08.02.2011 మంగళవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి.
భక్తి నివేదన
దేవుని నామాన్ని పలకడం నోరు చేసిన పుణ్యం
భగవంతుని అర్చించడం చేతులు చేసిన పుణ్యం
దేవాలయానికి వెళ్ళడం కాళ్ళు చేసిన పుణ్యం
పరమాత్ముని చూడటం కళ్ళు చేసిన పుణ్యం
భగవంతుని స్తుతులు వినటం చెవులు చేసిన పుణ్యం
యిలా చేయడం అనేది పూర్వ జన్మలో మనము చేసుకున్న పుణ్యం
--------------------------------------------------------------------
శ్రి చాగంటి కోటేశ్వరరావుగారి బాబా ప్రవచనాలు భక్తిసుథ.కాం లో వినవచ్చు.
షిరిడీలో బాబా లీల
పాఠకులకి ప్రతీరోజు యేదో ఒకలీల అందిద్దామని, మధ్య మధ్య లో విశ్రాంతి తీసుకుంటూ యివ్వడం జరుగుతోంది. ఒక్కక్కరోజు ఆలశ్యమవచ్చు. ఆంగ్లములోనించి తెలుగులోకి అనువదించి రాయడం కొంచెం శ్రమతో కూడుకున్న పని అయినా అంతా బాబాగారి సేవ.
ఈ రోజు బాబా లీల మరియొకటి తెలుసుకుందాము. ఇది జనవరి - ఫిబ్రవరి 2004 సాయి లీల పత్రికలొ ప్రచురింపబడినది. బాబాని నమ్ముకోవాలే గాని దుష్ట గ్రహములు కూడా పలాయనం చేస్తాయని ఈ లీల ద్వారా మనకౌ అవగతమౌతుంది.
శ్రీ బాబూ సాహేబ్ సఖారాం బాబుల్ పెండ్లి అయిన 3 నెలల తరువాత ఆయన భార్య సుశీలాదేవి స్పృహ లేకుండా పండ్లు బిగపెట్టుకుని పడిపోతూ ఉండేది. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా బాగా తెలుసున్నవాళ్ళు కనుక యెవరినీ సలహాలు అడగలేదు. కాని ఇది ఒక ప్రేతాత్మ వల్ల అయివుండవచ్చు అనుకున్నారు. ఆమెకు వైద్యం కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టారు. కాని, ఫలితం లేకపోయింది.
ఆమె ప్రతిరోజూ 18 గంటలు స్పృహ లేకుండానే వుండేది. అక్టొబర్ 1952 లో అది యింకా 23 - 24 గంటలదాకా పెరిగింది. 1952 అల్ట్ఫ్నర్ 25 న ఆమెను షిర్డీకి తీసుకుని వచ్చారు. ఆమెను బలవంతంగా అక్టోబర్ 25 - 26 తారీకులలో బాబాగారి హారతికి తీసుకుని వహ్చ్చారు. ఆమెకు ఊదీ యిచ్చి, తీర్థం త్రాగించారు. బాబా గారి సమాథి ముందు సాష్టాంగ నమస్కారం చేయించారు. సాయంత్రం హారతి అయిన తరువాqత ఆమె స్పృహ లేకుండా సమాథి వద్ద కింద పడిపోయింది. బాబా భక్తులలో ఒకరైన శ్రీ వై. బి. ప్రథాన్ గారు బాబా గారి తీర్థం ఆమె మీద చల్లుతూ ఉండమని చెప్పారు. వారు అట్లాగే చేశారు.
తరువాత ఆమెను ఆవహించిన ఆత్మ మాట్లాడటం మొదలు పెట్టింది. సుశీలాదేవి తన పుట్టింటినుంచి అత్తగారింటికి వస్తూండగా బెల్గాం బస్ స్టాండ్ వద్ద ఒక చెట్టు వద్ద ఆమెను ఆవహించినట్లు చెప్పింది.
అప్పుడు ఆఅత్మని నువ్వు ఆమె దేహాన్ని విడిచి వెళ్ళిపోతున్నావా అని అడుగగా బాబాగారు తనను కొడుతున్నారని, అంచేత వెళ్ళిపోతున్నానని చెప్పింది. ఇలా చెపుతూ ఆమె పడిపోయింది.
తరువాత సుశీలాదేవి లేచి బాబాగారి సమాథికి ప్రకక్షిణ చేసింది. యింటికి సంతోషంగా వెళ్ళిపోయింది. అందరూ కూడా బాబాగారికి కృతజ్ణతలు తెలుపుకున్నారు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment