Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, March 8, 2016

శ్రీసాయి పుష్పగిరి - ఆధ్యాత్మికం – 3వ.భాగం

Posted by tyagaraju on 8:04 AM
Image result for images of shirdi sai baba flower garden
Image result for images of rose hd

08.03.2016 మంగళవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయిబానిస గారికి సాయిబాబావారు ఆధ్యాత్మిక విషయాలపై ఇచ్చిన సందేశాలను ప్రచురిస్తున్నాను. 
Image result for images of saibanisa

శ్రీసాయి పుష్పగిరి -  ఆధ్యాత్మికం – 3వ.భాగం


21.05.2003

21.  భగవంతుని సేవించడానికి సర్వజనులకూ, సర్వజీవులకూ, హక్కు ఉందినీవు భగవంతుని సేవ చేసుకుంటూ ప్రశాంతంగా జీవించుఅంతేకాని, భగవంతుడిని ఇంకా ఎవరెవరు సేవిస్తున్నారు అనే ఆలోచనలతో నీ జీవిత పరమార్ధము నుండి దూరంగా జీవించవద్దు.

23.05.2003

22.   నిజాన్ని మనము ఎప్పుడూ మార్చలేమునీటిని అనేక రూపాలుగా మనము మార్చగలముకాని, దాని సహజ గుణాన్ని మార్చలేముఅదే విధముగా భగవంతునికి అనేక రూపాలను మనము ఆపాదించగలముకాని, ఆయన లక్షణాన్ని మనము మార్చలేముఅందువలననే భగవంతుడే సత్యముసత్యమే భగవంతుడు.



Image result for images of sai padukas

24.08.2003

23. గురువుయొక్క పాదుకలను భక్తితో పూజించుఅవి నీ జీవిత ప్రయాణంలో నీకు ఎదురుపడే ఆటంకాలను అధిగమింప చేసి నిన్ను భగవంతుని పాదాల వద్దకు చేర్చుతుంది.

*24.  ప్రతి వ్యక్తికి ఇంటర్ నెట్ లో ఒక మెయిల్ చిరునామా ఉన్నట్లే ఆధ్యాత్మిక రంగంలో భగవంతుని దగ్గర ప్రతి వ్యక్తికి ఒక చిరునామా ఉంటుంది. చిరునామాతో భగవంతుడు ఆ వ్యక్తి మంచి చెడ్డలను గమనిస్తూ ఉంటాడు.  

                    Image result for images of satellites

25.04.2004

25.  అంతరిక్షంలోనికి ఒక ఉపగ్రహాన్ని మానవ కళ్యాణానికి వదలుతారు ఉపగ్రహం తనపని పూర్తయిన తరువాత విశ్వాంతరాళంలో కాలిపోయి బూడిదయిపోతుందికాని, దాని పేరు శాశ్వతంగా నిలచిపోతుందిఅదే విధంగా ఈ ప్రపంచంలో మహాత్ముల జీవితాలు మానవాళికి ఉపయోగపడి ఆఖరికి పంచభూతాలలో కలసిపోతాయి.   

01.05.2004

26.  మందిరంలో భగవంతునియొక్క విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సమయంలో భగవంతుని కన్నులకు గంతలు కడతారువిగ్రహ ప్రతిష్టాపన పూర్తయిన తరువాత మాత్రమే ఆ మూర్తికి ఉన్నటువంటి గంతలను తొలగిస్తారుఆ సమయంలో విగ్రహానికి ఎదురుగా ఎవరూ ఉండకుండా ఏర్పాట్లు చేస్తారుకారణం భగవంతుని మొదటి చూపు విశ్వమంతటి మీద సమానముగా పడాలనె ఉద్దేశ్యంతో మాత్రమే. భగవంతుని దృష్టిలో మానవులందరూ సమానమే.

07.07.2004

27.  పరబ్రహ్మ స్వరూపము అనగా భగవంతుడుభగవంతునికి శిష్యులు లేరుఆయనకు అందరూ భక్తులేఆయన తన భక్తుల హృదయాలలో నివశిస్తూ ఉంటారునా దృష్టిలో సద్గురువు సాయినాధుల వారు పరబ్రహ్మ  స్వరూపులువారు తన భక్తుల హృదయాలలోనే ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటారు.
                                                                                                                సాయిబానిస -

15.07.2004

28.  నేటి భగవంతుని పూజకోసం వాడే పూజా సామాగ్రి అంతా నకిలీ వస్తువులు, కల్తీ సరుకులు చోటు చేసుకొన్నాయిదానివల్ల మనకు అశాంతే మిగులుతున్నదిఅందుచేత భగవంతుని దయ సంపాదించటంకోసం మానసిక పూజ చేసుకోవడం ఉత్తమం.

Image result for images of annamayya

19.10.2004

29.  అన్నమయ్య భగవంతుని పాటలరూపంలో కీర్తించి భగవంతునిలో ఐక్యమయిపోయాడు.   నేడు అనేకమంది అన్నమయ్య పాటలు పాడుతూ తమ పాదాలకు పాదపూజ చేయించుకుంటున్నారు పాద పూజలకు అర్ధం లేదు.  

30.  ఈ ప్రపంచములో మన కంటికి కనిపించేదంతా అశాశ్వతముమన కంటికి కనిపించని గురువు (భగవంతుని) అనుగ్రహము శాశ్వతము
*(ఈ 24వ.  సందేశాన్ని చదివిన తరువాతనేను చదివిన ఒక విషయం ఇక్కడ ప్రస్తావిస్తాను.  మనకి ఈ మెయిల్ ఐ.డి. ఉన్నట్లుగానే భగవంతుని వద్ద కూడా మనకి సంబంధించిన చిరునామా ఉంటుంది.   నేను చదివిన విషయం. బారసాలనాడు మనకి ఏ పేరయితే పెడతారో అదే పేరు భగవంతుని వద్ద నిర్ధారణ అయినట్లే. కొంతమంది పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు ఇంటిలోని తమ పెద్దల గౌరవార్ధం అందరి పేర్లు కలిసి వచ్చేటట్లుగా నామకరణం చేసేస్తూ ఉంటారు.  పిల్లలు పెద్దయిన తరువాత లేక పాఠశాలలో చేర్పించేటప్పుడు గాని అంత పెద్ద పేరు ఎందుకని తగ్గించి రాయించేస్తూ ఉంటారు.  ఇంకొక ముఖ్య విషయం మనం గుడిలో దేవునికి అర్చన చేయించేటప్పుడు కూడా మనకి బారసాల నాడు ఏ పేరయితే పెట్టారో అదే పేరుతో చేయించుకోవాలి.  ప్రారంభంలో పెట్టిన పేరు వదిలివేసి పెట్టిన పేరులో కొన్ని తీసివేసి చిన్న పేరు ఒకటె చెపితే ఎలాగ?  మరి భగవంతునికి మనం ఏ పేరుతో రెజిస్టర్ చేసుకున్నామో తెలియద్దూ?    కనీసం భగవంతునికి గుడిలో  పూజ చేయించేటప్పుడయిన బారసాలనాడు పెట్టిన పేరునే చెప్పండి. నేను చదివిన విషయం కాబట్టి చెప్పడం జరిగింది. ) 
భగవంతుడు సర్వాంతర్యామి కదా, ఆయనకి  తెలియనిదంటూ  ఏమీ ఉండదు కదా, పూర్తి పేరు చెప్పకపోయినా  ఆయనకి  మనమెవరమో  తెలియదా అనే  వితండవాదన మనకి వద్దు)
(దయ చేసి ఇది ఎవరినీ విమర్శిస్తున్నానని అనుకోవద్దని ప్రార్ధన. )
(నామకరణం విషయంలో ఎవరినయిన బాధపెడితే క్షంతవ్యుడను)

               త్యాగరాజు 

(తరువాతి సంచికలో మరికొన్ని ఆధ్యాత్మిక సందేశాలు)
(రేపటి సంచికలో “చెవి పోగులు” చదవండి)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List