02.02.2011 బుథవారము
శివపూర్ బాబా మందిరము మహిమలు
బాబా మందిరాల నిర్మాణంలో ప్రతిచోటా బాబాగారి శక్టి ఉంటుంది. ఆయన ప్రేరణే కనక లేకపోతే మందిర నిర్మాణం జరగదు. అంతా ఆయన ఆశీర్వాదమే.
ఈ రోజు మనము పశ్చిమ బెంగాల్ లోని శివ పూర్ బాబా మందిరం గురించి తెలుసుకుందాము.
ఈ రోజు మొదటి భాగము
అమిత్ విశ్వస్ గారికి బాబా గారు కలలో కనిపించారు. ఈ మందిరాన్ని నిర్మించమని బాబా గారు ఆజ్ఞాపించారు, నిర్మాణానికి సంబంథించిన ఏ ర్పాటులన్నీ తనే చూస్తానని చెప్పారు. అమిత్ విశ్వాస్ గారు ఇలా చెప్పారు. " నేను కలలో వేలకు వేలు నియాన్ లైట్లు ఉన్నట్లుగా వెలుగునిచూసాను . నేను చాలా దిగ్భ్రమ చెందాను. తరువాత “నేను సాయిబాబా ని “ అనే మాటలని విన్నాను . “ మీ ముత్తా తగారు ఈ గుడిలో గంటల తరబడి పూజలు చేసేవారు.
మీ ముత్తా తగారు ప్రతిరోజూ గంటల తరబడి పూజలు చేసేవారు . ఆయనతో నాకు చాలా ఆనందంగా ఉండేది. యిప్పుడీ ప్రాంతమంతా అరణ్యంలా మారిపోయింది. మరల యిక్కడ భక్తితో పూజలు పునస్కారాలు జరగాలని ఆశగా ఉంది.” అన్నారు
బాబా గారు కలలో చెప్పిన విషయాలు.
1. నాకు గుడి కట్టించి ప్రతిరోజూ పూజలు చేయవలసిందిగా నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను.
2. ఈ వేప చెట్టుకింద యెవరియెతే నిలబడతారో వారు నేను ఉన్నట్లు గా అనుభూతి చెందుతారు. ఈ వృక్షం వారి పాపలన్నిటినీ తొలగించివేస్తుంది.
౩. ఈ మందిర నిర్మాణానికి నాపని చేయడానికి నేను ఉంటాను. మందిర నిర్మాణము ఆగకూడదు.
4. ఈ మందిర నిర్మాణానికి నా నిజమైన భక్తుడు తప్ప ఎవరు యివ్వలేరు .
5. ఎవరియితే పూర్తి భక్తితో వచ్చి నా దర్సనం చేసుకుంటారో అతని/ఆమె కోరికలన్నీ నెరవేరతాయి .
బాబా గారు కలలో ఇంకా చాలా విషయాలు చెప్పారు కానీ, అవి ప్రజలకి వెల్లడించకూడదని, అమిత్ చెప్పారు.
భక్తుల విరాళాలవల్లా, ఆశీర్వాదం వల్లా బాబా మందిరాలు చాల వచ్చాయి . కానీ బాబా గారి ఆజ్ఞతో ఈ మందిరమొక్కటే ఇంత పెద్దదిగా నిర్మించబడుతోంది.
బాబా విగ్రహం కూడా తను కలలో చూసినట్లే వుందని అమిత్ చెపుతూ ఉండేవాడు. దానికి కూడా కథ ఉంది.
ఈ సాయి సద్గురు కార్యకలాపాలు విన్న తరువాత ప్రముఖ జాతీయ శిల్ప కళాకారుడు , జాతీయ బహుమతి గ్రహిత అయిన సుబీర్ పాల్ ఊరికే కూర్చుండ లేకపోయాడు.
ప్రేరణతో మనిషం త సైజుతో బాబా విగ్రహాన్ని ఫైబర్ గ్లాసుతో తయారుచేసాడు. పాల్ చెప్పినదేమిటంటే ఆరు నెలలుగా ఈ విగ్రహం తయారు చేస్తున్నప్పుడు ఏదో తెలియ ని దివ్య శక్తి తనలో ప్రవేశించిందని చెప్పాడు. ఇటువంటి సంపూర్ణమైన విగ్రహాన్ని తను ఇంతకుముందు తయారు చేయలేదని చెప్పాడు.
మందిరము యొక్క చరిత్ర
మనం 1850 సంవత్సరం ప్రాంతాలలోకి వెడితే, నాదియా వద్ద శివాపూర్ గ్రామంలో రామదాస్ విశ్వాస్ అనే ఆయన పెద్ద ధనవంతుడు. తన ఇంటి ఆవరణలోనే మందిరాన్ని నిర్మించి ప్రతిరోజూ పూజలు చేస్తువుండేవాడు. యెప్పుడు ఎవరివద్దనించి సహాయము తీసుకోలేదు, కాని తన స్వంత ఖర్చుతో మందిరాన్ని నిర్మించాడు. గతం గురించి విచారిస్తే రామదాస్ విశ్వాస్ గారు తను ఉండగా మందిరంలో బాబా విగ్రహాన్ని పెట్టారా లేదా అన్నది తెలియదు. కానీ ఇంతవరకు లభించిన సమాచారం ప్రకారం 1920 లో మందిరంలో రోజువారి పూజలు ఆగిపోయాయి. దాని వెనుక కారణం తెలియదు
మెల్లగా మందిరం చుట్టూ పొదలు పెరిగి, బూజు, సాలిడులు విషపు పురుగులకి నిలయంగా మారింది. గ్రామస్తులు , పాముల భయంతో గుడిలోకి వెళ్ళడం పూజలు చేయడం మర్చిపోయారు.
ఏమయినప్పటికీ చీకటి వెంటే వెలుతురు ఉన్నట్లు, వర్షం వెంటే ఇంద్రధనస్సు ఉన్నట్లు, శి ధిలమవుతున్న మందిరం వద్ద పొదలలో ఒక వేప చెట్టు పెరగడం 1992 లో శివపూర్ గ్రామస్తులు చూశారు.
వారిని ఆశ్చర్య పరచిన విషయమేమంటే , ఆ వేపచెట్టు పుట్టగానే విషపు పాములు కుడా వెళ్ళిపోవడం మొదలుపెట్టాయి.
పాములు వెళ్ళిపోగానే గ్రామస్తులు, పొదలు అవీ తీసి అంతా శుభ్రం చేయడం మొదలుపెట్టారు. అక్కడ పచ్చని మొక్కలు వచ్చాయి, పిల్లలు కూడా అక్కడ ఆడుకోవడం మొదలుపెట్టారు. తరువాత మందిరానికి వెళ్ళే దారి కూడా కనపడింది.
1999 వరకు, గ్రామస్తులు ఈవిషయాలన్నిటిని చాలా తేలికగా తీసుకున్నారు. ఒక గురుపూర్ణిమ నాడు రామదాస్ విశ్వాస్ గారి ముని మనమడైన అమిత్ విశ్వాస్ గారికి, 1918 లో సమాధి చెందిన బాబా గారు కలలో కనపడి " ఇప్పుడు వేప చెట్టు పెరుగుతున్నచోట, చాలా కాలం క్రితం రామదాస్, ఈ గుడిలో పూజలు చేస్తూ ఉండేవాడని చెప్పారు. మీ ముత్తాత గారు 100 సంవత్సరాల క్రితం ఇక్కడ రోజు పూజలు చేస్తూ ఉండేవారు ఆయన నా భక్తుడు, గుడిలో గంటల తరబడి కూర్చుని ప్రార్ధన చేసేవారని చెప్పారు. తరువాత అంతా ఆగిపోయింది. అందుచేత అన్ని బాధలు సమూలంగా నాశనము చేయడానికి నేను ఇక్కడ వేప చెట్టు నాటాను. మరల మందిరంలో పూజలు ప్రారంభించాలని నా కోరిక. ప్రజలకి ఈ మందిరం స్వర్గంలా చేయాలి. యెవ రయితే ఈ మందిరంలోకి అడుగు పెడతారో అతని/ఆమె కోరికలన్నీ నెరవేరతాయి." అని చెప్పారు.
ఈ దివ్య సందేశంతో అమిత్ పొద్దున్నే లేచి మందిర ప్రాంతానికి వెళ్ళారు. ఆప్రాంతంలో ఉన్న పొదలు తొలగించి, సాలె పురుగు బూజులని తొలగించి శుభ్రం చెశారు. బాబా మట్టి విగ్రహాన్నుంచి పూజలు చేయడం మొదలుపెట్టారు. కలలో బాబా గారు ఇచిన ఈ సందేశాన్ని గ్రామస్తులకు అందరికి ప్రచారం చేయగానే వారిలో కూడా ప్రేరణ కలిగింది. భయాన్ని వదలి గ్రామస్తులు మందిరానికి వచ్చి పూజలు చేయడం మొదలుపెట్టారు.
నమ్మండి నమ్మకపోండి, కొద్ది రోజులలోనే బాబాగారు చెప్పిన వాగ్దానాలన్నీ నిజమవడం మొదలైంది. శిధిలమై ఉన్నప్పటికీ, ఆ మందిరంలో పూజలు చేసిన, ఒకామెకు పెళ్ళయిన 12 సంవత్సరాల తరువాత మొట్టమొదటగా సంతానం కలిగింది. డాక్టర్ ఆమెకు వైద్య శాస్త్రం ప్రకారం సంతానము కలుగదని ముందరే చెప్పాడు. ఆమె ఒక్కత్తే కాదు ఆ గుడిలో పూజలు చేసిన కొంతమంది గ్రామస్తులకి నయంకాని రోగాలెన్నో తగ్గాయి . ఆ దెబ్బతో గ్రామస్తులందరూ ఏది ఏమయినా సరే ఆ గుడిని కాపాడాలని తీర్మానం చెశారు.
2003 సంవత్సరంలో గ్రామస్తుల సలహా మీద అమిత్ గారు మందిరం పునర్నిర్మాణానికి ఒక ట్రస్టీని ఏర్పాటుచేశారు. తరువాత నాదియా-శివపూర్-సాయి-సద్గురు సమితి ఏర్పాటు అయింది. ఆ కమిటీ మందిరాన్ని మరల కొత్త గా చేసి చుట్టుపక్కల ఉన్న బీదవారి అభివృధికి పాటుపడాలని తీర్మానించింది. కమిటీ , వరకట్న నిషేధము, విద్యార్ధులలో మత్తుమందు అలవాటు మానిపించుట మొదలైన సామజిక సేవలు కూడా చేపట్టాలని ప్రమాణం చేసింది. తరువాత కమిటీ తమ తీర్మానినికి అనుగుణంగా, బాల్యవివాహాలు, వరకట్న నిషేధం, మతుమందు అలవాటు మా న్పించుట వీటి గురించి విస్తృతమైన ప్రచారం చేసింది. చెప్పుకోదగిన విషయమేమంటే గ్రామస్తులలో ఫలితాలు రావడం మొదలుపెట్టాయి. వీరు సాధించిన విజయాలన్నీ కూడా నకశిపర గ్రామం మరియు దాని చుట్టుపక్కల అంతా కార్చిచ్చులా వ్యాపించింది.
ఆ విధంగా సాబిర్ పాల్ గారికి ప్రేరణ కలిగి బాబా విగ్రహాన్ని తయారు చేసారు. ఆర్ధికంగా సిథ్థం గా లేనప్పటికీ గ్రామస్తులు మందిర నిర్మాణానికి పూనుకున్నారు. పాత కట్టడాన్ని ఏమాత్రం మార్చకుండా మందిర ఆవరణలో వెదురు కర్రలతో ఒక కట్టడాన్ని నిర్మించారు. బంగారు రథంలో బాబా విగ్రహాన్నుంచి, తాటాకులతో వేసిన మందిరంలో ఉంచారు.
ఇప్పుడు భక్తులందరూ ప్రతిరోజూ రెండుసార్లు, పూజలు, భజనలు, ఆరతులు నిర్వహిస్తున్నారు. కమిటీ, మందిరాన్నికాంక్రీ టుతో నిర్మించడానికి ప్రజలందరి వద్దనించి విరాళాలు సేకరించడం మొదలుపెట్టింది. ప్రతిసంవత్సరం ఏప్రిల్ మూడవ వారంలో కమిటీ ఐదు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఒక్కసారి కనక శాస్వత నిర్మాణము జరిగితే, కోట్లమంది భక్తుల రాక మొదలయి వారి కోరికలన్నీ నెరవేరతాయి. ఆ విధంగా అందరు చేతులు చాచి తమ బాధలన్ని తీరాలని ఎదురు చూస్తున్నారు.
శివపూర్ మందిరంలో జరుగుతు న్న మహిమలు :
లీల నంబర్ 1. 2009 సెప్టెంబర్లో ఒక రోజు పీ. డబ్ల్యు. డి. యింజనీరుగారి భార్య ఈ మందిరం ప్రెసిడెంట్ అయిన అమిత్ విశ్వాస్ గారిని కలుసుకొంది. సంసారం సుఖంగా ఉన్నప్పటికీ తనకి ఇంకా సంతానం లేకపోవడంతో జీవితం నిస్సారంగా ఉందని చెప్పింది . పెండ్లి అయి 10 సంవత్సరములు కవోస్తున్నప్పటికి సంతానం లేదని బాధ పడింది. దంపతులిద్దరూ యెంతో మంది డాక్టర్స్ దగ్గిరకి వెళ్లి అన్ని మందులు వాడినా కూడా ఏమి ఫలితం కలగలేదని చెప్పింది. ఒకసారి వెహికిల్ మీద వస్తుండగా ఒక షాపులో బాబా ఫోటో చూశానని చెప్పింది. ఆమె అమిత్ గారిని బాబా దర్సనం చేసుకుని పూజ చేయచ్చా అని అడిగింది. అమిత్ గారు వారిని లోపలి రమ్మని పూజ చేసుకోమని చెప్పారు. ఆమె బాబా దర్సనం చేసుకుని సంతానం కోసం బాబా ముందు గట్టిగా విలపించింది. పెళ్ళయిన 10 సంవత్సరాలకు బాబా గారు వారికి సంతానాన్ని ప్రసాదించారు.
లీల నంబర్. 2:
గుడ్డు గురంగ్, సైనా గురు నేపాల్ దేశస్తులు. వారికి సంతానం లేదు. వారు ఆ గ్రామంలో వాచ్ మన్లు గా ఉన్నారు. ఒకరి తరువాత ఒకరుగా వారి పిల్లలు పుట్టకముందే మరణించారు. యెంతో మంది డాక్టర్స్ ని కలిసారు. సైనా కు ఓ వరిలో ప్రాబ్లం ఉండటం వల్ల సంతానానికి అవకాశం లేదు అని చెప్పారు. ఆఖరికి వైద్యం కోసం వెల్లూర్ వెళ్ళారు. కానీ ఫలితం లేకపోయింది. ఆఖరికి శివపూర్ బాబా గుడిలో పూజ చేసిన తరువాత వారికీ అందమైన అమ్మాయి జన్మించింది.
లీల నంబర్. ౩:
ఒక రోజు మందిరంలోని పూజారి గారి కూతురు, తన మొహం లో కింద కొంత భాగం నల్లగా ఉండటాన్ని గమనించింది . మోహంలో ఆ భాగంలో నల్లని మచ్చలు ఉన్నాయి. పూజారి గారు చాల ఆందోళన పడ్డారు. ఆయన ఏ వైద్యులని సంప్రదించలేదు. ఆయన మనసార పూర్తి భక్తీ, నమ్మకంతో ఉదీని ఆమె ముఖమంతా రాసి, తన కూతురి ము ఖం మీద ఉన్న నల్లటి మచ్చలని తొలగించమని బాబా ని ప్రార్ధించారు. విచిత్రంగా 7 రోజులలో ఆమె ముఖం మీద ఉన్న మచ్చలన్ని మాయమయిపోయి, ముఖం ఇంతకు ముందులాగా మాములుగా తయారయింది.
లీల నంబర్. 4 :
శివపూర్ బాబా మందిరంలో పూజ చేసిన ఇద్దరు దంపతులకి పెళ్ళయిన 14 సంవత్సరాల తరువాత సంతానం కలిగింది.
ఒకరోజున ఒక భక్తుడు బాబా దర్శనానికి వచ్చాడు. అతను కొద్ది రోజులుగా విపరీతమైన కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. ఆ నొప్పి ఎంతగా ఉందంటే అతను గుడిలో కుర్చోలేనంతగా ఉంది. అతను యెంతో భక్తితో ఊదీని నీళ్ళతో కలిపి తీసుకున్నాడు. కొద్ది నిమిషాలలోనే అతని కడుపు నొప్పి తగ్గిపోయి, మరల నొప్పి రాలేదు.
లీల నంబెర్. 5:
ప్రక్కనే ఉన్న గొపీనాధ్పుర్ అనే గ్రామంలో ఒక భక్తుడు ఉన్నాడు. అతనికి పక్షవాతం ఉంది. అతను కాళ్ళని కదల్చలేడు . యెంతో మంది డాక్టర్స్ ని కలిసాడు, ఫిజియొథెరపీ చేయించుకున్నా ఫలితం కనపడలేదు. ఇతను అతి కష్టం మీద యెంతో భక్తితో శివపూర్ బాబా దర్శనం చేసుకున్నాడు. తిరిగి వెళ్ళేటప్పుడు మెల్లగా అతని పక్షవాతం తగ్గిపాయింది. ఇప్పుడు అతను మామూలు వ్యక్తులలాగే నడవగలడు, పరిగెత్తగలడు.
మొదటి భాగము సమాప్తము. (సశేషం)
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment