Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Sunday, February 20, 2011

సాయి మనవెంటే ఉంటారు -- 2

Posted by tyagaraju on 3:04 AM



























20.02.2011 ఆదివారము


సాయి మనవెంటే ఉంటారు -- 2

ఓంసాయి శ్రీ సాయి జయజయ సాయి

మనకు ప్రతిక్షణము మన మనస్సులో బాబా రూపమే ఉండాలి. మన నాలిక మీద బాబా నామం ఆడుతూ ఉండాలి. మనం కూర్చున్నా, నుంచున్నా "బాబా" అని స్మరిస్తూ ఉండాలి. ఆఖరికి ఫొన్ లో సమాథానం చెప్పేముందు "హలో" అనకుండా "సాయిరాం" అని పలకాలి. అప్పుడే మనకు బాబా తో సన్నిహిత సాన్నిహిత్యం యేర్పడుతుంది.
దీనివల్ల ఆపత్సమయంలో కూడా బాబా నామస్మరణ మనకు తెలియకుండా అప్రయత్నంగా మన నోటివెంట వస్తుంది. బాబా తక్షణ సహాయం మనకి అందుతుంది.
అటువంటి సంఘటన ఒకటి మనము ఇప్పుడు తెలుసుకుందాము. ఇంతకుముందు శ్రీ వేమూరి వెంకటేస్వర్లుగారి ని బాబా గారు రక్షించిన లీల చదివాము. (సాయి మనవెంటే ఉంటారు) ఆయనకే సంబంథించిన మరియొక లీల యిప్పుడు తెలుసుకుందాము.

శ్రి వేమూరి వెంకటేశ్వర్లు గారు బాబా అనుగ్రహమును పొందిన గొప్ప భక్తులు.
ఆయన ప్రార్థించకుండానే తనకు తెలియకుండానే జరిగిన తన కుటుంబ రక్షణ బాబా యెట్లు చూపించారో ఈ లీల ద్వారా మనకి తెలుస్తుంది.

1957 సెప్టెంబరు 6 వ తేదీన సాయంత్రము ఆరుగంటల సమయమున శ్రీ వెంకటేశ్వర్లు గారు తన ఆఫీసు గదిలో శ్రీ సజ్జ వెంకయ్య గారను ఆయనతో మాట్లాడుతూ కూర్చున్నారు. యింతలో వీరి భార్య ఆదుర్దాగా వచ్చి పిల్లవాడు బావిలో పడ్డాడని చెప్పింది. ఆమాట వినికూడా ఈయన చలించక "బాబా" అంటూ లేచి తనతో మాట్లాడుచున్న వెంకయ్యతో కలిసి యింటి వెనక దొడ్డిలో ఉన్న బావి దగ్గరకు రెండు నిమిషాలలో వెళ్ళారు. వీరిద్దరు బావి వద్దకు వెళ్ళేసరికి బావిలో పడిన తన 15 యేళ్ళ వయసుగల మూడవ కుమారుడు ఒడ్డున నిలబడి ఉన్నాడు. తలకూడ తడిసి పోయిఉంది. ఆ అబ్బాయికి తాను బావిలో పడ్డానని గాని తిరిగి వచ్చితినని గాని తెలియలేదు. శ్రీ వెంకటేశ్వర్లుగారు ఆ బాలుని వీపుమీద తట్టి బావిలో యెల్లా పడ్డావు, మళ్ళా బయటికి యెల్లా వచ్చావు అని అడిగారు. అప్పుడు ఆ పిల్లవాడికి తాను బావిలో పడినట్లు గుర్తుకువచ్చి "నేను బావిలో పడినప్పుడు అడుగుకు పోలేదు. కొంత లోపలకు వెళ్ళగా ఒక యిటుకరాయి నా కాలుకింద అడ్డురాగా ఆ రాతిమీద నిలుచున్నాను. తరువాత యెవరో నన్ను యిక్కడ దింపారు" అని చెప్పాడు. బావి బొడ్డు బావి. ఆ బావి ఒరలతో ఉన్న బావి. బావికి గిలకలు కూడా లేవు. ఆ పిల్లవాడు బొడ్డు పైకెక్కి నీళ్ళు తోడుచు కాలు జారి ఆ బావిలొ పడ్డాడుట. ఆ బావిలో అప్పుడు 8 అడుగుల లోతున నీరు ఉంది. ఆ నీటిపై ఒడ్డుకు 5 అడుగుల యెత్తు ఉంది.

బావిలో నీళ్ళు 8 అడుగుల లోతున ఉన్నందున బావిలో పడ్డ ఆబాలుడు నీళ్ళల్లో మునగాల్సిందే.యిటుక రాయి నీటి పై యెట్లు తేలింది? ఆ రాతి మీద నిలిచి ఆ బాలుడు ముంగకపోవుట విచిత్రము కాదా? బావిలోనుండి పైకి తనంతట తాను రాలేడు కదా. అలనాడు బాబా మసీదు వెన్నుపట్టెలకు చెక్కబల్లను కట్టి దానిమీద యెవరికి అర్థము కాని రీతిలో యెక్కినట్లు ఈ బాలుని బాబాయే బావినుండి పైకి తెచ్చి నిలిపినారనడంలో యెటువంటి సందేహము లేదు. అక్కడకు వచ్చిన సజ్జా వెంకయ్యగారు వీరితో " పంతులుగారు! బావిలో పడ్డవాడు రెండు నిమిషములలో యెల బయటకు వచ్చాడండి, మీరు అక్కడ బాబా అని అన్నారు,యిక్కడ మీ అబ్బాయి ఒడ్దున వున్నాడు" అని అన్నాడు. యిది అంతయు బాబా లీలయే.

"సాయి సంకల్పిస్తే నీటిలో యిటుకరాయి తేలగలదు. ఆ రాయి 15 సం.బాలుని నీటిలో తేల్చగలదు. ఆ బాలుని పైకి విసరగలదు. ఒడ్డున నెలబెట్టగలదు. ఆఫీసుగదిలో బాబా అని అనుటయే ఆలస్యముగా ఆ తండ్రియే యిన్ని లీలలు చూపారనుటలో యెటువంటి సందేహము లేదు. యిట్టి సాయి లీలలు అనుభవించువారికే తెలుస్తుంది.తన భక్తులనే కాదు, వారికి అయినవారిని కూడా బాబా వెంటనుండి కాపాడుతారని తెలియవలెను" అని వెంకటేశ్వర్లు గారు అన్నారు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు




Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List