Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Saturday, April 30, 2011

జలంథర్ బాబా మందిరము - అద్భుత చరిత్ర

Posted by tyagaraju on 3:46 AM30.04.2011 శనివారము

జలంథర్ బాబా మందిరము - అద్భుత చరిత్ర

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంథువులందరికి బాబా వారి శుభాశీశ్శులు

ఈ రోజు జలంథర్ లోని బాబా మందిరానికి సంబంథించిన అద్భుతమైన లీలా విశేషాలని తెలుసుకుందాము. ఇది ఇంతకు ముందు శ్రిమతి ప్రియాంకా రౌతేలాగారి ఆంగ్ల బ్లాగులో ప్రచురింపబడినది.

ఈ లీలని గురువారమునాడే పోస్ట్ చేద్దామని తెలుగులోకి తర్జుమా మంగళవారమునాడే మొదలుపెట్టాను.

కొంతవరకు అనువాదము చేశాను. బుథవారమునాడు కొంత చేశాను. మరల సాయంత్రము చేద్దామని సాయిదేవా వెబ్ సైట్ ఓపెన్ అవలేదు. అన్ని వెబ్ సైట్లు ఓపెన్ అవుతూండగా ఇది మాత్రమే యెందుకు అవటల్లేదో అర్థం కాలేదు. ప్రియాంకా గారికి ఫోన్ చేశాను. ఆవిద చూసి వెబ్ సైట్ ఓపెన్ అవుతోంది, ప్రోబ్లెం యేమీ లేదని చెప్పారు. దుబాయిలో ఉన్న మా అమ్మాయికి, హైదరాబాదులో ఉన్న మా అమ్మాయికి ఫోనె చేసి కనుక్కున్నాను. చక్కగా ఓపెన్ అవుతున్నాయి. నెల్లూర్ సుకన్య గారిని అడిగితే తనకు కూడా ఓపెన్ అవుతోందని చెప్పారు. అలా గురువారమునాడు కూడా ఓపెన్ అవలేదు. కారణం తెలియలేదు. గూగుల్ నుంచి ప్రయత్నించాను. అయినా యేమీ లాభం లేకపోయింది. ఇక శుక్రవారమునాడు యెదురుగా ఉన్న బాబా ఫోటో చూస్తూ "బాబా నా తప్పులేమన్నా ఉంటే క్షమించు అని, నెట్ కనెక్ట్ చేసేముందు కంప్యూటర్ ని 3 సార్లు రిఫ్రెష్ చేసి, నెట్ కనెక్ట్ అయాక, ముందర షిర్డిసాయిదేవా వెబ్ సైట్ ఓపెన్ చేశాను. బాబా దయ వల్ల ఓపెన్ అయింది. ఈ రోజుకి అనువాదం పూర్తి చేసి మీ ముందు ఉంచుతున్నాను.

ఇక బాబా అద్భుతమైన లీలను మనసారా చదివి ఆనందించండి.


ఫ్రియాంకా రౌతేలాగారు జలంథర్ వెళ్ళినప్పుడు అక్కడి బాబా మందిరము దాని చరిత్ర గురించి తమ ఆంగ్ల బ్లాగులో ప్రచురించడం జరిగింది. దానిని యథాతథంగా ఈ రోజు మీకందిస్తున్నాను.

నేను మా కుటుంబంతో జలంథర్ వెళ్ళడం జరిగింది. మేము అక్కడికి రెండు లేక మూడు రోజులు ఉందామని వెళ్ళాము, అక్కడ సాయి మందిరం ఉందని కూడా తెలియదు. నేను యింటర్నెట్ లో కూడా వెతికాను కాని యెక్కడా బాబా మందిరం ఉన్నట్లుగా నాకు దొరకలేదు. యేమైనప్పటికీ మేము జలంథర్ చేరుకున్నాము, బాబా మందిరం గురించి కొంచెం ప్రయత్నిద్దామనుకున్నాను. అదృష్టవశాత్తు మా స్నేహితులకి యెక్కడ ఉందో ప్రదేశం తెలుసు గాని, సరిగ్గా తెలియదు యెందుకంటే వారెప్పుడు ఆ మందిరానికి వెళ్ళలేదు. ఇక్కడ నేను చెప్పదలచుకున్నదేమంటే మా జలంథర్ ట్రిప్ ముందు అనుకున్న ప్రోగ్రాం కాదు, కాని బాబా గారు నాకోసం వేరే ఉద్దేశ్యంతొ చేయించి ఉండవచ్చు. ఆయన నాకోసం అక్కడికి వెళ్ళి మందిరం గురించిన సమాచారమంతా తెలుసుకోవడానికి కావలసిన సౌకర్యవంతమైన యేర్పాటులన్ని చేశారు. అక్కడికి వెడతానని నేనెప్పుడూ అనుకోలేదు, సుందరమైన జలంథర్ బాబా మందిరంలో బాబాని దర్శించుకుని అనుగ్రహ పాత్రురాలినయ్యాను. ఆయన లీలలు, చర్యలు చాలా నిగూఢంగా ఉంటాయి. ఓ! దేవా! నీ పాదాలమీద నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను, ఈ జన్మలోను, వచ్చే జన్మలన్నిటిలోనూ నీ పాదాలే నాకు ఆశ్రయముండేలా అనుగ్రహించమని వేడుకుంటున్నాను. మేము జలంథర్ మంగళవారము చేరుకున్నాము, మరునాడు అంటే బుథవారమునాడు షిరిడి సాయి మందిరాన్ని దర్శిద్దామనుకున్నాము. మరలా బాబా లీలనుగ్రహం నామీద ప్రసరించినందుకు, నేను సంతోషంగా ఉన్న సమయంలో, ఈ బాబా మందిరం చరిత్ర గురించిన సమాచారం నాకు లభ్యమవుతుందా అనే అలోచనలో నిమగ్నమయ్యాను. కాని మేము అక్కడికి చేరుకున్న మరుక్షణమే బాబా గారు ప్రతీదీ ముందుగానే నిర్ణయించారు. బాబా గారి సుందరమైన పెద్ద మందిరాన్ని చూశాక నాసంతోషానికి అవథులు లేవు. (యిందులో ఇచ్చిన ఫోటొలన్ని నా మొబైల్ తో తీసినవ అందుచేత అంత క్లియర్ గా లేవు)

మందిరం వెలుపలి భాగం చాల అందంగా నిర్మించారు, ఆ ఆకృతి అందాన్ని చూసిన తన్మయత్నంలోనించి తేరుకునేటప్పటికి నాకు 15 నిమిషాలు పట్టింది. ఆకృతిని చూసి ఆశ్చర్య పడుతుండగా నా కళ్ళు ఒక బోర్డ్ మీద పడ్డాయి, దాని మీద ఇలా రాసుంది "పంజాబులో ఇదే మొట్టమొదటి బాబా మందిరము". మందిరం లోపల పెద్ద బాబా విగ్రహం ఉంది. నాయాత్రలు, నేను యెక్కడకు వెళ్ళినా బాబా మందిరాన్ని దర్శించడానికి అనుకోకుండా జరిగే యేర్పాటులు అన్నీ కూడా బాబాగారు ఒక విథంగా మా కుటుంబం మీద కురిపించే అనురాగము మరియు అనుగ్రహము అని ఒప్పుకుని తీరవలసినదే.

నేనెక్కడికి వెళ్ళినా బాబా అక్కడ వుంటారు, తను ఉన్న చోటకి నన్ను వచ్చేలా చేస్తారని గ్రహించినప్పుడు యెంతో మహత్వపూర్ణంగా ఉంటుంది. నా సద్గురు సాయీ నేను నీకెల్లప్పుడూ ఋణపడి ఉంటాను. నా తండ్రి సాయి నాకు ఇన్ని అవకాశాలని ఇస్తున్నందుకు నేనెప్పుడు విథేయురాలిగా ఉండాలన్నదే నా అంతర్గత కోరిక.

బాబా దర్శనం అయిన తరువాత, నేను అన్నివైపుల అడుగుతూ, ఈ క్రింది విథంగా జలంథర్ బాబా మందిరం చరిత్రని వివరించిన గగన్ కాల్ రా గారిని కలుసుకున్నాను. మీకిప్పుడు అదంతా వివరిస్తాను.

సెప్టెంబరు, 5 వ తారీకు, 1996 న సాయి మందిర్ జలంథర్ ప్రారంభింపబడింది. ఇది కాల్ ర కుటింబీకుల స్వంత మందిరం. గగన్ జీ గారు గతంలోకి వెళ్ళి చెప్పడం మొదలు పెట్టారు. 1992 లో మా కుటుంబమంతా కూడా చాలా ఆర్థిక బాథలలో ఉన్నాము. పరిస్థితి చాలా హీనంగా ఉంది. ఆ సమయంలో గగన్ జీ చదువును ఆపేయవలసి వచ్చింది. ప్రైవేటుకి ఇవ్వడానికి, యితర చదువుకి సంబంథించిన ఖర్చులకి కూడా డబ్బు చెల్లించలేకపోయేవారు.

గగన్ జీ గారి తల్లి గొప్ప భక్తిపరురాలు. ఆమె తన యింటిలో నున్న మందిరంలో చిన్న బాబా ఫోటొ ఒకటి పాతది ఉంది. దానికే ఆమె రోజు పూజ చేస్తూ ఉండేది. ఒకరోజు దీపావళినాటి రాత్రి దీపావళి చేసుకోవడాన్ని పక్కన పెట్టండి, తమ యింటిలొ ఆహారానికి కూడా డబ్బులేదనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. గగన్ జీ గారి తల్లి బాబా ముందర కూర్చుని యేడిచింది. "బాబా నువ్వు నీటితో దీపాలను వెలిగించావు, గోడమీద. నా యింటిలో తినడానికి కూడా యేమీ లేదు, యిక దీపావళి యెలా చేసుకోను బాబా " అని యేడిచింది. సరిగ్గా అప్పుడే యిద్దరు కుఱ్ఱవాళ్ళు వారి వద్దకు వచ్చి, వృత్తి రీత్యా ఉపాథ్యాయుడైన గగన్ జీ తండ్రిగారిని ప్రైవేటు చెప్పమని అడిగారు. యీ అబ్బాయిలిద్దరూ ట్యూషన్ ఫీజు ముందుగానె చెల్లించారు. వారందరికి యిది కొంచెం ఆశ్చర్యమనిపించింది, యెందుకంటే సాథారణంగా ముందుగానే ఫీజు ఇచ్చే పథ్థతి లేదు. ఆ రోజు వారందరూ తమ ఆకలిని తీర్చుకోవడమే కాక దీపావళి కూడా చేసుకున్నారని వేరే చెప్పనవసరం లేదు. కాల్ రా కుటుంబం మొత్తమందరికి సాయి భక్తి అప్పుడే మొదలైంది. ఆరోజునించి కార్ లా కుటుంబమంతా బాబాని యెక్కువ భక్తితోను నమ్మకంతోను పూజించడం మొదలుపెట్టారు. రోజులు గడుస్తూ ఉండగా గగన్ జీ తండ్రిగారి వద్దకు యింకా యింకా ట్యూషన్స్ రావడం మొదలు పెట్టాయి, యింకా యెప్పటినినిచొ పెండింగ్ లో ఉన్న కోర్ట్ కేసు గెలిచి వారి ఫాక్టరీ వారికి తిరిగి వచ్చింది. యిక ప్రతీదీ కూడా వెనకకు తిరిగి రావడం మొదలుపెట్టాయి. బాబా దయతో తక్కువ కాలంలోనే వారు తమ స్వంత ప్లాటు కొనుక్కున్నారు. ఒకరోజున అనుకోకుండా చిన్న కుక్క పిల్ల ఒకటి (3 నెలల వయసు) వాళ్ళ యింటి ప్రవేశ ద్వారం వద్ద బయట కూచుని ఉంది. ఆ కుక్కపిల్లని మొదటగా చూసింది గగన్ జీ తల్లిగారే. కొంచెం పరీక్షగా చూసేటప్పటికి అది చాలా అనారోగ్యంతో ఉంది. గగన్ జీ గారు దానిని పశు వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్ళి దానికి అవసరమయిన వైద్యం చేయమన్నారు.

కొద్ది రోజులలోనే, కుక్కపిల్ల కోలుకుంది. అది కాల్ రా గారి కుటుంబంలో ఒక భాగమయిపోయింది. గగన్ జీ తల్లి దానికి ప్రేమగా రాజు అని పేరు పెట్టారు. రాజు మిగత కుక్కలకన్న వేరుగా ఉండేది. గగన్ జీ తల్లిగారు బాబా పూజ చేస్తున్నప్పుడల్లా అది ఆవిడ ఒళ్ళో కూర్చుంటూ ఉండేది. ఒకరోజున ప్రార్థిస్తూ ఆమె రాజు తో, యేదీ, నీకళ్ళల్లొ బాబా ని చూడగలమేమో చూస్తాను అని, దాని కళ్ళల్లో బాబా ఫొటొ ప్రతిబింబాన్ని స్పష్టంగా చూశారు.

అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. కాల్ రా కుటుంబమంతా పూర్తిగా బాబా భక్తిలో నిమగ్నమైపోయారు. వారి వ్యాపారం కూడా బాగా అభివృథ్థి చెందుతూ, రోజులు గదిచేకొద్దీ కాల్ రా గారి కుటుంబం ఐశ్వర్యం దిశగా పయనించారు. యితర ఆస్తులే కాకుండా వారికి కొంత స్థలం కూడా ఉంది. అందులో వారు సొంతంగా ఇల్లు కట్టుకుని, యింటి ముందర చిన్న బాబా మందిరం కూడా కట్టుకుందామనే యోచనలో ఉన్నారు.

ముందర అనుకున్న ప్రకారం చిన్న మందిరంలో పెట్టడానికి చిన్న బాబా విగ్రహం కొనడానికి, 1995 లో కార్ లా కుటుంబం జయపూర్ వెళ్ళారు, కాని అక్కడకి వెళ్ళి సుందరమైన పెద్ద బాబా విగ్రహాన్ని చూశాక, యిక ఆగలేక పెద్ద విగ్రహానికి ఆర్డర్ ఇచ్చారు. అంత పెద్ద విగ్రహానికి తాము ఆర్డర్ ఇవ్వడం వారికే చాలా ఆశ్చర్యం వేసింది.

విగ్రహం పూర్తవడానికి దాదాపు సంవత్సరం పట్టింది. ఈ లోగా గగన్ జీ తల్లిగారికి 21 జూన్ ఉదయం 4.30 కి ఒక కల వచ్చింది. అందులో ఆమెకు యేమీ కనపడలేదు, కాని బాబా గారి మాట వినపడింది.

"ఇప్పుడు నా కోసం సమాథిని కూడా నిర్మించు" ఆమె నిద్రనుండి లేచింది, నా కోసం సమాథి నిర్మించు అన్నారు, దీని అర్థమేమిటి, తాము బాబా సమాథి యెట్లా నిర్మించాలి అని ఆశ్చర్య పడింది. దాని గురించి యింకా ఆలోచించేలోపలే, తన మంచం కింద తన చిన్న కుక్క రాజు చనిపోయి ఉండడం చూసింది. అప్పుడామెకి అర్థమయింది, రాజు, బాబా తప్ప మరెవరూ కాదని.

రాజు చనిపోయిన 3 నెలలకి, జయపూర్ నించి, బాబా విగ్రహం తయారయింది, వచ్చి తీసికెళ్ళమని ఫోన్ వచ్చింది.

కార్ లా కుటుంబం యింకా మరికొంతమంది కుటుంబ సభ్యులతో పెద్ద విగ్రహాన్ని తీసుకురావడానికి పెద్ద ట్రక్కులో బయలుదేరి వెళ్ళారు. విగ్రహాన్ని తీసుకుని షిర్డీ వెళ్ళి అక్కడే ప్రాణప్రతిష్ట చేయించారు. గగన్ జీ గారు ఆ రోజులని గుర్తుకు తెచ్చుకున్నారు. వారు ట్రక్కుని సమాథి మందిరానికి పక్కనే నిలిపి ఉంచారు. పూజారిగారు అక్కడే అన్ని పూజాదికాలు, ప్రాణప్రతిష్ట మొదలైనవన్ని చేశారు. షిరిడీ లో ప్రాణప్రతిష్ట చేసిన తరువాత, కార్ లా కుటుంబాము వారి యింటి వద్దకు తెచ్చి విగ్రహ స్థాపన చేశారు. సాయి తాను స్వయంగా కోరిన కోరిక ప్రకారం రాజు సమాథి ఈ మందిరంలోనే చెశారు.

యే ఆలోచన మందిర అభివృథ్థికి తోడ్పడింది ? బాబా చేసిన ఈ లీలలు అగోచరము. అది మానవుని ఆలోచనా శక్తికందనిది. ఈ రోజున ఈ సుందరమైన పెద్ద మందిరానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూఉన్నారు. షిర్డీలో జరుగుతున్నట్లే హారతి కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. హారతీ, యింకా మిగతా కార్యక్రమాలన్ని కూడా కార్ లా కుటుంబము వారే చేస్తున్నారు. కార్ లా కుటుంబము వారికి ఈ తరంలోనే కాదు, వచ్చే అన్ని తరాల వారికి కూడా బాబా ని సేవించుకునే అనుగ్రహం కలిగింది.

********************************

సాయి బంథువులారా చూశారా బాబా వారి లీల, మరియు అనుగ్రహం. ఇక్కడ మనం గ్రహించవలసినది జాగ్రత్తగా గమనించండి. గగన్ జీ గారి తల్లి పాత బాబా ఫొటొ ఒకటి ఉంటే దానినే తన యింటిలో చిన్న మందిరంలో పెట్టుకుని పూజిస్తూ ఉండేది. ఆమె యెప్పుడు తమ దీన స్థితి గురించి బాబాని నిందించలేదు. ఒక దీపావళి రోజున కూడా ఆమె బాబా కి నైవేద్యము కూడా యేమీ సమర్పించలేదు. ఆర్తితో విలపించింది.

"బాబా, నువ్వు నీటితో దీపాలని వెలిగించావు. మా యింటిలో తినడానికే తిండి లేదు, యిక దీపావళి యెలా చేసుకోము బాబా" అని రోదించింది. ఇక్కడ బాబా గారు , తనకి యేమి సమర్పించలేదని మిన్నకుండిపోయారా? మంచి అందమైన ఫొటో పెట్టుకోకుండా పూజిస్తున్నారని మిన్నకున్నారా? లేదు. ఆయన యేమి చెప్పారు. నాకు కావలసింది భక్తి, ఓర్పు, సహనం, శ్రథ్థ అన్నారు. బాబా గారు ఆమె ఆర్తికి, భక్తికి చలించి పోయారు. వెంటనే తన లీలని ప్రకటించారు.

యెంతటి అదృష్టవంతులు వారు.

సాయీ మమ్మలనందరిని నీ భక్తిమార్గంలోనే పయనించేటట్లు అనుగ్రహించు.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment