13.08.2011 ఆదివారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు
అగ్ని మీద అధికారం
ఒక సారి ద్వారకామాయిలొ పవిత్రాగ్ని ఉన్నచోట,బాబా వెలిగించిన "థుని" బాగా భయంకరంగా మండిపోవడం మొదలు పెటింది బాబా గారు అప్పటికే ఈ ప్రపంచాన్నించి వదలి వెళ్ళిపోతారని ముందుగానే సూచించారు. అందుచేత నేననుకోవడం "విజయదశమి" రోజు ప్రముఖంగా మనకు తెలిసిన దసరా. అది సాయంత్ర సమయం. మా నాన్నగారు కూడా అక్కడే ఉన్నారు.
ప్రతి సాయంత్రం ఆయన ద్వారకామాయికి వచ్చి, అక్కడ కూర్చుని ఆసక్తికరంగా జరిగే వాటినన్నిటినీ గమనిస్తూ తరువాత పెట్రొ మాక్స్ దీపాలు వెలిగిస్తూ తన విథిని నిర్వహిస్తూ ఉండేవారు.ఆ రోజు బాబా హటాత్తుగా లేచి నుంచున్నారు. థుని వద్దకు వెళ్ళి కొన్ని కట్టెలను కదిపి ద్వారకామాయిలో పైకి కిందకి చూస్తూ ఏదో గొణగడం మొదలు పెట్టారు. యిది చాలా అసాథారణమైనది. మా నాన్నగారికి అనుకోని సంఘటన. ఏదో జరగబోతోందనిపించింది. నేనిక్కడ తప్పకుండా చెప్పవలసినదేమిటంటే పుట్టుకతో బాబా మతం హిందువా, ముస్లిమా అని తెలుసుకోవాలనే ఆత్రుతతో ఆ రోజుల్లో చాలా మంది భక్తులుండేవారు. ఏమయినప్పటికీ ఆయన మానవ రూపంలో ఉన్నారు కాబట్టి, ఆయన తన పుట్టుకని కూడా మానవ శరీరం నించే తీసుకుని వుండచ్చు. కాని అటువంటప్పుడు ఆయన తలిదండ్రులు హిందువులా, ముస్లిములా అన్నది ప్రశ్న? మా నాన్నగారు కూడా దీనికేమీ తీసిపోరు.
బాబా మెల్లగా కోప స్వభావంలోకి మారుతున్నారు. ఆయన అక్కడ ఉన్న జనాలనందరినీ తిట్టడం మొదలెట్టారు. యిక్కడ థునిలోని మంట కూడా బాబా కోపస్వభావానికనుగుణంగా అదే స్థాయిలో యింకా పైపైకి ఎగసిపడుతోంది. ద్వారకామాయి మొత్తం కట్టెల మంటల వెలుగుతో వెలిగిపోయింది. బాబా యిప్పుడు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆయన తన తలకి కట్టుకున్న నూలు వస్త్రాన్ని తీసి థునిలోకి విసిరివేశారు. హటాత్తుగా నిప్పుమంటలు పైకెగరసాగాయి. బాబావారి పొడవాటి జుట్టు స్వేచ్చ పొందింది. కొంచెం సేపయిన తరువాత బాబా తన కఫ్నీని తీసివేసి దానిని థునిలోకి విసిరేశారు. నిప్పు మంటలు యింకా పైకెగశాయి. ద్వారకామాయి తగలబడిపోతుందా అని ప్రజలు భయపడేంతగ పైకి లేచాయి. బాబా వారి కోపం తారాస్తాయికి చేరింది. ఆయన కోపంగా ప్రజలముందు నిలబడి, సెకను భాగంలో తన లంగోటీని కూడా తీసివేసి మండుతున్న థునిలోకి విసెరేశారు. ఆ విథంగా ఆయన దిగంబరంగా తయారయి అదేస్థితిలో ప్రజలముందు నిలబడ్డారు. అప్పుడాయన అక్కడున్నవారితో తను హిందువా ముస్లిమా అన్నది తేల్చుకోమని గట్టిగా అరుస్తూ అన్నారు. తనకి తాను నిరూపించుకోవడానికి యెటువంటి పథ్థతి? మా నాన్నగారు అప్పుడుచూసిన దానిని నేను మీకిప్పుడు వివరిస్తాను. బాబాగారు తీక్షణమైన అగ్నిలా మండుతూన్న స్థితిలో ఉన్నారని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. ఆయన కను గుడ్లు యెఱ్ఱగా నిప్పు కణికల్లా ఉన్నాయి. వెలుగు కిరణాలని ఉధ్బవిస్తున్నాయి. అ ఆథ్యాత్మిక జ్యోతి గోళపు వెలుగు వెనుక ఆయన శరీరంలోని ప్రతి అణువూ, శరీరం మొత్తం మరుగునపడిపోయింది.
బయట తీవ్రమైన ఉరుములు మెరుపులు. అప్పుడు బాబాకి దగ్గరి భక్తుడైన భాగోజీ షిండే కుష్ఠు వాడు (బాబా అతనిని తన కాళ్ళు నొక్కడానికి అనుమతిచ్చేవారు) ముందుకు వచ్చి యెంతో థైర్యంతో కొత్త లంగోటీని ఆయన మొల చుట్టు కట్టాడు.అప్పుడు బాబా శాంతించి మామూలు స్థితికి వచ్చారు. ఆయన సటకా తీసుకుని థునికి దగ్గరగా వచ్చారు. ఆయన సటకాతో ఊగీ..ఊగీ.. అంటే అర్థం తగ్గు..తగ్గు... అంటూ మంటలను కొట్టడం మొదలెట్టారు. సటకాతో కొట్టే ప్రతి దెబ్బకి మంటలుయెత్తు తగ్గి ప్రతీదీ మామూలు స్థితికి వచ్చింది. అప్పుడు బాబాకి కొత్త కఫ్నీ థరింపచేయడానికి జనానికి థైర్యం వచ్చింది. ఆయన జుట్టును కొత్త గుడ్డ ముక్కతో కట్టారు. అప్పటికి చాలా ఆలశ్యమయినప్పటికీ ఈ భక్తులందరూ బాబాని గౌరవంగా తీసుకుని వెళ్ళి మామూలుగానే సాయంకాలపు ఆరతి యిచ్చారు.
మా నాన్నగారిని యెక్కువగా ముగ్థుడిని చేసిన దేమిటంటే బాబాగారి దైవాంశసంభూతమయిన ఘనమైన శరీరం నించి వెలుగు ప్రసరించడం. అగ్నిమీద ఆయన తన శక్తినుపయోగించి అదుపులో పెట్టడం. బాబా విజయదశమిని ఒక కారణం చేత యెన్నుకున్నారు. ఆయన తాను ఈ ప్రపంచాన్నించి ఈరోజున సెలవు తీసుకుంటున్నాననడానికి గుర్తుగాతనభక్తులకు సూచించారు. తరువాత 1918 లో విజయదశమి రోజున బాబా సమాథి చెందారు.
ప్రియ సాయిభక్త పాఠకులారా యిది చదివిన తరువాత మనమందరమూ కూడా బాబా మతమేమిటన్న ఆత్రుతని సమాథి చేయాలనుకుంటున్నాను. యెక్కువ భక్తితో 100 శాతం నమ్మకంతో అయనని సామాన్యంగా పూజించాలి. సాయి అంటే "సాక్షాత్తు ఈశ్వర్" (భగవంతుడు) ఆయనకి మతం లేదు. అంతటా అన్నింటా నిండి ఉన్నాడు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment