Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, June 14, 2012

సాయి.బా.ని.స. డైరీ - 1998 (05)

Posted by tyagaraju on 8:02 AM




14.06.2012 గురువారము


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు


సాయి భక్తులకు గమనిక::

మీరందరూ సాయి.బా.ని.స. డైరీ చదువుతూ బాగా ఆకళింపు చేసుకుంటున్నరనుకుంటున్నాను.  బాబాగారు ఆయనకు కలలలో ఫకీరు రూపములోను, అజ్ఞాత వ్యక్తి రూపములోను ఇచ్చిన సందేశాలు నేటి సమాజానికి అనుగుణంగా ఏనాడొ చెప్పారు.  సాయి.బా.ని.స. కు దాదాపు 12 సంవత్సరాల క్రితమే నేటి సమాజ స్థితిగతులను యధాతధాంగా చెప్పినట్లుగా మనకి అర్ధమవుతుంది.  అందుచేత సాయి.బాని.స. డైరీ మామూలుగా చదివేయడం కాకుండా, నేడు సమాజంలోని స్థితిగతులను కూడా బాబాగారు చెప్పినట్లు వాటికి తగినవిధంగా ఉన్నాయని మీరందరూ గ్రహిస్తున్నరనుకుంటున్నాను. 
ఇంతకుముందు డైరీలో బాబాగారు --  "నీ డైరీ నాపిల్లలు చదువుతారు అని సందేశాన్నిచ్చారు..  మరి మనమందరమూ కూడా ఆయన డైరీని చదువుతున్నాము.
బాబాగారు ఏనాడొ చెప్పినమాట నేడు నిజమయింది కదూ...

ఇక చదవండి .....



సాయి.బా.ని.స. డైరీ - 1998 (05)

08.03.1998

శ్రీసాయి నిన్నరాత్రి ఒక ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నీకు ఇతరమతాలు, వారి ఆచార వ్యవహారాలు తెలిసియుండవచ్చును.  నీవు మాత్రము వారి మత సాంప్రదాయాలలో తలదూర్చవద్దు.  నీవు నీ స్వధర్మాన్ని పాటించుతు భగవంతుని పాదాల చెంతకు చేరు. 

2) నాభక్తునికి అతని గత జీవితాన్ని చూపించి అతనికి నాపై నమ్మకాన్ని కలిగించి అతనికి మంచి భవిష్యత్ కలిగేలాగ సలహాను ఇచ్చి సదా అతని వెంట అతని నీడలాగ ఉంటాను. 

3) నిత్యము నీవు స్నానము చేసేటప్పుడు నీవు నీశిరస్సుపై పోసుకొనే మొదటి చెంబు నీరు నా నామస్మరణతో పోసుకో.  

అపుడు అదినీవు నాకు చేసే అభిషేకముగా భావించుతాను.

4) నీవు నీయింటికి ఎవరినైన పిలిచి భోజనము పెట్టదలచినపుడు నన్ను తలచుకొని ఆతిధికి భోజనము పెట్టు.  ఆభోజనమును నేను తప్పక స్వీకరించుతాను. 

10.03.1998

శ్రీసాయి నిన్నరాత్రి ఒక పాఠశాల ఉపాధ్యాయుని రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు. 

1) నీజీవితములో సుఖశాంతులు పొందాలి అంటే నీవారి సుఖశాంతులు గురించి భగవంతుని ప్రార్థించటములో తప్పులేదు.  నీవాళ్ళు సుఖశాంతులతో యున్నపుడే నీవు ప్రశాంతముగా జీవించగలవు. 

2) కాలప్రవాహాన్ని కొలమానముతో కొలవటానికి వీలుపడదు.  నీవు కొలవగలిగినది వర్తమానాన్ని మాత్రమే.  అందుచేత వర్తమానములో నీవారితో సుఖశాంతులతో గడ్లుపు.  భూతకాలములో నీవు నీవారితో గడిపినరోజులు తిరిగిరావు.  భవిష్యత్ లో నీవు నీవారితో గడిపే రోజులను ఊహించలేవు. అందుచేత వర్తమానము ఒక సత్యము అని నమ్మి జీవించు. 

3) నీలో అహంకారము అనె సూదులు ఎదుటివానిని గుచ్చుతున్నాయి.  నీవు ఆసూదులను తీసిపారవేయి. అపుడు నీసంగత్యములో ఉన్న ప్రతి మనిషి నీకు మిత్రుడుగా మారిపోతాడు.  నీజీవితము ప్రశాంతముగా గడచిపోతుంది. 

12.03.1998

శ్రీసాయి నిన్న రాత్రి ఒక ఫకీరు రూపములో దర్శనము ఇచ్చి అన్నమాటలు.

1) నీవు నాతోపొందిన అనుభవాలు, అనుభూతులు పుస్తకరూపములో ప్రచురించి సాయి బంధువులు చదవగలిగేలాగ చూడు.


2) నారూపము, నావేష భాషలు తురానియన్ సాంప్రదాయానికి చెందినవి.  నీవు మాత్రము నీసాంప్రదాయములో శివ స్వరూపముగా చూడు.  నీసాంప్రదాయము ప్రకారము నన్ను పూజించు. 








3) నేను నాటి సమాజములో జరుగుతున్న అన్యాయాలను, అరాచకాలను, అవినీతిని రూపుమాపటానికి వచ్చిన భగవంతుని విధేయ సేవకుడిని.  నీవు నన్ను సాయి భక్తులకు భగవంతుని విధేయ సేవకుడిగా మాత్రమే పరిచయము చేయి. 
4) నేను భగవంతుని గొప్పతనాన్ని నావారికి ధనాపేక్ష లేకుండ, ఉచితముగా వారికి తెలియ చేసినాను.  నీవు నాగురించి పదిమందికి తెలియచేసేటప్పుడు వారినుండి ధనాన్ని ఆశించవద్దు. 


(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు



Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List