30.09.2014 మంగళవారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
అందరికీ దసరా శుభాకాంక్షలు
పదిరోజుల క్రితం మీకు సాయిమహరాజ్ గారి అనుభవాలు సాయి లీలా పత్రిక లో ప్రచురింపబడినదానిని అందించాను. ఈ రోజు శ్రీ వినాయక్ సీతారాం ముల్ హెర్కర్ గారి మరొక అనుభవాన్ని అందిస్తున్నాను. ఈ అనుభవం సాయిలీల పత్రిక జనవరి-ఫిబ్రవరి 2008 సంచికలో ప్రచురింపబడింది.

సాయిమహరాజ్ తో అనుభవాలు - 2
నేనొకసారి పండరీపూర్ లో పాండురంగని దర్శించుకొని అక్కడినుండి షిరిడీ వెళ్ళాను. పండరీపూర్ లో మహాద్వారం వద్ద ఒక మిఠాయిదుకాణం ఉంది. "నేను షిరిడీ సాయి దర్శనానికి వెడుతున్నాను, నీ దగ్గర మంచి రకం పాలకోవా పావుసేరు ఇమ్మని" షాపతనిని అడిగాను. అతను నాకు మంచి పాలకోవా ప్యాక్ చేసి యిచ్చాడు.
మరునాడు నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకొన్నాను. అప్పుడు బాబా "ఈ పేడాలు పండరీపూర్ నించి నాకోసం తెచ్చావు అవునా?" అన్నారు. "అవును బాబా, ఈ పాలకోవా మీకోసమే తెచ్చాను. మీరు వీటిని స్వీకరించి నన్ను ధన్యుడిని చేయండి" అని ప్రార్ధించాను. "మంచిది, వీటిని నాకోసం తెచ్చావు అని అంటూ రెండు పేడాలు తీసుకొన్నారు. మిగిలినవి నాకు తిరిగి యిస్తూ "శ్రీపాండురంగని ప్రసాదం" అన్నారు. బాబాకు ఆపేడాలు పండరీపూరునుండి తెచ్చానని చెప్పడంతో ఆయన సర్వాంతర్యామి అనీ ఆయన భక్తుల మదిలోని కోరికలను తీరుస్తారని నాకనుభవమయింది. ఈఅనుభవంతో బాబావారి దివ్యస్వరూపం, ఆయన గురించిన ఆలోచనలు నాలో భక్తి భావాన్ని రోజురోజుకీ పెరగసాగింది.
బాబా దర్శనానికి షిరిడీ వెళ్ళినపుడెల్లా ఏదోఒక అద్భుతం జరుగుతూనే ఉంది. 2-4 నెలలకు ఒకసారి నేను షిరిడీ వెడుతున్నా నాప్రయాణంలో ఎపుడూ ఎటువంటి అడ్దంకులు ఎదురవలేదు. ఒకసారి నేను కీ.శే.శ్రీనానాసాహెబ్ చందోర్కర్ గారితో కలసి షిరిడి వెళ్ళాను. కోపర్గావ్ లో దిగి గోదావరి నదిలో స్నానాదికాలు కానిచ్చాము. అక్కడ మేము నానాసాహెబ్ గారి బ్రాహ్మణుడు తయారుచేసి యిచ్చిన టీ త్రాగాము. నానా సాహెబ్ గారు తనతో కూడా 5సేర్ల పాలు తీసుకొని వచ్చారు. అక్కడ ముంబాయినుండి వచ్చిన యాత్రికులు చాలామంది ఉన్నారు. వారు కూడా గోదావరిలో స్నానాలు చేసి తమవారందరికీ టీ యిప్పించే పనిలో మునిగిపోయారు.
నానాసాహెబ్ గారు అక్కడ వున్న పిల్లలందరికీ పాలు ఇప్పించడం ప్రారంభించగానే అక్కడున్న స్త్రీలు, పిల్లలు అందరూ కలసి చేసే హడావిడితో అంతా ఒక రణరంగంగా తయారయింది. నేను నానాసాహెబ్ గారి టాంగాలో కూర్చొని, ఆయన కూడా వచ్చి కూర్చోగానే బయలుదేరడానికి వేచి చూస్తున్నాను. నేను అక్కడ ఉన్న వారితో "ఆయనకు యిబ్బంది కలిగించకండి. ఆయన సామాన్యమయిన వ్యక్తి కాదు. ఆయన జిల్లా డిప్యూటీ కలెక్టర్ గారు. ఆయన షిరిడీ సాయిబాబాకు పక్కా భక్తుడు" అన్నాను.
తరువాత మేమిద్దరమూ ఆరతి సమయానికి టాంగాలో షిరిడీ చేరుకొన్నాము. ఆరతి పూర్తయిన తరువాత మేము బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాము. బాబా నావైపు చూసి "అయితే నానాసాహెబ్ పక్కా భక్తుడన్నమాట. మరి నీసంగతేమిటి? నువ్వు కచ్చా భక్తుడివా?" అన్నారు. గోదావరి నది ఒడ్దున అక్కడి యాత్రికులతో నేనన్న మాటలు గుర్తుకు వచ్చి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రతి విషయంలోను బాబా తాను సర్వాంతర్యామినని, అందరి హృదయాలలోను తాను నివసిస్తున్నాననే అనుభవాలను కలిగిస్తూ తన సర్వవ్యాప్తిత్వాన్ని స్పష్టంగా తెలియచేసింది ఈ సంఘటన. బాబా తన భక్తులందరూ అహంకార రహితులుగా, ఎటువంటి దర్పం లేకుండా జీవితాన్ని గడిపేలా బాబా తనలోని అపారమయిన లోతయిన జ్ఞానాన్ని తన భక్తులకు ప్రయోజనం కలిగించే ఫలితాన్నిచ్చారు. సంత్.రామదేవ్ విష్ణుమూర్తిని ఆయన భక్తులందరూ అహంకార రహితులుగా ఉండేలా అనుగ్రహించమని ఏవిధంగా ప్రార్ధించాడో, అదే విధంగా కూడా న్యాయబధ్ధమయిన జీవితం గడిపేలాగా బాబా తన భక్తులకు ప్రేమతో కధలను చెప్పేవారు.
ఈరోజు వరకు నేను శ్రీసాయిబాబావారి దీవెనలను అనుభవిస్తూ ఈజీవితాన్ని కొనసాగిస్తున్నాను. సంత్.తుకారాం చెప్పినట్లు "సాధుపుంగవుల చరణాలను ఒక్కసారి తాకితే చాలు, అహంకారమనే జీజం మాడిమసయిపోతుంది. సాధువుల పాదాల వద్ద మనం నమ్మకముంచారు.
సంత్.తుకారాం రచించిన అభంగాలలో ఈ విధంగా చెప్పారు; చేతులు, పాదాలు, గంధపు చెక్కతో తయారుకాబడినా శరీరంలోని ఏభాగమూ కూడా వానికంటే తక్కువ కాదు.
దీపానికి లోపల, బయట చీకటనేది ఉండదు. చక్కెరకు లోపల బయట కూడా తియ్యదనమె ఉంటుంది. ఆవిధంగానే ఒక మంచి వ్యక్తిలో ఎటువంటి లోపాలు ఉండవని తుకారాం చెప్పారు.
వినాయక్ సీతారాం ముల్ హెర్కర్
ఆంగ్లానువాదం జ్యోతిరాజన్ రౌత్
కాకడ్ ఎస్టేట్, ముంబాయి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
నేనొకసారి పండరీపూర్ లో పాండురంగని దర్శించుకొని అక్కడినుండి షిరిడీ వెళ్ళాను. పండరీపూర్ లో మహాద్వారం వద్ద ఒక మిఠాయిదుకాణం ఉంది. "నేను షిరిడీ సాయి దర్శనానికి వెడుతున్నాను, నీ దగ్గర మంచి రకం పాలకోవా పావుసేరు ఇమ్మని" షాపతనిని అడిగాను. అతను నాకు మంచి పాలకోవా ప్యాక్ చేసి యిచ్చాడు.
మరునాడు నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకొన్నాను. అప్పుడు బాబా "ఈ పేడాలు పండరీపూర్ నించి నాకోసం తెచ్చావు అవునా?" అన్నారు. "అవును బాబా, ఈ పాలకోవా మీకోసమే తెచ్చాను. మీరు వీటిని స్వీకరించి నన్ను ధన్యుడిని చేయండి" అని ప్రార్ధించాను. "మంచిది, వీటిని నాకోసం తెచ్చావు అని అంటూ రెండు పేడాలు తీసుకొన్నారు. మిగిలినవి నాకు తిరిగి యిస్తూ "శ్రీపాండురంగని ప్రసాదం" అన్నారు. బాబాకు ఆపేడాలు పండరీపూరునుండి తెచ్చానని చెప్పడంతో ఆయన సర్వాంతర్యామి అనీ ఆయన భక్తుల మదిలోని కోరికలను తీరుస్తారని నాకనుభవమయింది. ఈ అనుభవంతో బాబావారి దివ్యస్వరూపం, ఆయన గురించిన ఆలోచనల వల్ల నాలో భక్తి భావం రోజురోజుకీ పెరగసాగింది.
బాబా దర్శనానికి షిరిడీ వెళ్ళినపుడెల్లా ఏదోఒక అద్భుతం జరుగుతూనే ఉంది. 2-4 నెలలకు ఒకసారి నేను షిరిడీ వెడుతున్నా నాప్రయాణంలో ఎపుడూ ఎటువంటి అడ్దంకులు ఎదురవలేదు. ఒకసారి నేను కీ.శే.శ్రీనానాసాహెబ్ చందోర్కర్ గారితో కలసి షిరిడి వెళ్ళాను. కోపర్గావ్ లో దిగి గోదావరి నదిలో స్నానాదికాలు కానిచ్చాము. అక్కడ మేము నానాసాహెబ్ గారి బ్రాహ్మణుడు తయారుచేసి యిచ్చిన టీ త్రాగాము. నానా సాహెబ్ గారు తనతో కూడా 5సేర్ల పాలు తీసుకొని వచ్చారు. అక్కడ ముంబాయినుండి వచ్చిన యాత్రికులు చాలామంది ఉన్నారు. వారు కూడా గోదావరిలో స్నానాలు చేసి తమవారందరికీ టీ యిప్పించే పనిలో మునిగిపోయారు.
నానాసాహెబ్ గారు అక్కడ వున్న పిల్లలందరికీ పాలు ఇప్పించడం ప్రారంభించగానే అక్కడున్న స్త్రీలు, పిల్లలు అందరూ కలసి చేసే హడావిడితో అంతా ఒక రణరంగంగా తయారయింది. నేను నానాసాహెబ్ గారి టాంగాలో కూర్చొని, ఆయన కూడా వచ్చి కూర్చోగానే బయలుదేరడానికి వేచి చూస్తున్నాను. నేను అక్కడ ఉన్న వారితో "ఆయనకు యిబ్బంది కలిగించకండి. ఆయన సామాన్యమయిన వ్యక్తి కాదు. ఆయన జిల్లా డిప్యూటీ కలెక్టర్ గారు. ఆయన షిరిడీ సాయిబాబాకు పక్కా భక్తుడు" అన్నాను.
తరువాత మేమిద్దరమూ ఆరతి సమయానికి టాంగాలో షిరిడీ చేరుకొన్నాము. ఆరతి పూర్తయిన తరువాత మేము బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాము. బాబా నావైపు చూసి "అయితే నానాసాహెబ్ పక్కా భక్తుడన్నమాట. మరి నీసంగతేమిటి? నువ్వు కచ్చా భక్తుడివా?" అన్నారు. గోదావరి నది ఒడ్దున అక్కడి యాత్రికులతో నేనన్న మాటలు గుర్తుకు వచ్చి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రతి విషయంలోను బాబా తాను సర్వాంతర్యామినని, అందరి హృదయాలలోను తాను నివసిస్తున్నాననే అనుభవాలను కలిగిస్తూ తన సర్వవ్యాప్తిత్వాన్ని స్పష్టంగా తెలియచేసింది ఈ సంఘటన. బాబా తన భక్తులందరూ అహంకార రహితులుగా, ఎటువంటి దర్పం లేకుండా జీవితాన్ని గడిపేలా బాబా తనలోని అపారమయిన లోతయిన జ్ఞానం తన భక్తులకు ప్రయోజనం కలిగిం చేలా ఫలితాన్నిచ్చారు. సంత్.రామదేవ్ విష్ణుమూర్తిని ఆయన భక్తులందరూ అహంకార రహితులుగా ఉండేలా అనుగ్రహించమని ఏవిధంగా ప్రార్ధించాడో, అదే విధంగా బాబా కూడా తన భక్తులందరూ న్యాయబధ్ధమయిన జీవితం గడిపేలాగా బాబా తన భక్తులకు ప్రేమతో కధలను చెప్పేవారు.
ఈరోజు వరకు నేను శ్రీసాయిబాబావారి దీవెనలను అనుభవిస్తూ ఈజీవితాన్ని కొనసాగిస్తున్నాను. సంత్.తుకారాం చెప్పినట్లు "సాధుపుంగవుల చరణాలను ఒక్కసారి తాకితే చాలు, అహంకారమనే బీజం మాడిమసయిపోతుంది. సాధువుల పాదాల వద్ద మనం నమ్మకముంచాలి
సంత్.తుకారాం రచించిన అభంగాలలో ఈ విధంగా చెప్పారు; చేతులు, పాదాలు, గంధపు చెక్కతో తయారుకాబడినా శరీరంలోని ఏభాగమూ కూడా వానికంటే తక్కువ కాదు.
దీపానికి లోపల, బయట చీకటనేది ఉండదు. చక్కెరకు లోపల బయట కూడా తియ్యదనమె ఉంటుంది. ఆవిధంగానే ఒక మంచి వ్యక్తిలో ఎటువంటి లోపాలు ఉండవని తుకారాం చెప్పారు.
వినాయక్ సీతారాం ముల్ హెర్కర్
ఆంగ్లానువాదం జ్యోతిరాజన్ రౌత్
కాకడ్ ఎస్టేట్, ముంబాయి
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment