23.04.2020 గురువారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబా వారి శుభాశీస్సులు
శ్రీ సాయి సత్ చరిత్రకు అందని రహస్యాలు 3వ.భాగమ్
26.01.2020 -- ప్రేమ వివాహాలు
నేటి యువత ప్రేమల పేరిట కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేసుకొని తమ జీవితాలను నాశనము చేసుకొనుచున్నారు. ఇది నాకు చాలా బాధ కలిగించుచున్నది.
నా సలహా ఏమిటంటే తమతమ సాంప్రదాయాలలో పెద్దల అనుమతితో వివాహాలు చేసుకుని సుఖవంతమయిన జీవితాన్ని గడపండి.
పూజారి తన కూతురయిన గౌరికి వివాహం చేయదలచి, వీరభద్రుని వెంటబెట్టుకుని బాబా వద్దకు వచ్చాడు. ఇద్దరికీ నక్షత్రం, గోత్రం, వంశం అన్నీ కుదిరాయి. మంచి ముహూర్తం చూసి ఇద్దరికీ వివాహం జరిపించమని చెప్పారు.
28.01.2020 -- భగవంతుని వెదకుట
నేను నా ఇద్దరు స్నేహితులతో కలిసి సముద్ర తీరానికి వెళ్ళాను. సముద్ర తీరాన ఉన్న మడచెట్ల (సముద్ర ఉప్పునీటిలో పెరిగే చెట్లు) అడవులలో తిరగసాగాము.
నా స్నేహితులలో ఒకడు ధనవ్యామోహము కలవాడు. ఇంకొకడు స్త్రీ వ్యామోహము కలవాడు. నేను భగవంతుని సముద్రతీరంలో చూడాలని అర్ధనగ్నముగా సముద్రతీర జలాలలో నడవసాగాను. నా ఇద్దరు మిత్రులు నన్ను వదలివేశారు.
నేను ఒంటరిగా సముద్రపు తీరం వెంబడి నడవసాగాను. అక్కడ ఒక గుడిసెలో ఒక జాలరి నన్ను ప్రేమతో పిలిచి నాకు చేపలకూర, రొట్టె పెట్టాడు. నా ఆకలి తీరింది. ఆ గుడిసె బయట సముద్ర తీరములో రాతిగుట్టల మీద కూర్చుని భగవంతుని గురించి తపస్సు చేసాను. నా గురువు షిరిడీ సాయి దర్శనము ఇచ్చి, నా వెన్ను తట్టి, నన్ను లేపి నీకు త్వరలోనే భగవంతుని దర్శనము లభించుతుంది అని ఆశీర్వదించి నన్ను నా ఇంటికి పంపివేశారు.
నా విశ్లేషణ - శ్రీసాయి సత్ చరిత్ర 32వ.ధ్యాయాన్ని ఒకసారి గమనిద్దాము. అందులో బాబా వివరించిన సంఘటన ---
నలుగురు స్నేహితులము భగవంతుని అన్వేషిస్తూ అడవిలో తిరుగుతున్నాము. మార్గంలో ఒక బంజరి కలిసి ఎఱ్ఱటి ఎండలో దేనినిమిత్తం వెడుతున్నారని, రహస్యం మంచిది కాదు, స్పష్టంగా చెప్పమని అడిగాడు. కాని, అతనితో అసలు విషయం వెల్లడించలేదు. అపుడతడు రహస్యాన్వేషణ నాతో చెప్పకపోయినా పరవాలేదు, కాస్త రొట్టె తిని, నీరు త్రాగి వెళ్ళమని చెప్పినా వినకుండా బయలుదేరారు. ప్రేమతో తినడానికి పెట్టినదానిని తిరస్కరించి వ్యర్ధంగా అడవిలో తిరిగి తిరిగి వచ్చిన వారికి మరలా దైవవశాత్తు బంజరి వారిని కలిసాడు. దేనికయినా ఈశ్వర సంకల్పముండాలి. వడ్డించిన పళ్ళెమును తిరస్కరించరాదు. అన్నంపెట్టి తినమని ఎవరు అంటారో వారి వచనం పూర్ణ శుభశకునమని, తలపెట్టిన కార్యం నిర్విఘ్న కారకమవుతుందని తలచాలి. అని ఆ బంజరి వారికి హితోపదేశం చేసాడు.
29.01.2020 – నేటి పాఠశాలలు - ఉపాధ్యాయులు
నేటి పాఠశాలలలో ఉపాధ్యాయులు అహంకారముతో పిల్లలను మానసికముగా శారీరకముగా హింసించుతూ భయబ్రాంతులను చేయుచున్నారు. కొందరు ఉపాధ్యాయులు బడిలో కీచకులుగా మారి ఆడపిల్లలను మానసికముగా, శారీరకముగా హింసించుతున్నారు. అటువంటి ఉపాధ్యాయులను సమాజము ఏరివేసి, పాఠశాలలను పవిత్ర వారావరణములో నెలకొల్పాలి. నేటి పాఠశాలలలోని పిల్లలు రేపటి మన భావితరానికి మంచిపౌరులుగా ఎదగాలని కోరుకొందాము.
విశ్లేషణ -- శ్రీ సాయి సత్ చరిత్ర 32 వ. అధ్యాయములో బాబా చెప్పిన మాటలు…
“నాగురువు నన్ను ఒక బావివద్దకు తీసుకుని వెళ్ళి, నా రెండు కాళ్ళకు తాడు కట్టి బావిలోనికి తలక్రిందులుగా వ్రేలాడదీసి తాను ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆ తరువాత వచ్చి, నన్ను పైకి తీసి ఎలా ఉందని అడిగారు. నేనత్యంత ఆనందాన్ననుభవించానని చెప్పాను.
పక్షులు తమ పిల్లలను చూచుకునే రీతిగా నా గురువు నన్ను ప్రేమతో చూచేవారు. వారి బోధన పధ్ధతి ఎంతో మధురమయినది. తలచుకుంటే ప్రేమ ఉప్పొంగుతుంది. నా గురువు మెడకు పెనవేసుకుని వారి కళ్ళలో ఉండిపోవాలనిపించేది. వారి ప్రతిబంబం కళ్ళలో లేకపోతే ఆకళ్ళు వట్టి మాంసపుగోళాలు. అది అటువంటి పాఠశాల. అందులో అడుగుపెట్టి, వెనుకకు తిరిగిపోయే దురదృష్టవంతుడు ఎవడూ ఉండడు. నా ఇల్లు, వాకిలి, తల్లి తండ్రి నా సర్వం నాగురువే. నాదృష్టియొక్క ధ్యానమంతా ఒక్క గురువుపైనే. గురు స్వరూపాన్ని ధ్యానం చేస్తే మనోబుధ్ధులు కుంఠితమైపోతాయి. అందువలన మౌనంగా వారికి వందనం చేయాలి. అనుభవజ్ఞానం లేనివారి శిక్షణ వ్యర్ధం. అట్టి గురువు వ్యర్ధంగా వాగటానికి తప్ప మరెందుకు పనికివస్తాడు?
నా గురువు నన్నెటువంటి సేవలో వినియోగించారంటే నేను వేరే గురువును వెదకుకునే అవసరం లేకుండా, శ్రమపడి వేరే పరిశోధనలేవీ చేసే అవసరం లేకుండా నాకు జ్ఞానాన్ని ప్రసాదించారు.
(సమాప్తం)
(సమాప్తం)
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు)
(రేపటి సంచికలో శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలకు బాబా సమాధానాలు ప్రచురిస్తున్నాను...త్యాగరాజు)
(రేపటి సంచికలో శ్రీ సాయి సత్ చరిత్రలో నాకు కలిగిన సందేహాలకు బాబా సమాధానాలు ప్రచురిస్తున్నాను...త్యాగరాజు)
0 comments:
Post a Comment