

11.08.2011 గురువారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులందరికీ బాబావారి శుభాశీస్సులు
లాప్టాప్ అడాప్టర్ ప్రోబ్లెం వల్ల గత రెండు రోజులుగా ప్రచురణకు అంతరాయం కలిగింది. కనీసం ఈ రోజునైనా ఇద్దామని మరొక పథ్థతిలో బయట నెట్ సెంటర్ కి వచ్చి ప్రచురించడం జరిగింది. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
వరుణదేవునిపై ఆథిపత్యం
సాయి సచ్చరిత్రలో, షిరిడీలో అనుకోని విథంగా వర్షం వచ్చినపుడు జరిగిన ఒక దృష్టాంతం ఉంది. రెండు మహాశక్తుల మథ్య జరిగిన యుథ్థాన్ని వీక్షించిన అదృష్టవంతులలో మా నాన్నగారు ఒకరు. సాయిబాబా గారు అష్టసిథ్థులు సంపాదించారని, వాటిని అవసరమయినపుదు తన భక్తులు కోరినప్పుడు వారిని కష్టాలబారినుండి పడవేయడానికి ఉపయోగించేవారని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. సాయిబాబాయే ఈ భూప్రపంచం మీద భగవంతుని అవతారం కాబట్టి, ప్రకృతి శక్తులు కూడా, ఆయన చెప్పినట్లు సానుకూలంగా శిరసావహించేవి.
అప్పుడు వర్షాకాలం రోజులు. మథ్యాన్నం నించి వర్షం కురుస్తూ ఉంది. ప్రకృతి శక్తులు కూడా, ప్రకృతి శక్తులు కూడా, సాయంత్రమయేసరికి వర్షం యింకా పెద్దదయింది. ఆకాశంలో దట్టంగా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఈదురుగాలులు వీయడం మొదలైంది.

ఉరుములతో కూడిన గాలివాన వచ్చే సూచనలు బాగా కనిపించాయి. ఆకాశంలో మెరుపులు మెరుస్తూ వాటివెనకే పెద్ద ఉరుముల శబ్దాలు కూడా వస్తున్నాయి. ఆ తుఫాను బాగా తీవ్రంగా ఉండి షిరిడీ గ్రామమాన్నంతా విపరీతమయిన వర్షం బాగా గట్టిగా కొడుతోంది.

ప్రతీచోటా నీరు నిలిచిపోవడంతో, అంతకుముందెప్పుడూ అటువంటి ఉరుములు మెరుపులతో కూడిన కుంభవృష్టి చూడకపోవడంతో గ్రామస్తులంతా తమ పశువులతో ద్వారకామాయిలోకి వచ్చి గుమికూడటం మొదలెట్టారు. మా నాన్నగారూ యేమీ తీసిపోలేదు. ఆయన కూడా ద్వారకామాయిలోకి వచ్చారు. మా నాన్నగారు భగవద్గీతలో లో కృష్ణపరమాత్మ, అనుకోకుండా వచ్చిన కనీవినీ యెరుగని ప్రకృతి ఆగ్రహాన్నించి సమస్త ప్రాణులను గోవర్థనగిరి పర్వతం యెత్తి రక్షణ కల్పించిన సంఘటనని గుర్తు చేసుకున్నారు. అక్కడున్నవారందరికీ అటువంటి భయానక పరిస్థితినుండి రక్షించడానికి 'గోవర్థనగిరీ లాంటివాడు మాత్రమే రక్షించగలడు. అటువంటివాడి అవసరం యిప్పుడు షిరిడీవాసులకు అవసరమయింది.
అందరూ కూడా ఆందోళనలో ఉండి తమ మీద బాబా అనుగ్రహం కోసం యెదురు చూస్తున్నారు. తుఫాను తగ్గే సూచనలు యెక్కడా కనపడలేదు. వెంటనే బాబా ఓర్పు కూడా నశించింది. ఆయన తనున్న చోటునించి లేచి, సటకా చేతిలోకి తీసుకుని ద్వారకామాయి ద్వారం దగ్గిరకి దిగి వచ్చారు. ఆయన అక్కడ ఆరుబయట నిలబడ్డారు. ఆకాశంలో తీవ్రమైన మెరుపు మెరిసింది. బాబా సటకాతో నేలమీద కొట్టి తీవ్రమయిన స్వరంతో గర్జిస్తూ యిక్కడినించి వెళ్ళిపో అన్నారు (జాతేస్కి నై -- మరాఠీలో) ఆయన గర్జింపుయొక్క శబ్ద తీవ్రత యెంతెలా ఉందంటే షిరిడీలో భూకంపం వచ్చిందా అన్నంతగా అక్కడి ప్రదేశం వణికి పోవడం మొదలెట్టింది. మరొకసారి తీవ్రమయిన మెరుపు, షిరిడీనుంచి వెళ్ళిపొమ్మని వరుణదేవుడిని అడుగుతూ బాబా సటకాతో నేలమీద కొట్టడం. ఈవిథంగా మూడు సార్లు జరిగింది. అది రెండు మానవాతీత శక్తుల మథ్య పోరాటమని స్పష్టంగా కనపడుతోంది.బాబా అభ్యర్థన్లకనుగుణంగా తుఫాను, మెరుపులు ఆగిపోయాయి. వర్షం తగ్గి గాలులు మెల్లగా వీచాయి. సుమారు ఒక గంట తరువాత మరొకసారి అంతా ప్రశాంతంగా అయింది. ఆకాశం నిర్మలంగా ఉంది. బాబా అందరినీ తమ తమ యిళ్ళకు తిరిగి వెళ్ళమ ని చెప్పారు. మా నాన్నగారు తన సాయంత్ర విథి ప్రకారం యథావిథిగా పెట్రొమాక్స్ దీపాలని వెలిగించారు. ఆయుథ్థం గురించి బాబాని అడుగుదామని తగిన సమయం కోసం చాలా యిదిగా ఉన్నారు. యిప్పుడా సమయం వచ్చింది. ఆయన బాబాని, ఆయనకి ప్రకృతిని కూడా శాసించగల స్థాయి ఉందా అని అడిగారు. బాబా సమాథానం చెబుతూ "భావూ ! నా భక్తులు కష్టాలలో ఉన్నప్పుడెల్లా నేను విశ్వమంతటికీ ప్రభువైన భగవంతుడిని, ఆయన దయని వారిమీద కురిపించమని ప్రార్థిస్తాను. భగవంతుడు నా రక్షణకు వచ్చి నాకు సహాయమందిస్తాడు. మా నాన్నగారు ఆ దృశ్యాన్ని మరచిపోలెకపోయారు. అది బాబా వర్షంలోమథ్యలో నిలబడి వరుణదేవునితో షిరిడీని వదలి వెళ్ళిపొమ్మని గట్టిగా అరవడం. బాబా తనే భగంతునిగా విలక్షణమైన రీతిలో కనిపించారు.
సర్వ్మ్ శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment