Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, August 2, 2014

శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 6వ.భాగం

Posted by tyagaraju on 6:52 AM
            
          

02.08.2014 శనివారము
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 6వ.భాగం 

ఈ రోజు సాయి బా ని స గారు చెపుతున్న శ్రీసాయి సత్ చరిత్రలోని అంతరార్ధాన్ని వినండి.
       
              

మూలం: సాయి.బా.ని.స. శ్రీరావాడ గోపాలరావు
తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు 

ఒకరోజున ద్వారకామాయిలో దీపాలు వెలిగించడానికి బాబా నూనె అడిగితే, వర్తకులందరూ నూనె యివ్వడానికి నిరాకారించారు.  బాబా నీటితో దీపాలు వెలిగించారు.  ఇదెలా సాధ్యమయింది? 
                 
     

బాబా తన యోగశక్తితోను, భగవంతునిపై నమ్మకంతోను నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్ రెండుగా విడగొట్టి దీపాలను వెలిగించగలిగారు.  ఆవిధంగా బాబా, తమ గురువు మీద భగవంతుని మీద విశ్వాసం పెంపొందేలా మార్గాన్ని సుగమం చేశారు.  రసాయన శాస్త్రప్రకారం, నీరు 900 డిగ్రీల ఉష్ణొగ్రత వద్ద, నికెల్ ఉత్ప్రేరకంగా (కెటలిస్ట్) హైడ్రోజన్, ఆక్సిజన్ గా విడిపోతుంది. నీటిలో హైడ్రోజన్ ఎక్కువగా ఉంటుంది.  అందుచేతనే బాబా అదే హైడ్రోజన్ తో దీపాలను వెలిగించారు. భగవంతుని మీద పూర్తి విశ్వాసం ఉంచాలనే సందేశాన్ని ఇవ్వాలన్నదే బాబా సంకల్పం.         

బాబా తన అంకిత భక్తులలో ఒకరైన బీ.వీ.దేవ్ ను యిలా ప్రశ్నించారు. "గుడ్డపీలికలనెందుకు దొంగిలిస్తావు.  నేను నీకు పట్టు వస్త్రాన్ని యిద్దామని చూస్తున్నాను. బాలక్ రాం వద్దకు ఎందుకు వెళ్ళావు?" 

బాబా ఈవిధంగా మాట్లాడటంలోని ఆంతర్యమేమిటో చూద్దాము. 

ఏప్రశ్నకయినా సరే సమాధానం కావాలంటే బాబానే స్వయముగా అడగవలెననీ యితరులనుంచి అడిగి తెసులుకొనుట వ్యర్ధ ప్రయత్నమని బాబా ఉద్దేశ్యము. 

నేను సాయిమార్గంలోకి వచ్చిన మొదటి రోజులలో, నాకొక వ్యక్తితో పరిచయం కలిగింది.  నేను సాయి తత్వాన్ని ప్రచారం చేయడానికి ఆయనే కారకుడు. 

ఒకసారి బాబా నాకలలో కనిపించి "నేను నీకు నోట్లకట్టలనివ్వడానికి సిధ్ధంగా ఉండగా,క్రొత్తనాణాల కోసం యితరుల వెనుక ఎందుకని పరుగులు పెడతావు?" అన్నారు.  ఆరోజునుండి నాకేది కావలసి వచ్చినా సమాధానం శ్రీసాయిసత్ చరిత్రనుండే తెలుసుకోవడం అలవాటు చేసుకొన్నాను. 


బాబా ద్వారకామాయిలో తనే స్వయంగా వండి అన్నదానం జరిపేవారు.  ఉడుకుతున్న అన్నం గుండిగలో చేయిపెట్టి కలుపుతూ అన్నం ఉడికినదీ లేనిదీ పరీక్షించేవారు.  
                 

ఆయనకు చేయికాలిన బాధ ఏమీ ఉండేది కాదు. కాని, ఎక్కడో దూరంలో ఉన్న ఒక కమ్మరిస్త్రీ ఒడిలోనుండి కొలిమిలో పడ్డ బిడ్దను రక్షించడానికి ధునిలోకి చేయి పెట్టిన బాబాచేయి కాలింది - ఎందుకని?  
       

ఆయన ఎవరినుంచీ ఏమీఆశించకుండా స్వయంగా అన్నంవండి అన్నదానం చేశారు.  అందుచేతనే ఉడుకుతున్న అన్నం గుండిగలో చేయిపెట్టినా కాలలేదు.  కాని, కమ్మరి స్త్రీ ఒడిలోనున్న బిడ్డ కర్మఫలం చేత మంటల్లో పడింధి. ఒకరి కర్మఫలాన్ని ఎవరో మరొకరు అనుభవించి తీరవలసిందే.     

అందుచేత బిడ్డను రక్షించాలంటే ఆబిడ్డయొక్క కర్మను తాననుభవించి బిడ్డపడవలసిన బాధను తాననుభవించారు బాబా.   

తమ జీవితం ఆఖరి క్షణాలలో కొంతమంది చేత బాబా భాగవతం చదివించారు.  తాను మహాసమాధి అవుతున్న సందర్భంలో బాబా వజే చేత రామవిజయం చదివించుకొని విన్నారు.  ఎందులకీ భేదం?  

పరీక్షిన్మహారాజు జీవితపు ఆఖరి ఘడియలలో ఉన్నాడు.  శుకమహాముని ఏడురోజులు భాగవతం చదివి పరీక్షిత్తుకు సద్గతి కలిగించాడు.  అదేవిధంగా బాబా విజయానంద్ కి మద్రాసునుంచి వచ్చిన సన్యాసికి రెండువారాలు భాగవతం చదివించి సద్గతి కలిగించారు.  బాబా వజే చేత రామవిజయం చదివించుకొని 15 అక్టోబరు, 1918 విజయదశమినాడు మహాసమాధి చెందారు.  
       
బాబా తన భక్తులను పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా తనవద్దకు రప్పించుకుంటానని చెప్పారు.  దీని అర్ధమేమిటి?   

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment