Sairam ,If you wish to share your experiences ,poems on Sai or any Sai mandir information ,sai paintings etc then mail us on any one e-mail Id's .

Mail to priyanka Rautela -saipriya.rautela@gmail.com
Mail to Tyaga Raju Ji - tyagaraju.a@gmail.com

Wednesday, May 11, 2011

మొదటిసారి షిరిడీ యాత్ర - అనుభవాలు

Posted by tyagaraju on 8:35 PM




















12.05.2011 గురువారము


మొదటిసారి షిరిడీ యాత్ర - అనుభవాలు




ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులందరకు బాబా వారి శుభాశీశ్శులు

ఈ రోజు మనము సుకన్య గారు సేకరించి పంపిన ఒక బాబా లీల గురించి చదువుకుందాము.

ఈ లీలానుభవం శ్రి సాయి రామ ప్రకాష్ గారిది. ఆయన బెంగళూరు వాస్తవ్యులు. ఆయన మొట్టమొదటిసారిగా షిరిడీ వెడుతున్నప్పటి అనుభూతి ఈ రోజు మనమందరం చదువుకుందాము.

ఈ లీలని వారి మాటలలోనే తెలుసుకుందాము


నాపేరు రామసాయి ప్రకాష్. మాది బెంగళూరు. నేను షిరిడి దర్శించడం మొదటిసారి, నేను ఒక్కడినే ప్రయాణం ప్రారంభించాను ... అప్పుడు.........

యెలా వర్ణించాలో నాకు తెలియదు. నా అనుభవాన్ని వివరించడానికి నాకు మాటలు రావు.

బాబా దయ వల్ల నేను ప్రయాణం ప్రారంభించాను. రైలు కంపార్టు మెంట్ లో నాకొక యువకుడు తారసిల్లాడు. అతను కూడా షిరిడి వస్తున్నాడు. నా సీట్ నంబరు 34, అతనిది 38. అతను ఒక్కటే అడిగాడు "మీరు కూడా షిరిడీ వస్తున్నారా" అని. అప్పుడు నేను "అవును యిదే మొదటిసారి నాకు సహాయం చేయగలరా " అన్నాను. అప్పుడతను అన్నాడు, ఆందోళన పడద్దు, నేను 10 సంవత్సరాలనుండీ షిరిడీ వెడుతున్నాను, ఇది నా 17 వ సారి వెళ్ళడం. అప్పుడు నేను సంతోషించాను. యెందుకంటే అతనికి షిరిడీలో చుట్టు పక్కల ప్రతీ ప్రదేశం తెలుసునని చెప్పాడు. అరగంటలో అతను నాకు దగ్గరి స్నేహితుడుగా అయ్యాడు (నా కుటుంబములోని వ్యక్తిగా). అతను నన్ను, మళ్ళి యెప్పుడు తిరిగి వెడతారు అని అడిగాడు. నేనింకా నిర్ణయించుకోలేదు, యెందుకంటే తిరుగు రిజర్వేషన్ చేయించుకోలేదని చెప్పాను. అతను "నేను 20 తారీకున తిరిగి వెడతాను, మీరు కూడా నాతో వస్తారా" అని అడిగాడు. అప్పుడు నేను, "వస్తానని చెప్పాను. అప్పుడతను బంగళూరులో ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేసి తత్కాల్ లో రెండు టిక్కట్టులు రిజర్వె చేసి, ఆ టిక్కట్ట్లని తన మైల్ ఐ.డీ. కి పంపమని చెప్పాడు. (మరుసటిరోజు పొద్దున్నే 17 తారీకున, అతని స్నేహిటుడు టికెట్స్ రెజర్వె చేసి మైల్ లో పంపించాడు)

అప్పుడు నేను వసతి గురించి ఆలోచిస్తున్నాను. అప్పుడతను, తను తన యిద్దరు కజిన్స్ తొ వస్తున్నానని, వాళ్ళు అప్పుడే హోటల్లొ గది రిజర్వె చేశారని చెప్పాడు. అప్పుడు నేను రిలాక్స్ అయ్యాను. కాని, అప్పుడు ఒకామె తన కొడుకుతో మా కంపార్టు మెంట్ లో కి వచ్చింది. ఆమె కూడా షిరిడీ వస్తొంది. గంట సేపు మాట్లాడుకున్నాక, నేను షిరిడీలో యక్కడ ఉంటానని అడిగింది. అప్పుడు నేను యింకా నిర్ణయించుకోలేదు, కాని నా స్నేహితుడు నాకు గది యేర్పాటు చేశాడని చెప్పాను. అప్పుడామె, తను అప్పటికే ఒక రోజుకి గది బుక్ చేశానని, మధ్యాహ్నము, రాత్రి భోజనం ఉచితమని చెప్పింది. తాను ఆ గదిలో కేవలం రెండు గంటలు మాత్రమే ఉంటానని, తరువాత తన అబ్బాయితో నాసిక్ వెడతాని చెప్పింది. మీకిష్టమయితే, మీరు ఆ గదిలో ఉండచ్చు, నేను ఒక రోజుకి డబ్బు చెల్లిస్తాను అని అంది.
ఇక్కడ బాబా లీల చూడండి. సాయి నాకు తిరుగు ప్రయాణానికి టిక్కట్టు యేర్పాటు చేశారు, ఉండటానికి ఒక గది, 16 సారులు షిరిడీని దర్శించి అనుభవమున్న మితృడు, యింక బాబానించి నాకేమి కావాలి.

మరునాడు మధ్యాహ్నం 2 గంటలకి మేము కోపర్ గావ్ చేరుకున్నాము. మేమంతా అంటే నేను, నా మితృడు, అతని యిద్దరు కజిన్స్, ఆ స్త్రీ, వాళ్ళ అబ్బాయి మొత్తం ఆరు మందిమి ఒక ఆటో మాట్లాడుకున్నాము. మొట్టమొదట మేము బాబా 16 సంవత్సరాలు తపస్సు చేసిన తపోభూమిని దర్శించుకున్నాము. తరువాత మేము గోదావరి నది కి వెళ్ళి, ముఖం కడుక్కుని కొంత నీరు నెత్తిమీద చల్లుకున్నాము. తరువాత మేము లాద్జ్ కి వెళ్ళాము. మేమంతా స్నానాలు చేసి సాయంత్రం 5 గంటలకి ఖండొబా మందిరానికి వెళ్ళాము. 6.30 కి మేము దర్శనానికి వెళ్ళాము. 8.30 కి మేము సమాధి మందిరంలో దర్శనం చేసుకున్నాము. తరువాత మేము చావడికి చేరుకున్నాము. ఆరోజు గురువారం కాబట్టి రాత్రి 9.15 కి మేము పల్లకీ సేవ (చావడి ఉత్సవం ) చూశాము.

మేము రాత్రి 10 గంటలకి రూముకి వచ్చాము, భోజనం చేసి తిరిగి ద్వారకామాయికి వచ్చాము. మేము ద్వారకామాయిలో సచ్చరిత్ర చదువుకుంటూ, ఉన్నాము, "ఓం సాయిరాం" రాస్తూ ,రాత్రి 1.30 దాకా ఉన్నాము. తరువాత రూముకి తిరిగివచ్చి నిద్రపోయాము.

పొద్దున్నే టిఫిన్ చేసి, ష్యామా గారి యింటికి , మహల్సాపతి యింటికి, తరువాత లక్ష్మీబాయి షిండే యింటికి వెళ్ళాము.

మధ్యాహ్నం 12 గంటలకి పంచముఖి గణేష్ (విష్ను గనేష్) మందిరానికి వెళ్ళాము. ఇది షిరిడీనించి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడికి వెళ్ళి దర్శనంచేసుకుని అక్కడే ప్రసాదం (లంచ్) తీసుకున్నాము. ప్రతీరోజు మధ్యాహ్నం 12.30 కి గుడికి వచ్చినవాళ్ళందరికీ కూడా ఉచితంగా భోజనం పెడతారట.

ప్రసాదం (ఆంధ్రా భోజనం) చాలా రుచికరంగా ఉంది.

తిరిగి వచ్చి గుడికి వెళ్ళాము.

బాబా లీల ::

సాయంత్రం నా స్నేహితుడు సాయిథాం కి తీసుకుని వెళ్ళాడు. (నేనకోవడం చాలా మందికి ప్రదేశం తెలీదు) షిరిడీ నించి 22 కి.మీ. కోపర్గావ్ నించి 6 కి.మీ. అక్కడ ధోనీ బాబా, లేక చవన్ బాబా అనె పేరుతో ఒక సాయి భక్తుడు ఉన్నారు. సాయిబాబా ప్రేరణతో ఆయన సలహాలూ, సూచనలూ ఇస్తూ ఉంటారు. (జ్యోతిష్యం, లేక భవిష్యత్తు చెప్పడం, లేక సాయిబాబా ఆయన శరీరంలోకి వచ్చి చెపుతూ ఉండవచ్చు).

సాయిథాం ఆవరణలో సాయిథామ అని పిలవబడే ఒక చిన్న యిల్లు ఉంది. యింకా ఒక సాయి మందిరం కూడా ఉంది. యింకా ఒక గది ఉందిగాని అది కింద భూగృహంలో ఉంది.

అప్పటికే అక్కడ కొన్ని లీలలు ఉన్నాయి.

1. సాయిథాం లో బాబా విగ్రహం ముందర నేలమీద పాలరాతి పలకల మీద "ఓం, త్రిశూలము" కనిపించాయి.

2. బాబా గుడి వెనక ఒక కొబ్బరిచెట్టు ఉంది. ఆ చెట్టులో మీకు సాయిబాబా వదనం కనపడుతుంది.. (టెలివిజన్ మరియు వార్తా పత్రికలు ఫొటొలతో సహా ఇచ్చాయి) (ఫొటొ సాయిథాం గదిలో ఉంది)

3. కింద నేలమాళిగలో ఉన్న గదిలో బాబా ముందర గోడమీద ఉన్న పాలరాతి పలకలో సాయిబాబా వదనం కనపడింది.

4. అక్కడ శునకం ఆరతి యిస్తుంది.

మేము ముగ్గురం, అక్కడకి రాత్రి 7.15 కి వెళ్ళాము. ధోనీ బాబా యిల్లు సాయిధాం కి యెదురుగా ఉంది. సాయిథాం లోకి వెళ్ళాక, మేము బాబా ని చూడటానికి వెళ్ళాము, కాని మేము ధోనీబాబా ని చూసినప్పుడు ఆయన కోపంతో అరవడం మొదలుపెట్టారు " పొండి, .. పొండి ... నేను యేమీ చెప్పను ఇక్కడినించి వెళ్ళిపొండి..

మేము తిరిగి గుడికి వచ్చాము. దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. ధోనీ బాబా తన యింటినించి సాయిథాం వైపు వెళ్ళడం చూశాము...మళ్ళీ మేము తిరిగి అక్కడికి వెళ్ళాము. యేమైనా ఆయన మమ్మల్ని చూసి మళ్ళి అరవడం మొదలుపెట్టారు .. "వెళ్ళిపోండి.. నేను మీకేమీ చెప్పదలచుకోలేదు". అప్పుడు నేను ధోనీబాబాతో "నేను మిమ్మలనించి యేమీ ఆశించడంలేదు, నాకేమీ చెప్పద్దు, మమ్మల్ని ఆశీర్వదించండి, మీ పాదాలు పట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి" అన్నాను. అందుకాయన ఒప్పుకుని మాముందర నిలిచున్నారు. యేమైనప్పటికి నేను ఆయన పాదాలు ముట్టుకున్నాను, హటాత్తుగా ఆయన ప్రసన్నంగా మారి నన్ను ఆశీర్వదించారు, నా భుజం మీద చేయి వేసి లోపలకు రమ్మన్నారు. నన్ను సాయిబాబా ఫోటొ దగ్గిరకి తీసుకుని వెళ్ళి, అరుస్తూ బాబా నిన్ను దక్షిణ అడుగుతున్నారు, దక్షిణ ఇవ్వు..బాబా దక్షిణ అడుగుతున్నారు దక్షిణ ఇవ్వు మళ్ళి తిరిగి అన్నారు..

హటాత్తుగా నేను షాక్ తిని సాయిబాబా ఫొటో దగ్గిరకి వెళ్ళి, నేను నా పర్స్ తెరిచి చూశాను. అందులో రెండు నోట్లు ఉన్నాయి. ఒకటి 500/- మరొకటి 100/- నోటు. మొదట 500/- రూపాయల నోటు ఇద్దామనుకున్నాను. అప్పుడు నా మనసు మారిపోయింది 100/- రూపాయల నోటు బాబా ఫోటో ముందర పెట్టి వెనక్కి వచ్చాను. అప్పుడు ధోనీ బాబా "మొదట నువ్వు 500/- పెడదామనుకున్నావు..తరువాత 100/- రూ.పెట్టావు అవునా" అని అడిగారు. నేను "ఆవునని చెప్పాను. అప్పుడాయన అన్నారు "నిన్న నువ్వు షిరిడీలో 500/- ఇచ్చావు అవునా" ?
నేను "అవును" అని చెప్పాను. (యెందుకంటే కిందటిరోజు గురువారము నేను షిరిడీలో 501/-రూ. డొనేషన్ ఇచ్చాను.
అప్పుడాయన నవ్వుతూ "బాబా నించి నీకేమి కావాలి?" అన్నారు.
నాకేమీ వద్దు అని చెప్పాను. అప్పుడాయన, తొందరలోనే నీ వివాహం అవుతుంది వెళ్ళు అన్నారు. అప్పుడాయన నీకెవరైనా జెం స్టోన్ పెట్టుకోమని సలహా ఇచ్చారా? అని అడిగారు. నేను అవునన్నాను. జెం స్టోనె పెట్టుకోమని నీకెవరు చెప్పారు? అన్నారు. కొంతమంది జ్యోతిష్కులు 2-3 సంవత్సరాలనించి చెప్పారు, కాని నేను పెట్టుకోలేదు అని చెప్పాను. నేను నా అఱచేయితెరిచాను , ఆయన ఒక రాయి ఇచ్చారు. (అది చాలా అద్భుతం ఆయన తన సూన్య హస్తాన్నించి ఒక మెరిసే రాయినిచ్చారు). అప్పుడాయన ఆ రాయి సాయిబాబా ఇచ్చారు, నేను కాదు, అని చెప్పారు.
అప్పుడాయన నా స్నేహితుడితో "యితను సాయిబాబా బిడ్డ..యితనికి ఆయనమీద నిజమైన భక్తి ఉంది..యితని చేతిలో సాయిబాబా చేయి ఉంది" అన్నారు. ఆ సమయంలో నా అనుభూతిని వర్ణించలేను. మేము బయటకి వచ్చిన తరువాత, ఆయన తన యింటిలోనించి ప్రసాదం పొట్లాలు నాకు నా స్నేహితులకి ఇచ్చారు. మా స్నేహితులుకూడా, తమకు కూడా యేదైనా చెప్పమని అడిగారు. అప్పుడాయన "మీరు సాయంత్రం ఆరతికి ముందు రండి, ఇప్పుడేమీ చెప్పను" అన్నారు.

ద్వారకామాయి ఉదయం 4 గంటలకు తెరిచారు. నేను కొబ్బరికాయని బాబా ముందు పెట్టాను. (అక్కడ ఒక ప్లాస్తిక్ బకెట్ ఉంటుంది. మనం కోరిక కోరుకుని ఆ కొబ్బరికాయని ఆ బాస్కెట్ లో ఉంచాలి). మేము మరలా ఉదయం ఆరతి అయ్యేంతవరకూ ద్వారకామాయిలో కూర్చున్నాము. తరువాత మేము లాద్జ్ కి వెళ్ళి కొన్ని గంటలు నిద్రపోయాము.

ఉదయం 8 గంటలకి శనిషింగణాపూర్ వెళ్ళి మధ్యాహ్నం 1 గంటకి వచ్చాము. తరువాత నేను లెండీబాగ్, గురుస్థాన్, నందదీప్, మ్యూజియం,శివాజీ మందిరం, శనిదేవు, గనేష్జీ, దత్త మందిరం, చూశాను. మరలా నేను యింకొకసారి దర్శనం చేసుకున్నాను. తరువాత నేను కొన్ని పుస్తకాలు, కీ చైన్స్, ఫోటోలు, చిన్న విగ్రహాలు, కాలెండర్లు, కొన్నాను. నేను డొనేషన్ ఇచ్చి కొన్ని ఊదీ పొట్లాలు తీసుకున్నాను.

శనివారం రాత్రి మరలా ద్వారకామాయికి వచ్చి 2.30 వరకూ అక్కడ ఉన్నాను. సచ్చరిత్ర చదువుతూ, ఓం సాయిరాం రాస్తూ, సమయం గడిపాను. అక్కడ రాథామోహన్ అని పిలవబడే స్వామి ఒకాయన ఉన్నారు, ఆయనెప్పుడూ సాయిబాబా సేవ చేస్తూ ఉంటారు. ఆయన "సాయి ప్రేరణ" పుస్తకం ఒక కాపీ ఇచ్చి ప్రతీ గురువారం దానిని చదవమన్నారు, కుదిరితే ప్రతీరోజూ చదవమన్నారు. అప్పుడు ఆయన యెఱ్ఱ సిరాతో "ఓం సాయిరాం" రాయమన్నారు. ఆయన నాకు ఒకశివ సాయి ఫొటో కూడా ఇచ్చారు. "సాయి ప్రేరణ" చదివితే మన కోరికలన్ని తొందరలోనే తీరతాయని చెప్పారు.

సాయి ప్రేరణ యెవరికన్నా కావాలంటే నాకు మైల్ చేయండి, స్కాన్ చేసి పంపిస్తాను.

యిందులో చాలా వ్యాకరణ దోషాలూ, పద దోషాలూ ఉంటాయని నాకు తెలుసు. నా తప్పులని మన్నించండి.

బంగళూరులో ఉన్నవారెవరికైనా ఊదీ కావాలంటే నా దగ్గిరనించి పొందవచ్చు. నా వద్దనించి మరేదైనా వివరాలు కాని, సాయి సేవ కాని కావాలంటే నేను సిథ్థంగా ఉన్నాను. సాయి భక్తులకి సేవ చేసే అవకాశాన్నివ్వండి.

సాయికి నేను విథేయుడైన బానిసను. సాయి సేవ గురించి యెవరైనా యెప్పుడైన్న నాతో మాట్లాడవచ్చు.

నేనుప్పుడూ 24/7 X 365 ఉంటాను.

ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి.

నా అనుభవాన్ని చదివిన భక్తులందరూ దయచేసి నా మైల్ ఇ.డీ. కి జవాబివ్వండి లేకపోతే నా సెల్ల్ నంబరుకి ఎస్.ఎం.ఎస్. ఇవ్వండి. 09986002003.

మీ సమాథానం కోసం యెదురు చూస్తూ ఉంటాను.

నా తరువాతి ఉత్తరంలో సాయిథాం ఫోటోలు, చవన్ బాబా ఫోటోలు ఉంచుతాను.

రాంసాయిప్రకాష్
బెంగళూరు.

--------------------------------------------------------------------------------------------------


పైన ఇచ్చిన చిత్రాలలో ధోనీ బాబా వారిని, శ్రి రామసాయి ప్రకాష్ గారిని, పాలరాతి మీద ఓం త్రిశూలం, ధోనీ బాబా వారు ఇచ్చిన జెం స్టొన్ చూడండి.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు

Kindly Bookmark and Share it:

0 comments:

Post a Comment

 

Shirdi Sai Real Leelas

Bhjans Of Sai

Sai Prayer Club

My Blog List