Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, January 21, 2014

శ్రీసాయితో మధుర క్షణాలు - 33

Posted by tyagaraju on 2:36 AM
                                         
                           
21.01.2014 మంగళవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయితో మధుర క్షణాలు - 33
బాబా భక్తుల విశ్వాసాన్ని పరీక్షించుట

ఈ రోజు శ్రీసాయితో మధురక్షణాలలోని ఒక మధుర క్షణం తెలుసుకుందాము.  ఈ లీల చదివిన తరువాత మనకే కనక అటువంటి పరీక్ష ఎదురయితే మన ఆపరీక్షలో నెగ్గగలమా అని అనిపించక మానదు. సాయి అంటే ఎవరు? పూర్తిగా గ్రహించుకున్నపుడే మనం ఆయన పెట్టే పరీక్షలలో విజయం సాధిస్తాము.

సాయి తత్వాన్ని ప్రచారం చేసినవారిలో శ్రీనరసిం హ స్వామీజీ గారు సుప్రసిధ్ధులు.  ఆయన 1936 లో శ్రీఉపాసనీ బాబా గారిని దర్శించడానికి వెళ్ళిన తరువాత సాయి అంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకొన్నారు.  ఆయన ఉపాసనీ బాబా వద్ద ఉన్న సమయంలో మరొక సాయి భక్తుడు కూడా అక్కడే ఉన్నారు.  

                               


ఆయన పేరు శ్రీరాం బాబా. ఆయన 141 సంవత్సరాలకు పైగా జీవించారు.  ఆ సమయంలో ఉపాసనీ బాబాగారు అందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు.  ఎంతోమంది ఆ విందుకు హాజరయ్యారు.  భోజనాలు మొదలయ్యి యిక పూర్తయే సమయంలో అక్కడికి ఒక ముసలివాడు భోజనం  కోసం వచ్చాడు. ఆ ముసలివాడు కుష్టువ్యాధితో బాధపడుతున్నాడు.  చూడటానికి భయంకరంగా ఉన్నాడు.  అతనికి ఒక్కటే కన్ను ఉంది.  అతని పెదిమల నుండి, ముక్కునుండి, కళ్ళనుండి చీము నెత్తురులు కారుతూ ఉన్నాయి.  శరీరమంతా పుండ్లుపడి భరించలేని దుర్గంధం వెలువడుతూ ఉంది.  
                          
అప్పుడు ఉపాసనీ బాబా శ్రీరామ బాబాతో " ఆ ముసలివాడు స్వయంగా  తినలేని పరిస్థితిలో ఉన్నాడు.  నీ చేతులతో స్వయంగా అతనికి తినిపించు" అన్నారు.  

                           
శ్రీరామబాబా గారు ఆ  పరిస్థితిలో ఏవిధంగా దిగ్భ్రమ చెంది ఉంటారో ఊహించుకోండి.  శ్రీరామ బాబాగారు తను లేవగలిగినంత వరకూ పైకి లేచి కుష్టువ్యాధితో బాధపడుతున్న ఆముసలి వానికి అన్నం తినిపించడం మొదలు పెట్టారు.  రక్తం కారుగున్న అతని పెదాలకి తన చేతులు తగలకుండా జాగ్రత్త పడుతూ తినిపిస్తున్నారు.  దాంతో తినిపిస్తున్న దానిలోనించి కింద పడిపోతూ ఉంది.  అన్నం తిన్న తరువాత ఆముసలివాడు నడచుకొంటూ వెళ్ళిపోయాడు.  అప్పుడే ఉపాసనీ బాబా శ్రీనరసిం హ స్వామీజీ గారితో " కిందపడ్డ ఆ అన్నంతీసుకొని తిను" అన్నారు.  రక్తం కారుతున్న పెదాలకు అంటుకొని కలుషితమైన ఆ ఆహారాన్ని తినడమంటే అక్కడున్న వారందరికీ చాలా రోతగా అనిపించింది.  కాని శ్రీనరసింహ   స్వామీజీ గారికి సర్వం తెలుసు. ఆయన జ్ఞాని. ఆయన ఎటువంటి సందేహం లేకుండా కిందపడ్డ ఆ మిగిలిన అన్నమంతా తినేశారు.  అందరికీ చాలా విస్మయం కలిగింది.  ఆదృశ్యం చూస్తున్న వారందరితోను ఉపాసనీ బాబా యిలా అన్నారు " ఆముసలివాడు ఎంత వేగంగా వెళ్ళిపోయాడో చూశారా!  కుష్టు రోగంతో తీవ్రంగా బాధ పడుతున్న వ్యక్తి ఎవరయినా అంత వేగంగా నడవగలడా?"  చీదరింపు కలిగిస్తూ ఒక కుష్టురోగి రూపంలో వచ్చినదెవరో తెలుసా?  వచ్చినది శ్రీసాయిబాబా తప్ప మరెవరూ కాదు. 

మణీ. ఎస్. 
ది ఎటర్నల్ సాయి
బెంగళురు 

"నన్ను అన్వేషించడానికి సుదూర ప్రాతాలకు వెళ్లనవసరం లేదు.  సకల జీవరాశులలోను నేను నివసిస్తున్నాను.   ఈ విషయాన్ని కనక మీరు జాగ్రత్తగా గ్రహిస్తే నా నిజస్వరూపాన్ని తెలుసుకోగలరు" 

                                                                          *****

9 గురువారాల వ్రత మహిమ

మరొక బాబా లీల.  బెంగళూరు నుండి ఒక సాయి భక్తుడు పంపిన లీల.  ఆయన పేరు,  ఆయన కోరిక ప్రకారం వెల్లడించటంలేదు.  ఆయన మాటలలోనే చదవండి.

నేను ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను.  ఎప్పటినుండో నేనుసాయిని పూజిస్తున్నాను.  సాయి నాజీవితంలో ఎన్నో లీలలు చూపించి అనుభూతులనిచ్చారు.  ఈ మధ్యనే జరిగిన ఒక అధ్బుతమైన లీల మీకు వివరిస్తాను. ఐ.టి. ఫీల్డ్ ఎలా ఉంటుందో మీకందరికీ తెలుసు.  ఎక్కువ జీతం వచ్చే కంపెనీలోకి, పాత కంపెనీ వదలి పెట్టి మారిపోతూ ఉంటారు.  దురదృష్టం కొద్దీ నాకు మరొక కంపేనీలో ఉద్యోగం వచ్చింది.  దాంతో కారణం ఏమీ లేకుండానే నేను పనిచేస్తున్న కంపెనీనుంచి కొత్త కంపెనీలోకి  5 నెలల క్రితం ప్రవేశించాను.  కాని నాకు ఈ కొత్త కంపెనీలో ఉద్యోగం అంతగా నచ్చలేదు.  చాలా అసంతృప్తిగా ఉండేది.  ఎంతో బాధపడి బాబాని ప్రార్ధించి 9 గురువారాల వ్రతం మొదలు పెట్టాను.  రాత్రులప్పుడు నిద్రకూడా పట్టేది కాదు.  నాకు ఈ కంపనీ ఎందుకు నచ్చలేదో నాకు అర్ధమయ్యేది కాదు. అనుకోకుండా ఒకరోజు  యింతకుముందు నేను పనిచేసిన కంపెనీ మానేజరు ఫోన్ చేసి తిరిగి మళ్ళి యిదే కంపెనీలో చేరడం నీకు ఇష్టమేనా అని అడిగాడు. నాకు ఎంతో సంతోషం కలిగింది.  వెంటనే ఒప్పేసుకొన్నాను.  ఇదంతా షిర్దీ సాయి అనుగ్రహం వల్లే జరిగింది.  తొమ్మిది గురువారాల వ్రతం ఆఖరి రోజునే మా మానేజరునించి ఫోన్ వచ్చింది.  బాబా దయవల్ల తిరిగి పాత కంపెనీలో చేరాను.

బాబా నాతప్పులన్నిటినీ క్షమించు.  నన్ను వంటరివాడిని చేయవద్దు.  

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment