ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఊదీ మహిమ (1983)01.02.2011 మంగళవారము
ఈ రోజు మనము మరియొక ఊదీ మహిమ గురించి తెలుసుకుందాము. ఈ లీల సాయి లీల మాసపత్రికలో నీలం.బీ.సంగ్లికర్, పూనా వారు వ్రాసినది. ఈలీలన్ని చదివితే బాబాగారిలో యెంత మహాత్మ్యం ఉందొ ఆయన ఊదీలో కూడా అంతే మహిమ ఉంటుందని మనకు అర్థమవుతుంది.
నీలం బి.సంగ్లీకర్ - పూనా వారు వ్రాసిన ఊదీ మహిమఆ రోజు జూలై, 5 తా. 1983, మంగళవారం, మథ్యరాత్రిలో మంచం మీద పడుకుని గట్టిగా ఆవలించాను. హటాత్తుగా నా దవడ వద్దనున్న జాయింట్స్ బిగుసుకుపోయి నోరు మూత పడలేదు. నా నోరు ఒక అంగుళం మేర అలా తెరుచుకునే ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం రెండు సార్లు నాకు ఇలా జరిగింది. వెంటనే నేను మంచం మీదనుంచి లేచి దవడకి మెల్లిగా అయొడెక్స్ రాయడం మొదలుపెట్టాను. కాని యేమీ ఫలితం కనిపించలేదు. నేను నా గదిలో ఒంటరిగా ఉండడంతో నాకు చాలా అందోళణ కలిగింది, యెందుకంటే నా రూం మేట్ ఆరోజు రాత్రి అనుకోకుందా యెక్కడికో వెళ్ళింది. నేను మాట్లాడే పరిస్తితిలో లేను, అప్పటికే రాత్రి ఒంటిగంట అయింది, అందుచేత మిగతా రూంస్ లో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడము యెందుకనుకున్నాను. చాలా నిస్సహాయ స్థితిలోఉన్న నాకు శ్రీ బాబా గారిని పిలవడం తప్ప, వేరెవరి సహాయము లేదని తెలుసుకున్నాను. అయొడెక్స్ పనిచేయకపోయేటప్పటికి, బాబా ఊదీ ని తీసుకుని కొంచెం కొంచెం గా నోటిలో వేసుకుంటూ, యెడమ దవడ మీద కూడా మెల్లగా రాయడం మొదలుపెట్టాను. అదే సమయంలో నా హృదయాంతరాళలోనుంచి సాయి నాథ్ ని స్మరించడానికి ప్రయత్నించాను, కాని నత్తి గా ఉండి శబ్దం కూడా బయటికి రాలేదు. మెల్లిగా ఫలితం కనపడడం మొదలు పెట్టింది. నా పెదిమలని కొద్దిగా దగ్గరికి చేర్చగలిగాను, కాని దవడ వద్దనున్న జాయింట్స్ బిగుసుకునే ఉండడంతో నోరు తెరవలేకపోయాను. నా భయానికి ఇంక అంతులేదు. బాబా ఫోటొ ముందు నా తప్పులన్నిటినీ క్షమించి నన్నీ శిక్షనుండి తప్పించమని చిన్న పిల్లలా యేడిచాను. శరణాగతి చేసిన తరువాత మంచం మీద పడుకుందామని చూసాను గాని, నెప్పిగా ఉండడంతో చాలా అశాంతిగా ఉండి పడుకోలేకపోయాను. అందుచేత మంచం పక్కనే ఉన్న గోడకు తల ఆనించి, కళ్ళు మూసుకుని బాబా ని స్మరిస్తూ ఉన్నాను. మెల్లగా నా దవడ నరాల్లో యేదొ జరుగుతోందన్నట్లుగా అనిపించింది, బాబా గారు మాయమయిపోతారేమొనని కళ్ళుతెరిచేందుకు థైర్యం చేయలేకపోయాను. అప్పుడు బాబాగారు, నన్ను, నా యెడమ చేయి నా యెడమ దవడమీదుగా ఉండేటట్లుగా నన్ను పడుకోబెట్టారు. మెల్లిగా నా దవడ జాయింట్లు సద్దుకోవడం మొదలు పెట్టాయి. సరిగ్గా రెండు గంటలకి అయిదు నిమిషాలు ఉందనగా నేనీ గండమునుంచి బయట పడ్డాను. ఇప్పుడు చాలా హాయిగా ఉంది. బాబాగారి నామాన్ని ఉఛ్ఛరిస్తూ వేయి సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నాను.
అదే నిజమైన ఊదీ మహిమ: పడుకునేముందు నోటిలో కొంచెం ఊదీ వేసుకున్నాను. (ఇది నేను సాథారణంగా చేయను, నేనెప్పుడైనా ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు, యేదయినా పనిమీద బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే ఊదీ ని వేసుకుంటాను.) ఆ రోజు నేను చాలా తీవ్రమైన వేదనని అనుభవించి సుఖమైన నిద్రకి దూరమయ్యాను. అణచిపెట్టుకున్న నా బాథని దిగమింగడానికి గట్టిగా యేడవాల్సొచింది. ఈ సంఘటన జరిగినవెంటనే నేను ఊదీ వేసుకున్నాను. రెండు గంటలపాటు చాల బాథపడుతూ యేడిచి అలసిపోయాను. బాబా ముందు దీపం వెలిగించిన తరువాత గాఢ నిద్ర పోయి, మరునాడు ప్రొద్దున్న మామూలు సమయానికే నిద్ర లేచాను. రాత్రి అంత నరకం అనుభవించాక పొద్దున్న చాలా సంతోషంగా లేచాను.
ఈ సాయి లీల పత్రిక ద్వారా ఇంతమంది సాయి బంథువులందరితోనూ నా అనుభవాన్ని పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment