Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, November 15, 2012

శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 10వ. భాగము

Posted by tyagaraju on 8:47 AM

15.11.2012  గురువారము

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి

సాయి.బా.ని.స. చెప్పిన శ్రీకృష్ణునిగా శ్రీసాయి 10వ.భాగము వినoడి.

శ్రీకృష్ణునిగా శ్రీసాయి - 10వ. భాగము  




శ్రీమహావిష్ణువును పూజిస్తున్నాకూడా, ఆయన భక్తులు పేదరికంతో ఎందుకని కష్టాలు పడుతున్నారని, పరీక్షిత్  మహారాజు, శుకమహర్షిని ప్రశ్నించాడు. 
అశ్వమేధయాగం చేస్తున్న సందర్భములో ధర్మరాజు కూడా శ్రీకృష్ణులవారిని ఇదే ప్రశ్న అడిగారు. దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు.


"బెల్లం చీమలను ఆకర్షిస్తుందన్న విషయం అందరికీ తెలుసు.  ఒక్కసారి కనక బెల్లాన్ని తీసేసిన వెంటనే చీమలన్ని వెళిపోతాయి. మనవద్ద ధనం ఉన్నపుడే బంధువులందరూ మన చుట్టూ చేరతారు, అదిపోగానే అందరూ అదృశ్యమయిపోతారు. ఎవరూ మనకోసం రారు."

నాభక్తులందరినీ నావద్దకు రప్పించుకుంటాను అని  శ్రీకృష్ణుడు చెపుతూ, అపుడు తన భక్తులనుంచి ఐహికపరమయిన వాటినన్నిటినీ లాగేసుకుంటానన్నారు.

శ్రీకృష్ణులవారు ఇలా చెప్పారు, "మొదటగా వారి సంపదను హరించివేస్తాను.  అస్థితిలో బంధువులు కూడా వారివద్దకు చేరడానికి సందేహించి, దూరంగా వైదొలగుతారు. చివరకు ఈ విధమైన పరిస్థితిని పొందినవారందరూ ఒకటవుతారు."

"ఇక వారు  చివరికి చేసేదేమీ లేక నా భక్త బృందంలో చేరి,సత్సంగంలో కలలిమెలసి ఆధ్యాత్మిక పురోగతికి పనిచేస్తారు." 
 
ఇటువంటిదే మనం శ్రీసాయి సత్ చరిత్రలో చూస్తాము. బాబా అంకిత భక్తుడయిన మహల్సాపతి ఆయనను దేవా అని పిలిచేవాడు. బాబా ఆయనను భగత్ అని పిలిచేవారు. బాబా అందరికి ఏమిచ్చినా కూడా మహల్సాపతికి మాత్రం పైసా ఇవ్వలేదు. బాబా అందరికీ ఎంతో దాతృత్వంగా అన్నీ ఇస్తున్నాకూడా బాబా మీకేమిచ్చారని మహల్సాపతి భార్య ఆయనను అడుగుతూ ఉండేది. 

ఒకసారి హన్స్ రాజ్ మహల్సాపతికి ఒక పళ్ళెమునిoడా వెండినాణాలను ఇద్దామనుకున్నపుడు బాబా ఇవ్వనివ్వలేదు. 

మహల్సాపతి వెండినాణాలను స్వీకరించడానికి బాబాని అనుమతికోరినపుడు, నీకేది ప్రాప్తమో అదే ఇస్తాను అన్నారు బాబా. 1922 సెప్టెంబరు, 11వ.తేదీన, తన తండ్రీ ఆబ్ధీకము పెట్టిన తరువాత, ఛాతీలో నెప్పివచ్చి మహల్సాపతి బాబాని ప్రార్ధిస్తూ సద్గతి పొందారు. ఆయన స్వర్గాన్ని చేరుకున్నారు. అదే బాబా ఆయనకు అనుగ్రహించినది.  శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఏదయితే చెప్పాడొ, మహల్సాపతి విషయంలో బాబా ప్రత్యక్షంగా చూపించారు.

యిటువంటి సంఘటనలు ఎన్నోఉన్నాయి. కాలం ఎలాగడిచిపోతుందో కూడా మనకు తెలీదు.

ఇపుడు మనం శ్రీకృష్ణులవారుసాయిబాబా, ఇద్దరూ  తమ అవతారాలను ఎలా చాలించారో చూద్దాము. భాగవతంలో పాండవులకు, కౌరవులకు యుధ్ధము ముగియగానే

పాండవులు తిరిగి పూర్వపు వైభవాన్ని సంతరించుకొన్నారు.  యాదవులు తమలో తాము కోట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక ఎవరూ తనమాట వినరనే విషయం శ్రీకృష్ణునికి అర్ధమై తన అవతారాన్ని చాలిద్దామనుకొన్నాడు. ఒకసారి ఆయన అరణ్యలో, కుడికాలిమీద, ఎడమకాలు వేసుకొని ఊపుతూ కూర్చొని వున్నారు. అలా ఉన్న సమయంలో, దూరమునుండి ఒక వేటగాడు, అది లేడియొక్క శిరస్సుగా భ్రమించిశ్రీకృష్ణుని పాదానికి తన బాణాన్ని గురిపెట్టి వదిలాడు. కృష్ణుడు అదే కారణంగా భావించి తన అవతారాన్ని చాలించాడు. బాలునిగా ఉన్నపుడే ఎంతోమంది రాకషసులతో పోరాడి, మహాభారత యుధ్ధానికి సారధ్యం వహించిన శ్రీకృష్ణుడు, ఈచిన్న సంఘటనతో  తన అవతారాన్ని చాలించి విష్ణులోకానికి వెళ్ళిపోయారు. 

మన సాయికృష్ణులవారు తన అవతార పరిసమాప్తికి ఏకారణాన్ని ఎన్నుకున్నారు. ఇది మనకు శ్రీసాయి సత్ చరిత్ర 43,44 అధ్యాయాలలో స్పష్టంగా కనపడుతుంది.

1918 సంవత్సరములో, విజయదశమినాడు, మధ్యాహ్న్నము 2.30 కు, ఏకాదశి ఘడియలు సమీపిస్తుండగా, సాయి భక్తులందరినీ పంపివేశారు.  తన శిరసును బయ్యాజీ భుజం మీద పెట్టి ఆఖరి శ్వాస తీసుకొన్నారు. ఆయన మహాసమాధి చెందేముందు అన్నమాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొందాము. "ద్వారకామాయిలో నాకు అశాంతిగా ఉన్నది. నన్ను బూటీవాడాకు తీసుకొని వెళ్ళండి".  బాబా నిర్ణయించిన ప్రకారం బూటీవాడాలో మురళిధరుని విగ్రహాన్ని ప్రతిష్టించడానికి కొంత స్థలం కేటాయించబడింది. షిరిడీ సాయియే మురళిధరుడు అంటే కృష్ణుడు అనే విషయాన్ని  ఋజువు చేస్తు, బూటీవాడాలో మురళిధరుని విగ్రహాన్ని ప్రతిష్టించవలసిని స్థానంలో, ఆఖరికి సాయి శరీరం సమాధి చేయబడింది. 
ఈనాడు కోటానుకోట్ల భక్తులు సమాధిమందిరాన్ని దర్శించుకొని ఆయన అనుగ్రహాన్ని పొందుతున్నారు. నా ఉద్దేశ్యంలో కలియుగంలో సాయినాధులవారు, ద్వాపరయుగంలో శ్రీకృష్ణపరమాత్ములవారు ఇద్దరూ ఒకరే. 

జై సాయిరాం

(శ్రీకృష్ణునిగా శ్రీసాయి సమాప్తము)     

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List