Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, May 31, 2018

శ్రీ స్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ –20 వ.భాగమ్

Posted by tyagaraju on 5:05 PM

        Image result for images of shirdi sai baba
        Image result for images of rose hd

31.05.2018 గురువారమ్

ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి 
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ స్వామీజీ భక్తులతో జరిపిన అనుగ్రహ భాషణమ్ –20 .భాగమ్
 తెలుగు అనువాదమ్ :  ఆత్రేయపురపు త్యాగరాజు


అట్లాంటా (యూ ఎస్ )  -  ఫోన్ : 1 571 5947354

18.12.1971  :  రోజు స్వామీజీ హిందూమతంలోని కర్మ సిధ్ధాంతం  గురించి వివరించారు.  ఎవరయినా సరే కర్మను, ప్రారభ్ధాన్ని అనుభవించవలసినదే అంటారు.  దానియొక్క భావం ఏమిటి?  ప్రతీదీ కర్మసిధ్ధాంతం ప్రకారమే జరుగుతుందని భావిస్తే మరి మోక్షం సంగతి ఏమిటి?  అష్టావక్ర గీతలో 



           Image result for images of ashtavakra gita
             Image result for images of ashtavakra gita telugu
మనస్సుని ఐహిక బంధాలనుండి తప్పించి భగవంతునితో బంధాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగిపో అని చెప్పబడింది.  నువ్వే ఆత్మవని తెలుసుకో అని బ్రహ్మజ్ఞానులు చెబుతారు.  భగవంతుడు సర్వాంతర్యామి. నీలో ఉన్నాడు, నాలోను అందరిలోను ఉన్నాడు.  అందుచేతనేనే భగవంతుడను అనే మాటని నువ్వెందుకు అంగీకరించవు.

వాస్తవంగా మనలని భగవంతునినుంచి వేరు చేసేదేమిటి?  అహంకారమే మనలని భగవంతునినుంచి దూరం చేస్తూ ఉంది.  ఎపుడయితే అహంకారం తొలగిపోతుందో నేను అనేది కూడా తొలగిపోయి దాని స్థానంలో యదార్ధమయిన నేను ప్రకాశవంతమవుతుంది.  వాస్తవమయిననేను అన్నదిఅంతా భగవంతుడే నిర్వహిస్తాడు అని మనకు బోధిస్తుంది.  తనను తాను తెలుసుకున్నవాడు అనగా తనలోనే భగవంతుడు నివస్తిస్తున్నాడని పరిపూర్ణమయిన నమ్మకంతో ఉన్నవాడు భగవంతునితో సమానంగా జీవిస్తాడు.  అందుచేత మనం దేనియందూ ఆసక్తిని పెంచుకోకుండా నిర్లిప్తంగా జీవించాలి.  ఆవిధంగా అభ్యాసం చేయాలి.   మనలోని అహంకారాన్ని పూర్తిగా రూపుమాపుకోవడానికి మన శాయశక్తులా ప్రయత్నించాలి.  దానికోసం మనము ఎమ్., పి.హిచ్ డి లాంటి పెద్ద పెద్ద చదువులు ఏమీ చదవనసరంలేదు.  భగవంతుని అనుగ్రహం ఉంటే చాలు.  మన మనస్సును, బుధ్ధిని స్థిరంగా ఉంచుకుని అహంకారం మన దరి చేరకుండా మనకి మనమే కాపాడుకుంటే భగవదనుగ్రహం తప్పక కలుగుతుంది.  మనకి ధైర్యం, భగవంతుని మీద పరిపూర్ణమయిన నమ్మిక ఉండాలి.  స్వామి వివేకానందులవారికి రెండూ ఉన్నాయి.
                   Image result for images of vivekananda
సులభమయిన మార్గం భగవంతునిమీద భక్తి కలిగి ఉండటం.  భగవంతుడు భక్తుడు కోరుకొన్న రూపాన్ని సంతరించుకుంటాడు.

( సందర్భంగా మీకు ఒక కధ చెబుతాను.  నేను కొన్ని సంవత్సరాల క్రితం చదివిన కధ.

ఒకసారి ఒక పశువుల కాపరి అడవిలో పశువులను తోలుకుంటూ వెడుతున్నాడు.  అతనికి దారిలో ఒక పండితుడు ఎదురయాడు.  పండితుడు మంచి పట్టు బట్టలు, మెడలో రుద్రాక్షలు, నుదుటిన పెద్ద బొట్టుతో ఉన్నాడు.  చూడగానే అతను ఎంతో మహానుభావుడని భావించిన పశువుల కాపరి ఆయనతో,  స్వామీ మీరు చాలా గొప్పవారిలా ఉన్నారు.  నాకు దేవుడిని చూడాలని ఉంది.  చూపిస్తారా?” అని అడిగాడు.

పశువుల కాపరి ప్రశ్నకి పండితుడు పకా పకా నవ్వి ఎన్నో శాస్త్రాలను చదివాను, ప్రతిరోజు దేవుడిని పూజిస్తూ ఉన్నాను.  నావంటివానికే  కనపడని  ఆ దేవుడు నువ్వు అడిగిన వెంటనే కనిపిస్తాడా, వెళ్ళు వెళ్ళు,” అన్నాడు.

కాని పశువుల కాపరి తన పట్టు వదలలేదు.  మీరు అంత గొప్ప గొప్ప శాస్త్రాలు చదివిన వారు కదా, మీకు దేవుడు కనపడకపోవడమేమిటి,  నాకు కృష్ణుడిని చూడాలని ఉంది.  నాకు ఆయన కనిపించేయాలా చేయండి ,  నాకు మంత్రాన్ని ఉపదేశించండి అని కాళ్ళా వేళ్ళా పడ్డాడు.  వాడు పట్టిన పట్టు విడవకపోయేసరికి ఆవ్యక్తి  సరే అని కృష్ణుడు బొల్లి మచ్చలతో ఉంటాడు.  బొల్లి గద్దనెక్కి తిరుగుతూ ఉంటాడు.  అందుచేత నువ్వు బొల్లి మచ్చల కృష్ణయ్యా, బొల్లి గద్దనెక్కి రావయ్యా అంటూ ఉండు.  ఆయన నీకు కనిపిస్తాడు అని చెప్పి తన దారిన తాను పోయాడు.

పశువుల కాపరికి పండితుడు చెప్పిన మాటల మీద పరిపూర్ణమయిన నమ్మకం కలిగి ఆయన చెప్పిన మాటే మంత్రంలా భావించి ఏకాగ్ర చిత్తంతోబొల్లి మచ్చల కృష్ణయ్యా, బొల్లి గద్దనెక్కి రావయ్యా అంటూ జపం చేసుకుంటూ ఉన్నాడు.  కొంత సేపటికి ఆకాశంనుండి శ్రీకృష్ణపరమాత్మ బొల్లి గద్దనెక్కి బొల్లిమచ్చల కృష్ణుడిగా అతనికి దర్శనమిచ్చాడు.  పశువుల కాపరి ఎంతగానో సంతోషించాడు.  కొన్నాళ్ళ తరవాత మరలా  దారిలో పండితుడు కనిపించగానే సంతోషంతో తనకు కృష్ణ దర్శనం కలిగిన సంగతి చెప్పాడు.  మొదట పండితుడు నమ్మకపోయినా పశువుల కాపరి చెప్పినదానిని బట్టి నమ్మక తప్పలేదు.  తను చేసిన పనికి చాలా సిగ్గుపడ్డాడు.  ఎన్నో శాస్త్రాలను చదివాను గాని నీకున్నంత పరిపూర్ణమయిన విశ్వాసం, నమ్మకం నాకు లేకపోవడం వల్లనే నాకింతవరకు భగవంతుని దర్శనం కలగలేదు, నువ్వు చాలా అదృష్టవంతుడివి అని అతని కాళ్ళమీద పడి నమస్కరించాడు. ఇక్కడ పశువులకాపరికి పండితుడు చెప్పిన మాట మీద విపరీతమయిన గురి ఏర్పడింది.  నిజంగా కృష్ణుడు బొల్లిమచ్చలతోనే ఉంటాడని భావించాడు.  ఆయన వాహనం గద్ద కూడా బొల్లి మచ్చలతోనే ఉంటుందని నమ్మకంతోనే కృష్ణుడిని దర్శనాబిలాషతో కీర్తించాడు.  ఆతని భావానికి తగ్గట్ట్లుగానే దర్శనమిచ్చాడు కృష్ణుడు.  -----   త్యాగరాజు)

జ్ఞానమార్గం ద్వారా కాని, భక్తి మార్గం ద్వారా కాని మనం భగవంతుని తెలుసుకోగలం.  కాని జ్ఞానమార్గమే ఉత్తమమయినది.  కాని మనం భగవంతుని గురించి తెలుసుకోవడం మాత్రం తప్పకుండా చేయవలసినదే.  మనలో సుఖానుభోగం గురించిన ఆలోచన  ఏకాస్త  ఉన్నా మనకి పునర్జన్మ తప్పదు.


తనను తాను తెలుసుకున్న వ్యక్తి తానే దేవుడినని చెప్పినట్లయితే అది అహంకారంతో చెప్పిన మాట కాదు.  గొప్ప గొప్ప యోగీశ్వరులు కూడా భగవంతుని గురించి అన్వేషణ చేయనవసరంలేదని చెప్పారు.  ఆయన నీ హృదయంలోనే ఉన్నాడు.  అటువంటప్పుడు ఆయన గురించి మనం ప్రతిచోట వెతకనక్కరలేదు.  ఎక్కడ ఉన్నాడో కనుగొనాలి.  మన హృదయంలోనే భగవంతుడు నివాసం ఏర్పరచుకొని ఉంటే యాత్రలు చేసి పుణ్యస్థలాలకు వెళ్ళడమెందుకు?  ఆధ్యాత్మిక సాధనలో భాగంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు.  భగవంతుని ప్రాప్తి లభించిన తరువాత పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనే ఆలోచనలు, సాధనలు ఏమీ అవసరం లేద్లు.  తీర్ధ యాత్రలకు సంబంధించి మరొక అంశం కూడా ఉంది.  కామ, క్రోధ, మద, మాత్సర్యాలను త్యజించకుండా తీర్ధయాత్రలు చేసినందువల్ల ఎటువంటి ఉపయోగము లేదు.


19.12.1971  :  ఆధ్యాత్మికపరంగాను,  ఆరోగ్యపరంగాను మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో రోజు స్వామీజీ వివరించారు.  మనము మితాహారాన్ని తీసుకోవాలి.  ఆధ్యాత్మిక సాధనకి అనుగుణంగా మన శరీరానికి తగినట్లుగా ఉండటానికి పాల సంబంధమయిన పదార్ధాలు మజ్జిగ, పాలు, నెయ్యి, వెన్న ఇవి చాలు.  వీటనన్నిటినీ మనకు ప్రసాదించిన గోమాతే మనలను భగవంతుని వద్దకు చేర్చే బాధ్యత వహిస్తుంది.  సాత్వికాహారం తీసుకోవడం కూడా ముఖ్యమయినదే.  అనగా మనం కారం ఎక్కువగా ఉన్న పదార్ధాలను విసర్జించాలి.  కారంతో కూడినటువంటి ఆహారాన్ని స్వీకరించినందువల్ల రక్తం మరిగి మనం ఉష్ణంతో బాధపడవలసి వస్తుంది.

20.12.018  :  స్వామీజీ రోజు భక్తియొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. 
                 Image result for images of sant eknath
తీవ్రమయిన భక్తి అత్యంతావశ్యకం.  తీవ్రమయిన భక్తికి ఏకనాధుడు ప్రతీక ఆయన ఒక గొప్ప సాధువు.  ఏకనాధుడు తన గురువయిన జనార్ధనస్వామి వద్ద జమా ఖర్చులు, పద్దులు రాసేవానిగా పని చేసేవాడు.  రాత్రి నిద్రపోయేముందు జమాఖర్చులు అన్నీ లెక్క చూసి అంతా సరిపోయిన తరువాతనే నిద్రించేవాడు.  ఎప్పుడయినా లెక్కలో తేడా వస్తే తిండి కూడా తినకుండా లెక్క సరిపోయేంతవరకు కూర్చునేవాడు.  ఒకరోజున ఎంతగా లెక్కలు చూసినా పద్దులో లెక్క తేడా వచ్చింది.  చాలా శ్రమపడి చూస్తూ కూర్చున్నాడు.  గురువుగారి భార్య అతని అవస్థను చూసి తన భర్తకు చెప్పింది.  ఆసమయంలో ఏకనాధుడు ఇంకా లెక్కలతో కుస్తీ పడుతూనే ఉన్నాడు.  ఒక్కసారిగా, దొరికింది అని ఆనందంతో అరిచాడు.  లెక్కలో తేడా ఎక్కడ వచ్చిందొ కనిపెట్టాడు.  ఉన్న తేడా ఒక్క పైసా మాత్రమే.  అపుడు గురువు అతని వద్దకు వచ్చిఇదే విధంగా నువ్వు పట్టుదలతో భగవంతుని మీద  ఏకాగ్రతతో దృష్టిని నిలిపినట్లయితే భగవంతుని ప్రాప్తి నీకు కలిగి ఉండేది  అన్నాడు.  ఏకనాధుని గురువయిన జనార్ధనస్వామి పండరీపూర్ విఠలునికి గొప్ప భక్తుడు. ఆక్షణంనుంచి ఏకనాధుడు తనకు విఠలుని దర్శనభాగ్యం కలిగించమని తన గురువుని ఒత్తిడి చేసి అడుగుతూ ఉండేవాడు.  సరియైన సమయం వచ్చినపుడు విఠలుడే దర్శనమిస్తాడని ఏకనాధుడిని ఓదార్చేవాడు.  జనార్ధనస్వామి కూడా ఏకనాధుడిని దయతో అనుగ్రహించి దర్శనమివ్వమని తను కూడా విఠలుడిని ప్రార్ధించేవాడు.  ఆయన ప్రార్ధనకు మెచ్చి విఠలుడు ఏకనాధుడికి మూడుసార్లు దర్శనమిచ్చాడు.  కాని ఏకనాధుడు మూడవసారి మాత్రమే విఠలుడిని గుర్తించాడు.  మొట్టమొదటగా విఠలుడు ఒక ముస్లిమ్ ఫకీరుగా  కనిపించాడు.  తరువాత మూడు శునకాలను పట్టుకుని ఒక సాధువుగా (దత్తాత్రేయుడు) దర్శనమిచ్చాడు.  సారి కూడా ఏకనాధుడు భగవంతుడిని గుర్తించలేకపోయాడు. ఆఖరికి విఠలుడు ఒక గురువు రూపంలో గుఱ్ఱం మీద కూర్చుని దర్శనమిచ్చాడు. వెంటనే ఏకనాధుడు తాను భగవంతుడిని గుర్తించగలిగేలా చేయమని ప్రార్ధించాడు.

గురువు తను నములుతున్న తాంబూలాన్ని ఏకనాధుని చేతిలో ఉమ్మి, దానిని తినమన్నాడు.  ఈసంఘటన  సారాంశం ఏమిటంటే ఏకనాధుని మనసు ఏకాగ్రతతో ఉన్నదా లేదా అని పరీక్షించడానికే.

విధంగా ఏకనాధుడికి విఠలుని దర్శన భాగ్యం కలిగింది.  దీని ద్వారా మనం గ్రహించవలసినది ఏమిటంటే మన మనసులో కొంత భాగం భగవంతుని కోసం కేటాయించాలి.   అందువల్ల సమయం వచ్చినపుడు మనం భగవంతుని చేరుకోగలం.  కాస్తంత ఏకాగ్రతతోనయినా ఎంతమంది భగవంతుని మీద భక్తిని నిలుపుకొంటున్నారు?  నిర్మలమయిన మనసు కలవారు  మాత్రమే దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆయన అవతరించడానికి గల కారణమేమిటి, ఆయనను తెలుసుకోవడం ఎలా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతారు.  ఇటువంటి ప్రశ్నలను లేవనెత్తడమనేది మంచి పధ్ధతి కాదు.  చక్కగా సాధన చేసి ఆయన గురించి తెలుసుకోవాలి.   ఆవిధంగా సాధనద్వారా తెలుసుకోవాలంటే నిర్మలమయిన మనస్సు, బుధ్ధి ఉండాలి.  లేకపోయినట్లయితే భగవంతుడిని తెలుసుకోవడానికి చాలా కాలం పడుతుంది.  సంసార సముద్రాన్ని దాటాలంటే భక్తి ఒక్కటే మార్గం.  సంసారం అంటే మనలో ఉన్న ప్రాపంచిక ఆలోచనలే.  ఏకనాధుడు గృహస్ఠాశ్రమ జీవితాన్ని గడుపుతూనే ఏకాగ్రచిత్తంతో భగవంతుడిని ఏవిధంగా చేరుకోవాలో చూపించాడు.  భక్తి మార్గమనేది చాలా సులభంగా కనిపించచ్చు గాని, దానికి నిరంతర సాధన అవసరం.  అపుడే నడక నేర్చుకుంటున్న పిల్లవాడు పడుతూ లేస్తూ ఏవిధంగానయితే బాగా నడవడం నేర్చుకుంటాడో, నిజమయిన భక్తుడు కూడా భగవంతుని మీద ఏకాగ్రత సాధించడానికి నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలి.  ఆవిధంగా చేసినట్లయితే భగవంతుని గురించి తప్పక తెలుసుకోగలుగుతాడు  హృదయంలో కలిగిన ప్రేరణతోనే నిజమయిన భక్తి ఉధ్భవిస్తుంది.
  
(స్వామీజీగారి భాషణాలు ఇంకా ఉన్నాయి)

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)





Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List