Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, September 4, 2012

షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం (రెండవభాగము)

Posted by tyagaraju on 7:32 AM


                           Real Test of Patience!
                                
04.09.2012  మంగళవారము

ఓంసాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు 31.08.2012 తరువాత "షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం" గీతాంజలి గారి అనుభవం రెండవ భాగాన్ని అందిస్తున్నాను. ఆఖరి భాగం రేపు ప్రచురిస్తాను.  

 
షిరిడీ యాత్రలో అడుగడుగునా బాబా అనుగ్రహం (రెండవభాగము)

- గీతాంజలి

ఆటో అతను హొటల్ లో రూము ఏమన్నా బుక్ చేసుకున్నారా అని అడిగాడు. ద్వారావతి కి చేరుకున్నాక రూము కోసం ప్రయత్నించాలి, ముందు అక్కడికి తీసుకుని వెళ్ళు మమ్మల్ని అన్నాము.  ద్వారావతిలో చాలా వైటింగ్ ఉంటుంది, అందుకని మందిరానికి దగ్గరలో ఉన్న హోటల్ లో గది తీసుకుంటే మంచిదని చెప్పాడు ఆటో అతను. ముందర ద్వారావతి భక్త నివాస్ కి వెళ్ళి ప్రయత్నం చేద్దామనింపించింది నాకు.  ముందర ద్వారావతి భక్త నివాస్ కి పోనీ, అక్కడ గది ఏమీ దొరకకపోతే మరొక చోట ప్రయత్నించవచ్చని చెప్పాను. 

భక్త నివాస్ కి చేరుకున్నాక అక్కడ కవుంటర్ లో ఉన్న అతనితో గదులు ఏమయినా ఉన్నాయా అని అడిగాను. అతను నావైపు చిరునవ్వుతో చూసి, నాన్-ఏసీ గదులు లేవు ఒకే  ఒక్కటి 3 బెడ్ ఏ.సీ. రూం ఉందని చెప్పాడు. ఎక్స్ట్రా బెడ్ వేయడానికి కుదురుతుందా అని అడిగాను. 50 రూపాయలు చెల్లిస్తే ఎక్స్ట్రా పరుపు వేస్తామని చెప్పాడు. నేను నాభర్తతో ఆటో నించి సామాను తీసుకు రమ్మని చెప్పి, భక్తనివాస్ లో గది తీసుకున్నాము. బాబాయే మాకంతా ఏర్పాటు చేశారనిపించింది. నేనింతకు ముందు ఇక్కడికి  వచ్చినపుడు గదుల కోసం గంటలకొద్దీ భక్తులందరూ వేచిఉండటం నాకు తెలుసు. మరి మావిషయంలో ఇప్పుడు వెంటనే గది దొరకడం అంతా బాబా లీల.

మేము గదిలోకి వెళ్ళి, బాబా దర్శనానికి వెళ్ళడానికి అందరం స్నానాలు కానిచ్చాము. ద్వారకామాయిలో సాయంత్రం ఆరతికి వెళ్ళాక, రాత్రికి సమాధి మందిరంలో ఆరతి చూద్దామనుకున్నాము.  రాత్రి ఆరతికి మాకు పాసులు ఉన్నాయి. సాయంత్రం ద్వారకామాయిలో ఆరతికి వెళ్ళాము. 

బాబాకు సమర్పించడానిని నేను రెండు బాక్శ్ లు కోవా, ఒక కొబ్బరికాయ పట్టుకుని వెళ్ళాను. వీటిని బాబా స్వీకరించారనడానికి గుర్తుగా నాకేదయినా నిదర్శనం  బాబా చూపాలి అనుకున్నాను. మేము దర్శనానికి వెళ్ళినపుడు, భక్తులంతా కొబ్బరికాయలను అక్కడ ద్వారకామయిలో ఉన్న తొట్టెలో వేస్తున్నారు. నేను కోవా ఉన్న పెట్టెలు రెండు, ఒక కొబ్బరికాయ తీసుకుని వెళ్ళాను.  బాబా వీటిని స్వీకరించారన్నదానికి గుర్తుగా నాకేదయిన సూచన చూపించమని బాబాని కోరుకున్నాను. మేము దర్శనానికి వెళ్ళినపుడు భక్తులంతా ద్వారకామాయిలో  ఉన్న తొట్టెలో తాము తెచ్చినవన్నీ ఉంచుతున్నారు. అక్కడ లోపల ఒక గార్డ్ ఏదో పనిచేసుకుంటూ ఉన్నాడు. బాబాకు నేను సమర్పించదలచున్నవాటిని తొట్టెలో వేయడానికి నాకిష్టం లేకపోయింది. నేనాగార్డుని పిలిచి నేను తెచ్చిన కోవా, కొబ్బరికాయ బాబాకి సమర్పించమని అభ్యర్ధించాను. అతను నవ్వుతూ ఇష్టపూర్వకంగా ఒక కోవాతీసి బాబా నోటివద్ద పెట్టి, రెండుకోవాలు, కొబ్బరికాయా బాబాముందర పెట్టాడు. నా చిన్న కోరికను మన్నించి బాబా తన కృపని నామీద చూపినందుకు నేనెంతో సంతోషించాను.
 
మేమంతా దీపాలు వెలిగించడానికి నంద దీపం దగ్గర ఉన్న లెండీ బాగ్ కి వెళ్ళాము. నాతో కూడా దీపాలు, వాటికి సంబంధించిన సరంజామా అంతా తెచ్చుకున్నాను.  కాని స్వామిగారికి ఈ విషయం గురించి చెప్పడం మరిచాను. దీపాలు వెలిగించేముందు, స్వామిగారి భార్యకు కూడ ఆ అవకాశం ఉంటే బాగుండుననిపించింది. బయట  షాపు దగ్గిరకి వెళ్ళి ఆమెకు కూడా, దీపాలు, నూనె, అగరుబత్తీలు పట్టుకుని వచ్చాను. 

గురుస్థాన్ వద్ద వెలిగించడానికి నేను అగరువత్తులు తెచ్చుకున్నాను. అన్నీ  కూడా మేము కలిసి చేసుకోవడంతో నాకెంతో తృప్తినిచ్చింది. వేపాకు కూడా ఒకటి దొరికితే  బాగుండుననిపించింది. నా ఈ కోరికని కూడా బాబా తీర్చారు. ఒక వ్యక్తి నాదగ్గిరకొచ్చి నాకొక వేపాకును ఇచ్చాడు. నాకెంతో ఆనందాన్నిచ్చిన ఆ క్షణాన్ని ఆ అనుభూతిని పాఠకుల ఊహకే వదలివేస్తున్నాను.   


మందిరంలో కాసేపు కూర్చుని, శేజ్ ఆరతికి బయలుదేరాము. గార్డ్ మమ్మల్ని రాత్రి 10 గంటలకి లోపలికి వదిలాడు. సమాధి మందిరంలో కి వెళ్ళడానికి ముందు ఒక చోట గార్డ్ అందరినీ ఆపేసి  కొంత సేపు వేచి ఉండమని చెప్పాడు. మాముందున్న సి సి టీ వీ లో మందిరంలో జరిగే వాటినన్నిటినీ  ప్రత్యక్ష ప్రసారం లో  చూస్తున్నాము. అందులో ద్వారకామాయి, చావడీ, ఒకదాని తరువాత మరొకటి ప్రసారం చేస్తున్నారు. ద్వారకామాయిలో తిరుగుతూ ఒక పిల్లి కనిపించింది. మాముందున్న కొంతమంది వయసుమళ్ళిన దంపతులుమేము అందరం ఆ పిల్లి గురించే మాట్లాడుకుంటున్నాము.  నేనెప్పుడు వచ్చినా ఆపిల్లిని చూస్తూ ఉంటానని చెప్పాను. ఆ పిల్లి ఈ ద్వారకామాయి చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటుందని అందరూ అనుకోవడం విన్నానని చెప్పాను.

ఒక భక్తుడు నాతో, " ఆ పిల్లి కొంతమంది వడిలో  మాత్రమే కూర్చుంటుందనీ, అది వచ్చి వడిలో  కూర్చుంటే అది శుభ సంకేతమని" చెప్పాడు.   ఈ సంభాషణ తరువాత మేము ఆరతికి వెళ్ళాము.  బాబా దయవల్ల మాకు ముందు వరసలోనే చోటు దొరికింది. అక్కడినుంచి మేము బాబాని సులభంగా చూడగలము. ఆరతి జరుగుతుండగా నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది.  ఆరతి తరువాత మరలా ద్వారకామాయి లోకి వెళ్ళి కూర్చోవాలి . పిల్లి నా వళ్ళోకి వచ్చి కూర్చుంటే కనక నేననుకున్నకోరిక  నెరవేరుతుంది అనుకున్నాను.

నా మనసులోకి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో వివరిస్తాను. గత సంవత్సరం నించీ నేను గాల్ బ్లాడర్ స్టొన్  తో బాధ పడుతున్నాను. ప్రశ్నలు సమాధానాలు వెబ్ సైట్ లో బాబాని ప్రశ్న అడిగినప్పుడు ఏప్రిల్ నెలలో దానికి సమాధానం లభిస్తుందని జవాబు వచ్చింది. ఈ సంవత్సర కాలంలో నా శ్రేయోభిలాషులందరూ, నన్ను గాల్ బ్లాడర్ ఆపరేషన్ ద్వారా తీయించేసుకోమని, నాబాధ నివారణకు అదొక్కటే వైద్యమనీ చెప్పారు. కాని నాకది ఇష్టం లేదు, అందరితోనూ ఆపరేషన్ అవసరం లేకుండా బాబాయే నయం చేస్తారు అని అంటు ఉండేదానిని. ప్రశ్నలు జవాబుల వెబ్ సైట్లో సర్జరీ గురించి ప్రశ్న అడిగిన ప్రతీసారి వద్దు అనే సమాధానం వచ్చేది.  నాపరిస్థితేమీ అంతగా మెరుగు పడలేదు. కాని బాబా దయవల్ల ప్రమాదకరంగా మాత్రం అవలేదు. ఇప్పుడీ విధంగా ఫిబ్రవరిలో నాకు షిరిడీనించి పిలుపు వచ్చింది.  బాబా నించి నాకు సమాధానం వస్తుందనిపించింది.  పిల్లి కనక నావడిలో కూర్చుంటే సర్జరీ అవసరం లేకుండా బాబా నాబాధను నయం చేస్తారు.  ఇదీ నేను అలా ఆలోచించడానికి వెనుక ఉన్న కారణం.  ఆరతి అయిన తరువాత అందరూ భోజనానికి వెడదామన్నారు.  నేను కొంతసేపు ద్వారకామాయిలో కూర్చుంటాను  మీకు అంగీకారమయితే మీరు  కూడా రండి అని చెప్పాను. దీనికందరూ ఒప్పుకున్నారు.  అందరం కలిసి ద్వారకామాయికి వెళ్ళాము.  5 - 10 నిమిషాల తరువాత, నాభర్త, స్వామిగారు బయటకు వెళ్ళిపోయారు. వెడుతూ మమ్మలిని మాకు ఎప్పుడు  రావలనిపిస్తే అప్పుడు రమ్మని చెప్పి వెళ్ళిపోయారు. ఇక మేమిద్దరమూ మసీదులో ధ్యానంలో కూర్చున్నాము. వెబ్ సైట్ లో వచ్చిన సమాధానమే  కనక నిజమయితే,  పిల్లి వచ్చి నా వడిలో కూర్చోవాలి అని బాబాని ప్రార్ధిస్తూ ఉన్నాను. నాకీ ఆలోచన వచ్చిన తరువాత కొంతమంది భక్తులు చీపుళ్ళు తీసుకుని ద్వారకామాయిని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. శుభ్రం చేస్తు  భక్తులందరినీ కాసేపు లేవమని, శుభ్రం చేసిన తరువాత మళ్ళి కూర్చోమని చెప్పారు.  నేను, స్వామిగారి భార్య లేచి నిలబడ్డాము. స్వామిగారి భార్య కొంతసేపు నిలబడి ఉండగా, నేను మసీదు మెట్ల మీద కూర్చున్నాను. పిల్లి లోపలే తిరుగుతూ ఉంది.  నేను దానినే చూస్తూ, బాబాని ప్రార్ధిస్తూ ఉన్నాను. భక్తులలో ఒకరు పిల్లికి కొంచెం ప్రసాదం పెట్టారు.  పిల్లి ఆ ప్రసాదాన్ని తింది. నా చేతిలో కోవా పెట్టి ఉంది.  అందులోనించి ఒక కోవా తీసి పిల్లి దగ్గర పెట్టాను. అది వాసన చూసి మళ్ళీ లోపలికి వెళ్ళింది. నేను ప్రార్ధిస్తూ అక్కడే కూర్చున్నాను. హటాత్తుగా పిల్లి వచ్చి నా వడిలోకి చేరింది. మెల్లగా అది నావడిలోకి పూర్తిగా వచ్చి పడుకుంది. పిల్లి వచ్చి నావడిలోకి రావాలనుకున్నాను, కాని అది ఖచ్చితంగా వస్తుందని తెలీదు. నాకింకా భక్తి తగినంతగా లేదని నాలో నేను అనుకుంటున్నాను.  నాకు కన్నీరు రావడం మొదలైంది. పంజాబీ భజనని పాడటం మొదలుపెట్టాను. "తేరెయాన్ చరణా విఛ్ మేరీ అర్దాస్ బాబా. కి హర్ పల్ బాధ్ దా రవె మేరీ విశ్వాస్ బాబా" (అర్ధం : ప్రతీక్షణం కూడా నా నామ్మకం మాత్రమే పెరుగుతు ఉండేలా  చేయమని నీపాదాల వద్ద ప్రార్ధిస్తాను.) నేను మూగదానిలా అయిపోయాను. పిల్లి ప్రశాంతంగా నిద్రపోయింది.  నేను దానిని 10 నిమిషాల దాకా నిమురుతూ ఉన్నాను.

(ఆఖరి భాగం రేపు)

(సర్వం శ్రీ  సాయినాధార్పణ మస్తు )


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment