సత్సంగము
04.02.2011 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులారా బాబా ఆశీర్వాదములు
ఇన్నాళ్ళూ మనము బాబా లీలలను చదువుకున్నాము. ఇవాళ మనం కొంచెం సేపు సత్సంగము చేసుకుందామా?
ఈ సత్సంగములో మనం సాయి తత్వము గురించి తెలుసుకుందాము.
సత్సంగం పట్లా, సత్కథా శ్రవణం పట్లా సద్భావం, సదా వాటిలో నిమగ్నమయే సంస్కారం ఉన్నవారి భాగ్యమే భాగ్యం.
ఒక్కసారి కనులు మూసుకుని మీ కనులముందు బాబా వారిని దర్శించుకోండి. మీరు ఒక్కరే కంప్యూటరు ముందువున్నట్లు కాకుండా, సాయి బంథువులందరూ కూర్చున్నట్లుగా భావించుకోండి.
యెదురుగా ఉన్న బాబా ఫోటొ వంక చూడండి.
అందరూ చెప్పండి. సద్గురు సాయి నాథ్ మహరాజ్ కీ జై
ఒక్కసారి బాబా నామ స్మరణ చేయండి.
ఓం సాయీ నమోనమహ శ్రీ సాయీ నమోనమహ
జయజయ సాయీ నమోనమహ, సద్గురు సాయి నమోనమహ
కళ్ళు మూసుకుని రెండు నిమిషాలు బాబాగారి రూపాన్ని ఊహించుకుని థ్యానం చేయండి.
ఇప్పుడు మీ చేతుల్లోకి సచ్చరిత్ర తీసుకుని యేదో పేజీ లో ఒక పేరా చదవండి.
సచ్చరిత్రలో ప్రతీ పేజీ కూడా బాబా వారు చెప్పినవి అమృతపు గుళికలు. అందుచెత పారాయణ చేసేటప్పుడు మన మనసంతా అందులో లీనమయిపోవాలి. అథ్యాయం యెప్పుడు పూర్తవుతుందా అనే ఆలోచన రాకూడదు. చరిత్ర చదివాక ఒక్కసారి చదివినది మరల జ్ణప్తికి తెచ్చుకోవాలి. ఆనాటి షిరిడి, అప్పుడు బాబా గారు అక్క్డ డవుండే వారితో యెలా ఉన్నారు ఇటువంటి దృశ్యాలన్నీ మన కనులముందు సాక్షాత్కరింప చేసుకోవాలి.
ఆనాటి షిరిడీ గ్రామం, ఖండొబా దేవాలయము, మసీదు, చావడి, పైన యిచ్చిన చిత్రాలని మరలా ఒకసారి చూడండి.
ఇందులో పొందుపరచిన చిత్రాలలో నంద దీపము , మందిరంలో బాబా గారి విగ్రహము పెట్టకముందు ఫోటొ, విగ్రహము పెట్టిన తరువాత, శ్రీ తాలిం గారు బాబా విగ్రహమును చెక్కుతున్నట్లు ఉన్న ఫోటోలు ఉన్నవి.
శ్రీ సాయిబాబా పట్ల భక్తిగా ఉండేందుకు పదకొండు కారణాలు
1. మొదటిదీ, విశిష్టమైనదీ అయిన కారణం, శ్రీ సాయిసచ్చ్రిత్ర గ్రంథకర్త హేమాద్పంత్ చెప్పినట్లు బాబా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే నియమం పెట్టుకొన్నారు. (అ. 13)
2. అది కూడా వెంటనే ఆలస్యం కాకుండా, మీరు నిజమైన శ్రథ్థతో అడగండి, సహనం పెట్టుకోండి. ఇక మీ కోర్కీలు తీరిపోయినట్లే.
మీరు యెవ్వరైనా, యెక్కడున్నా నా ముందు భక్తి భావంతో అంజలి ఘటించి, విన్నపం చేసుకుంటే నేను మీ వెనుక భావావేశంతో రాత్రింవవళ్ళు నిలబడి వుంటాను. (అ.15)
3. ఆయన ఎంత సహజంగా ప్రసన్నులౌతరంటే అందుకు కఠిన తపశ్చర్య అవసరం లేదు. కష్టదాయకమైన ఉపవాసాలూ, తపవాసాలూ అక్కరలేదు. కఠోరమైన యింద్రియ నిగ్రహం కూడా అవసరం లేదు. బాబా నే చెప్పినట్లు నీవు నావైపు చూస్తే నేను కూడా అలాగే మీవైపు చూస్తాను.
4. బాబా దేహ త్యాగం చేసి యిన్ని సంవత్సరాలయినా, ఈ రోజుకీ వేలాది మంది భక్తులకి ఆయన తమ అస్థిత్వాన్ని తెలుపుతున్నారు. వారి పిలుపుకి ఆయన పరుగున వస్తున్నట్లు అనుభవం కూడా కలుగుతోంది.
నేనొకవేళ మరణించినా నా మాటలు ప్రమాణంగా తీసుకోండి. నా యెముకలు నా సమాథినుంచి మీకు థైర్యాన్నిస్తాయి.
5. బాబా యిప్పుడు దేహథారి కాకున్నా ఆయన్ని సద్గురువుగా భావించి భక్తిని కలిగివుంటే మనం మోసపోతామేమోనన్న చింత వుండదు. ఈ రోజుల్లో మన దేశంలో తమను భగవాన్, అవతారం, మహర్షి అని అనిపించుకొనే అనేకమంది గురువులను చూసినప్పుడు నిజమైన గురువు యెవరో తెలుసుకోవటం చాలా కష్టమైపోయింది.
6. బాబా పట్ల భక్తి కలిగి వుండటానికి డబ్బు అవసరం లేదు. కేవలం పూలు, లేక ఆకులు, నిజమైన ప్రేమతో మోక్షం ప్రాప్తిస్తుంది. ఆదరంతో యేది అర్పించినా ఆయనకి సరిపోతుంది. రెండు చేతులతో చేసే నమస్కారాన్ని కూడా ఆయన యిష్టపడతారు.
7. బాబాకి మన కష్టాల గురించి యేకరువు పెట్టుకోవటానికి ప్రతీసారీ డబ్బు ఖర్చు పెట్టుకొని షిరిడీకి పోనవసరం లేదు. ఆయన త న భక్తులు, యెక్కడనుంచైనా (సప్త సముద్రాల కవతలినుంచైనా) సరే పిలిస్తే ఆయన పరుగున వస్తారు.
నాకు బళ్ళు, వాహనాలు, విమానాలు, రైళ్ళు అవసరం లేదు. నన్ను ప్రేమగా యెవరు పిలుస్తారో వారిముందు నేను వెంటనే ప్రకటమౌతాను. (అ. 40)
8. ద్వాకామాయిలోని అఖండంగా వెలిగే థునిలోని విభూతి సర్వ రోగాలకీ రామబాణం లాంటి ఔషథం.
ఈ విభూతిని అద్దుకొంటే ఆది వ్యాథులు పోతాయి. (అ.33)
వారి పాతకాలు పూర్తిగా నశిస్తాయి. సదా సర్వదా వారికి సుఖసంతృప్తులు లభిస్తాయి.
9. సచ్చరిత్ర గ్రంథం కాదు. కల్పవృక్షమే. సంసారులకు అది నిస్సారంగా అనిపిస్తుంది. కాని, మోక్షాన్ని వాంచించే భావికులకు అది కేవలం మూర్తీభవించిన మోక్షమే అనిపిస్తుంది. (అ.53)
10. బాబాకున్న సాయి అనే పేరు చాలా చిన్నది. తియ్యనిది. పలకటం సులభం. కష్టమైన జోడాక్షరాలూ లేవు. నాలుకకి బాథా లేదు. సాయి సాయి అన్న నామ స్మరణ నిరంతరం చేస్తే మీ కష్టాలు గట్టెక్కి కోర్కెలు నెరవేరుతాయి. యెంత మాత్రమూ సందేహం పెట్టుకోకండి. (అ.10)
11. నన్ను అనన్యంగా శరణు వచ్చి, యెవరు నన్ను నిరంతరం స్మరిస్తుంటారో వారి ఋణం నా తలమీద వుంటుంది. వార్ని ఉథ్థరించి దాన్నించి నేను ముక్తుడినౌతాను. (అ.44)
గ్రంథ పారాయణ చేసేటప్పుడు, శ్రథ్థ, సహనం వుంటేనే అనుకున్న ఫలప్రాప్తి అవుతుంది.
హడావుడి పడకుండా శ్రథ్థతో ఈ కథా అనే అమృతరసథారలను ఆదరపూర్వకంగా సేవెస్తే శ్రోతలకు ప్రేమ యుక్త భక్తి లభించి, వారుకృతార్థులవుతారు.
పిసినారి వాళ్ళు యే పని చేస్తున్నా వారి మనోనేత్రం ముందు పూడ్చిపెట్టిన థనమే రాత్రింబవళ్ళు కనిపించినట్లు అలా మన మనొనేత్రంలో సాయియే కనిపించాలి.
మీరు యెక్కడకు వెడుతున్నా సరే మీ హృదయంలో సాయి ఉన్నాడనే థైర్యంతోను, భక్తిభావంతోను, వెళ్ళండి. సాయి నిరంతరమూ మీవెంటే ఉంటారు.
భవవంతుడు అన్ని చోట్లా నిండి వున్నాడు. గుడిలోనే ఉన్నాడని అనుకోవద్దు. కాని గుడిలొ ఒక విథమైన పవిత్ర వాతావరణం ఉంటుంది. అనుదుచేత మనస్సు భక్తిభావంతో నిండి మనస్సు భగవంతుడి మీద లగ్నమవడానికి ఆస్కారం ఉంది. ఆస్కారం ఉంది అని యెందుకని అంటున్నానంటే, గుడిలోకి వెళ్ళగానె తెలిసిన వారు కనిపించారనుకొండి, "యేమండీ, బావున్నారా, యేమిటీ, ఈమథ్య కనపడటల్లేదు, పిల్లలంతా బావున్నారా, పిల్లలు యేమి చేస్తున్నారూ? ఈ మథ్య అబ్బాయి పెళ్ళి చేశారట కదా నన్ను మర్చిపోయారు, పిలవనే లేదూ" యిలాంటి ప్రాపంచిక విషయాలు మాట్లాడుకొంటే ఇక భక్తిభావం మనకీ ఉండదు, భక్తితో వచ్చిన పక్కవారిని కూడా మన సంభాషణ యిబ్బందిగా ఉంటుంది.
అందుచెత సాయి భక్తులమైన మనము యెక్కడకు వెళ్ళినా, కూడా అనన్యమైన భక్తి శ్రథ్థలతో వెళ్ళాలి. సాయి బిడ్డలమైన మనము సాయి ప్రవచనాలు ఆయన చెప్పిన విలువైన అమృత వాక్కులు మననం చేసుకుంటూ వాటిని ఆచరణలో పెట్టాలి.
సాయి యేవ్యక్తుల మథ్య కూడా భేదం చూపలేదు.
ఈ రోజు యింతటితో ప్రస్తుతానికి ముగిద్దాము.శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment