Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Tuesday, May 10, 2011

షిరిడి దర్శించే వారికి సమాచారం -- 2

Posted by tyagaraju on 11:53 PM




11.05.2011 బుథవారము

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

షిరిడి దర్శించే వారికి సమాచారం -- 2 పల్లకీ సేవ - 2

సాయి బంథువులందరికి షిరిడీ దర్శన అనుగ్రహ ప్రాప్తిరస్తు


నిన్న మనం షిరిడీ గురించి కొంత సమాచారం తెలుసుకున్నాము, ఈ రోజు మరికొంత సమాచారం తెలుసుకుందాము.
యింతకుముందు పల్లకీ సేవ లీల ఒకటి చదివాము. ఈ రోజు మరొక పల్లకీ సేవ లీల తెలుసుకుందాము.


ద్వారకామాయిలో మనము చూసే బాబా పటాన్ని శ్రి జయకర్ గారు చిత్రించారు. దాని గురించిన కథ యింతకుముందు ఈ బ్లాగులోనే ఉంది చదవండి. ఈ పటానికెదురుగా వెండి పాదుకలున్నాయి. దాసుగణు మహరాజ్ కి సాయి తన కాలి బొటన వేళ్ళనించి గంగా యమునలు స్రవింపచేసిన లీల ఇక్కడే.

ద్వారకా మాయిలో కి మీరు ప్రవేశించగానే, యెడమవైపునించి లైనులో వెడుతూ ఉంటే, యెడమవైపున చిన్న కొయ్య స్తంభం ఉంటుంది. ఇప్పుడు దాని చుట్టూ రక్షణ వలయంగా సన్నటి స్టీలు రాడ్లు బిగించారు. ఈ కొయ్య స్తంభానికి మోకాళ్ళు తగిలిస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. అక్కడినించి మెట్లు యెక్కి పైకి వెళ్ళగానె యెడమవైపున థుని ఉంటుంది. ఈ థుని బాబా గారు జీవించి ఉన్నఫ్ఫుడు వెలిగించిన థుని, ఇప్పటికీ అది వెలుగుతూనే ఉంది. థుని దగ్గరలో రాతిపీట ఉండేది. బాబా అప్పుడప్పుడు దీనిపై కూర్చుని స్నానం చేసేవారు. మసీదు నైఋతి మూలలో థునికి పక్కన ఒక మట్టికుండ వుంది. అందులోని నీరు తాగడానికి, ముఖం కడుక్కోవడానికి వాడేవారు. (యిదివరకు ఈ మట్టికుండలోనీరు భక్తులందరూ తాగడానికి వీలుగా ఉండేది. యిప్పుడు యెలా ఉందో తెలియదు. )

బాబా బిక్షకు వెళ్ళినప్పుడు, తెచ్చిన పదార్థాలన్ని నీటికుండ పక్కనే వున్న కొళంబె (మట్టిపాత్ర) లో వేసి, మూత పెట్టేవారు కాదు. ఈ కొళంబే కూడా చూడవచ్చు. (కొళంబేలో కూడా నైవేద్యం పెట్టి ప్రసాదంగా తిరిగి తీసుకునేవారు.)

తరువాత అక్కడ పక్కనే మూల బాబా గోథుమలు విసరిన తిరగలి ఉంటుంది. తిరగలి పక్కనే అద్దాల బీరువాలో గోథుమల బస్తా ఉంటుంది. బాలాజి పాటిల్ నేవాస్కర్ సాయిని నిష్కల్మషంగా సేవించిన భక్తుడు. తనకు పండిన పంటనంతా బళ్ళమీద తెచ్చి బాబాకి సమర్పించేవాడు. తరువాత బాబా యెంత ఇస్తే అంత తీసుకునేవాడట. ఇందుకు గుర్తుగా వారి కుటుంబ సభ్యులు కూడా బాలాజీ వంశీకులు నేటికీ సమర్పించే గోథుమల బస్తా యిక్కడుంచుతారు. సంవత్సరానికొకసారి శ్రీరామనవమినాడు ఉదయం ఆ బస్తాలోని గోథుమలు ప్రసాదాలయానికి తీసుకువెళ్ళి, పిండిచేసె, భక్తులకు ప్రసాదంగా పంచుతారు. మళ్ళీ ఆ స్థానంలో కొత్త గోథుమల బస్తా ఉంచుతారు. ఈ గోథుమలు సంవత్సరకాలం నిలవ ఉన్నాకూడా, యే జాగ్రత్తలూ తీసుకోకపోయినా పురుగు పట్టడం, చెడకపోవడం విసేషం.

మసీదులో పడమటి గూటిని నింబార్ అంటారు. నింబారుకు ముందుగా మశీదు పైకప్పు దూలాలకు రెండు కొక్కాలు కనిపిస్తాయి. ఈ కొక్కలకే బాబా కొయ్యబల్ల కట్టుకుని నిద్రించేవారు. నింబారు పక్కనే దీపస్తంభాలుంటాయి. తిరగలి ఉన్న మూల ఒక అలమారలో బాబా చిలిం గొట్టాలుంచేవారు. ప్రస్తుతం యివి ప్రదర్శన శాలలో ఉంచారు. ఇక మశీదు పైనుండి మెట్లు దిగిరాగానే హాలులో ఈశాన్యమూల సాయి ప్రతిష్టించిన తులసి బృదావనం ఉంటుంది. రేకుల షెడ్డులో మెట్లకెదురుగా తూర్పు పక్క గోడనానుకుని ఒక రాయి ఉంటుంది. సాయి తరచు మథ్యాహ్న సమయంలో దానిపై కూర్చునేవారు. ఆ రాతి వెనుక పెద్ద ఫ్రేముతో బ్లాక్ అండ్ వైట్లో బాబాగారి చిత్రపటం ఉంటుంది.

రాతిబండ పక్కనే దక్షిణంవైపున చిన్న పులి విగ్రహం ఉంటుంది. రాతి బండకు పక్కన ఉత్తరం పైపున గుఱ్ఱం , విగ్రహం ఉంటుంది.

ద్వారకామాయి హాలు మథ్యన నేలలో ఒక చిన్న పాలరాతి తాబేలు పలక ఉంటుంది. ఆరతి సమయంలో శ్యామకర్ణ యిక్కడే నిలబడేది.

మధ్యాహ్న ఆరతి తర్వాత, లెండీ బాగుకి వెళ్ళేముందు, సాయంత్రంపూట బాబా మశీదు ముందుగల మట్టిగోడకి ఆనుకుని నిలబడి దారినపోయే గ్రామస్తులను కుశలప్రశ్నలు వేసి పలకరిస్తూఉండేవారు. ఇక్కడ చిన్నమందిరంలో సాయి పాదుకలని అమర్చారు. బాబా ముందుకు వంగి గోడమీద చేతులు ఆనించినచోట మరొక జత చిన్న పాదుకలని అమర్చారు.

మసీదులో దక్షిణం పక్కన గోడని ఆనుకుని సాయి స్వయంగా వంట చేసిన పొయ్యి ఉంటుంది. ఈ పొయ్యికి యెదురుగా 2.5 అడుగుల యెత్తు కఱ్ఱ గుంజ ఉంటుంది. వంట చేసెటప్పుడు బాబా దానికి ఆనుకునేవారు.

బాబా భక్తుడైన సాయ్ శరణ్ ఆనంద్ ఒకసారి తీవ్రమైన మోకాలి నొప్పితో బాథపడుతుంటే మోకాలుని ఆ కఱ్ఱ గుంజకి తాకించి తరువాత దానిచుట్టూ ప్రదక్షిణలు చెయ్యమని సాయి సలహా యిచ్చారు. అలా చేయగానే ఆయన కాలినొప్పి తగ్గింది. (మీరు ద్వారకా మాయిలో దీని ప్రత్యెకంగా చూసి ప్రదక్షిణలు చేయండి. చాలా మందికి ఈ కఱ్ఱ గురించి, దాని విశిష్టత తెలీదు)

చెక్కతో చేయబడిని చిన్న అగరుబత్తి స్టాండు ద్వారకామాయి ప్రవేశద్వారం దగ్గిర కుడివైపున ఉంటుంది.
సాయి మధ్యాహ్న ఆరతి అయిన తరువాత ఈ అరుగుమీద కూర్చుని భక్తులకు ఊదీ ప్రసాదించేవారట.

మశీదులో ప్రవేశించాక యెడమ పక్కన పైభాగంలో పెద్ద యిత్తడి గంట ఉంటుంది. యిది సాయి కాలమ్నించీ ఉంది. దీనిని రోజూ మూడుసార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మోగించేవారు. మశీదు పైన రెండు జండాలు కనిపిస్తాయి.

మసీదు తరువాత చావడి చూడండి. చావడిలో ఉత్తరం గోడకి ఆనుకొని పద్ద రంగుల చిత్రపటం ఉంటుంది. బాబా చావడిలో నిద్రించేముందు రోజు శేజ్ ఆరతి, ఉదయం కాకడ ఆరతికి ఈ పటం ఉన్న చోటలోనే కూర్చొనేవారు. దీనిని గుజరాత్ లోని నౌసారి గ్రామానికి చిందిన అంబారాం అనే 18 సంవత్సరాలు యువకుడు చిత్రించాడు. చావడికి మథ్యలో కటకటాలుండి రెండు భాగాలుగా ఉంటుంది. బాబా తూర్పుభాగంలో నిద్రించేవారు. స్త్రీలు బాబాని యివతలనిండే దర్శించుకోవాలి, సాయి నిద్రించే ఆ భాగంలోకి వారికి ప్రవేశించడానికి అనుమతిలేదు. యిప్పటికీ ఆ ఆచారం అలా పాటిస్తూనే ఉన్నారు.

గురువారమునాడు చావడి ఉత్సవం చూడదగ్గది. షిరిడీలో మూడు రాత్రులు ఉండి నిద్ర చేయాలంటారు. అందుచేత మీరు షిరిడీ వెడితే మూడురోజులలో ఒకటి గురువారం వచ్చేలా చూసుకుని ప్రయాణం పెట్టుకోండి.

లెండీ బాగ్ ::

గురుస్థాన్ కి దగ్గరలో లెండీ బాగ్ ఉంది. సాయిబాబా కాలంలో అది చెట్ల తోపు. తరువాత లెండీ బాగ్ లో రకరకాల గులాబీలు, తులసి, సబ్జా లాంటి మొక్కలతో అందంగా ఉండేది. ఇక్కడ బాబా ఉపయోగించిన బావి కూడా ఉంది. అది కూడా యెవరినయినా అడిగి దానిని కూడా దర్శించండి.

తరువాత, మీరు నందా దీపం , ఔదుంబర వృక్షం, దత్తత్రేయ విగ్రహం ఇవన్ని దర్శించుకోండి. ఇక్కడ ఆవరణలొ దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు భక్తులు.

యింకా ఇక్కడ మందిరం ఆవరణలో బాబా భక్తుల సమాథులు కూడా ఉన్నాయి.

సమాథి మందిరంలో కూడా బాబా వారి దివ్య మంగళ స్వరూపాన్ని కూడా దర్శించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందండి. బాబా విగ్రహం తయారీ వెనుక గల కథని కూడా యింతకు ముందు బ్లాగులో పోస్ట్ చేయడం జరిగింది. దానిని కూడా యిప్పుడే మరలా ఒకసారి చదువుకోండి. మీకు విగ్రహాన్ని చూడగానే బాబా యొక్క ఆ అద్భుతమైన లీల మదిలో మెదులుతూ శరీరం పులకరించిపోతుంది.


షిరిడీలో ఉండటానికి వసతులు

యిప్పుడు షిరిడీలొ చాలా హోటల్స్, లాడ్జీలు ఉన్నాయి.

సాయి సంస్థాన్ వారి భక్త నివీఅస్ ఉంది. ఇది సమాథి మందిరం నించి కిలోమీటరు దూరంలో రహతా వైపుగా మన్మాడ్ రోడ్డుమీద ఉంది. యిందులో రమారమి 500 దాకా గదులు ఉన్నాయి. వరుస క్రమంలో గదులు కేటాయిస్తారు. ఇక్కడనించి ఉచిత బస్ సౌకర్యం కూడా ఉంది. మందిరం వరకూ షేర్ ఆటో లు కూడా ఉంటాయి.

సంస్థాన్ వారి ప్రసాదాలయంలో భోజనం లభిస్తుంది. లెండీ బాగ్ కి పక్కన సంస్థాన్ కాంటీన్లో, క్యూ కాంప్లెక్స్ లో కూడా, టీ, కాఫీ, పాలు దొరుకుతాయి.

భక్తులకు ఊదీ, ప్రసాదాలు సమాథి మందిరం యెదురుగా ఉన్న కవుంటర్లో, ఆరతి తరవాత యిస్తారు. రాత్రి శేజ్ ఆరతి తరువాత ఇచ్చే సాయి ప్రసాదం చాలా మథురంగా ఉంటుంది.

భక్తులు సమర్పించిన వస్త్రాలు, గురువారము, ఆదివారములలో ఉదయం 8 గంటలకి కాంటీన్ కి, దీక్షిత్వాడాకి మథ్యలో వేలం వేస్తారు.

భక్త నివాస్ కాంటీన్లో కూడా టిఫిన్, భోజనం దొరుకుతుంది. యింకా మందిరానికి కొద్ది దూరంలోనే చాలా భోజన హోటల్స్ ఉన్నాయి.




మీ షిరిడీ యాత్ర ఫలప్రదం, శుభప్రదం అవాలని, అయేలా చేయమని సాయిని మనసరా ప్రార్థిస్తున్నాను.


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.








పల్లకీ సేవ - 2

మనము యింతకుముందు పల్లకీ సేవ గురించి ఒక లీల చదువుకున్నాము. ఇప్పుడు అటువంటిదే మరొక లీల తెలుసుకుందాము. ఈ లీలని హైదరాబాదు నించి శ్రీ నగేష్ గారు పంపించారు. యిది వారి స్వీయ అనుభవం. ఈ అనుభవాన్ని వారి మాటలలోనే తెలుసుకుందాము.

"అందరికీ బాబా ఆశీర్వాదములు"

నేను నిత్యం వెళ్ళే బాబా గుడి లో బాబా విగ్రహం ఎదురుగా ఒక వేప చెట్టు ఉంది ,అక్కడ బాబా గురుస్తానం ఏర్పాటు చేయాలనీ గుడి యజమానులు నిర్ణయించారు
జైపూర్ నుండి బాబా విగ్రహం తెపించారు .ఆ విగ్రహాన్ని ప్యాక్ చేసిపెట్టారు.నేను గుడిలో బాబా ను దర్శనం చేసుకొని బయటికి వస్తున్నాను ఒక స్త్రీ నన్ను చేయి పట్టుకొని "బాబు బాబా పల్లకి తీసి బయట పెట్టండి అని అడిగింది ,నేను మరి కొంతమంది కలిసి ఆ పల్లకి ని తీసి బయటకి తీసుకోని ప్యాక్ చేసిన బాబా విగ్రహం దగ్గర పెట్టమని చెప్పారు మేము అలాగే చేశాము ,యిప్పుడు ప్యాక్ లోని బాబా విగ్రహాన్ని తీసుకో ని వచ్చి బాబా గురుస్థానం దగ్గర పెట్టడం చేశాము. యిదంతా నా చేతుల మీద జరగడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.

యిది బాబా నాకు యిచ్చిన గొప్ప అవకాశంగా బావించాను.

సర్వం శ్రీ సాయినాథం సమర్పయామి

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List