03.08.2012 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీశ్శులు
బాబా లీలలు - ఊదీ వైద్యము
ఈ రోజు పేరు పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలి అనుభవాలను తెలుసుకుందాము.
నా స్నేహితురాలికి సాయి దర్శనమిచ్చుట
బాబా ప్రేరణతో నేను
ప్రతీరోజు భక్తుల అనుభవాలను కొంతమంది నాస్నేహితులకు
(మెయిల్ ద్వారా)
పంపడం మొదలుపెట్టాను
.రోజూ ఒక
అనుభవం అయినా
వాళ్ళకు మెయిల్
చేస్తూ ఉండేదానిని. సహజంగా నేను
భక్తుల అనుభవాలు
మెయిల్ చేసేటప్పుడు
ఆ అనుభవం
యొక్క హేడ్డింగ్
పెట్టి
అనుభవం జత చేసి పంపేదాన్ని. బాబా యొక్క
ఫోటో ఆ
అనుభవంకు జత చేసి పంపేదాన్నికాదు. ఇంటర్నెట్ యొక్క సర్వీసు
నెమ్మదిగా వుండడం వలన
బాబా ఫోటో
జతచేసినా అది వాళ్ళు చూడలేరు అని
బాబా ఫోటోపంపేదాన్ని
కాదు.
ఎప్పటిలాగేపోయిన వారం నేను ఒకరి
అనుభవం మామూలుగానే ఒకే గ్రూపులోని స్నేహితులందరికీ
పంపించాను. సాయంత్రం నేనుహాస్టల్ కి
వెళ్ళాక నాస్నేహితులలో
ఒకామె నువ్వు
పంపిన మెయిల్ లో బాబా ఫోటో
చాలా బాగుందనీ, అందుకని
ఆ బాబా
ఫోటోని మళ్ళీ
మళ్ళీ చూడడంకోసం
ఆ మెయిల్
మూడుసార్లు చూశానని చెప్పింది. నేను బాబాఫోటో
ఏదీ మెయిల్
కి జత
చేసిపంపలేదు అని చెప్పాను. కానితను ఖచ్చితంగ
బాబా ఫోటో
చూశానని, అది ఎలాగుందో కూడా నాకు
వివరించిచెప్పింది. నాకు ఆ
బాబాఫోటో కొన్ని రోజుల క్రిందట బ్లాగులో
చూసినట్టు గుర్తు. కాని ఆ రోజునేను బాబా ఫోటోఏదీ
జత చేయలేదనినమ్మకంగా
చెప్పగలను.నా ఫ్రెండ్ చెప్పిందినిజమే అని ఋజువు చెయ్యడానికి తను
ఆ మెయిల్
మళ్ళి ఓపన్
చేసి చూసింది.
కానిఅప్పుడు అక్కడ యే బాబాఫోటో లేదు.
మేము ఆబాబా
లీలకు విస్మయం
చెందాము.నా
ఫ్రెండ్ రోజూబాబా
గుడికి వెళ్తుండేది.
ఋతుక్రమం వలన కొన్ని రోజులుగా గుడికి
వెళ్ళడం లేదు.
అందుకని బాబాఆమె
కోసమే మెయిల్
లో కనపడి
దర్శనము, ఆశీర్వాదము ఇచ్చాడు . ఇక ఏమి
చెప్పను. అద్భుతమైన ఈ బాబా లీలచూసి
మేము అందరం
యెంతోసంతోషపడ్డాము. బాబా తన
అద్భుతలీలలు, మాపై కురిపించారు.
మరొక బాబా లీలను
కూడా మీతో
పంచుకోవాలని అనుకుంటున్నాను.
నా వివాహ శుభకార్యమునకు
బాబాచేసిన సహాయము.
నేనుబాబా అనే చల్లని
నీడనిఆశ్రయించాక నాకు మా
స్వంత ఊరిలో
ఉన్న బాబా
గుడిలో వివాహం
చేసుకోవాలనే కోరిక ఉంది. తీరా బుక్
చేసుకున్న తరువాత అబ్బాయి తరఫు వాళ్ళు
అంగీకరిస్తారో లేదో తెలీదు. బాబాదయ వలన
నాబాయ్ ఫ్రెండ్
తన తప్పులు
తెలుసుకొని నా దగ్గరకి వచ్చి క్షమాపణ
చెప్పాడు. అప్పటి నుండి బాబా దయవలన
అన్నీ శుభంగా
జరుగుతున్నాయి. మా యిరువైపుల పెద్దలు మా
పెళ్ళి జూన్
లేదా జూలై
లో జరపాలనినిర్ణయించారు.
అబ్బాయి తండ్రి
పెళ్ళికని మూడు,నాలుగు తేదీలు
అనుకొని ఆ తేదీలలో ఏదో
ఒకరోజుకు వివాహం జరగాలని అనుకున్నారు. మా
అమ్మ కూడా
జ్యోతిష్యులను మంచి ముహూర్తం కోసం సంప్రదించింది.
వారు మేము
అనుకున్న రెండు తేదీలు కూడా బాగున్నాయని
చెప్పారు. ఆరెండు తేదీలలో ఏతేదీ నిర్ణయించుకోవాలో
తెలీని అయోమయంలో
పడ్డాము. మేము మంచి రోజు కోసం
బాబాని ప్రార్థించాము. మేము గుడికి
వెళ్లి విచారిస్తే
ఆ రెండు
తేదీలలో ఒకతేదీ
అప్పటికే మ్యారేజ్ హాల్ బుక్ అయ్యిందనిచెప్పారు. అందుకని మేము
జూలై 9వతేదీన
వివాహం జరపాలని
నిశ్చయించుకొని మ్యారేజ్ హాల్ బుక్ చేశాము.
మేము చాలా
ఆనందించాము.ఎందుకంటే9 వ సంఖ్య బాబా
కుచలా ఇష్టమైన
సంఖ్య. బాబాయే
9వతేదీన మావివాహం
జరిగేల చూస్తున్నారని
సంతోషించాము. అందుకే ఆ రొజే హాలు
ఖాళీగా వుండడం,
మేము బుక్
చేసుకోవడం జరిగింది. బాబా మాకు ప్రతీదీ
చేసిపెడుతున్నందుకు మేము బాబాకు
ఎల్లప్పుడూ ఋణపడిఉంటాము. ఇంకో విషయం
ఏమిటంటేఅబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు బాబా భక్తులు
కాకపోయినప్పటికి, బాబా గుడిలో
వివాహం
జరిపించేoదుకు అబ్బాయి
తనతల్లిదండ్రులని ఒప్పించాడు. అందుచేత
ఏమి సందేహమేలేదు
బాబా యే
ఇదంతాజరిపించారు. నేను బాబాపాదాలకు మనః
పూర్వకంగా ప్రణమిల్లి మావివాహం ఏఆటంకం
లేకుండ జరగాలని
వేడుకున్నాను. మా పెళ్ళి కివచ్చి మమ్మల్ని
ఆశీర్వదించాలని బాబా ని వేడాను.
లవ్ యు బాబా.మీరు
లేకుండ నేనేమిజీవితం
లో సాధించలేను
సాయి.
బాబాఆశీర్వాదాలు అందరికి లభించు
గాక.
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
దీర్ఘకాలంగా వున్న నా
వీపునొప్పిని బాబా నయం చేశారు.
2, 3 సంవత్సరముల నుండి నేను
విపరీతమైన వీపు నొప్పితో బాధపడుతూ ఉండేదానిని.
నొప్పి తరచుగా
వస్తూ ఉండేది,
కాని ఏమందులూ
పనిచేయలేదు. చివరగా బాబా ఊదీని ఆశ్రయించాను.
నా వీపు
నొప్పితగ్గించమని, భరించలేనని
మనఃస్పూర్తిగ వేడుకొని ఊది
తీసుకోవడం మొదలుపెట్టాను . కొన్ని రోజల తర్వాత
నొప్పితగ్గడం మొదలయింది. కొన్ని నెలల నుండి
నొప్పినుండి చాల రిలీఫ్ గావుంది. బాబా
నే నానొప్పిని
నయం చేసారని
నాకుతెలుసు. బాబా మీకు ధన్యవాదాలు.నిజంగా
బాబా ఊది
ఎటువంటి అనారోగ్యానికైన
అమోఘమైన నివారణోపాయం.
బాబానా చర్మ సమస్యను
నయంచేశారు.
నా మొహం మీద
మొటిమలవల్లా, శరీరం
వేడి చేయడం
వలన చర్మం
మీద బాగ
మచ్చలువచ్చాయి .ఆ చర్మం గురించినాకు చాల
బాధగ వుండేది.
నేను ఒకసారి భక్తుల అనుభవాలు చదివేటప్పుడు ఇలానే ఒక
అమ్మాయికి చర్మ సమస్యతో ఉన్నప్పుడు
రోజు రాత్రి బాబా ఫోటో ముందు ఒక
గ్లాసు నీటిలో
బాబా ఊది
కొచెంవేసి రాత్రంతా అలాగే వుంచి ఉదయంలేవగానే తీసుకొనేది అని
చదివాను. నేను అలానే చెయ్యడం
మొదలు పెట్టాను. ఇప్పుడు నా
చర్మ సమస్యచాలా
తగ్గి మెరుగయింది. ఏదో ఒక రోజుబాబా
దయ వలన
మొహంమీద ఉన్న
మచ్చలు తగ్గి మునుపటి అందమైన
చర్మం వస్తుందని
నాకునమ్మకం . బాబా తన భక్తులయొక్క చిన్న
కోరికలను కూడ విని, వాళ్ళ కోరికలు తీరుస్తున్నందుకుఎంతో
కృతజ్ఞతలు సాయి మీకు.
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు
0 comments:
Post a Comment