Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Thursday, February 3, 2011

షివపూర్ బాబా మందిరము

Posted by tyagaraju on 5:08 AM03.02.2001 గురువారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

ఈ రోజు షివపూర్ బాబా గుడి లీలలు రెండవ భాగములో మిగతావి తెలుసుకుందాము. షివపూర్ బాబా గుడిలో జరిగిన, జరుగుగుతున్న లీలలు చదువుతుంటే మనందరికీ ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే బావుండును అనిపిస్తుంది. ఆ లీలలు అంత అద్భుతంగా ఉన్నాయి.

షివపూర్ బాబా మందిర్. లీల నం. 6

సునీల్ దాస్ అనె భక్తుడికి 16 రోజుల బాబు ఉన్నాడు. హటాత్తుగ బాబు ఆహారం తీసుకోవడం మానేసి, అదేపనిగా యేడవడం మొదలుపెట్టాడు. ఇలా మూడు రోజులపాటు, తిండిలేకుండా అదేపనిగా వణుకుతూ యేడుస్తూ ఉన్నాడు. డాక్టర్ ఇచ్చిన మందులు కూడా యేమీ పనిచేయలేదు. తరువాత వారు బాబుని బాబా గారివద్దకు తీసుకుని వచ్చి విగ్రహం వద్ద పడుకోబెట్టారు. పూజారి గారు బాబా గారి పేరు జపిస్తూ బాబు నుదిటిమీద ఊదీ ని రాశారు. వెంటనే బాబు యేడవడం మానేసి నవ్వడం మొదలు పెట్టాడు. బాబు సీసాలో ఉన్న పాలన్నీ అక్కడున్నవారి సమక్షంలో తాగేసి, మామూలుగా ఆడుకొవడం మొదలుపెట్టాడు.

లీల నం. 7

తారిత్ పాల్ అనే భక్తుడి కూతురికి మొహనికి పక్షవాతం వచ్చింది. ఆయన కూతురుని యెంతో మంది డాక్టర్స్ దగ్గిరకి తీసుకువెళ్ళారు, కాని యెవరూ నయం చేయలేకపోయారు. తరువాత తారిత్ గారు మెను బాబా గుడికి తీసుకుని వచ్చి మొహం మీద యెక్కడయితే పక్షవాతం వచ్చిందో అక్కడ ఊదీని రాయడం మొదలుపెట్టారు. వాడిన మందులన్నీ నిష్పలమైన తరువాత బాబా వారి అనుగ్రహంతో ఆమె పక్షవాతం తగ్గిపోయి మామూలు స్థితికి వచ్చింది.

లీల నం. 8

గ్రామంలొ ఇటువంటి లీలలు చాలా జరిగాయి. పెళ్ళికాని యువతులు బాబా గారికి గుడిలో పూజలు చేయగానే వివాహాలు జరిగాయి. క్రిష్ననగర్ లోని బాలాయి ఘోష్ అనే ఆయన కడు బీద స్థితిలో ఉన్నాడు. కనీస అవసరాలకి కూడా అతని వద్ద డబ్బు ఉండేది కాదు. ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు గాని యేమి ఫలించలేదు. పూర్తిగా నిరాశ చెంది జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నాడు. హటాత్తుగా అతని మనసులో షివపూర్లోని బాబా గుడికి 500/- విరాళమిస్తే అతని చెడు రోజులన్నీ పోతాయన్నట్లుగ ఒక సందేశం వచ్చింది. ఇతని వద్ద పాత సైకిలు తప్ప యేమీ లేదు. అందుచేత సైకిలుని 500- కి అమ్మేసి వచ్చిన డబ్బు బాబా గారికి దక్షిణగా ఇద్దామనుకున్నాడు. అతను సైకిలుని 500- అమ్మేసి ఆవచ్చిన సొమ్ము తీసుకు వెళ్ళి షివపూర్ బాబాగుడికి వెళ్ళి, బాబా గారి పాదాల వద్ద పెట్టి ఇంటికి తిరిగి వచ్చాడు. సరిగ్గా 7 రోజుల తరువాత బాలాయి దూరపు బంథువు ఇతనిని చూడటానికి వచ్చాడు. బాలాయి బంథువుని యెప్పుడూ చూడలేదు. బాలాయిని, తను చేస్తున్న వ్యాపారంలో భాగస్వామిగా ఉండమని అడిగాడు. బాలాయి వ్యాపారంలో యే విథమయిన పెట్టుబడి పెట్టనవసరం లేదు అని చెప్పాడు. బాలాయి బంథువుకి బ్యాటరీలు తయారీ, మరియు రిపేర్ వ్యాపారం ఉంది. వ్యాపారం బాగా అభివృథ్థి చెందింది. ఒక సంవత్సరం తరువాత బాలాయి గారు వ్యాపారంలో లాభం యెంతవచ్చిందో చూద్దామనుకున్నాడు. అతని బ్యాంకర్, అతనికి ఒక సంవత్సరంలో 5 లక్షల రూపాయలు లాభం వచ్చిందని చెప్పాడు. ఇదే బాబా గారి చమత్కారము. బాబాగారు కడుబీదవాడిని థనవంతుడిగా చేశారు. బాలాయి, గారు బాబా గారికి 500/- ఇచ్చారు, బాబాగారు అతనకి 1000 రెట్లు తిరిగి ఇచ్చారు.

కనీసం ముగ్గురు నలుగురు, తాము, రాత్రివేళ 2 , 2.30 మథ్య గుడి పైన వేప చెట్టు పైనించి, గుడిపైదాక ఒక గుండ్రటి తెల్లని కాంతి , బంతి ఆకారంలొ వెలుగులు విరజిమ్ముతూ తిరుగుతూ ఉండడం చూశామని అమిత్ విస్వాస్ గారికి చెప్పారు. గుండ్రటి బంతి రెండు మూడు సార్లు తిరిగి మాయమయిపోయిందని చెప్పారు.

లీల నం. 9

ఒకరోజున గుడిలో సాయంత్రం హారతి జరుగుతోంది. గుడి ప్రశిడెంట్ అయిన అమిత్ విశ్వాస్ గారు గుడి బయటకి చూశారు. ఆయన బాబాగారు, థొతీ, కుర్తా, కఫినీ, థరించి కీర్తనకి అనుగుణంగా నాట్యం చేయడం చూశారు. ఆరతి పాట జరుగుతున్నంత సేపూ బాబాగారు నాట్యం చేసి మాయమయిపోయారు. విషయం అమిత్ విశ్వాస్ గారు చెప్పారు.

ఒకావిడ, అనుకోకుండా తన భర్తకి పక్కింటి అమ్మాయితో అక్రమ సంబంథం ఉందని కనిపెట్టింది. వారి వివాహమయిన 15 సంవత్సరాల తరువాత ఇటువంటిది జరుగుతుందని ఆవిడ ఊహించలేకపోయింది. భర్త ఆవిడతో ఉండటానికి ఇష్టపడక దెబ్బలాడుతూ ఉండేవాడు. ఈమె బాథ పడి యేడ్చింది. ఆమె బాబా గుడికి వెళ్ళి తన భర్త మరలా తనతో ఉండేలాగ చేయమని మొర పెట్టుకుంది. తన భర్త అక్రమ సంబంథాన్ని వదులుకుని వస్తే బాబాగారికి పాయసం నివేదన చేస్తానని బాబా గారికి మాట ఇచ్చింది. నెల తరువాత ఆమె భర్త తిరిగి వచ్చాడు. అతను పక్కింటి అమ్మాయితో పెట్టుకున్న సంబంథాలన్నిటిని వదిలేశాడు.

లీల నం. 10

గుడి సాయి భక్తుల విరాళాలతో నిర్మించబడింది. శ్రీ కె.వి.రమణి అనే గొప్ప భక్తుడు, గుడి నిర్మాణ సమయంలో పెద్ద మొత్తంలో విరాళమిచ్చాడు. ఒకరోజున గుడి సీలింగ్ పని చేసేటప్పుడు పనివారికి 5,000/- రూపాయలు ఇవ్వవలసి వచ్చింది. పనివారికి డబ్బు ఇవ్వకపోతే వారు పనిలొకిరారు. రోజు రాత్రి గుడిని నిర్మించేవారి వద్ద నయాపైసా లేదు. మరునాడు గుడి నిర్మాణం కొనసాగించడమెలాగా అని బాగా వ్యాకులత పడ్డారు. 5,000/- రూపాయలు యెక్కడనించి తేవాలి? వారు బాబా మీదే భారమంతా వేసి పడుకున్నారు. మరునాడు ఒకాయన తన కుటుంబంతో షివపూర్లొని బాబా గుడికి దర్శనం కోసం వచ్చాడు. ఈయన దుబాయి నుంచి వచ్చాడు, కలకత్తాలో ఉన్న తన స్నేహితుడి ద్వారా షివపూర్లోని బాబా గుడి గురించి విన్నాడు. ఆయన బాబా దర్శనం చేసుకుని పూజలు చేశారు. తరువాత 5,001/- రూపాయలకు చెక్కు మీద సంతకం చేసి బాబా గారికి దక్షిణగా, గుడి యాజమాన్యానికి చెక్కు ఇచ్చారు. బాబా గారు ఉన్నప్పుడు మనం బుఱ్ఱలో అందోళనలు పెట్టుకోవడం యెందుకు. అదే బాబా లీల.

లీల నం. 11

గ్రామంలో ఉన్న ఆవులు, బాబా ఊదీ కలిపిన నీటిని తాగిన తరువాత ఆంథ్రాక్స్ వ్యాథినుండి బయట పడ్డాయి. ఒక్ ఆవుకి 6 సంవత్సరములకి, దాని నుదిటిమీద బాబా ఊదీని రాసి, ఊదీ కలిపిన నీటిని తాగించిన తరువాత దూడ పుట్టింది.

ప్రతి సంవత్సరము జరిపే షివపూర్ బాబా గుడి వార్షికోత్సవాల్లొ, పది వేల మందికి అన్నదాన కార్యక్రమన్ని జరిపించే బాథ్యత సమీర్ భట్టాచార్జీ అనే ఆయన తీసుకుంటాడు. ఒక సంవత్సరం ఈయన జబ్బు పడ్డాడు. ఆలయ కమిటీ వారు సంవత్సరం ఉత్సవాలు భారీగా కాకుండా తక్కువగా చేద్దామనుకున్నారు. ఆఖరి నిమిషంలో గుడి ప్రశి డెంట్ అయిన అమిత్ విశ్వాస్ గారు, భక్తులందరికి, అన్నదాన కార్యక్రమానికి తమకు తోచిన విరాళాల ను ఇమ్మని విజ్ణప్తి చేశారు. అనుకోకుండా చాలా మంది, బియ్యము, కూరగాయలు, పప్పులు, వాటితో వచ్చారు. వారు తెచ్చినవాటితో పది వేలమందికి అన్నదానం చేయడమే కాకుండా ఇంకా మిగిలిన వాటిని బాబా ప్రసాదంగా తమ తమ ఇళ్ళకి తీసుకువెళ్ళారు. బాబా గారు సర్వాంతర్యామి. బాబా లీలను అర్థం చేసుకోవడం కష్టం.

.

లీల నం. 12

నాదియా జిల్లాలోని టెహత్త పి.ఎస్. బెతాయి జోర్డర్ గ్రామం లో శ్రిమతి తపతి మొందల్ గారికి పెళ్ళయి 20 సంవత్సరాలు అయింది. వైద్య శాస్త్ర పరంగ వారికి పిల్లలు పుట్టే అవకాశం లేదు. వారు నిరాశా నిస్పృహలతో మానసికంగా చాలా వేదనతో ఉండి, షివపూర్ బాబా గుడికి వచ్చారు. వారు అమిత్ విశ్వాస్ గారితో చాలా సేపు సంభాషించిన తరువాత, అమిత్ గారు ఆమె నుదిటి మీద బాబా ఊదీ ని పెట్టి, ప్రతీరోజు, ఊదీ ని పెట్టుకోమని చెప్పారు. ఆమె యెంతో భక్తితో ఊదీని పెట్టుకుంది. విచిత్రంగా ఆమెకి, 3 కె.జీ. 800 గ్రా. బరువుతో జనవరి 2010 ఆడ శిశువు జన్మించింది. తల్లీ బిడ్డ సుఖంగా ఉన్నారు.

లీల నం.13

విథంగా షివపూర్ బాబా గుడిలో లీలల మీద లీలలు జరుగుతున్నాయి. గ్రామంలో థరణీ థర్ మొండల్ అనే ఆయనకి సెరిబ్రల్ అటాక్ వచ్చి కోమాలో ఉన్నారు. అందరూ ఆశ వదులుకున్నారు. కాని విచిత్రంగా బాబా ఊదీ ని నుదుట పెట్టి, కొంచెం నోటిలో వేయగానే మూడు రోజులలో లేచి తిరగడం మొదలుపెట్టారు. ప్రతిరోజు బాబ్ గుడికి రావడం మొదలుపెట్టారు.

లీల నం.14

శ్రీ సంతు మొండల్ అనె 9 తరగతి విద్యార్థి, మొహము మీద ఇన్ ఫెక్షన్ సోకి, ఆరు నెలలుగా మందులు వాదుతున్నప్పటికి యేమీ ప్రయోజనం కనపడకపోగా, షివపూర్ బాబా గుడికి వచ్చి బాబా ఊదీ పెట్టుకోగానే విచిత్రంగా వారం రోజులలో ఇన్ ఫెక్షన్ తగ్గిపోయింది.

క్రితం సంవత్సరం ఉత్సవాలు జరుగుతున్నప్పుడు, బాబా దయవల్ల సంతానవతులైన నలుగురు తల్లులు బాబా గుడికివచ్చి వారి పిల్లల బరువు యెంత ఉందో అంతే బరువుతో స్వీట్స్ అక్కడున్నవారందరికీ పంచిపెట్టారు.

శ్రీమతి కమలా బాలా జోర్దార్ అనే 75 సంవత్సారాల మహిళకి కుష్టు వ్యాథి మూడవ దశలో ఉంది. డాక్టర్ ఆర్జిత్ ముఖర్జీ నాదియా జిల్లా హాస్పిటల్ వైద్యుడు, ఎం.డి.టి. డొసు 12 నెలలపాటు వైద్యం చేసి తిప్పి పంపివేయగా, ఈమె 12 నెలలపాటు గుడిలో బాబా ప్రసాదము ఊదీతో కలిపి తీసుకొనగా, బాబా అనుగ్రంతో ఆమె వ్యాథి తగ్గిపోయింది. ఆమె ఉత్సవంలో సంతోషంతో నాట్యం చేసింది.

లీల నం.15

20 రోజుల క్రితం ఒక బాలుడికి ఫైబర్ ముక్క కంటిలో గుచ్చుకొంది. తల్లితండ్రులు పిల్లవానిని హాస్పిటలికి (కలకత్తాలో ప్రముఖ కంటి ఆసుపత్రి) తీసుకువెళ్ళారు. 15 రోజులు వైద్యం చేసినా యెమి గుణము కనపడలేదు. వారు కన్ను పూర్తిగా చెడిపోయింది, భవిష్యత్తులో అబ్బాయి చూడలేడు, చూపుపోతుంది అని చెప్పారు. తల్లి తల్లడిల్లిపోయింది. ఆమె షివపూర్ బాబా గుడికివచ్చి బాబా ముందర విలపించింది. ఆమె అమిత్ గారిని పిల్లవాడికోసం బాబాని ప్రార్థించమని చెప్పింది. అమిత్ గారు బాబా ముందు ప్రార్థించి ఆమెకు బాబా ప్రసాదం ఇచ్చారు.

తరువాత వారు పళ్ళు తీసుకువచ్చి బాబా కి కృతజ్ణతలు చెప్పారు, అబ్బాయికి ఛూపు వచ్చిందని ఆనందంతో చెప్పారు. యెంత అద్భుతమైన లీల చేశారు బాబా గారు?

లీల నం.16

కొన్నాళ్ళక్రితం ఒక పెద్దాయన ఉదయం 4 గంటలప్రాంతంలో అమిత్ గారి వద్దకు వచ్చి శిరసు వంచి నమస్కరించారు. అమిత్ గారు ఆశ్చర్య పోయి, నాకెందుకు శిరసువంచి నమస్కారము చేస్తున్నారు, నేను మీకన్న చిన్నవాడిని అన్నారు. అప్పుడు ఆయన తనకి వహ్చిన కల గురించి చెప్పారు.

"అమిత్జీ గారు పొడవైన కఫినీ, ధోతీ థరించి, కుడిచేతిలో సటకా, యెడమ చేతిలో కమండలము థరించి సముద్రము మథ్యలో కూ ర్చున్న బాబా గారి వద్ద నిలబడి ఉన్నారు. ఇద్దరూ సంభాషించుకొంటున్నారు, బాబా గారి చేయి అమిత్ గారి మీద ఉంది. " వచ్చిన కల గురించి అమిత్ గారికి చెప్పారు. అమిత్ గారు బాబాగారిచెత అనుగ్రహింపబడినవారు.

ఇవీ సౌమ్య గారు చెప్పిన షివపూర్ బాబా మందిర లీలలు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు


Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment