19.02.2011 శనివారము
బాబా - కామథేనువు
ఈ రోజు మనము ఊర్వీ లాడ్ గారు ఆంగ్లబ్లాగ్ లో పోస్ట్ చేసిన బాబా లీలకు తెలుగు అనువాదము తెలుసుకుందాము.
బాబాగారి లీలలు అనంతము. మనము ప్రతిరోజు బాబా లీలలను చదువుతున్నాము, లీలలను అనుభవిస్తున్నాము.దీనిని బట్టిమనకి తెలిసేది యేమంటే బాబాగారు మనతో యెప్పుడు ఉంటారు. కాని ఆయన ఉనికిని మనము యెప్పుడు గ్రహిస్తామంటే మనము మంచి పనులు చేయాలి. అహంకారం ఉండకూడదు.
అహంకారంతో యెన్ని మంచిపనులు చేసినా అవన్ని నిష్ప్రయోజనమే. బాబాగారు మనలని మంచి మనుషులుగానూ, వినయవిథేయతలతో ఉండాలని కోరుకుంటారు. అందుచేత మనము మొట్టమొదటగా చేయవలసినది యేమిటంటే, దయగలవారిగాను, మంచిమనుషులుగానుతయారవడం. ఈరోజు నేను పోస్ట్ చేయబోయేది, ఇంతకుముందు ఊర్వి లాడ్ గారి "బాబాతో నా మొట్టమొదటి అనుభూతి" కి ఇది అనుబంథము. ఇది కూడా ఊర్వీగారి లీల, దీనిని మీఅందరితో కూడా పంచుకుంటున్నాను.
సాయిరాం ప్రియాంకాగారు,
మొట్టమొదటగా నేను మీకు చెప్పదలచుకునేదేమంటే, మీ బ్లాగ్ ని చూడడం కుడా ఒకలీల. , యెందుకంటే నెట్ ముందు కూర్చుని ఒక గుజరాతీ పత్రిక కోసం నెట్ లో వెతుకుతున్నాను, మీ వెబ్ సైటుకి యేవిథంగా వచ్చానో నాకే తెలియదు. బాబా లీలలని చదవడం మొదలుపెట్టాను, చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇదంతా బాబాగారి అనుగ్రహమేనని అనుకున్నాను. నేనింకా యెన్నో అనుభవాలని మీతో పంచుకుంటానని మాట ఇచ్చాను, అందుకనే నేను నా వ్యక్తిగత అనుభవాలని మిగిలిన భక్తులందరితోనూ పంచుకుంటాను. నేనీరోజు మీకు పోస్ట్ చేయబోయేది నాకు కెనడా వీసా రావడానికి, నా వివాహమునకు బాబాగారు యేవిథంగా సహాయము చేశారో వివరిస్తాను.
నాకు కాలి మీద చర్మ వ్యాథి (తెల్లమచ్చలు) ఉంది. సంఘంలో అందరూకూడా నన్ను తృణీకరించేవారు. కాని నేను మా నాన్నగారికి చాలా కృతజ్ణురాలిని, ఆయన నా కనడియన్ వీసా కోసం చాలా డబ్బు ఖర్చుపెట్టారు. దీనికంతా కూడా మామామయ్య చాలా సహాయం చేశాడు.
నాకు గుర్తుంది, నా 24వ పుట్టినరోజునాడు నేను యింటర్వ్యూకి వెళ్ళాను. బాబాగారి అపరిమితమైన ఆశీర్వాదంతో యింటర్వ్యూ, వైద్యపరీక్షలూ పూర్తి అయ్యాయి. అన్ని పనులూ చక్కగా జరుగుతున్నాయి. కనడియన్ ఎంబసీ కూడా నా వీసా పంపించడానికి సిథ్థంగా ఉంది. కాని ఈలోపులో యునైటేడ్ స్టేట్స్లో 9/11 అవడంవల్ల, నా వీసాకు సంబంథించిన పలులన్నీ ఆగిపోయాయి
మేము యెంతో కాలం యెదురుచూశాము. కాని ఫలితం కనపడలేదు. మేమంతా చాలా అందోళన పడ్డాము. చాలా డబ్బు ఖర్చయింది. ఒకరోజున మానాన్నగారు షిరిడీ వెడదామని నిశ్చయించారు. మేమంతా షిరిడీ వెళ్ళాము. దర్శనం బాగా అయింది. మరునాడు, కనడాలో ఉన్న మామామయ్య వద్దనుంచి, మాలాయరు గారికి నా వీసా వచ్చిందని ఫోన్ వచ్చింది.
