28.04.2012 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
సాయి.బా.ని.స. డైరీ - 1995 (25)
18.11.1995
నిన్నటిరోజున పరుల ధనము ఆశించినాను. నిద్రకు ముందు నేను చేసిన పని తప్పు అని గ్రహించి, శ్రీసాయికి నమస్కరించి సాయినాధ పరుల ధనము మీద వ్యామోహము లేకుండ యుండేలాగ మార్గము చూపు తండ్రీ అని వేడుకొన్నాను. శ్రీ సాయి ఒక తోట కాపలావాని రూపములో దర్శనము ఇచ్చి ప్రసాదించిన సందేశము "నీవు కష్ఠపడి సంపాదించిన ధనము నీచింత చెట్టుమీదకు ఎక్కి పండిన చింతకాయలను కోసి వాటిని యెండపెట్టి ఆ చింత పండును మట్టికుండలలో దాచుకొని నీనిత్య అవసరాలకు కొంచము కొంచముగా వాడుకోవటమువంటిది. మరి పరుల ధనమును ఆశించటము అంటే సీమ చింత చెట్టు ఎక్కి ఆచెట్టుకు ఉన్న ముళ్ళతో శరీరానికి బాధ కలిగించుకొని ఆరంగురంగుల సీమ చింతకాయలను తిని గొంతులో దగ్గు బాధను అనుభవించటము వంటిది. అందుచేత పరుల సొమ్మును ఆశించి మానసిక బాధలు, శారీరక బాధలు పొందవద్దు.
21.11.1995 నిన్నరాత్రి శ్రీసాయి ఒక వృధ్ధుని రూపములో దర్శనము యిచ్చి ప్రసాదించిన సందేశము "ప్రాపంచికము అనే బెల్లము నీదగ్గర యున్ననాడు స్నేహితులు, బంధువులు చీమల లాగ, ఈగలలాగ నీదరికి చేరుతారు. అదే ఆధ్యాత్మికము అనే బెల్లము నీదగ్గర యున్ననాడు ఏస్నేహితుడు ఏ బంధువు నీదగ్గరకు చేరడు, కాని సమర్ధ సద్గురువు నీదగ్గర ఉన్నా ఆధ్యాత్మిక బెల్లమును చూసి నీదగ్గరకు వచ్చి తల్లిలాగ ప్రేమతో ఆబెల్లమును నీచేత తినిపించి నీకు మోక్షమును ప్రసాదించుతారు."
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

0 comments:
Post a Comment