నయం కానివాటిని కూడా ఊదీ నివారిస్తుంది (1983)
శ్రీ డి.ఎల్. కాంతారావు గారు, కర్నూలు వారు వ్రాసిన బాబా ఊదీ లీల సాయి లీల పత్రికలొ ప్రచురింపబడినది.
ఈ రోజుకీ కూడా ప్రపంచ వ్యాప్తంగా బాబా గారి భక్తులందరూ కూడా ఆయన లీలాని అనుభవిస్తున్నారు.
ఇంక ఊగీసలాడే నమ్మకం ఉన్నవారికి నమ్మకం మరింత బలపడెలాగ, గత నలుగు దశాబ్దాలుగ బాబా భక్తుడిగా ఈ లీలను సాయి లీల ద్వారా తెలియచేయడం నా థర్మంగా భావిస్తున్నాను. బాబా గారు షిరిడీ వచ్చిన తరువాత అక్కడి గ్రామస్తులకి మందులతో వైద్యం చేసి జబ్బులను తగ్గించెడివారు. తరువాత తన వద్దకువచ్చినవారికి ఊదీ వైద్యం చేసి జబ్బులను తగ్గించేవారు. ఈ రోజుకీ కూడా నమ్మినవారికి, పూర్తిగా బాబాగారిని సర్వస్య శరణాగతి చేసి, ఊదిని ధరించినవారికి అది పరమ ఔషధం
1982 ఫిబ్రవరిలో మా ఆఖరి అమ్మాయి శ్రీనిజకి మొహం మీద నల్లని మచ్చలు వచ్చాయి. అప్పుడామె వయసు 5 సంవత్సారాలు. రోజురోజుకి మచ్చలు సైజు పెరగడం మొదలుపెట్టాయి. రోజురోజుకి ఆమె అందమైన మొహం అందవికారంగా తయారవడం మొదలైంది. నా శ్రీమతి భాగ్యమ్మ దీని గుర్నించి చాలా అందోళన పడసాగింది. నేను ఆమెకు బాబాకి పూర్తిగా శరణువేడి, అమ్మాయి మొహమంతా ఊదీ రాయమని ఒప్పించాను. ఆమె కొద్దిరోజులు అల్లాగే రాసింది, కాని,తగ్గకపోగా మరింతగ సైజు పెరిగి ముట్టుకుంటే గట్టిగా తగలడం మొదలుపెట్టాయి. నా భార్యను సంతృప్తి పరచాడానికి మా అమ్మాయిని నర్సింగ్ హోం కి తీసుకువెళ్ళాను. అక్కడి డాక్తర్ ఎం.డి. ఆయన భార్య ఎం.బి.బి.ఎస్. ఇద్దరూకూడా నాకు యెప్పటినుంచో స్నేహితులు. డాక్టర్లు ఇద్దరూ కూడా శ్రీనిజాని యెంతో ఓర్పుతొ పరీక్షించారు. ఇంగ్లీషులో దీనికి మందులులేవని, అవి ఇంకా బాగా పెరిగిన తరువాత ఆపరషన్ ఒక్కటే మార్గమని తేల్చి చెప్పారు. వారు, మందులమీద అనవసరంగా ఖర్చు పెట్టవద్దు అని సలహా ఇచ్చారు.మచ్చలని మానపటానికి మందులు లేవని చెప్పారు. బరువెక్కిన హృదయంతో మేము యింటికి తిరిగి వచ్చాము. నా భార్యని తృప్తి పరచడానికి బజారులో ఆయింటుమెంట్ కొని ఒక్కక్కమచ్చమీదే నా భార్య సమక్షంలో రాయడం మొదలుపెట్టాను. నాలుగు రోజుల తరువాత మేము గమనించినదేమంటే మచ్చలు యింకా వచ్చి గట్టిగా తయారయి ముట్టుకుంటే ముళ్ళలాగ గుచ్చుకోవడం మొదలయ్యాయి. నా భార్య కన్నీళ్ళతో నావద్దకు వచ్చి అమ్మాయి మొహమ్మీద మచ్చల మీద ఊదీని రాయమని అడిగింది. ఆమె, బాబాగారు ఒక్కరే ఆ మచ్చలని తగ్గించగలరు అని గ్రహించుకుని ఆయనకి పూర్తిగా శరణాగతి చేసింది. శ్రీనిజ మొహము మీద మచ్చలు పూర్తిగా ఒక వారం రోజులలో తగ్గిపోతాయని ఆమెకి భరోసా యిచ్చాను. పొద్దున్న, సాయంత్రము పూజ అయినతరువాత ఊదీ రాయడానికి అమ్మాయిని తీసుకుని రమ్మని చెప్పాను. బాబాగారిని మా తప్పులన్నిటినీ క్షమించి ఆయన పవిత్రమైన ఊదీతో మచ్చలని నయం చేయమని ప్రార్థించాము. అమ్మాయికి తిరిగి పూర్వంలాగ మొహం అందముగా తయారయితే షిరిడీ వస్తామని మొక్కుకున్నాము.
పొద్దున్న, సాయంత్రము, పూజ అయినతరువాత మా వద్ద ఉన్న షిరిడీ ఊదీని అమ్మాయి మొహమంతా రాశాము. పొద్దున్న సాయంత్రము ఊదీని నీళ్ళల్లొ కలిపి తాగించాము. కొత్తగా మచ్చలు రాడం, ఉన్న మచ్చలు మెత్తగా అవడం మేము గమనించాము. ఓహ్, విచిత్రాతి విచిత్రం, వారం రోజులలో మామ్మాయి శ్రీనిజ మొహం మీద యెటువంటి మచ్చలు లేకుండా, పూర్వంలాగా చాలా అందంగా తయరయింది. మా అనందానికి అవధులు లేవు. ఈ లీల చూశాక సంధిగ్థావస్తలో ఉన్న నా భార్య నమ్మకం మరింత బలపడి పూర్తిగా బాబా గారి చరణాలకు శరణాగతి చేసింది.
తరువాత ఈలీల గురించి, యెటువంటి మందులతోను, శస్త్రచికిత్సతోను కాకుండా పవిత్రమైన ఊదీతో మచ్చలన్ని మటుమాయమయాయని చెప్పేటప్పటికి దాక్టర్స్ కూడా ఊదీ మహత్యానికి ఆశ్చర్యపోయారు. మా కుటుంబమంతా కూడా అనుకున్న మొక్కు ప్రకారం, షిరిడివెళ్ళి, బాబా గారిని, ద్వారకామాయిని తృప్తిగా దర్శించుకున్నాము.
ఇప్పటికీ కూడా యెవరయినా సరే సర్వస్య శరణాగతిచేసి పవిత్రమయిన ఊదీ ని థరిస్తారో నయం కాని రోగాలన్ని నివారణ అవుతాయనడంలో యెటువంటి సందేహము అక్కరలేదు.ఫూర్తిగా నమ్మకం ఉండాలి.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
0 comments:
Post a Comment