04.01.2022 మంగళవారం
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు
మరొక అధ్బుతమయిన బాబా లీల ప్రచురిస్తున్నాను.
సాయివిచార్ నుండి గ్రహింపబడిన ఈ లీలకు తెలుగు అనువాదం
ఆత్రేయపురపు
త్యాగరాజు
నిజాంపేట,
హైదరాబాద్
పర్సు
పోయింది……???
ఉషగారి
అనుభవమ్
2007వ.సంవత్సరం నవంబరు 29వ.తేదీ గురువారమునాడు మైలాపూర్ లో ఉన్న సాయిబాబా మందిరానికి వెళ్ళాను. ఉదయం గం.10.30 కి మందిరంలోకి అడుగుపెట్టాను. గం. 10.40 కి అన్నదానానికి డబ్బు కడదామని చూస్తే హాండ్ బాగ్ లో నా పర్సు కనపడలేదు. అన్ని రోజులలోను బాబా మందిరం బాగా రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా గురువారమునాడు భక్తుల రద్దీ బాగా విపరీతంగా ఉంటుంది. 10.30 కి నేను మందిరంలోకి వచ్చినపుడు హాండ్ బాగ్ లో పర్సు ఉందని నాకు ఖచ్చితంగా తెలుసు.
ఎందుకంటే
నా భర్త అన్నదానానికి డబ్బు కట్టమని ఇవ్వడం వలన దానిని పర్సులో పెట్టి నా హాండ్ బాగ్
లోనే పెట్టుకున్నాను. ఆరోజు మా వివాహ వార్షికోత్సవం. అటువంటి రోజున ఈ విధంగా పర్సు పోవడం నామనసును కలిచివేసింది. నిజం చెప్పాలంటే ఆరోజు నేను బాబాని మనఃస్ఫూర్తిగా
ప్రార్ధించుకోలేకపోయాను. నా బ్యాంక్ కార్డులన్నీ
పర్సులోనే ఉన్నాయి. నా అద్రుష్టం కొద్దీ
మందిరంలో ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు. వెంటనే
వారికి కంప్లైంట్ చేసి, మందిరంలోనుండే బ్యాంకు వాళ్ళకి ఫోన్ చేసి నా కార్డులన్నిటినీ
బ్లాక్ చేయించాను. భారమయిన హ్రుదయంతో ఇంటికి
తిరిగివచ్చాను. కార్డులతోసహా నా పర్సును దొరికేటట్లు
చేయమని బాబాను ప్రార్ధించుకున్నాను. నా మెడికల్
కి సంబంధించిన కార్డులు, పాన్ కార్ఢు అన్నీ పర్సులోనే ఉన్నాయి. ఆకారణం చేత నా పర్సు దొరికేలా చేయమని బాబాని మనఃస్ఫూర్తిగా
వేడుకున్నాను.
(మైలాపూర్ సాయిబాబా మందిరం)
రోజులు,
నెలలు గడిచిపోయాయి. అనుకోకుండా 2008 వ.సంవత్సరం
మార్చి, 22 వ.తారీకున ఒకతనినుంచి నాకు ఫోన్ వచ్చింది. తనకు నా పర్సు రోడ్డు మీద దొరికిందని చెప్పాడు. తను బస్ స్టాండ్ లో నుంచుని ఉన్న సమయంలో రోడ్డు
మీద పర్సు దొరికిందని, అందులో కొన్ని కార్డులు నా బిజినెస్ కార్డు ఉన్నాయని చెప్పాడు. నా బిజినెస్ కార్డు మీద నా ఫోన్ నెంబరు ఉండటం వల్ల
వెంటనే నాకు ఫోన్ చేస్తున్నట్లుగా చెప్పాడు.
నా పర్సును ఎక్కడికి వచ్చి తీసుకొవాలో రెండుగంటల తరవాత చెబుతానని అన్నాడు. మొట్దమొదటగా నేనసలు నమ్మలేకపోయాను. ఆవ్యక్తి తన ఫోన్ నెంబరు ఇచ్చాడు. వెంటనే నేను ఆఫీసులో ఉన్న నాభర్తకు విషయమంతా చెప్పి
అతని ఫోన్ నెంబరు కూడా ఇచ్చాను. వచ్చేటప్పుడు
అతను చెప్పిన ప్రదేశానికి వెళ్ళి పర్సు తీసుకురమ్మని చెప్పాను.
సాయంత్రం
నా భర్త ఆఫీసు నుండి ఇంటికి వచ్చేటప్పుడు ఆవ్యక్తి ఇంటికి వెళ్లారు. అతను నా పర్సుతోపాటుగా సాయిబాబా ప్రసాదం ఇవ్వడంతో
నా భర్తకు చాలా ఆశ్చర్యం వేసింది. అతను షిరిడీనుండి
క్రిందటి రోజునే తిరిగి వచ్చినట్లుగా చెప్పాడు.
అతను అరుదయిన రెండు సాయిబాబా ఫోటోలను, ఊదీని పర్సుతోపాటుగా ఇచ్చాడు. బాబాకరుణ ఎంతటిదో వర్ణించడానికి మాటలు చాలవు.
మినీ…
ఈ మధ్యనే
యుక్తవయసులో ఉన్న మా అమ్మాయిని దంతవైద్య పరీక్షకోసం తీసుకు వెళ్లాను. ప్రతిసంవత్సరం ఈ విధంగా పరీక్ష చేయిస్తూ ఉంటాను. పరీక్షించిన దంతవైద్యుడు మా అమ్మాయి నాలిక మీద తెల్లటి
మచ్చ చూసి నాతో మాట్లాడాలని అన్నాడు. ఆమచ్చ ఒకవేళ
కాన్సర్ వచ్చేముందు సూచనా లేక కాన్సరా అని నేను చాలా భయపడ్డాను. బాబాని చాలా తీవ్రంగా ప్రార్ధించుకుని ఒక వారంలో
సత్ చరిత్ర పారాయణ చేసాను. మంచినీళ్ళలో ఊదీని
కలిపి ప్రతిరోజు మా అమ్మాయికి త్రాగడానికి ఇచ్చాను. ఆ తరువాత బయాప్సీకి పంపించినపుడు రిపోర్టు నార్మల్
గానే వచ్చింది. కాన్సర్ కణాలు ఏమీ లేవని తెలిసింది. ఈ నా అనుభవాన్ని సాయివిచార్ కి పంపిస్తానని బాబాకు
మ్రొక్కుకున్నాను. బాబా! నీ భక్తులను ఎటువంటి
కష్టాలు వచ్చినా వాటిని రూపుమాపి సహాయం చేయి తండ్రీ….
(సర్వం
శ్రీసాయినాధార్పణమస్తు)
0 comments:
Post a Comment