25.11.2019 సోమవారమ్
ఓమ్ సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు భువనేశ్వర్ నుండి శ్రీమతి మాధవిగారు, సాయిలీల మాసపత్రికనుండి అనువాదం చేసి పంపించిన బాబా ఊదీ లీలను ప్రచురిస్తున్నాను.
ఊదీ మహిమ
" ఓం సాయి రాం" సాయి బంధువులందరికి.మాలతి
గారు,మహారాష్ట్ర నుంచి,తనకు బాబా తో కలిగిన అనుభవాన్ని ఇలా మనతో
పంచుకుంటున్నారు.
బాబాగారి విభూతి సర్వరోగ నివారిణి అని ఆవిడకు బాబా కలిగించిన అనుభవం ఇది.ఆవిడ మాటల్లో నే
విందాము...
"అవి గణేష్ చతుర్థి పండగరోజులు. మా మహారాష్ట్ర వాళ్లకు చాలా పెద్ద పండగ. మేమంతా పండగ సందడిలో ఉన్నాము. ఒకరోజు రాత్రి నా వీపు పైన చిన్న గుల్ల లేచింది. కొంచెం దురద,మంట ఉండేది. అదే పోతుందిలే అనుకున్నాను. చూడగా,చూడగా..అది పెద్ద పుండు రూపం దాల్చింది. చాలా మంటగా
ఉండేది. ఎటూ పడుకోలేక పొయేదాన్ని. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను.
ఆపరేషన్
చెయ్యాలి,అన్నారు. నాకు ఆపరేషన్ అంటే చాలా భయం. 81 సంవత్సరాల వయసు నాకు. ఇంక ఈసారి గణేష్ పూజ చేయలేను అనుకున్నాను. వచ్చే సంవత్సరం ఉంటానో లేదో తెలీదు. అన్ని మార్గాలు మూసుకున్నా, బాబా మార్గం తెరిచివుంటుంది అందరి కోసం. అప్పుడు బాబాకు సర్వస్యశరణాగతి చేసుకున్నాను." బాబా,నువ్వే మార్గం చూపాలి,ఎలా చేస్తావో నాకు తెలీదు" అని అనుకుంటూవుండగానే
సాయిలీల పుస్తకం సంస్థానం వాళ్ళ నుంచి వచ్చింది. ఆ పుస్తకంలో నుంచి విభూతి పేకెట్ ఒకటి క్రింద పడింది. మరి ఎలా వచ్చిందో, నాకు తెలీదు ఆ పుస్తకంలో అన్నీ బాబా విభూతి లీలలే ఉన్నాయి. అంటే,బాబా నాకు విభూతి పూసుకో,బాగా అవుతుంది..అని చెపుతున్నట్లనిపించింది..వెంటనే నా వీపు మీద పుండుకు విభూతి
పుయ్యమని నా కోడలికి చెప్పాను. అంతే,రెండు సార్లు పూసుకున్నాను, అంతే..పుండు మచ్చ కూడా లేదు.మళ్ళీ డాక్టర్
దగ్గరికి వెళ్లి చూపించాను. డాక్టర్ ఆశ్చర్యపోయాడు. పిన్నిగారు,
మీ వీపు మీద
పుండు మాయం అయింది" అన్నాడు. నాకు ఎంత ఆనందం అయివుంటుందో,మీరే ఊహించండి. నా గౌరిగణపతి పూజ నిర్విఘ్నంగా గడిచి
పోయింది. ఇంతకూ నేను చెప్పబోయేది ఏమిటి అంటే, ఏదైనా దైవకార్యం చెయ్యాలంటే, బాబా సదా సర్వదా తోడుగా వుంటారు. లేకుంటే,ఎప్పుడూ బాబా,బాబా..అనే నేను విభూతి గురించి మర్చేపోయాను. బాబానే గుర్తుచేశారు. నన్ను బాగుచేశారు. సాయిగణేశుని పూజ బాగా జరిగింది.. ఇది నా అనుభవం ,బాబా కలిగించిన ఆనందం."
ఇదండీ మాలతి గారి కథ.
"సర్వం సాయి నాధార్పణ మస్తు." మాధవి.
(సర్వం శ్రీసాయినాధార్పనమస్తు)
6 comments:
పరమం పవిత్రం బాబా విభూతిమ్.పరమం విచిత్రం లీల విభూతిమ్. ధన్యవాదాలు..
ఓం సమర్థ సాయి నాథాయ నమః
సర్వం సాయి నాథార్పణమస్తు
Mahima gala sai naathuni leela leela amogham
Sri sainath maharajki jai
Sri sainath maharajki jai
Post a Comment