15.10.2021 శుక్రవారమ్
ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయిబంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఊదీ ప్రభావమ్
మరలా రెండున్నర నెలల తరువాత మన బ్లాగులో ప్రచురణ చేయడానికి సమయమ్ దొరికింది. ముందుగా
బాబాకు క్షమాపణలు వేకుంటున్నాను. ఈ మధ్య మన బ్లాగులో ఏమీ ప్రచురించడం లేదేమిటి అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న భక్తులను నిరాశ పరుస్తూ వచ్చాను.
కాని
కుటుంబ వ్యవహారాల వల్ల అనువాదాలు చేయలేని పరిస్థితిలో ఉన్నాను.
పాఠకులు
కొందరు నన్ను అడగడం కూడా జరిగింది.
బాబా
యే వారి ద్వారా నన్ను హెచ్చరించినట్లుగా భావిస్తూ ఈ రోజు మరలా ప్రచురిస్తున్నాను.
ఓమ్
సాయిరామ్
103
సంవత్సరాల క్రితం బాబా సరిగా ఇదే రోజున మహాసమాధి చెందారు.
ఈ
విషయం మన సాయిభక్తులందరికి తెలుసు గాని మరొక్కమారు జ్ణప్తికి తెస్తున్నాను.
ఇక
ఈ రోజు బాబా ఊదీ మహాత్మ్యం ఎటువంటిదో తెలిపే సంఘటనతో ప్రారంభిస్తున్నాను.
శ్రీ
వై . నాగార్జునరావు, హైదరాబాద్ వారు వివరిస్తున్న
ఈ
లీల శ్రీ సాయిలీల ద్వైమాసపత్రిక జూలై – ఆగస్టు, 2021 సంచికలో ప్రచురింపబడింది.
ఆంగ్ల మూలమ్ – శ్రీ జ్యోతి రంగన్ రావుత్, ముంబాయి
హిందీ
అనువాదమ్
– శ్రీ వినయ్ ఘాస్ వాలా
తెలుగు అనువాదమ్ – ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట, హైదరాబాద్
1970 వ.సంవత్సరంలో నేను నా స్వంతపని మీద ముంబాయి వెళ్లవలసివచ్చింది. ముంబాయిలో అది నామొట్టమొదటి సమావేశం. ఆవిధంగా ముంబాయిలొ ఉన్న రోజులలో అక్కడ చుట్టుప్రక్కల ఉన్న ఎన్నో దర్శనీయ స్థలాలకు వెళ్ళే అవకాశం లబించింది.
ఈ
లోపు షిరిడి వెళ్ళి సాయిబాబా సమాధిని దర్శించుకుందామనే భావం అనుకోకుండా నా మదిలో ఉత్పన్నమయింది.
ఈ
భావం భక్తివల్ల మాత్రం కాదు. ఒక విధంగా అప్పటికప్పుడే వెళ్ళి వద్దామనే ఆలోచన.
కాని
మనం అనుకున్న విధంగా ఏమీ జరగవు.
అమెరికానుండి
మా బావమరిది బొంబాయి వస్తున్నడనే వార్త తెలిసింది. అందుచేత
నా షిరిడీ ప్రయానం మానుకోవలసి వచ్చింది.
నేను
చాలా హతాశుడినయ్యాను.
మనసులోనే
బాబాను ప్రార్ధించుకోవడం మొదలుపెట్టాను.
“బాబా
మీరే కనక భగవంతుడయినట్లయితే షిరిడీకి వచ్చే అవకాశాన్ని నాకు ప్రసాదించండి” అని ప్రార్ధించుకున్నాను.
ఈలోపుగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది.
కారణాంతరాలవల్ల మా
బావమరిది ప్రయాణం కొన్ని రోజులు ఆలశ్యమవుతుందనే సమాచారం వచ్చింది.
ఈ
సంఘటన వల్ల నాలో సాయిబాబా మీద భక్తి బీజం మొలకెత్తింది.
ఇక
నాకు షిరిడీ దర్శనభాగ్యం కలగబోతోంది
షిరిడీ
ప్రయాణంలో నాకు సహాయపడె వ్యక్తి ఎవరయినా ఉన్నారా అనే ఆలోచనలో పడ్దాను.
అంధేరీ నుండి దాదర్ కి లోకల్ రైలులో వెడుతుండగా ఊహించనివిధంగా ఒక సాయిభక్తునితో పరిచయం కలిగింది.
షిరిడీ
యాత్ర గురించి అన్ని విషయాలు అతనినుంచి తెలుసుకోవచ్చని భావించాను.
అతను
నాకు షిరిడీ యాత్రగురించి అన్ని వివరాలు చెప్పాడు.
ఈ విధంగా నేను ముందుగా అనుకున్న ప్రకారం సాయిబాబా నాకోరికను తీర్చారు.
షిరిడీ చేరుకున్నాక స్నానాదులన్నీటినీ పూర్తి చేసుకుని బాబా దర్శనానికి బయలుదేరాను.
బాబాని
దర్శించుకున్నంతనే
నామనస్సంతా ఆనందంతో నిండిపోయింది.
ఒక్క
క్షణంలో షిరిడిలోని ప్రతివస్తువు సాయి స్పర్శతో నిండిపోయినట్లనిపించింది. బాబాను
దర్శించుకుని, ప్రపంచమంతా సుఖ సంతోషాలతోను శాంతితోను నిండి ఉండాలని ప్రార్ధించాను.
ఆ
తరువాత సాయిబాబాకు సంబంధించిన పుస్తకాలెన్నో చదివాను.
అంతేకాదు,
సాయిబాబా అతీద్రియ శక్తులు కలిగిన వ్యక్తి మాత్రమే కాదని ఆయన సర్వశక్తిమంతుడు, తన భక్తుల మీద అపారమయిన దయను, కృపను ప్రసరించే సాక్షాతు భగవంతుడె అని అందరూ భావించేటట్లుగానే, నాలో కూడా అదే విధమయిన భావం కలిగింది.
ఆవిధంగా
నేను కూడా బాబా భగవంతుడే అనే నిర్ధారణకు వచ్చాను. ఆ తరువాత నామన్సులో బాబా మీద గౌరవప్రపత్తులు, నిరంతరం వృధ్ధి
చెందడం
ప్రారంభమయింది. ఒకసారి నాప్రాణ స్నేహితుని కూతురికి దురదృష్టవశాత్తు పక్షవాతం వచ్చింది.
ఆమె
తన చేతిని కదల్చలేకపోయింది.
ఎన్నో
రకాల వైద్యాలు చేసినా ఏమీ లాభం లేకపోయింది.
మా
మిత్రుడు చాలా బెంగపడ్డాడు.
ఇక
తన కూతురి ఆరోగ్యం మీద ఆశలన్నీ వదిలేసుకున్నాడు.
రోజురోజుకి
అతనిలో బాధ ఎక్కువయి విచారంతో కుమిలిపోసాగాడు.
అతని అవస్థ చూసి నేను చలించిపోయాను.
మా
మిత్రుడికి నేను షిరిడీనుంచి తెచ్చిన ఊదీలో కొంత ఇచ్చాను. “మీ అమ్మాయికి పక్షవాతం సోకిన చేతికి ఈ ఊదీని రాయి” అని చెప్పాను.
అతనికి బాబామీద నమ్మకం లేకపోయినా గాని నన్ను తృప్తిపరచడానికి నేనిచ్చిన ఊదీ తీసుకున్నాడు.
నేను
చెప్పినట్లుగా
పక్షవాతం సోకిన తన కుమార్తె చేతికే కనక పూర్తిగా నయమయినట్లయితే బాబాని భగవంతునిగా భావించి ఆయనను పూజిస్తాను” అని అన్నాడు.
బాబా ఊదీ తన ప్రభావాన్ని చూపించింది.
అధ్బుతమయిన
చమత్కారం. కదలికే
లేని చేతిలో చలనం కలిగింది.
చిటికెడు
ఊదీ పక్షవాతానికి గురయిన చేతికి స్వస్థత చేకూర్చి మునుపటిలాగా చేతిని కదల్చగలిగే శక్తినిచ్చింది. ఈ అధ్భుతాన్ని చూసి వైద్యులు కూడా చాలా ఆశ్చర్యపోయారు.
పక్షవాతానికి
గురయిన చేతికి కదలిక అనేదే వస్తుందా అనే సందిగ్ధంలో ఉన్న వైద్యుల ఆశ్చర్యానికి అంతులేదు.
కొద్ది
రోజులలోనే నా మిత్రుడి కుమార్తెకి సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది.
సాయిబాబా చూపిన ఈ అపరిమితమయిన కృపను చూసి నా మితుడు పులకించిపోయాడు.
సాయిబాబాకు
అంకిత భక్తుడిగా మారిపోయాడు.
(సర్వం శ్రీ సాయినాదార్పణమస్తు)
0 comments:
Post a Comment