Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, March 23, 2011

సచ్చరిత్ర - ప్రశ్నలు, సమాథానాలు

Posted by tyagaraju on 7:15 AM
23.03.2011 బుథవారము కాంప్: బంగళూరు
సచ్చరిత్ర - ప్రశ్నలు, సమాథానాలు


కంప్యూటర్ ప్రాబ్లం వల్ల బాబా ఫోటొ, గులాబీ, పెట్టడం సాథ్యము కాలేదు.

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి.
సాయి బంథువులకు బాబా వారి శుభాశీశ్సులు

ఇంతవరకు మనము బాబా వారు చెప్పిన సాయి ప్రేరణ శ్రథ్థగా ఆలకించాము. బాబా లీలలు తెలుసుకుంటూ మథ్య మథ్య లో కొన్ని విషయాలు కూడా చెప్పుకుందాము. బాబా మందిరాల నిర్మాణము వెనుక బాబా గారి అదృశ్య శక్తి వుంటుందనేది మనకందరకు తెలుసు. అటువంటి ఒక బాబా మందిరం గురించి నిన్న తయారు చేయడం మొదలు పెట్టాను. పూర్తి అవడానికి యింకా కొంత సమయం పట్టచ్చు. అందుకని ఈలోపు కొన్ని మిగతా విషయాలు పోస్ట్ చేద్దామనుకుని నెట్ లో వెతుకుతూండగా బాబా సచ్చరిత్రలోని క్విజ్ కనపడింది. క్విజ్ తయారు చేస్తుండగా సుకన్యగారు కూడా అదే క్విజ్ ని నాకు మైల్ చేయడం అంతా యాద్రుఛ్ఛికం, మరి బాబా అనుమతి.

బాబా లీలలు చదవడమే కాదు, చరిత్ర పారాయణ చేయడమే కాదు, అందులో మనం యెంత వరకు గ్రహించుకున్నాము అని మనకు మనమే ప్రశ్నించుకోవాలి. ఈ క్విజ్ లో మొత్తం 100 ప్రశ్నలు సమాథానాలూ ఉన్నాయి. మొదటగా 30 ప్రశ్నలు సమాథానాలు మీతోపాటు నేను కూడా తెలుసుకుంటాను.


ఇక మొదలు పెడదామా...........



1. హేమాడ్పంత్ కు సాయి సచ్చరిత్రను వ్రాయడానికి ప్రేరేపించిన సంఘటన యేది?

ఒకరోజున ద్వారకామాయిలో బాబా గారు తిరగలి విసురుతుండగా హేమాడ్పంత్ గారు చూశారు. అప్పుడే ఆయనకు బాబా సచ్చరిత్ర వ్రాయాలనే సంకల్పం కలిగింది.

2. బాబా గారు తిరగలి విసురుతున్నప్పుడు, అక్కడికి ఆవూరి ఆడవారు యెంతమంది వచ్చారు?

నలుగురు ఆడవాళ్ళు వచ్చారు.

3. బాబాగారు తను విసిరిన గోథుమ పిండిని యేమి చేశారు?

బాబా గారు ఆ పిండిని ఊరి బయట చల్లించి షిరిడీలో కలరా వ్యాథిని నిర్మూలించారు.

4. గుఱ్ఱము మీద వచ్చిన మనిషి (తన సంచీలో బల్లిని తీసుకుని వచ్చాడు) బాబా దర్శనానికి షిరిడీ వచ్చినప్పుడు, బాబా గారు యేమి చేస్తున్నారు?

ఆ సమయములో బాబా గారు స్నానము చేస్తున్నారు.

5. బాబా గారు బలరాం మాంకర్ ను ప్రాయశ్చిత్తం నిమిత్తము మచ్చిందర్ ఘడ్ కు వెళ్ళమని చెప్పి, మచ్చిందర్ ఘడ్ వెళ్ళడానికి యెన్ని రూపాయలు ఇచ్చారు?

12 రూపాయలు ఇచ్చారు.

6. హరిశ్చంద్ర పితలే షిరిడీ వెళ్ళినప్పుడు బాబా గారు ఆయనకు యెన్ని రూపాయలు ఇచ్చారు?

3 రూపాయలు ఇచ్చారు.

7. బాబా గారు ద్వారకామాయిలో యెన్ని రోజులు నిద్రించేవారు, చావడిలో యెన్ని రోజులు నిద్రించేవారు?

ఒక్ రోజు ద్వారకామాయిలో, మరునాడు చావడిలో, మరలా మరునాడు ద్వారకామాయిలో మరునాడు చావడిలో ఇలా సమాథి చెందేవరకూ నిద్రించేవారు.

8. బాబా గారు రాథాబాయ్ దేస్ముఖ్ కి యేమి మంత్రము ఇచ్చారు?

శ్రథ్థ, సబూరి

9, శ్రీమతి కపరదే కి బాబా గారు యేమి మంత్రము ఇచ్చారు?

బాబా గారు ఆమెతో "రాజారాం రాజారాం" అని ఉచ్చరించమన్నారు.

10, బాబా గారు సమాథి చేందేముందు లక్ష్మీ బాయికి యంత డబ్బు యెన్ని వాయిదాలలో ఇచ్చారు?

బాగారు ఆమెకు 9 రూపాయలు ఇచ్చారు . మొదట 5 రూపాయలు, తరువాత 4 రూపాయలు.

11. బాబాగారు యెవరి వళ్ళో తన ఆఖరి శ్వాసను విడిచారు?

బాయాజీ కోతే పాటిల్.

12. బాబా గారు సన్యాసి రూపములో యిద్దరు చిన్న పిల్లలతో కలిసి దహానూలో ఉన్న శ్రి బీ.వీ.దేవ్ గారిని చూడటానికి వారి యింటికి వెళ్ళినప్పుడు, టాంగా ను యెవరి యింటిముందు ఆపి దిగారు?

అడ్వొకేట్ పరంజపే గారి యింటి ముందు.

13 , 14. బాబా, షామా, యెన్ని జన్మల అనుబంథము.

72 జన్మలు.

15. బాబా, బలరాం థురందర్ యెన్ని జన్మల అనుబంథము.

60 జన్మలు.

16. ఒకసారి యోగా నేర్చుకుంటున్న విథ్యార్థి, బాబా దర్శనానికి వచ్చినప్పుడు, బాబాగారు యేమి చేస్తున్నారు?

బాబా గారు మిగిలిపోయిన గోథుమ రొట్టెను ఉల్లిపాయతో తింటున్నారు.

17, ప్రముఖ హారతి పాట "ఆరతి సాయిబాబా, సౌఖ్య దాతార జీవా" యెవరు వ్రాశారు?

శ్రీ మాథవరావ్ అడాకర్

18. బాబావారి పవిత్రమైన శరీరం యెవరి యింటిలో విశ్రాంతి తీసుకుంది?

శ్రీ బూటీ యింటిలో.

19. బాబాగారు యేసమయలో, యేరోజున తమ ఆత్మను బ్రహ్మానందంలో ఉంచారు?

దత్త జయంతి రోజున రాత్రి 10 గంటలకు.

20. ద్వారకామాయిలో బాబా గారు చెక్క ఊయల మీద నిదురించేటప్పుడుం యెన్ని మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగింపబడినవి?

నాలుగువైపులా 4 దీపాలు.
21. యెంతమంది అమ్మాయిల తరువాత నాందేడ్లో ని సేట్ రతంజీ పార్శీ గారికి మగపిల్లవాడు జన్మించాడు?

12 మంది ఆడపిల్లల సంతానం తరువాత మగపిల్లవాడు జన్మించాడు.

22. సఖారాం ఔరంగాబాద్కర్ గారి సవతి కొడుకు పెరు యేమిటి? యెన్ని సంవత్సారాల తరువాత సఖారాం గారికి మొట్టమొదటి సంతానం కలిగింది? పుట్టిన సంతానం ఆడా? మగా?

సవతి కొడుకు పేరు విశ్వనాథ్, 27 సంవత్సరాల తరువాత మగపిల్లవాడు జన్మించాడు.

23. లక్ష్మీ చంద్ గారు దాసుగణు కీర్తన వినడానికి ముంబాయి వెళ్ళినప్పుడు ఆ సమయంలో దాసుగణుగారు తమ కీర్తనలో యెవరి గురించి వర్ణిస్తున్నారు?

సంత్ తుకారాం గారి కథ.

24. షామా గారు కాశీ, గయ, ప్రయాగ, అయోథ్య యాత్రలకు వెళ్ళునప్పుడు, నంద్ రాం మార్వాడీ వారి వద్ద యెంత అప్పు తీసుకున్నారు?

100 రూపాయలు.

25. షిరిడీ వెళ్ళునప్పుడు లక్ష్మిచంద్ గారు తన సోదరుని వద్ద యెంత సొమ్ము అప్పుగా తీసుకున్నారు?

15 రూపాయలు.

26. మూలే శాస్త్రిగారు, బాబా దర్శనానికి షిరిడి వెళ్ళినప్పుడు, బాబాగారు ఆయనకు యెన్ని అరటిపండ్లను ఇచ్చారు?

నాలుగు అరటిపండ్లు.

27. రఘునాథరావ్ టెండూల్కర్ గారు పదవీ విరమణ చేసినతరుచ్వాత నెలకు యెంత పెన్షన్ తీసుకుంటూ వుండేవారు, బాబాగారు ఆయనకు నెలకు యెంత పెన్షన్ ఇచ్చారు?

నెలకు 75 రూపాయలు, కాని బాబా దయ వల్ల నెలకు 110 రూపాయలు పెన్షన్ వచ్చింది.

28. రాంగిరీ బువాగారు సల్గావ్ రైల్వే స్టేషన్లో దిగినప్పుడు ఆయన జేబులో యెంత డబ్బు మిగిలింది?

రెండు అణాలు మాత్రమే.

29, బాబా గారు కొన్ని రోజులు యేగురువుకు శిష్యుడుగా ఉన్నారు?

జవహర్ ఆలీ

30. బాబా గారు మెరిసే రాయి కాదు, వజ్రం అని షిరిడీవాసులతో అన్నది యెవరు?

ఆనందనాథ్ మహరాజ్.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List