Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Monday, April 10, 2017

శ్రీసాయి లీలా తరంగిణి –18 వ.భాగమ్

Posted by tyagaraju on 6:10 AM
       Image result for images of shirdi saibaba smiling face
      Image result for images of rose hd yellow

10.04.2017 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీసాయి లీలా తరంగిణి –18 వ.భాగమ్
రచనః  శ్రీమతి భారం మణి ఉమా మహేశ్వర రావు  
     
      Image result for images of bharam mani

(మూల రచన :  తెలుగు.   ఆంగ్లంలోకి అనువదింపబడినది)
సాయి లీలాస్. ఆర్గ్ నుండి గ్రహింపబడినది
(మరల తెలుగులోకి అనువాదమ్ చేయించినవారు బాబా)
అనువాదానికి నిమిత్త మాత్రుడుః  ఆత్రేయపురపు త్యాగరాజు
ఆల్ ఖైల్ గేట్,  దుబాయి
Email :  tyagaraju.a@gmail.com
Watts app.No.  9440375411

శ్రీ రాధాకృష్ణస్వామి గారి దర్శనమ్

1987 వ.సంవత్సరం మే నెల 30 వ.తారీకున నాభర్త శ్రీ భారం ఉమామహేశ్వరరావుగారు షిరిడీలో ధ్యానం చేసుకుంటున్నారు.  ధ్యానంలో ఆయనకు శ్రీసాయిబాబా దర్శనమిచ్చి ఒక శుక్రవారమునాడు ఏకధాటిగా 9 గంటలపాటు ధ్యానంలో ఉండమని ఆదేశించారు. 


షిరిడీనుంచి తిరిగివచ్చిన తరువాత, నాభర్తకు పూజ్య శ్రీశివనేశన్ స్వామీజీ గారు కలలో కనిపించి "వచ్చే శుక్రవారంనాడు నువ్వు 9 గంటలపాటు ధ్యానంలో కూర్చో.  ఇంక ఆలస్యం చేయకుండా బాబా చెప్పినట్లు చెయ్యి”  అని చెప్పారు.
     
        Image result for images of sivanesan swamiji

శ్రీసాయిబాబాగారి ఆదేశానుసారం నాభర్త 1987 వ.సంవత్సరం జూన్ నెల 6వ.తారీకు శుక్రవారమునాడు 9 గంటలపాటు ధ్యానంలో కూర్చున్నారు.  కాని ఆధ్యానంలో ఆయనకు ఎటువంటి దర్శనం గాని సందేశం గాని లభించలేదు.

కాని ఆరోజు రాత్రి ఒక సిధ్ధపురుషుడు మావారి కలలో కనపడి “వచ్చే ఆదివారం నేను ఉదయం గం. 10 .00 – గం . 10.30 ని. మధ్య వస్తాను.  నిన్ను ఒకచోటకు తీసుకుని వెడతాను.  నువ్వు నాతోపాటు రా” అని చెప్పి అదృశ్యమయిపోయాడు.

మాకు సన్నిహితంగా ఉండే కొంతమంది సాయిబంధువులని ఆరోజున మాయింటికి రమ్మని ఆహ్వానించాము.  ఆరోజున వారందరూ మాయింటికి వచ్చారు.  నా  భర్త ఉదయం గం.10.20 ని. నుండి సాయంత్రం గం.4.20 ని. వరకు ధ్యానంలో కూర్చొన్నారు.  ధ్యానంలోనుంచి లేచిన తరువాత ధ్యానంలో తాను చూసినవన్నీ వివరించారు. 

ధ్యానంలో నాభర్త వివరిస్తున్న విషయాలు  :

నాఎదుట ఒక సిధ్ధపురుషుడు దర్శనమిచ్చాడు.  అతను చాలా పొడవుగా, మంచి శరీర ఛ్చాయతో ఉన్నాడు. తల, గడ్డం నెరిసిపోయి ఉంది.  ఆయన వదనం ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంది.  ఆయన నన్ను “నువ్వు నాతో వస్తావా” అని అడిగారు.

“స్వామీ,  నాకంతకన్న అదృష్టం ఏముంటుంది” అన్నాను.

ఆతరువాత నేనాయనని అనుసరిస్తూ వెళ్ళాను.  ఎన్నో పర్వతాలను, నదులను, అరణ్యాలను దాటుకుంటూ ఒక గంట పైగా నడిచాము.  నాకు దాహం వేసింది.  స్వామీజీ దాహంగా ఉంది మంచినీళ్ళు కావాలని అడిగాను.  ఆయన దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి తన కమండలంలో నీరు తీసుకునివచ్చి నాకు ఇచ్చారు.  నేను మంచినీళ్ళు త్రాగి “స్వామీ, మీరెవరు?  నాకోసం మీరింతగా కష్టపడుతున్నారెందుకు?  మీ పేరు తెలుసుకోవచ్చా?" అని ప్రశ్నించాను.

అపుడు స్వామీజీ, "నువ్వు నన్ను గుర్తించలేదా?  నేను రాధాకృష్ణస్వామిని” అన్నారు.
                  Image result for images of sri radhakrishna swamiji
వెంటనే నేను ఆయన పవిత్రమయిన పాదాలపై సాష్టాంగపడి “స్వామీ నన్ను క్షమించండి” అన్నాను.  ఆయన నుదుటిమీద చందనం అద్దుకుని దానిమీద కుంకుమ బొట్టు పెట్టుకున్నారు.  చేతిలో జపమాల ఉంది.  మేమక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాము.

ఆతరువాత మేము అరణ్యంలోకి వెళ్ళాము.  అది దట్టమయిన కీకారణ్యం.  సూర్యకిరణాలు కూడా ఆ అరణ్యంలోకి ప్రవేశించలేనంత దట్టంగా ఉంది.  ఆప్రదేశంలో ఒక యోగి ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు.  నేనాయనకి నా ప్రణామాలు అర్పించుకున్నాను.  ఆయన దిగంబరంగా ఉన్నారు. 
                Image result for images of yogi in penance

 నన్ను తీసుకునివచ్చిన స్వామీజీ, “అక్కడున్న నదిలో మనం స్నానం చేద్దాము రా” అని తీసుకునివెళ్ళారు.  మేమా నదిలో స్నానంచేసి మరలా యోగి వద్దకు వచ్చాము.  ఆయన ఇంకా ధ్యానంలోనే ఉన్నారు.  ఆయన ఇంకా కళ్ళు తెరవలేదు.  మేమాయనకు మరొకసారి సాష్టాంగ నమస్కారం చేసుకుని అక్కడినుంచి బయలుదేరాము.

పూజ్యశ్రీ రాధాకృష్ణ స్వామీజీగారు నన్ను మరొక అడవికి తీసుకుని వెళ్ళారు.  అక్కడ ఒక చెట్టుక్రింద ఒక యోగి పద్మాసనంలో కూర్చుని ఉన్నాడు.  అక్కడ ఎంతోమంది సాధువులు, శిష్యులు ఆయోగిని పూజిస్తూ ఉన్నారు.  వాళ్ళలో ఒకరు నన్ను దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి రమ్మని చెప్పారు.  నేను నదిలో స్నానం చేసి తిరిగివచ్చాను.  కాని నాకక్కడ యోగి కనిపించలేదు.  అక్కడ ఉన్న శిష్యులలో ఒకడు ఎవరయితే ఆయోగి పాదుకలను స్పృశించి సాష్టాంగ నమస్కారం చేసుకుంటారో వారి కోరిక నెరవేరుతుందని చెప్పాడు.  నేను ఆశిష్యుడు చెప్పిన విధంగానే చేసాను.

పూజ్యశ్రీ రాధాకృష్ణస్వామిజీగారు నన్ను ఇంకొక ప్రదేశానికి తీసుకుని వెళ్ళారు.  అక్కడ ఒక పెద్ద ఆశ్రమం ఉంది.  అక్కడ ఎంతోమంది మహాపురుషులు వేదాలు చదువుతున్నారు.  అక్కడ నాలుగు లేక అయిదు నదుల సంగమం ఉంది. ఒక యోగి ఆనదీ సంగమంలో స్నానం చేసి వస్తూ కనిపించారు.  ఆయోగి వచ్చి ఒక కుర్చీలో కూర్చొన్నారు.  ఆయన తలపై జుట్టు లేదు.  ఆయన తన శిరస్సు మీదనుంచి శరీరమంతా కాషాయ వస్త్రాన్ని ధరించి ఉన్నారు.  ఆయన మెడలో మూడువరుసల జపమాల ఉంది.  ఆయన ఒక చేతిలో కమండలం, మరొక చేతిలో భిక్షాపాత్ర ధరించి ఉన్నారు.  నుదుటిమీద విభూది రేఖలు ఉన్నాయి.  ఆయన శ్రీఆది శంకరాచార్యులవారిలా కనపడుతున్నారు.  
          
         Image result for images of adi sankaracharya
కొంతసేపటి తరువాత ఆయోగి ఒక పులిగా మారిపోయి అడవిలోకి వెళ్ళిపోయారు.

తరువాత శ్రీరాధాకృష్ణస్వామీజీ నన్ను అక్కడినుండి తీసుకుని వెళ్ళారు.  దారిలో స్వామీజీని “ఆయోగి ఎవరు?  ఆయన పులిగా ఎందుకని మారిపోయారు?” అని ప్రశ్నించాను.  “దాని గురించి నీకు తరువాత తెలుస్తుంది “ అన్నారు శ్రీరాధాకృష్ణస్వామీజీ.  

స్వామీజీ నన్ను మరొక అరణ్యానికి తీసుకునివెళ్ళారు.  అక్కడ నాకొక మహాత్ముడు కన్పించాడు. ఆయన చేతులలో జపమాల, శంఖం, చక్రం ఉన్నాయి.  ఆయన నేను అంతకుముందు చూసిన యోగిలాగానే ఉన్నారు.  ఆయన శిష్యులు ఆయనను స్ఠుతిస్తూ వేదాలు చదువుతున్నారు.  ఆయనకు నైవేద్యం సమర్పిస్తున్నారు.  నేనాయనకు సాష్టాంగ నమస్కారం చేసుకున్నాను.

ఆయన శిష్యులలో ఒకడు నన్ను స్నానం చేసి రమ్మన్నాడు.  ఈసారి నేను ఒక్కడినే వెళ్ళి స్నానం చేసి తిరిగి వచ్చాను.

నాకు శ్రీసాయిబాబా అసలయిన రూపంలో కనిపించారు.  ఆయన కాలుమీద కాలువేసుకుని ఒక రాతిమీద కూర్చుని ఉన్నారు.  ఆయన తెల్లని కఫనీ ధరించి తలకు తెల్లని గుడ్డ చుట్టుకుని ఉన్నారు.  

       Image result for images of shirdisaibaba sitting on stone
మెడలో మాల ఉంది.  ఆయన కళ్ళు నీలంగా ఉన్నాయి.  ఆయన చేతులు చాలా పొడవుగాను, పాదాలు చాలా పెద్దవిగాను ఉన్నాయి.  ఆయన శరీరం సన్నగా లేదు, లావుగాను లేదు.  ఆయన చాలా వృధ్ధునిలా కపడ్డారు.

నేను ఆయన పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు నేననుభవించి ఆపరమానందం నేను మాటలలో వర్ణించలేను.  ఆ ఆనందాన్ని అనుభవించినవాడికే తెలుస్తుంది.  వర్ణించడానికి మాటలు చాలవు.   ఆయన తన అభయహస్తాన్ని మెల్లగా ఆడిస్తూ ఈ సందేశాన్నిచ్చారు.

“త్రికరణ శుధ్ధిగా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా నన్ను నువ్వు పూజించు.  నీకు దివ్యమయిన లక్షణాలు ప్రాప్రిస్తాయి.  చేతిలో ఊదీని తీసుకుని నానామ స్మరణ చేస్తూ రుద్రాక్షమాల మీద చల్లు.  నువ్వు ఈవిధంగా చేసినట్లయితే నీపాప కర్మలన్నీ భస్మమైపోతాయి.”

అపుడు నేను బాబాని అడిగాను “గత జన్మలలో చేసిన పాపకర్మల యొక్క ఫలితాలను మనం అనుభవించవలసినదే అంటారు.  అది నిజమేనా?”

నేనడిగిన ప్రశ్నకి బాబా ఇచ్చిన సమాధానం :

“నువ్వు అటువంటి అనుమానాలను మన్సులో పెట్టుకుంటే నీశ్రధ్ధ అస్థిరమై ఆటంకం ఏర్పడుతుంది.  జ్ఞానం సిధ్ధించాలంటే ధ్యానం ఆవశ్యకం.  ఎల్లప్పుడూ నీమనస్సును నాయందే లగ్నం చేయి.  అప్పుడె నీమనస్సు స్థిరపడుతుంది.  నాభక్తుల బాధలను నివారించడానికి సమాధినుండి బయటకు రమ్మని నన్ను నువ్వు షిరిడీలో అడిగావు.  
                
\                       Image result for images of rare picture of shirdisaibaba samadhi

అది వట్టి పిచ్చి ఆలోచన.  ఎవరి కర్మ ఫలితాలను వారనుభవించక తప్పదు.  గత జన్మలో చేసిన కర్మలు అవి మంచివయినా, చెడ్డవయినా, మంచి, చెడు రెండిటినీ ఈ జన్మలో అనుభవించవలసిందే.  గత జన్మలో చేసిన కర్మను బట్టి నీచమైన జన్మ ఎత్తవచ్చు".

అపుడు నేను బాబాని అడిగాను, “ధ్యానం ద్వారానే ఆత్మజ్ఞానం, భక్తి వల్ల దైవ సంపద (ఆధ్యాత్మిక సంపద) లభిస్తుందని మీరు చెప్పారు.  గత జన్మలో చేసిన కర్మల ఫలితాలను తొలగించలేనపుడు ఇవన్నీ చేసినందువల్ల ఉపయోగమేముంది?  వాటినన్నిటినీ తొలగించుకోవాలంటే ఇంకేమన్న చేయాలా? (ప్రాయశ్చిత్తం). మిమ్మల్మి పూజించడం వల్ల, ధ్యానించడం వల్ల ఉపయోగమేమిటి?"

అపుడు బాబా నవ్వి,  “పిచ్చివాడా,  మనఃస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందితే కర్మ ప్రాబల్యం తగ్గుతుంది.  కర్మ ఫలితాన్ని తగ్గించుకోవడానికి పశ్చాత్తాపానికంటే తగినది ఇంకేమీ లేదు.  పుణ్యక్షేత్రాల సందర్శనం, పవిత్ర నదులలో స్నానమాచరించడం, వీటి వల్ల కొంత కర్మ తగ్గుతుంది.  సిధ్ధపురుషుల సమాధులను దర్శించినందువల్ల కొంత కర్మ తగ్గుతుంది.  ఈ ప్రదేశాలన్నిటియందు వారు సంచరించినందువల్ల వాటికి ఎంతో పవిత్రత ఏర్పడుతుంది. వారు సంచరించిన ప్రదేశాలు ఎంతో పవిత్రమయినవి.  సత్ఫురుషుల, యోగుల సమాధులను దర్శించినందువల్ల ఆత్మజ్ఞానం (ఆత్మ సంపూర్ణత) సిధ్ధిస్తుంది.  మహాపురుషులందరూ సమాధి చెందారు కాబట్టి,  వారెవరూ జ్ఞానాన్ని ప్రసాదించలేరనే అనుమానం వద్దు.  ఈ విశ్వంలో నేనంతటా వ్యాపించి ఉన్నాను.  ఎవరయితే నన్ను సదా ప్రార్ధిస్తూ ఉంటారో  వారు నాతో సమానమవుతారు”.

“నేను బాబాని ఇంకా చాలా విషయాలు అడుగుదామనుకున్నాను.  కాని ఆయన మవునంగా ఉండిపోయారు.  బాబాకు సాష్టాంగపడి నమస్కారం చేసుకున్నాను.  "నీలక్ష్యం నెరవేరింది.  ఇంక మనం వెళ్ళిపోదాము" అన్నారు శ్రీరాధాకృష్ణస్వామీజీ.

కొంతదూరం నడచిన తరువాత శ్రీరాధాకృష్ణ స్వామీజీ ఒక సర్పంగా మారిపోయి ఒక నది ఒడ్డున అదృశ్యమయ్యారు.  ఆతరువాత నేను ఈలోకంలోకి వచ్చాను."

మాయింట్లో ఉన్న సాయిబంధువులందరికీ మావారు తన అనుభవాన్నంతా వివరించి చెప్పారు.

(రేపటి సంచికలో షిరిడీలో సాయి చూపించిన అద్భుత
లీలలు --  నీకంత పొగరుగా ఉందా? బాబాప్రసాదాన్ని
నాకు పెట్టు అని ఉమామహేశ్వరరావుగారిని ఎవరు అన్నారు?)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)





Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List