11.04.2022 సోమవారమ్
ఓమ్
సాయి శ్రీ సాయి జయజయ సాయి
శ్రీ మాత్రే నమః
సాయి
బంధువులకు బాబావారి శుభాశీస్సులు
శ్రీ
సాయి దయా సాగరమ్ 9 వ, భాగమ్
అధ్యాయమ్
– 4
కొన్ని
అధ్బుతాలు
మరాఠీ
మూలగ్రంధ రచయిత్రి --- శ్రీమతి ఉజ్వలా బోర్కర్, విలేపార్లే - ముంబాయి
ఆంగ్లానువాదమ్
--- శ్రీ ఉదయ్ అంబాదాస్ బక్షి
తెలుగు
అనువాదమ్ --- ఆత్రేయపురపు త్యాగరాజు, నిజాంపేట,
హైదరాబాద్
నేను రాత్రివేళ మాత్రమే కాదు, పగలు కూడా నిద్రిస్తూ ఉంటాను. ఆవిషయం నాకు 2000 సం.వరకు గుర్తే. మా ఇంటిలో నేను, మా అత్తగారు ఇద్దరమే ఉంటాము. మేమిద్దరం వేరు వేరు గదుల్లో నిద్రిస్తూ ఉండేవాళ్ళం. మా అత్తగారి సోదరుడు పనిమీద పార్లే వస్తుండేవాడు. ఆవిధంగా వచ్చినపుడు అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వచ్చేవాడు. అతను వచ్చినపుడు మేము గాఢనిద్రలో ఉండేవాళ్ళం. అతను ఇంటిలోకి వచ్చి అన్ని గదులూ తిరుగుతూ మేము గాఢనిద్రలో ఉన్నందువల్ల మమ్మల్ని లేపడం ఇష్టం లేక వెళ్ళిపోతూ ఉండేవాడు.
ఆ తరువాత మాకు ఫోన్ చేసి తను మా ఇంటికి వచ్చినట్లు
మేమిద్దరం మంచి నిద్రలో ఉండటం వల్ల లేపకుండా వెళ్ళిపోయినట్లు చెప్పేవాడు. ఆవిధంగా తలుపులు దగ్గరగా వేసుకుని పడుకున్నట్లయితే
ఎవరయినా దొంగ సులభంగా ఇంట్లోకి వచ్చి అన్నీ దోచుకు వెళ్ళిపోతాడని హెచ్చరించాడు.
కాల
చక్రం గిఱ్ఱున తిరిగింగి. మా అత్తగారు కాలం
చేసారు. మా పిల్లలు బయటకు వెళిపోతూ ఉండేవారు. ఇంటిలో నేను ఒక్కదాన్నే ఉండేదానిని. ఇంటికి మొత్తం రక్షణగా తలుపులున్నాయి. నా ఇంటిలోనే నేను బందీనయినట్లుగా ఒక జైలులో ఉన్నట్లు అనిపించేది.
మా
ఇంటిక్రింది భాగంలో ఉన్న మందిరంలో సాయిబాబా ఉన్నారు. అదే నాకు కొండంత ధైర్యాన్నిస్తూ ఉంది. ఆయనే మా కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నారు. మా తాతముత్తాతలు ఎప్పుడూ “అతిది దేవోభవ’ అని చెబుతూ
ఉండేవారు. మనింటికి ఎవరయినా అతిధి వచ్చినచో
అతను దైవంతో సమానమని ఆయనకు సేవ చేయాలని”, దాని అర్ధం. కాని ఇపుడు రోజులు మారాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి.
కొన్ని సంవత్సరాల క్రితం వామనరావు పాయ్ మా సాయిమందిరంలో సత్సంగాన్ని నిర్వహించారు. ఒక శుక్రవారమునాడు నన్ను కూడా ఆ సత్సంగానికి రమ్మన్నాడు. ఆయన ప్రవచనం వినడానికి నేను క్రిందకి వెళ్ళాను. ఒక గంట తరువాత ఒకామె నన్ను పిలిచి తనకు మంచినీళ్ళు కావాలని అడిగింది. నేను మంచినీళ్ళు తేవడానికి పైకి వెళ్ళాను. ఇంటి ప్రధానద్వారం తెరచి హాలులోకి వెళ్ళాను. మంచినీళ్ళ కోసం వంటగదిలోకి వెడుతున్నపుడు నాగదిలో ఎవరో ఉన్నట్లుగా కనిపించింది. అతను మా ఇంటిలో కొత్తగా చేరిన పనివాడు (బీహారీ కుఱ్ఱవాడు). ఆ పనివాడు నా లాకర్ తెరిచాడు. అందులో నా ఆభరణాలున్నాయి.
నేను వెంటనే పరుగెత్తి వాడిని పట్టుకోబోయాను. కాని వాడు తప్పించుకుని పారిపోయాడు. వాడు నా లాకర్ కి మారుతాళం తయారు చేసాడు. సరిగ్గా సమయానికి నేను రావడంతో వాడి పాచిక పారలేదు. ఇది బాబా చేసిన అధ్భుతం. సత్సంగంలో ఆమె నన్ను మంచినీళ్ళు అడిగి ఉండకపోయినట్లయితే
నేను ఇంటిలోకి వచ్చేదానినే కాదు. పనివాడు మొత్తం దోచుకుని వెళ్ళిపోయేవాడు. నాకు భారీ నష్టం జరగకుండా బాబా కాపాడినందుకు ఆయనకు
మరలా ధన్యవాదాలు తెలుపుకున్నాను. బాబా నాకు
ఎన్నో అనుభవాలనిచ్చారు. అందువల్లనే నేను సాయి
దయాగుణం ఎటువంటిదో తెలిపే లీలలతో కూడిన ఈ పుస్తకాన్ని రచించడానికి నిర్ణయించుకున్నాను.
ఉజ్వలా
బోర్కర్
(సర్వం శ్రీ సాయినాధార్పణమస్థు)
0 comments:
Post a Comment