16.06.2016 గురువారమ్
ఓమ్
సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీకాకుళంనుండి
సాయి బంధు శ్రీ సాయి సురేష్ గారు తమ అనుభవాలు పంపించారు. వాటినన్నిటినీ క్రమానుసారంగా ప్రచురిస్తాను. బాబా తన భక్తులను ఏ విధంగా అనుగ్రహిస్తూ ఉంటారో
ఆయన అనుభవాల ద్వారా మనం గ్రహించుకోవచ్చు.
శ్రీ
సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
నా పేరు సాయి సురేష్, నేను శ్రీకాకుళంలో ఉంటాను. సాయి నాకు ఇచ్చిన అనుభవాలను సాయి బంధువులందరితో పంచుకొనే అవకాశం కల్పించినందుకు సాయి కి నా కృతజ్ఞతాభివందనములు.
షిర్డీ
లోని విఠల్ మందిరం
• సాయి లీలామృతం లో
బాబా లెండి కి వెళ్ళేటప్పుడు
విఠల్ మందిరం దగ్గర ఒక ఇంటి
గోడకు అనుకుని నిలిచే వారని ఉంటుంది.
నేను
7 టైమ్స్ షిర్డీ వెళ్ళాను. కానీ నాకు ఆ
విఠల్ మందిరం ఎక్కడ ఉందో తెలిసేది
కాదు.
గత సంవత్సరం షిర్డీ
వెళ్ళే ముందు ఈ సారైనా
ఆ మందిరం చూపించండి సాయి అని వేడుకున్నాను.
షిర్డీ వెళ్ళిన తర్వాత ఒకరోజు మేము షిర్డిలో షాపింగ్
చేస్తూ తిరుగుతూ ఉన్నాము. అలా తిరుగుతూ ఉండగా
సాయి అనూహ్యంగా మమ్ము విఠల్ మందిరం
ఎదురుగా నిలిచేలా చేసారు. నేను విఠల్ దర్శనం
చేసుకొని, బాబా నా కోరిక
మన్నించినందుకు ఎంతో సంతోషించాను.
చామరంతో
సేవ
• నేను అప్పుడప్పుడు హైదరాబాద్
లో అమీర్ పేట బాబా
గుడికి వెళ్ళే వాడిని. సాయి
కి హారతి ఇచ్చే సమయంలో
చామరముతో వీస్తూ ఉంటారు. నాకు చామరం వీచే
అవకాశం కావాలనిపించింది. కానీ నాకు అక్కడ
ఎవరు పరిచయం లేకపోవటము వలన ఆ కోరిక
నా మనస్సులో ఆపుకొన్నాను.
కొన్నాళ్ళ
తర్వాత నేను మందిరానికి వెళ్లి
సాయి దర్శనం చేసుకొని హారతి కి ఉందామని.
దూరంగా కూర్చున్నాను.. హారతికి తయారుచేస్తున్నారు. ఒక వ్యక్తి అంతమంది నా ముందువుండగా వారినందరిని దాటి దూరంగా ఉన్న
నా దగ్గరకు వచ్చి చామరం వీస్తారా
అని అడిగారు. సంతోషంతో సరేనన్నాను. నాకున్న కోరికను సాయి ఆవిధంగా తీర్చినందుకు
మనసులోనే సాయికి కృతఙ్ఞతలు తెలుపుకుంటూ చామరం వీచాను. ఆనందంతో
నా కళ్ళనిండా నీళ్ళు తిరిగాయి.
హైదరాబాద్
లో చింతల్ బాబా గుడిలో:-
• ఒక సాయంత్రం నాకేందుకో
పులిహోర తయారుచేసి సంధ్య ఆరతి కి
గుడిలో బాబాకి నివేదించాలనిపించింది. నేను పులిహోర చేసి
గుడికి బయలుదేరాను. కానీ అప్పటికే హారతి
టైం అయిపొయింది. త్వరత్వరగా వెళ్ళాను. సాయి నాకోసం ఎదురు
చూస్తున్నట్లు హారతి ఇంకా మొదలు కాలేదు.
థాంక్స్ బాబా అనుకొని లోపలికి
వెళ్లి పంతులు గారికి పులిహోర ఇచ్చాను.
ఆయన సంతోషంతో తీసుకొని,
ఈ రోజు ఎవరూ నైవేద్యం
తేలేదు. ఎవరైనా తెస్తారేమో అని ఎదురు చూస్తున్నాను
అన్నారు. భక్తులు ప్రేమతో
తెచ్చే నైవేద్యం కోసం బాబా ఎదురు చూడటము
మనము సచ్చరిత్రలో చదివాము. అలానే సాయి నాకోసం
వేచి నా నైవేద్యం స్వీకరించినందుకు
చాలా ఆనందమనిపించింది.
• మరోసారి ఉదయం బాబా గుడికి
వెళ్లి ధ్యానం చేస్తున్నాను. “దాసగణు కి ఉద్యోగం వదిలి
పెట్టమని సాయి చెపితే, అతడు
నాకు భుక్తి ఎలా అని అడుగుతారు.
అప్పుడు సాయి ‘నేను పోషిస్తాను’
అని చెప్తారు. ఈ సన్నివేశం గుర్తు
వచ్చి, బాబా నేనిప్పుడు టిఫిన్
చేయలేదు. నాకు టిఫిన్ పెడతావా?
అని అనుకున్నానంతే. బాబా పాదాలకు నమస్కరించి
బయటకు వెళ్ళిపోతుండగా ఒక పెద్దాయన ఆ
గుడిలో ఉంటారు. ఆయన నన్ను అతని
గదిలోకి రమ్మన్నారు. నాకు అతనితో పరిచయము
ఏమి లేదు. సరే వారు
రమ్మన్నారని గది లోపలికి వెళ్ళాను. ఆయన నాకు టిఫిన్
ఇచ్చి తినమన్నారు. నేను మొహటానికి వద్దన్నాను.
కానీ వారు ఒప్పుకోలేదు. నాకు
చాల ఆశ్చర్యాన్ని కలిగించింది ఈ సంఘటన. నేను
బాబాని అడగటము తర్వాత ఆయన నాకు టిఫిన్
ఇవ్వటం అంతా బాబా లీలే,
లేకుంటే
నా మనసులో కోరిక వారికి ఎలా
తెలుస్తుంది. అందరి హృదయ వాసుడు
సాయే కదా! వారె అతనిని
ప్రేరేపించి నాకు టిఫిన్ ఇప్పించారు.
దీనినిబట్టి మనకు సాయికి శరణు
అని ఒకసారి అంటే చాలు, ఇక
భక్తుని సర్వ బాధ్యతలు వారు
తీసుకుంటారని, భక్తులకు వారి సేవలోనే భుక్తి,
ముక్తి ప్రసాదిస్తారని తెలుస్తుంది.
• ఇంకోసారి సాయి మందిరంలో పంతులుగారు
నన్ను ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావా అని అడిగారు. నేను
నా ఉద్యోగ విషయం సాయి కి
వదలివేసాను, అంతా వారే చూసుకుంటారని
అన్నాను. దానికి ఆయన నువ్వు ప్రయత్నం
ఏమి చేయకుండా ఉంటే సాయి ఏమి
చేస్తారు. గాలిలో దీపం పెట్టి దేవుడా
నీవే దిక్కు అంటే ఎలా అన్నారు.
నేను సాయి పై పూర్ణ
విశ్వాసం ఉంచి సహనంతో ఉంటే
మనకు శ్రేయస్కరమైనది వారే చేస్తారు. గాలిలో
దీపం అయినా ఆరిపోకుండా ఉంటుంది
అని అన్నాను. ఆ మందిర ప్రాంగణములో
బయట గణేశుడు, దత్తాత్రేయుడు, శివుడు, నాగేంద్రుడి విగ్రహాలు, తులిసికోట ఉన్నాయి. ప్రతి చోట ఒక
దీపం వెలిగిస్తారు. ఆ సమయంలో విపరీతమైన
గాలి వీస్తూ ఉంది. పంతులుగారు, సాయి పై నీకంత
విశ్వాసం కదా! కనీసం ఒక్క
దీపామైన ఇంత గాలిలో ఆరకుండా
ఉంటుందా అన్నారు. కచ్చితంగా ఉంటుంది అన్నాను. మేము బయటకుపోయి చూసాము.
అన్ని దీపాలు ఆరిపోయాయి కానీ తులసికోట వద్ద
దీపం మాత్రము దేదీప్యమానంగా అంత గాలిలో కూడా
వెలుగుతూ ఉంది. దానితో ఋజువైంది సాయి పై సంపూర్ణ
విశ్వాసం ఉంటే ఏదీ అసాధ్యం కాదని.
(ఇంకా ఉన్నాయి)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment