Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, March 3, 2016

శ్రీ సాయి పుష్పగిరి – ఆధ్యాత్మికం (1 వ.భాగం)

Posted by tyagaraju on 6:57 AM
                                                 











Image result for images of yellow roses

03.03.2016 గురువారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు నుండి సాయిబానిస గారి డైరీల నుండి నేను సేకరించిన సాయి సందేశాలను ప్రచురిస్తున్నాను. ఈ సందేశాలన్నీ ఆధ్యాత్మికతకు సంబంధించినవి.  విచిత్రమేమిటంటే 1999 వ.సంవత్సరములోనే బాబా గారు ఆయనకి తను ఇచ్చిన సందేశాలను ఇంటర్ నెట్ ద్వారా సాయిభక్తులకు పంచి పెట్టమని ఆదేశించారు.  5 వ. సంఖ్య సందేశాన్ని గమనించండి.

Image result for images of saibanisa
సాయిబానిస గారు హైదరాబాదులో సాయి దర్బార్ ను 25.12.1998 నాడు ప్రారంభించారు. ఆ రోజు క్రిస్మస్ పండగ.  ఈ రోజున ఆధ్యాత్మిక కేకును ప్రపంచానికి పంచిపెట్టమని బాబా  ఆదేశించారు. ఆ విధంగా ఇంటర్ నెట్ లో మొట్టమొదటి వెబ్ సైట్ ప్రారంభించారు. http://www.angelfire.com/ma/shirdi/  ఈ లింకు చూడండి.

     గృహస్తులకు సాయి సలహాలపై సాయిబానిసగారి ఉపన్యాసములు  ఈ  లింక్ ద్వారా వినండి. 
https://youtu.be/pHVcgg207FQ

https://youtu.be/DFqUsQQNm38


శ్రీ సాయి పుష్పగిరిఆధ్యాత్మికం (1 వ.భాగం)
13.02.1999

1. శ్రీసాయి గురించి ఇతరులు చెప్పే విషయాలు ఆలోచించకుప్రతి విషయము నీవే స్వయముగా తెలుసుకో.



2. నీవు సాయిభక్తుల మధ్య ఉంటూనే ప్రపంచంలో జరుగుతున్న వాటిని చూస్తూ మంచి చెడులను గుర్తించు.

3. ఎవరయినా కష్టాలలో ఉన్నపుడు నీవు వారి పక్షాన నిలబడి వారికి ధైర్యము చెప్పి సాయి సత్ చరిత్రలోని విషయాలు వారికి చెప్పి వారికి ప్రశాంతత కల్గించు.

4.  శ్రీషిరిడీ సాయి లీలామృత భాండాగారములోని అమృతాన్ని పదిమందికి పంచిపెట్టు

16.02.1999

5. నీవు ఇంటర్ నెట్ లో ప్రస్తుతానికి నేను నాభక్తులకు ప్రసాదించిన ఏకాదశ సూత్రాలు మరియు నేను నీకు చెప్పిన సాయితత్వం నీ తోటి సాయిబంధువులకు పంచి పెట్టు




25.02.1999

6.  భగవంతుడు స్త్రీ పురుషులలో ఒకే విధమయిన ఆత్మ శక్తిని ప్రసాదించాడు.  స్త్రీ పురుషులు దీనిని గుర్తించి, తమలోని శారీరకమయిన తేడాలోని శక్తిని గుర్తించి, ఒకరిని ఇంకొకరు గౌరవించడం నేర్చుకోవాలిఅంతే కాని తమ తమ ఆధిపత్య నిరూపణ చేసుకోరాదు.

16.03.1999

7.  నరుడి పాదాలకు నీవు పూజలు చేయడం ప్రారంభించిననాడు ఆపాద పూజ చేయించుకునేవాడు నిన్ను బానిసగా చూస్తాడుఅదే నీవు నారాయణుడి పాదాలకు పూజలు చేయడం ప్రారంభించిననాడు నారాయణుడు దిగి వచ్చి నేను నా భక్తునికి బానిసని అంటాడు.

              Image result for images of  worshipping vishnu


22.03.1999

8.  ఆనాడు సాయినాధుడు షిరిడీలో శ్రీరామనవమి, చందనోత్సవాలను ఒకే రోజు జరిపించి తన భక్తులకు భగవత్ భక్తిని గురించి ప్రబోధించారుఈనాడు మనము శ్రీసాయిరామునికి ప్రేమ అనే చందనం  పూసి నవవిధ భక్తితో పూజిద్దాము    

27.01.1999

9. రాజయినా, పేదయినా జీవించడానికి తినేది పట్టెడన్నమే కదా అన్నమును ప్రసాదించేది పరబ్రహ్మమే కదాఅటువంటి పరబ్రహ్మాన్ని ఆలోచించడం మానివేసి అశాశ్వతమయిన పదవుల కోసం ఆఖరి శ్వాసవరకు ప్రయత్నించడంలో అర్ధమేమిటి?

26.02.2000

10. ఇతరుల ఇంట పిండివంటలు తిన్నా, మన ఇంటిలో మన తల్లి చేసిన సాధారణ వంట ప్రేమతో తినాలికారణము మన తల్లి ప్రేమతో వండి వడ్డిస్తుంది కాబట్టిమన తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదుఅలాగే మన గురువు మన తల్లిలాంటివాడుమన గురువు చెప్పిన బోధనలను ఆస్వాదించి ఆచరించవలెనుఇతర గురువులను మనము గౌరవించవలెను.  
                         Image result for images of shirdi saibaba teaching


(మరికొన్ని సందేశాలు తరువాతి సంచికలో)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు) 


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List