ఈ రోజున తెలుగులో సాయి బ్లాగ్ ప్రారంభించబడిందంటే
బాబా ఆశీర్వదం కాక మరేదీ కాదు.
సాయి బాబా బ్లాగ్ ద్వారానే సాయి భక్తురాలయిన శ్రీమతి ప్రియాంక రౌతేల గారితో నెట్ ద్వారా పరిచయ భాగ్యం కలిగింది.
ఇది అంతా కూడా బాబా లీల.
రెండు సంవత్సరాల క్రితం నేను సాయిబాబ ఫోరంలో నా వ్యక్తిగత బాబా అనుభవం గురించి వ్రాయడం జరిగింది.
అది చదివిన వెంటనే ప్రియంకా గారు నాకు మైల్ పంప
డం అక్కడనుంచి ఆవిడతో పరిచియం ఏర్పడడం జరిగింది.
అప్పటినుంచి బ్లాగ్ లో బాబా లీలలు చదవడం నాకు కలిగిన అనుభవాలు పంపించడం జరుగుతూఉంది.
ఇక మనం బాబా లీల గురించి తెలుసుకుందాము.
2006 లో అనుకుంట మార్చి నెల ఉగాది కి ముందు నేను, మా శ్రీమతి, మా మూడవ కుమార్తె క్రిష్ణ గాయత్రి షిరిడి వెళ్ళడం జరిగింది. అక్కడ 3 రోజులు ఉన్నాము. మొదటి రోజు దర్శనం బాగా జరిగింది. మరుసటి రోజు అనగా ఉగాది నాడు చాల రద్దీగా ఉంది. ఆరోజు ఆదివారము. ప్రతి ఆదివారమునాడు గుడి లోపల బాబా గారికి వాడిన వస్త్రములు వేలం వేయడం జరుగుతూఉంటుందని తెలుసుకున్నాము. కాని షిరిడి పూర్వాంలా కాక చాలా మారిపోఇంది. 4 గేట్స్ ఉన్నాయి. మేము ముగ్గురమూ కూడా బాబా గారి వస్త్రములు వేలంపాటలో కొందామని గుడి వద్దకు వెళ్ళము. కాని మాకు లోపలకు యెలా వెళ్ళాలో తెలియలేదు. అందుచేత దర్శనం క్యూ లో నే అందరితోపాటు వెళ్ళడం జరిగింది. ఆరోజు చాల రద్దీగా ఉంది.
క్యూ లైన్లో ఉండి నేను మా శ్రీమతి "అయ్యో ఉత్తి చేతులతో బాబా దర్శనానికి వెడుతున్నాము. కనీసం స్వీట్స్ గాని పువ్వులు గాని తేకుండా వెడుతున్నాము అని బాథపడ్డాము. నేను మనసులొ "బాబా నీ లీల ఏమయినా చూపించు అని అనుకున్నాను.
లైనులొ మెల్లగా సమాథి మందిరంలోకి ప్రవేసించాము.
ఇంతలో ఒక సెక్యూరిటీ గార్ద్ నన్ను పిలిచాదు. నేను అది గమనించకుండ మెల్లగా వెడుతున్నాను. బహుశ నన్ను లైనులో సరిగా నడవమన్నడేమో అనుకుని లైనులో కదులుతున్నాను. మరల గార్డ్ నన్ను పిలుస్తుంటే మా శ్రీమతి నన్ను పిలుస్తున్నారు అని చెప్పింది. నేను వెంటనే గార్డ్ వద్దకు వెళ్ళాను.
అప్పుడు నేను ఊహించని సంఘటన జరిగింది. గార్డ్ నా చేతికి గులాబీలు ఉన్న రెండు గుత్తులు నా చేతిలో పెట్టి బాబా గారికి ఇవ్వమని చెప్పాడు. నిజంగా చాల ఆశ్చర్యం వేసింది. మనసులో అనుకున్న వెంటనే బాబా గారు తన లీల చూపించారు.
మనం యెక్కడ ఉన్నా సరే. మన మనసులోని ఆలోచనలను ఆయన గ్రహించగలరు అనటానికి ఇంతకన్న నిదర్శనం యేమి కావాలి.
యల్లప్పుడూ బాబా నామ జపం చేయండి
0 comments:
Post a Comment