

సాయితో మరికొన్ని అనుభవాలలో ....
నానావలీ కోతి చేష్టలు
మోరేశ్వర్ ఆస్త్మా వ్యాధి నయమగుట
పుచ్చకాయ తొక్కను తినుట
కీటకాలను చంపుట
బాబాతో మరికొన్ని అనుభవాలు
ప్రియమైన పాఠకులారా ! యింతకు ముందు చెప్పినట్లుగా మా నాన్నగారు సుమారుగా 17 సార్లు షిరిడీకి వెళ్ళారు. అలా వెళ్ళిన ప్రతిసారి 7 రోజుల నుంచి ఒక నెల దాకా వుంటూండేవారు. అక్కడున్న కాలంలో వారు ఆసక్తికరమయిన లీలలను చూడటం జరుగుతూ ఉండేది. వారికి షిరిడీని వదలి వెళ్ళాలనిపించేది కాదు. కాని, బాబా యెప్పుడయితే వానిరి షిరిడీనించి వెళ్ళిపొమ్మనేవారో అప్పుడు వారు షిరిడీ నుంచి వెళ్ళిపోయేవారు. మా నాన్నగారి వద్ద అటువంటి మంచి అనుభవాల సేకరణ ఉంది, నాకవన్నీ గుర్తుండకపోవచ్చు. ఈ అనుభవాలలో సాయి సచ్చరిత్రలో వివరింపబడని కొన్నిటిని ఈ అథ్యాయంలో వివరించటానికి ప్రయత్నిస్తాను. ఆ రోజులలోనున్న సాయి భక్తులకు అటువంటి అనుభవాలు యెన్నో కలిగే ఉంటాయని నాకు బాగా తెలుసు, వారు వాటిని తమ దగ్గరవారికి కూడా చెప్పే ఉంటారు. బాబా మీద నాకున్న స్సచ్చమైన ప్రేమ, భక్తి వల్ల నేను వాటిని మీకు వివరిస్తున్నాను.
నానావలీ
సాయిబాబాకి తలతిక్క స్వభావం గల నానావలీ అనే భక్తుడుండేవాడు. నేనతనిని చంచల స్వభావి అని స్వేచ్చగా అనడానికి కారణం అతను కోతిచేష్టలు చేస్తూ ఉండేవాడు. అవి జనాలకి కోపం తెప్పిస్తూ ఉండేవి. వారు అతని దుష్ప్రవర్తన గురించి బాబాకి ఫిర్యాదు చేస్తూ ఉండేవారు. మానాన్నగారికి నానావలీ అంటే వేరొక విథమైన ఆదరణ ఉండేది. అతను హెర్నియాతో బాథపడుతూ ఉండటం వల్ల, అలా పెరిగిన భాగం నేలను తాకుతూ ఉండేది. అతను ఆ విథంగానే నడుస్తూ ఉండేవాడు.
అప్పుడప్పుడు అతను గుడ్డ పీలికలని తన పైజామాకి వెనకాల కట్టుకుంటూ ఉండేవాడు. అది పొడుగ్గ తోకలాగా తయారయేది. అప్పుడతను కోతిలాగా గెంతుతూ ఉండేవాడు.

గ్రామంలోని పిల్లలంతా అతని కోతి చేష్టలకి పరిహాసంచేస్తూ ఉండేవారు. ఆ స్థితిలో అతను బాబా దగ్గిరకి పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లల తాకిడినించి రక్షించమనేవాడు. ఈ మనిషి అంత హెర్నియాతో ఉండి కూడా అంత వేగంగా యెలా పరిగెత్తగలిగాడో అని మా నాన్నగారు విస్మయం చెందుతూ ఉండేవారు. అతను పిచ్చివాడని ఆయనెప్పుడూ అనుకోలేదు. నానావలి మా నాన్నగారిని 'గవాల్యా' అని పిలుస్తూ ఉండేవాడు. ఆయనని భోజనం కోసం అర్థిస్తూ ఉండేవాడు. అప్పుడు మా నాన్నగారు సగుణ నడిపే హొటలుకు వెళ్ళి అతనికి కడుపునిండా భోజనం పెట్టమని చెప్పేవారు. మా నాన్నగారి అభిప్రాయం ప్రకారం సాయిబాబా, నానావలీ, రాముడు, ఆయన గొప్పభక్తుడైన హనుమాన్ జంటలా ఉండేవారనుకునేవారు. ఒకసారి నానావలీ బాబాతో తనని ఆయన ఆసనంలో కూర్చోనిమ్మని అథికారికంగా అడిగాడు. బాబా అతన్నదానికి అనుకూలంగా స్పందించి తన ఆసనం నుండి లేచి, నానావలిని అక్కడ కూర్చోనిచ్చారు. నానావలి అక్కడ కొంచెంసేపు కూర్చుని లేచి, "దేవా, నువ్వు మాత్రమే ఈ ఆసనాన్ని అథిష్టించగలవు. కారణం అది నీకు తగినది. నా సరియైన స్థానం నీ పాదాల దగ్గిర మాత్రమే" అన్నాడు. బాబాని అలా తన ఆసనంలో కూర్చొనిమ్మని అడగటానికి నానావలికెంత గొప్ప థైర్యం ఉందో , యింకా తనకిష్టుడైన నానావలిమీద బాబా యొక్క అమితమైన ప్రేమ ఆయనని తన ఆసనాన్ని యిచ్చేలా చేయడం మీరందరూ ఊహించుకోవచ్చు. కాని మా నాన్నగారు వారిద్దరినీ రాముడు, హనుమాన్ జంట అనుకోవడానికి కారణం వేరే ఉంది. ఒకసారి నానావలి మానాన్నగారితో " హే గవాల్యా నాతో కూడా రా, నీకొక తమాషా చూపిస్తాను" అన్నాడు. అతను మా నాన్నగారిని ద్వారకామాయికి దగ్గరగా ఉన్న చావడి లోకి తీసుకుని వెళ్ళాడు. బాబా అక్కడ చావడిలో కూర్చుని ఉన్నారు. యిక ఆలశ్యం చేయకుండా నానావలి తన ఆకారాన్ని తగ్గించుకుని 'హండీ' లో (హండీ - చావడిలో పై కప్పుకి చిన్న చిన్న తాళ్ళతో కట్టబడి ఉన్న గాజు గిన్నెలు) పట్టేటంత చిన్నగా తనకి తాను సులువుగా పైకి గెంతి పైన ఉన్న ఒక హండీలో కూర్చున్నాడు. అతను హండీలో ఒక కోతిలా కూర్చుని మా నాన్నగారిని వేళాకోళం చేశాడు. అది చూసి మా నాన్నగారు ఆశ్చర్య పోయారు. అది నమ్మశక్యం కానిది. అది ఒక అద్భుతం తప్ప మరేమీ కాదు. నానావలి తన పెద్ద శరీరంతో అంతపైకి యెలా గెంతగలిగాడు. తన శరీరాన్ని దానికి తగినట్లుగా చిన్నది చేసుకుని హండీలో యెలా కూర్చోగలిగాడు. అది సామాన్యంగా ఆశ్చర్యకరమైనదీ, నమ్మశక్యం కానిదీ. అప్పుడాయన సాయిబాబా నానావలీ యిద్దరూ రాముడు, హనుమంతుడు అవతారాలని అర్థమయింది. ఆయన వెంటనే బాబా ముందు సాష్టాంగపడి ఆయనని పూజించారు.
ప్రియమైన సాయి భక్త పాఠకులారా, బాబా సమాథి చెందిన తరువాత నానావలి చాలా విచారంలో మునిగిపోయి పదమూడవ రోజున అతను ఈ ప్రపంచాన్ని వదలి వెళ్ళిపోయాడు. లెండీ బాగ్ ద్వారానికి తూర్పువైపున నానావలి సమాథి ఉంది. నేను షిరిడీ వెళ్ళినపుడు యెప్పుడూ దానిముందు నమస్కరిస్తాను. లార్డ్ సాయికి, ఆయన లీలలకు కోటి కోటి ప్రణామాలు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
మోరేశ్వర్ ఆస్త్మా నయమగుట
మోరేశ్వర్ బాబాబాకు సన్నిహిత భక్తుడు. ఆయన బొంబాయి హైకోర్టు జడ్జీ. ఆయన ఆస్త్మాతో విపరీతంగా బాథ పడుతున్నారు. ఆయన మా తాతగారితో బ్రిడ్జ్ ఆట (పేకాట) లో భాగస్వామిగా ఉండేవారు. ఆయన ఆస్త్మా తగ్గడానికి మాతాతగారు ఆయనని షిరిడీ వెళ్ళమని సలహా యిచ్చారు. ఆయనందుకు ఒప్పుకున్నారు. ఆయన షిరిడీకి మొట్టమొదట వెళ్ళగానే, బాబా ఆయనకి స్వయంగా చిలిం (ఒక మట్టి గొట్టంతో బాబా పొగ పీలుస్తూ ఉండేవారు) యిచ్చి పీల్చమన్నారు. మోరేశ్వర్ కొంచెం ఆండోళన పడ్డారు, కాని చిలిం పీల్చారు. అది ఒక అద్భుతం. ఆక్షణం నించీ ఆయనకి ఆస్త్మా రాలేదు. ఒక వ్యక్తి వ్యాథిని నయం చేయడానికి యెటువంటి విచిత్రమైన విథానం? మోరేశ్వర్ మా తాతగారికి థన్యవాదాలు చెప్పుకున్నారు. అప్పటినుంచి ఆయన శ్రీ సాయిబాబా కి గొప్ప భక్తుడయ్యారు. అది 1918 సం. విజయదశమి రోజు మధ్యాహ్న్నం తరువాత హటాత్తుగా మోరేశ్వర్ గారికి ఆస్త్మా వచ్చింది. అది చాలా విపరీతంగా ఉండటంతో ఆయన తన సేవకుడిని బాంద్రా పంపి మా తాతగారిని శాంతాక్రజ్ లో ఉన్న తన యింటికి రమ్మన్నారు. మోరేశ్వర్ గారి సేవకుడు మా తాతగారితో తన యజమాని హటాత్తుగా జబ్బుపడ్డారని, వెంటనే వచ్చి సహాయం చేయమని అడిగాడు. మా తాతగారు మా నాన్నగారితో కలిసి యింటినుంచి బయలుదేరారు. వారు తమతో కూడా వారు ఆఖరుసారి షిరిడీ వెళ్ళినపుడు బాబా స్వయంగా యిచ్చిన ఊదీని తీసుకుని వెళ్ళారు. మోరేశ్వర్ విపరీతమైన బాథతో ఉండటం చూశారు. మాతాతగారాయనని ఓదార్చారు. మా తాతగారు గ్లాసు నీళ్ళలో ఊదీని వేసి మోరేశ్వర్ తో దానిని తాగమన్నారు. మోరేశ్వర్ ఆయనని తన సన్నిహిత స్నేహితునిగా భావిస్తున్నందున ఆయన చెప్పినట్లు చేశారు. యెప్పుడయితే ఆయన ఆనీటిని తాగారో ఆయన బాథయొక్క తీవ్రత తగ్గుతూ కొంత సేపటికి ఆయనకి నయమనిపించింది. మోరేశ్వర్ మా తాతగారితో, బాబా తన ఆస్త్మా పూర్తిగా నయమయిందని చెప్పినా మరి మరలా యెందుకు తిరగబెట్టిందని అడిగారు. మా తాతగారు ఆయనతో చింతించవద్దని, ఒకవేళ మరలా వస్తే కనక బాబా ఊదీనే మందులా తీసుకోమని చెప్పారు.
యేమయినప్పటికీ మోరేశ్వర్ యిక యేమీ చేయనవసరం లేకపోయింది. ఊదీ తీసుకున్నందువల్ల ఖచ్చితంగా ఆస్త్మా తగ్గిపోయింది కాని ఈ సంఘటన వెనుక వేరే ఏదో సందేశం ఉంది. వారికది తరువాత అర్థమయింది. అదేరోజు సుమారు మధ్యాహ్న్నం 2 గంటలకి షిరిడీ సాయిబాబా సమాథి చెందారు. అలా చెందుతూ ఆయన తనదైన సంక్లిష్టమయిన పథ్థతిలో తన అంకిత భక్తులకి తంత్ర రహిత (వైర్లెస్) సందేశం పంపించారు. మ తాతగారికి, నాన్నగారికి ఆ తంత్రరహిత సందేశం వచ్చింది. దానిని గురించి మీకు తరవాతి అథ్యాయంలో వివరిస్తాను.
పుచ్చకాయ తొక్కను తినుట
బాబా గారు జీవించి ఉన్న కాలంలో షిరిడీ వెళ్ళిన కొంతమంది ఆయన ఆశీర్వాదములని పొందలేకపోయేవారు. వారికి ఆయన మీద నమ్మకం లేకపోవడం వల్ల కావచ్చు లేక వారికి సహనం లేకపోవడం వల్ల కావచ్చు. వీరంతా థనిక వర్గానికి చెందినవారు. షిరిడీ వెళ్ళినపుడు పేదవానిగా కనపడే ఆయన జీవిత విథానాన్ని చూసి అటువంటి 'ఫకీరు' తమ సమస్యలని యెలా తీర్చగలడా అని ఆలోచిస్తూ ఉండేవారు. కాని, బాబా సమస్యలని పరిష్కరించే విథానం చాలా వినోదకరంగానూ, మొదటి కలయికలోనే అర్థం చేసుకోవడానికి కష్టంగానూ ఉండేవి.
అది వేసవికాలం. తట్టనిండా పుచ్చకాయలు పెట్టుకుని అమ్ముకునే ఒకామె ద్వారకామాయి దగ్గరకొచ్చింది. బాబా మొత్తం పుచ్చకాయలన్నిటినీ కొనేశారు. ఆయన ఒకటి కోసి ముక్కలు చేసి అక్కడున్న భక్తులందరికీ పంచడం మొదలెట్టారు.

వారందరూ పుచ్చకాయ తింటూ ఆనందిస్తున్నారు. అక్కడే ఉన్న మా నాన్నగారికి బాబా పుచ్చకాయ ముక్కనివ్వలేదు. ఆ సమయంలో మంచి దుస్తులు థరించిన ఒక థనికుడు తన యిద్దరు సేవకులు తోడు రాగా ద్వారకామాయిలోకి ప్రవేశించాడు. అతను చక్కెర వ్యాథితో బాథ పడుతున్నాడు. యెవరో యిచ్చిన సలహా మీద అతను షిరిడీకి వచ్చాడు. బాబా ఒక వినోదం చేశారు. ఆయన ఒక ముక్కని తీసుకుని తొక్కని, గుజ్జు భాగాన్ని వేరు చేశారు. గుజ్జుని మా నాన్నగారికి తొక్కని థనికివ్యక్తికి యిచ్చి తినమన్నారు. ఆ థనికుడు కొంచెం కలవర పడి తొక్క తినడానికి తాను ఆవుని గాని, మేకను గాని కానని చెప్పాడు. బాబా దానినే మా నాన్నగారికిచ్చి "హే భావూ, నువ్వే దీనినిప్పుడు తినాలి" అన్నారు. మా నాన్నగారు దానిని కొరికినప్పుడు ఆశ్చర్యకరంగా అది అరటిపండులాగా మెత్తగా ఉండి తను అంతకు ముందు తిన్న గుజ్జుకన్నా మథురంగా ఉంది.తన జీవితంలో యెప్పుడు అటువంటి తీయని పుచ్చకాయను తినలేదని మా నాన్నగారు చెపుతూ ఉండేవారు. ఆ థనిక వ్యక్తి సిగ్గుపడి అక్కడినించి వెళ్ళిపోయాడు. అతను బహుశా తన చక్కెర వ్యాథిని శాశ్వతంగా నయమయే ఆవకాశాన్ని పోగొట్టుకున్నాడు. మా నాన్నగారు తన 70 వ యేట మరణించారు. అప్పటివరకూ ఆయనకు చక్కెరవ్యాథి లక్షణాలు లేవు. ప్రియమైన భక్తులారా, నిజమైన మందు ఆ పదార్థంలో లేదు కాని బాబాగారి పవిత్ర హస్తాలలో ఉంది. ఆయన ఆ పదార్థానికి పవిత్రమయిన స్పర్శనిస్తూ ఉండటంవల్ల అది మథురంగా మారుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్న భక్తులు యెంతో లబ్ధిని పొందారు. బాబా చెప్పిన ముఖ్యమయిన సూత్రాలు 'శ్రథ్థా అంటే నమ్మకం, 'సబూరీ' అంటే సహనం. ఈ రెండు మంత్రాలని ఆచరించినవారికి జీవితంలో యెప్పుడూ విజయమే.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
కీటకాలను చంపుట
బాబా ఉన్నకాలంలో భక్తులు షిరిడీకి వచ్చినప్పుడు వారు స్వచ్చందంగా కొన్ని పనులు చేస్తూ ఉండేవారు. (విథులు నిర్వర్తిస్తూ ఉండేవారు) ద్వారకామాయిని శుభ్రం చేయడం, బాబా ద్వారకామాయి నుండి లెండీ బాగ్ కి రోజూ నడచి వెడుతూండే దారిని శుభ్రం చేయడంవంటివి చేస్తూ ఉండేవారు. ఈ విథులు యెవరికీ కూడా చేయమని యెవరూ అప్పగించలేదు. కాని భక్తులే అటువంటి సామాజిక సేవల ద్వారా తమ భక్తిని (పూజని) బాబాకి సమర్స్పిస్తున్నట్లుగా వాటిని చేస్తూ ఉండేవారు. షిరిడీలో నివసించే భక్తులు అటువంటి విథులన్నిటినీ క్రమం తప్పకుండా చేస్తూ ఉండేవారు. మా నాన్నగారు షిరిడీ వెళ్ళినపుడెల్లా పెట్రొ మాక్స్ దీపాలను శుభ్రం చేయడం, సాయంత్రం వేళల్లో వాటిని వెలిగించి ద్వారకామాయి అంతటా వాటి వాటి స్థానాల్లో వేలాడదీయడం వంటి బాథ్యత ఆయన తీసుకుని చేసేవారు.


బాబావారి బోథనలు చాలా సరళంగానూ, నచ్చచెప్పే పథ్థతిలోనూ ఉంటాయి. ఈ సంఘటన ద్వారా ఆయన మా నాన్నగారికి మంచి సలహా మందు వేసి భగవంతుడు చేసే పనిని గురించి యెరుకతో ఉండేలా చేశారు.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
(మరికొన్ని తరువాయి భాగంలో)
0 comments:
Post a Comment