Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Friday, July 25, 2014

శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 2వ.భాగం

Posted by tyagaraju on 1:19 AM
             
          
          

25.07.2014 శుక్రవారము (ఒంగోలునుండి )
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 2వ.భాగం

మూలం : సాయి బాని స శ్రీరావాడ  గోపాలరావు 
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు 


శ్రీసాయి సత్ చరిత్ర 32వ.అధ్యాయంలో బాబా "నేను చిన్నపిల్లవాడిగా ఉన్నపుడు నాయజమాని నాపనికి సంతోషించి ఆరువందల రూపాయలు జీతమిచ్చాడు" అని చెప్పారు.  అంటే దానర్ధం బాబా 16 లేక 18 సంవత్సరాల వయసులో 18వ.శతాబ్దంలో  ఆరువందల రూపాయలు జీతంగా సంపాదిచారనా?  ఆరోజుల్లో అది అసాధ్యమనే అనుకొంటున్నాను.  ఆరోజులలో ప్రభుత్వంలో  అత్యున్నత అధికారిగా ఉండే బ్రిటిష్ గవర్నర్ జనరల్ కే నెలకు అయిదు వందల రూపాయల జీతం వచ్చేది. 



అయితే బాబాకు నెలకు ఆరువందల రూపాయల జీతం ఎవరివ్వగలరు?



శ్రీసాయి సత్ చరిత్ర 32వ.అధ్యాయాన్ని ఒకసారి గమనిద్దాము. అందులో బాబా ఈవిధంగా చెప్పారు.  "నాచిన్న తనములో నేను భుక్తికొరకు బీడ్ గాం వెళ్ళాను.  అక్కడ బట్టలపై చేయు అల్లిక పని దొరికింది.  


నేను చాలా కష్టపడి పని చేశాను.  యజమాని నాపనికి సంతోషించాడు. నాకంటే ముగ్గురు కుఱ్ఱవాళ్ళు అప్పటికే పనిచేస్తూ ఉన్నారు.  మొదటివానికి రూ.50/- రెండవవానికి రూ.100/- మూడవవానికి రూ.150/- జీతం.  నాకు ఈ మూడు మొత్తములకు రెండింతలు జీతం అనగా రూ.600/- నాయజమాని యిచ్చేవాడు.  నాయజమాని సంతోషించి నాకు మంచి దుస్తులు, తలపాగా బహూకరించాడు.  కాని నేను వాటిని ఉపయోగించలేదు.  వాటిని భద్రంగా దాచిపెట్టి ఉంచాను.  మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును, దైవమిచ్చినది శాశ్వతముగా నిలుచును." 

బాబా చెప్పిన మాటలు "ఈ భౌతిక శరీరం మట్టిలో కలసిపోతుంది.  శ్వాస అనంత విశ్వంలో లీనమయిపోతుంది.  నేనెక్కడికి వెళ్ళినా మాయ నన్ను బాధపెడుతున్నది.  నేనెల్లప్పుడు నాభక్తుల క్షేమం కోసం ఆతురత పడెదను.  ఎవరికి తగ్గట్లుగా వారి కర్మఫలం వారనుభవిస్తారు.  అటువంటి అవకాశాలు మరలా మరలా రావు.  నామాటలను గుర్తుంచుకున్నవారికి అమూల్యమయిన ఆనందం లభిస్తుంది."     

బాబా చెప్పిన పైమాటలను విశ్లేషించి దాని అంతరార్ధాన్ని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.


ఇక్కడ యజమాని అంటే భగవంతుడు.  నేయబడే బట్ట అంటే అర్ధం మానవులని ఒక క్రమమయిన పధ్ధతిలో సరియైన దారిలో నడిపించడం.  తనకంటే పూర్వము పనిచేసిన ముగ్గురు బాలురు అంటే సాయియొక్క క్రిందటి మూడు జన్మలు. ఆరువందల రూపాయలు జీతమనగా ఈజన్మలో సాయియొక్క కీర్తి,శక్తి, మహిమలు మరొక ఆరువందల సంవత్సరాలవరకు మరొక రూపంలోనికి మారడానికి ముందు, నిలిచి ఉంటాయని అర్ధము.  "మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును, 
దైవమిచ్చినది శాశ్వతముగా నిలుచునని బాబా చెప్పారు.  ఈ సందర్భంలో ఆయన శక్తి మరియు కీర్తిని ప్రస్తావిస్తున్నాను.  ఆయన యింకా యిలా చెప్పారు.  అటువంటి అవకాశలు మళ్ళీ మళ్ళీ ఎప్పటికీ రావు అని చెప్పినదానికి అర్ధం  పరోక్షంగా యిక ఎప్పటికీ జరగదని ఒక సూచన చేశారు.  నేనెక్కడికయినా వెళ్ళినా నేనెక్కడ ఆసీనుడయినా సరే అని ఆయన అన్నదానికి అర్ధం.  బాబా మరలా తరువాతనుంచి మరొక కొత్త రూపంలో జీవిస్తారు.  "నేను నావారి కోసం ఆతురత పడెదను" అని బాబా అన్న మాటలకు అర్ధం. తాను మరొక రూపంలోనికి మారినా కూడా తన భక్తుల యోగక్షేమాలను నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉంటానని.   


   
శ్రీసాయి సత్ చరిత్రలో బాబా చెప్పిన మాటలను తిరిగి ఒకసారి గుర్తు చేసుకొందాము.  శ్యామాతో తనకు 72 జన్మలనుండి అనుబంధం ఉందని బాబా చెప్పారు.  లక్ష్మీ కాపర్దేతో  తనకు క్రితం అయిదు జన్మలనుండి సంబంధం ఉందని శ్యామాతో చెప్పారు..  దురంధరే సోదరుల విషయంలో వారితో తనకు వారితో గత 600 సంవత్సరాలనుండి అనుబంధం వుందని బాబా చెప్పారు.

బాబా తన భక్తులనుండి ధనరూపేణా దక్షిణకు బదులుగా అరిష్డ్వర్గాలను, నవవిధ భక్తి, నమస్కారాలను సీకరించేవారు.  తన యజమాని నుంచి ఆరువందల రూపాయలను ఆయన తీసుకొన్నారు.  ఏ రూపంలో తీసుకొన్నారు, దాని అంతరార్ధం ఏమిటి?   

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


Kindly Bookmark and Share it:

2 comments:

Unknown on July 26, 2014 at 12:30 PM said...

great information
Telugu Songs Lyrics

Unknown on March 18, 2019 at 3:07 AM said...

thank you...valuble information
https://abhilyrics.com/

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List