

16.08.2011 మంగళవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంథువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు యితర సాయి లీలలలో మరొక లీల తెలుసుకుందాము.
సాయితో మరికొన్ని అనుభవాలలో
అగ్నితో యుధ్ధం
ప్రియమైన సాయి భక్తులారా ! ప్రమాదవశాత్తు కొలిమిలో పడ్డ కుమ్మరివాని కుమార్తెను బాబా రక్షించారని మీకు తెలుసు. అలా చేస్తున్నపుడు ఆయన చేతులకి విపరీతంగా కాలిన గాయాలయ్యాయి. భాగోజీ షిండే అనే కుష్టువాడు ఆయన గాయాలకు నెయ్యి రాసి గుడ్డ పీలికలతో కట్టు కట్టేవాడు. బాబా తనచేతులనే తెడ్డుగా ఉపయోగించి వేడి పప్పును గాని మాంసపు కూరను గాని కలియబెట్టే వారు. ఈ పదార్థాలనే ఆయన భక్తులకు ప్రసాదంగా యిచ్చేవారు. ఆయన పవిత్రమైన చేతుల స్పర్శ ఆ పదార్థాలని విపరీతమైన ఔషథగుణాలతో ప్రభావితం చేసేదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. వాటిని ప్రసాదంగాతిన్నపుడు అది వెంటనే అన్ని రోగాలను పారద్రోలేది. యేమయినప్పటికి యిక్కడ మీకందరకు అపూర్వమైన సంఘటన ఒకటి వివరిస్తాను.
ఒక రోజు పొద్దున్నే మా తాతగారు ఒక కల కన్నారు. ఆయన, కలలో ఖటావూ మిల్ల్స్ అగ్నిజ్వాలలలో ఉండటం చూశారు. దాని ఫలితంగా ఆయనకి నిద్రా భంగమయింది. భోజనాల బల్ల వద్ద ఆయన మా నాన్నగారికి ఈ విషయంగురించి చెప్పినప్పుడు వారు మిల్ల్స్ యజమాని ధరంసీ ఖటావూ గారికి తెలియ చేద్దామని నిర్ణయించుకున్నారు. గ్రూపు ఆఫ్ మిల్ల్స్ కి సెక్రటరీగా ఆయన, మిల్ల్స్ కి తగిన విథంగా అగ్నిప్రమాదాలకి రక్షణగా భీమా చేయించమని మిల్ల్స్ యజమానికి సలహా యిచ్చారు. ఆ రోజుల్లో భీమ రక్షణ సాథారణం కాదు. యెందుకంటే దానికి పెట్టే డబ్బు ఖర్చు లాబాలలో తగ్గిపోతుందని
ఫైనాన్షియల్ మానేజర్స్ (ఆర్థిక నిర్వాహకులు) (మునింజీ) వ్యతిరేకించేవారు. ఆఖరికి మా తాతగారు ధర్మసీ గారిని ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు. వారు మొత్తం టెక్స్ టైల్ మీల్ కి తిరిగి మదింపు చేయడానికి యేర్పాటు చేసి, మిల్ల్ యొక్క పెంచబడిన విలువకి భీమా రక్షణ తిరిగి రాయించారు.
5, 6 నెలల తరువాత ఒక రోజు పొద్దున్నే మిల్లులో అగ్నిప్రమాదం జరిగిందని మిల్లునించి ( S O S ) వార్త వచ్చింది. వారు వెంటనే బయలుదేరి మిల్లు దగ్గిరకి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే మిల్లులోని వీవింగ్ డిపార్ట్ మెంట్ మంటల్లో ఉండటం చూశారు.

వారిద్దరూ ఆ మంటలని ఆర్పమని, మిల్లు పూర్తిగా నాశనమవకుండా, సహాయం చేయమని బాబాని కోరుతూ ప్రార్థించారు. వారు వీవింగ్ డిపార్ట్ మెంట్ ఉన్న రెండవ అంతస్థులోకి యెక్కి వెళ్ళేసరికి, అక్కడ ఒక ఫకీరు తలకి ఒక గుడ్డ కట్టుకుని మంటల మధ్యలో నిలబడి తన రెండు చేతులను ఊపుతూ మంటలనార్పడానికి ప్రయత్నిస్తూ ఉండటం చూసి వారు చాలా ఆశ్చర్యపోయారు. మా తాతగారు మా నాన్నగారితో "మంటలనార్పడానికి ప్రయత్నిస్తున్నది మన బాబా కాదూ ?" అన్నారు. బాబా తమ ప్రార్థనలకు స్పందించారని వారికి నిర్థారణ అయింది. మంటలు అదుపులోకి రావడానికి ఒక గంట పైన పట్టింది. వీవింగ్ డిపార్ట్ మెంటుకు జరిగిన నష్టం పరిమితంగానే ఉండటం వల్ల మిల్లును మూసివేయాల్సిన అవసరం లేకపోవడంతో వారంతా ఊపిరి పీలుచుకున్నారు. భీమా రక్షణ కూడా ఉండటంవల్ల ఆర్థికంగా జరిగిన నష్టాలకి భీమా నష్ట పరిహారం కూడా వచ్చింది.
మిల్లులో కార్యకలాపాలు సాథారణ స్థితికి చేరుకోగానే వారిద్దరూ షిరిడి వెళ్ళి బాబాకు థన్యవాదాలు తెలుపుకున్నారు. వారు ద్వారకామాయి మెట్ల దగ్గర ఉన్నప్పుడు బాబా మా తాతగారితో, "ఏయ్ ! ముసలివాడా ! (మ్హతార్యా) నీ మిల్లుని యెవరు నిర్వహిస్తున్నారు?" అన్నారు. మా తాతగారు ఆయన పాదాల ముందు సాగిలపడి తమందరిమీద నిరంతరం ఆయన దీవెనలు యిస్తూ ఉండమని చెప్పారు. మంటలతో యుథ్థం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఆయన అక్కడికక్కడే, నిజమైన సెక్రటరీ ఆయనే అని బాబాకి నిర్థారణగా చెప్పారు. యిది వినగానే బాబా తన ఆసనం నించి లేచి, బాబా సాహెబ్ తార్ఖడ్ ని కిందనించి లేపి " హే ముసలివాడ, పైకి లే,అత్యంత ప్రమాదాల బారినుండి నా భక్తులను బయటకు లాగడానికి నేను కట్టుబడి ఉన్నాను గుర్తుంచుకో" అన్నారు. ఈ ద్వారకామాయినుండి నా భక్తుల కోసం నేను సర్వ కార్యములు నిర్వహిస్తాను. నాభక్తుడు నాకు ప్రమాద సంకేతం యిచ్చిన వెంటనే అతను ఈ ప్రపంచంలో యెక్కడ ఉన్నా సరే నేనక్కడ అతని సేవకై ఉంటాను."
అది ఒక అపూర్వమైన సంఘటన అని మీరంతా నాతో ఏకీభవిస్తారని నాకు తెలుసు.
ఓ లార్డ్ సాయీ నేను నీముందు నీ లీలలముందు వినయమగా నమస్కరిస్తున్నాను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.
0 comments:
Post a Comment