్మలోని ఋణానుబంధము కాదా !
2) ముసలితనములో ఉద్యోగ విరమణ తర్వాత కూడా భార్య పిల్లలకోసము ధన సంతాదన తాపత్రయములో పడిపోవటము చేసుకొన్న ఖర్మ కాదా !
3) కావససినంత ధనము యుంది చేతిలో. విమాన ప్రయాణమునకు టిక్కెట్టు యుంది. కాని సరయిన సమయానికి విమానాశ్రయమునకు చేరలేక ఆఖరికి రైలులో ప్రయాణము చేసేవాడిని ఏమనాలి - విమాన ప్రయాణ యోగము లేదనాలా !
30.03.1995
శ్రీసాయినాధ సాయి బంధువులకు సందేశము ప్రసాదించు తండ్రి అని వేడుకొన్నాను. రాత్రి కలలో శ్రీసాయి కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసి రూపములో దర్శనము యిచ్చి జీవితము గురించి దృశ్యరూపములో యిచ్చిన వివరణ. "జీవితము అనే రైలు ప్రయాణములో ఆఖరి స్టేషన్ రాగానే "ఆత్మ" ఈ శరీరాన్ని ప్లాట్ ఫారం మీద వదలి యింకొక రైలు ప్రయాణము (నూతన శరీరము) కోసము ఎదురు చూస్తూ ఉంటుంది. నా భక్తులకు ఈరైలు ప్రయాణము బాధలు లేకుండ యుండటానికి నేను వాళ్ళను వారి గమ్యానికి చేరుస్తాను.
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment