Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, January 26, 2011

శ్రీ సాయి చాలీసా

Posted by tyagaraju on 7:38 AM





26.01.2001 బుథవారము

ఈ రోజు మన సాయి బంథువులందరకూ శ్రీ సాయి చాలీసాను
అందిస్తున్నాను. ప్రతిరోజు లేక గురువారమునాడయినను దీనిని
చదవండి. సాయిని మదిలో నిలుపుకొనండి.

మేము సత్సంగములొ మొదటగ ఈ చాలీసా చదివి సత్సంగమును ప్రారంభిస్తాము.

సాయి బంథువులందరూ కలిసి ఈ సత్సంగము యెలా చేయాలొ తరువాత వివరంగా ఇస్తాను.

---------------------------------------------------------------



శ్రీ సాయి చాలీసా


షిరిడివాస సాయి ప్రభో
జగతికి మూలం నీవె ప్రభో
దత్త దిగంబర అవతారం
నీలో సృష్టి వ్యవహారం

త్రిమూర్తి రూపా ఓ సాయి
కరుణించి కాపాడోయీ
దర్శనమీయగ రావయ్యా
ముక్తికి మార్గం చూపుమయా షిరిడి

కఫినీ వస్త్రము ధరియించి
భుజమునకు జోలి తగిలించి
నింబ వృక్షపు చాయలో
ఫకీరు వేషపు ధారణలో

కలియుగమందున వెలిసితివి
త్యాగం, సహనం నేర్పితివి
షిరిడి గ్రామం నీ నివాసం
భక్తుల మదిలో నీ రూపం షిరిడి

చాంద్ పాటిల్ ను కలుసుకొని
అతని బాథలు తెలుసుకొని
గుఱ్ఱముజాడ తెలిపితివి
పాటి ల్ బాథను తీర్చితివి

వెలిగించావు జ్యోతులను
నీవుపయోగించీ జలము
అచ్చెరువొందెను ఆ గ్రామం
చూసీ వింతైనా దృశ్యం షిరిడి

బాయీజా చేసెను నీ సేవ
ప్రతిఫలమిచ్చావో దేవా
నీ అయువును బదులిచ్చి
తాత్యాను నీవు బ్రతికించి

పశు పక్షులను ప్రేమించి
ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం
చిత్రమయా నీ వ్యవహారం షిరిడి

నీ ద్వారములో నిలిచితిని
నిన్నే నిత్యము కొలిచితిని
అభయమునిచ్చి బ్రోవుమయా
ఓ షిరిడీశా దయామయా

ధన్యము ద్వారక ఓ మాయీ
నీలో నిలిచెను శ్రీ సాయీ
నీ ధుని మంటల వేడిమికి
పాపము పోవుని తాకిడికి షిరిడి

ప్రళయకాలము ఆపితివి
భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహామారి నాశం
కాపాడీ షిరిడీ గ్రామం

అగ్నిహోత్రి శాస్త్రికి
లీలామహత్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి
పాము విషము తొలగించి షిరిడి

భక్త భీమాజీకి క్షయరోగం
నశియించే అతని సహనం
ఊదీ వైద్యం చేసావూ
వ్యాథిని మాయం చేసావు

కాకాజీకి ఓ సాయి
విఠ్ఠల దర్శన మిచ్చితివి
దామూకిచ్చి సంతానం
కలిగించితివి సంతోషం షిరిడి

కరుణా సింథూ కరుణించు
మాపై కరుణ కురిపించు
సర్వం నీకు అర్పితము
పెంచుము భక్తి భావమును

ముస్లిమనుకుని నిను మేఘా
తెలుసుకొని అతని బాథ
దాల్చి శివశంకర రూపం
ఇచ్చావయ్యా దర్శనము షిరిడి

డాక్టరుకు నీవు రామునిగా
బల్వంతుకు శ్రీ దత్తునిగా
నిమోనుకరుకు మారుతిగా
చిదంబరకు శ్రీ గణపతిగా

మార్తాండ్ కు ఖండోబాగా
గణూకు సత్యదేవునిగా
నరసిం హ స్వామిగ జోషికి
దర్శనమిచ్చిన శ్రీ సాయి షిరిడి

రేయీ పగలూ నీ ధ్యానం
నిత్యం నీలీలా పఠనం
భక్తితో చేయండీ ధ్యానం
లభించును ముక్తికి మార్గం

పదకొండూ నీ వచనాలు
బాబా మాకవి వేదాలు
శరణని వచ్చిన భక్తులను
కరుణించి నీవు బ్రోచితివి షిరిడి

అందరిలోన నీ రూపం
నీ మహిమ అతిశక్తిమయం
ఓసాయి మేము మూఢులము
ఒసగుమయా నీవు జ్ఞానమును

సృష్టికి నీవేనయ మూలం
సాయి మేము సేవకులం
సాయి నామము తలచెదము
నిత్యము సాయిని కొలిచెదము షిరిడి

భక్తి భావన తెలుసుకొని
సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయి ధ్యానం
చేయండీ మీరు ప్రతినిత్యం

బాబా కాల్చిన థుని వూది
నివారించును అది వ్యాథి
సమాథి నుండి శ్రీసాయి
భక్తులను కాపాడోనోయి

మన ప్రశ్నలకు జవాబులు
తెలుపును సాయి చరితములు
వినండి లేక చదవండి
సాయి సత్యము చూడండి

సత్సంగమును చేయండి
సాయి స్వప్నము పొందండి
భేద భావమును మానండి
సాయే మన సద్గురువండి షిరిడి

వందనమయ్యా పరమేశా
ఆపద్భాందవ సాయీశా
మా పాపములు కడతేర్చు
మా మదికోరిక నెరవేర్చు

కరుణామూర్తి ఓ సాయి
కరుణతో మము దరిచేర్చోయి
మా మనస్సే నీ మందిరము
మా పలుకులే నీకు నైవేద్యం షిరిడి


శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List