నేను కెనడా వెళ్ళి స్థిరపడ్డాను. 9 నెలల తరువాత నా వివాహం కోసం యిండియ వచ్చాను. కాని నాకు 6 రోజుల సెలవు మాత్రమే ఉంది. ఒకరోజు నేను బొంబాయి ఏర్ పోర్ ట్లో దిగి వెంటనే మావూరు వెళ్ళాను. అదే రోజు నేను, మాన్నగారు మా యింటికి దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళాము. దర్శనము అయినతరువాత మందిరము ఆవరణలో మానాన్నగారితో షిరిడి వెడతానని చెప్పాను.
నా తల్లితండ్రులు నా కోరికను మన్నించారు. మరునాడు శుక్రవారమునాడు, నేను, మా అమ్మగారు, మా సోదరుడు, డ్రైవరుతో కారులో షిరిడికి బయలుదేరాము. షిరిడీలో 12 గంటల మథ్యాహ్న్న హారతి చూసి యింటికి తిరిగి వచ్చాము.మేము శుక్రవారము రాత్రికి యింటికి వచ్చాము, మరునాడు శనివారమునాడు నా కాబోయే భర్త నన్ను కలుసుకోవడానికి వచ్చారు. మేమిద్దరము ఒకరికొకరం ఇష్టపడ్డాము, బాబా ఆశీర్వాదముతో గురువారమునాడు నిశ్చితార్థము జరిగింది.
బాబా దయ వల్ల మంచి భర్త లభించాడు. మా వివాహము తరువాత మాకు అమ్మాయి పుట్టింది. నేను నాభర్త, ఇంక పిల్లలు వద్దనుకున్నాము. కాని ఒకరోజు రాత్రి నేను, నా భర్త బాబా గుడిలో ఉన్నట్లుగా కల వచ్చింది. నేను బాబాకి నమస్కరించి కళ్ళు తెరిచేటప్పటికి బాబాగారి కుడి కంటిలో బ్రహ్మాండమైన విశ్వము కనిపించింది. మరునాడు నా భర్తకి నాకు రాత్రి వచ్చిన కల గురించి చెప్పాను. నా భర్త ఆశ్చర్యపోయి తనకు కూడా అటువంటి కలే వచ్చిందని చెప్పారు. ఈ బాబా లీల తరువాత నేను గర్భము దాల్చానని తెలుసుకున్నాను.
ఆగష్ట్ 9, 2009 లో మాకు శ్రావణమాసములో 9.8.9 న ఇదికూడా బాబా రోజైన ఆదివారమునాడు అమ్మాయి పుట్టింది. (హిందూ కాలండరు ప్రకారం శ్రావణమాసం పవిత్రమైన నెల) గణేష్ చతుర్థి కూడా. మేము మా అమ్మాయికి "దిష" అని పేరుపెట్టాము. దిష బాబాగారు మాకు ప్రసాదించిన వరము.
ప్రియాంకాగారిని పరిచయం చేసి ఈ విథంగా బాబా లీలలను పంచుకునే భాగ్యాన్ని నాకు కలుగచేసినందులకు బాబాగారికి కృతజ్ణురాలిని. నాకు యింతటి ఆనందకరమైన జీవితాన్ని యిచ్చినందులకు బాబాగారికి చాలా చాలా కృతజ్ణురాలిని. బాబా నువ్వెప్పుడూ నాతోనే ఉన్నావు, అందుకనే నా భవిష్యత్తు గురించి నాకు యే చింతా లేదు.
సర్వం శ్రీ సాయినాథారపణమస్తు
0 comments:
Post a Comment