18.01.2016 సోమవారం
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బందువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ జీ .ఎస్.ఖపర్డే గారి డైరీనుండి మరికొన్ని విశేషాలు
శ్రీ జీ.ఎస్.ఖపర్డే
డైరీ – 24
31.01.1912 బుధవారం
సరిగ్గా
సమయానికి లేచి, వామన్ గోంకర్ తో కలిసి కాకడ ఆరతికి వెళ్ళాను. మేము తిరిగి వచ్చేటప్పుడు సాయి మహరాజ్ కొద్దిగా
కోపం చూపించారు. బాపూ సాహెబ్ జోగ్, ఉపాసనీ
శాస్త్రి, శీమతి కౌజల్గీలతో పరమామృత పఠనం జరిగింది.
పదకొండు గంటలవుతుండగా తిరిగి వచ్చి కొన్ని ఉత్తరాలు
రాద్దామనుకున్నాను కాని నాకు తెలియకుండానే రాస్తుంటేనే నిద్ర ముంచుకు వచ్చేసింది. దాదా కేల్కర్ కొడుకు భావూ వచ్చి లేపితే మధ్యాహ్న
ఆరతికి మసీదుకు వెళ్ళాను. సాయి మహరాజ్ ఎప్పటిలాగే
బయటకు వెళ్ళటం ఇంతకు ముందే చూశాను. ఎప్పటిలాగే
మధ్యాహ్నమ్ ఆరతి జరిగింది. మేఘా చనిపోయి
13వ.రోజవటంవల్ల దాదా కేల్కర్ రెండు వాడాలలో ఉన్నవాళ్ళనీ ఇంకా మరికొందరినీ భోజనాలకి పిలిచాడు. సహజంగానే భోజనాలు ఆలస్యమవుతాయి అందుచేత
నన్ను పిలిచేంతవరకు బాగా నిద్రపోయాను. భోజనాలు
పూర్తయేటప్పటికి సాయంత్రం 5 గంటలయింది. తరువాత
మసీదుకు వెళ్ళి సాయి మహరాజ్ వద్ద కూర్చున్నాను.
ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. వినోదంగా
మాట్లాడారు.
పాటలు పాడుతూ నాట్యం చేసి ఉల్లాసంగా
నాతో సహా అక్కడున్నవారందరికి ఆనాటి గోకులంలో కృష్ణుడిని బాగా గుర్తుకు తెచ్చారు.
సాయంత్రం
ఆయన వ్యాహ్యాళికి వెళ్ళేటప్పుడు దర్శించుకున్నాము. వాడాలో అరతి అయిన తరువత భీష్మ కొద్దిగా భజన, దీక్షిత్
రామాయణం జరిగాయి. ఈ రోజు రాత్రి సుందర కాండ
పూర్తయింది.
01.02.1912 గురువారమ్
నేను లేవటం కాస్త ఆలస్యమయినా గాని సరైన సమాయంలోనే ప్రార్ధన పూర్తి చేసుకుని పరమామృతం క్లాసుకి
హాజరయ్యాను. ఈ రోజుతో పరమామృతం పూర్తయింది. రేపటినుంచి పునశ్చరణ చేయాలి. ఆ తరువాత మసీదుకు వెళ్ళి, ఆయన వద్ద కూర్చున్నాను. ఆయనతో సాఠేవాడా దాకా వెళ్ళాను. ఆయనకు నమస్కరించుకోవడానికి ఎప్పటిలాగే అక్కడ జనం
ఉన్నారు. నేను కూడా వారితో కలిసి ఆయనకు నమస్కరించుకున్నాను. తరువాత బాపూసాహెబ్ జోగ్ ఇంటికి వెళ్ళి పంచదశి ప్రారంభించి
వాటిలోని మొదటి పది శ్లోకాలను వివరించి చెప్పాను.
నిజానికి ఈపంచదశలోని మొత్తం సారమమంతా ఈ పదిశ్లోకాల రూపంలో వివరింపబడి ఉంది. తరువాత నా బసకు తిరిగి వచ్చి కొన్ని ఉత్తరాలు వ్రాసి,
కొన్నిటిని పంపించాను. తరువాత మసీదుకు వెళ్ళి
మధ్యాహ్న ఆరతికి హాజరయ్యాను. ఆరతి బాగా
జరిగింది. అహ్మద్ నగర్ కి చెందినమాణిక్ చంద్ ఈ సంవత్సరమే ఎల్.ఎల్.బి. పట్టా తీసుకున్నాడు. అతను వచ్చి రోజంతా ఇక్కడే ఉన్నాడు. ఆరతి నుండి తిరిగి వచ్చి భోజనాలు చేశాము. ఆతరువాత సఖ్రేబువా వ్యాఖ్యానించినౕ జ్ఞానేశ్వరి చదువుతూ
కూర్చున్నాను. దురదృష్టవశాత్తు ఇతర పుస్తకాలలాగే
ఇది కూడా నా సమస్యలను ఏమీ పరిష్కరించలేదు.
ఆ తరువాత దీక్షిత్ రామాయణం చదివాడు. షిరిడీ మామలతదారు సానే, డిప్యూటి కలెక్టర్ సాఠే, సబ్ డివిజనల్ ఆఫీసరు వీరందరూ
వచ్చారు. అందరం మాట్లాడుకుంటూ కూర్చున్నాము. వారు వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ రామాయణం రిరిగి చదవడం
ప్రారంభించాము. సాయిబాబా సాయంత్రం వ్యాహ్యాళికి
వెళ్ళేటప్పుడు దర్శించుకోవటానికి సాయంత్రం మసీదుకు వెళ్ళాము. వాడాలో ఆరతియిన తరువాత శేజ్ ఆరతికి వెళ్ళాము. భీష్మ
భజన జరగలేదు. సఖారాం ప్రాకృత భాగవతం చదివాము. రాత్రి దీక్షిత్ రామాయణం చదివాడు. ఈరోజు సాయంత్రం సాయిబాబా వ్యాహ్యాళికి బయలుదేరేముందు,
మేమంతా మసీదులో ఉండగా, ఆ సమయంలో సాయిసాహెబ్ కాళ్ళకు నూనె రాస్తున్న నాభార్యకు రెండువందల
రూపాయలనిమ్మని దీక్షిత్ కు చెప్పారు. ఈ ఆజ్ఞ కి కారణం తెలిసుకొనశక్యం కానిది. నేనేమన్నా దానధర్మాలమీద
ఆధారపడిబ్రతకాలా!!! దానికన్నా చావడం నయం. సాయి
మహరాజ్ నాకోరికలకు కళ్ళెం వేసి, నా అహంకారాన్ని నాశనం చేయదలచుకున్నారేమో. అందుకనే ఆయన నన్ను పేదరికానికి, దయాధర్మాలకు అలవాటు
పడేలా చేయదలచుకున్నారేమో. **
**01.12.1912
డైరీలో రాసిన విషయాన్ని మరొకసారి చదివాను.
నా భావాలు సరైనవనిపించాయి. మన సద్గురు
సాయిమహరాజ్ ఆజ్ఞాపించారు. ఆయన సర్వాంతర్యామి
కావున ఆయనకన్నీ తెలుసు. నామనసులోని భావాలు
కూడా తెలుసు. అందుచేతనే ఆయన తన ఆజ్ఞను అమలుపరచమని
నొక్కి చెప్పలేదు. నా భార్య విషయంలో ఆమెకు
శారీరక శ్రమ, పేదరికం, అప్పట్లో ఇష్టం లేవన్న విషయం మీద నాదృష్టి పడింది. కాకా సాహెబ్ దీక్షిత్ ఆ జీవితానికి అంగీకరించే సంతోషంగా
ఉన్నాడు. అందుచేతనే నా జీవితానికి సాయిమహరాజ్ పేదరికము, ఓర్పు అనే రెండువందల రూపాయలిమ్మని అతనితో చెప్పారు.
(మరికొన్ని విషయాలు తరువాతి సంచికలో)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment