26.08.2011 శుక్రవారము
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు శ్రీమతి ప్రియాంకా గారి ఆంగ్ల బ్లాగునుండి బాబా 9 గురువారముల వ్రత మహాత్మ్యము , అమెరికా నుండి శ్రిమతి సుప్రజగారు పంపిన బాబా మీద ఒక పాట, శ్రి నగేష్ గారి షిరిడీ యాత్రలోని అనుభూతులను తెలుసుకుందాము.
సాయి తొమ్మిది గురువారముల వ్రతము - శివ
సాయిరాం,
ప్రపంచం నలుమూలల ఉన్న సాయిభక్తులు సాయి 9 గురువారముల వ్రతమాచరించి మంచి ఫలితాన్ని పొందారనిమనకు తెలుసు.
ఇది చాలా శక్తివంతమైనదని, మహిమగలదని రాయవలసిన అవసరం లేదు. దాని శక్తియొక్క తీవ్రత సూటిగా మీకు బాబా మీద ఉన్న నమ్మకం మీద ఆథారపడి ఉంటుంది. యెవరైనా సరే , వయసు, కులం, ఆడ/మగ వివక్షత లేకుండా, మతం, వీటి నియమనిబంధనలు ఏమీ లేకుడా చేయవచ్చు. బాబా రోజు ఏరోజైనా సరే ఈ వ్రతాన్ని ఆరంభించవచ్చు.
ఇప్పుడు నేను సాయి సోదరుడు శివ యొక్క సాయి వ్రతం అనుభవాన్ని మీకు వివరిస్తాను. ఈ సుందరమైన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నందుకు నేనతనిని అభినందిస్తున్నాను.
మీరు కూడా మీ సాయి తొమ్మిది గురువారముల వ్రత అనుభవాలను పంచుకోవాలనుకుంటే నాకు మైల్ చేయండి. ఈ వ్రతాన్ని గురించిన సందేహాలు యేమన్నా ఉంటే ఈ పోస్ట్ దిగువన మీ వ్యాఖ్యను వ్రాయండి. అల్లాహ్ మాలిక్
మీతో ఈ అనుభవాన్ని పంచుకోవడానికి నాకీ అవకాశమిచ్చిన పవిత్రమూర్తికి నా శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
నేను నా జీవితంలో గొప్ప కష్టాలలో ఉన్నప్పుడు, బాబా నా జీవితంలోకి వచ్చారు. బాబా నన్ను, మా కుటుంబాన్ని జీవితంలో యెన్నో కష్టాలనుండి అనవసరమైన పరిస్థితులనుండి రక్షించారు.
చాలా కాలంగా మాజీవితాల్లో యేమి జరుగుతోందన్నది మేమెరగము. మాస్టర్ (బాబా) మీద నానమ్మకం చంచలంగా ఉంటూఉండేది కాని యెలాగో బాబా నన్ను సరైన గాడిలోకి తీసుకువచ్చారు.
చాలా అనుభవాలలో నేనొక అనుభూతిని వివరిస్తాను. (తొమ్మిది గురువారాల వ్రత మహత్యం)
కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల నాకు ఇప్పుడు చేస్తున్నలాంటిదే మరొక మంచి ఉద్యోగం వస్తుందనే ఆశతో చేస్తున్న ఉద్యోగాన్ని వదలిపెట్టిన రోజులలో జరిగిందిది. మొదటి రెండు నెలలు నాకు తొందరలోనే మంచి ఉద్యోగం వస్తుందని బాగా ఆశతో ఉన్నాను. పరిస్థితులు దిగజారడం మొదలెట్టాయి, నా తల్లితండ్రులు కూడా నా భవిష్యత్తు గురించి ఆందోళన చెందసాగారు.
యింకా చెప్పలంటే నా మూర్ఖత్వం వల్ల మా నాన్నగారికి ప్రమాదం సంభవించింది.
చేతిలో డబ్బు లేక నేను చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నాన్నగారి మంచి మిత్రులు కొంతమంది సహాయంతో, నా బంధు వులతోనూ పరిస్థితిని నెట్టుకొస్తున్నాము.
యిదంతా కూడా నా సోదరి తొమ్మిది గురువారముల వ్రతం చేస్తున్నప్పుడు, జరిగింది. అది నాకు తెలీదు. ఆమె 8 వ్రతాలు పూర్తి చేసింది, కాని మా నాన్నగారు ఆస్పత్రిలో ఉండటంవాల్ల ఆఖరి గురువార వ్రతం చేయలేకపోయింది.
కాని బాబా దయతో అన్నీ చక్కబడ్డాయి. మా నాన్నగారు చాలా త్వరగానే కోలుకుని, యింతకుముందులాగే యెటువంటి బాధ లేకుండా నడవగలుగుతున్నారు.
ఆఖరి గురువారమునాడు నా సోదరి ఆఖరి గురువారం వ్రతం పూర్తి చేయగానే, నాకు అదే గురువారమునాడు రెండు కంపెనీలనుంచి పిలుపు వచ్చింది ( ఇది ఒక అద్భుతమైన లీల లేకపోతే యిన్ని నెలలుగా నాకు ఏ కంపెనీ నుంచి పిలుపు రాకుండా, నాసోదరి గురువారము వ్రతము ఉద్యాపన రోజునే పిలుపు రావడమేమిటి) అందరూ చెప్పిన సలహాప్రకారం నేనొకదానిని యెంచుకున్నాను అదికూడా బాబాగారి ఇష్ట పడ్డదె.
అప్పటినుంచీ నేనెక్కడికి వెళ్ళినా బాబాగారు ఉన్నారనే అనుభూతిని పొందడం మొదలైంది.
నేనీ కొత్త కంపెనీ లో ప్రవేశించిన నాలుగు నెలలతరువాత ప్రాజెక్ట్ నిమిత్తమై అమెరికాకి పంపబడ్డాను. ఇక్కడా నాకు గొప్ప ఆశ్చర్యకరమైనది యేమిటంటే నేనొక మంచి మితృడిని సంపాదించాను, అతనుకూడా గొప్ప సాయి భక్తుడు. అతను నన్ను ప్రతి గురువారం సాయి మందిరానికి తీసుకుని వెడుతూ ఉండేవాడు. నిజానికి సాయి నాకు యెంతో మంది స్నేహితులని బహుమతిగా ఇచ్చారు, వారంతా కూడా సాయి భక్తులే.
అందుచేత నేను సాయి భక్త స్నేహితులందరికీ చెప్పదలచునేదేమిటంటే ఈ సాయి తొమ్మిది గురువారముల వ్రతాన్ని కనక నమ్మకంతో చేస్తే నిజంగా అద్భుతంగా ఉంటుంది. మరొక్కసారి నా హృదయాంతరాళలోనించి, నా మాస్టర్ సాయికి, నా ఉద్యోగంకోసం సాయి వ్రతమాచరించిన నా సోదరికి, మా కష్టకాలంలో మమ్మల్ని ఆదుకున్నవారందరికీ, నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
నా సాయి మనందరిమీద ఆయన అనుగ్రహపు జల్లులను కురిపంచుగాక.
సర్వం శ్రీ సాయినాథారపణమస్తు.
అమెరికా నుంచి శ్రీమతి సుప్రజ గారు బాబా మీద ఒక పాటను పంపించారు. దానికి రాగం కూడా కట్టించి ఈ సందర్భంగా ప్రచురిస్తున్నాను.
రాగం : రంజని
ఓ సాయి ఏమని వర్ణింతును నీ లీలలు
మనసులో ఉన్న భావాలు మాటలకందడము లేదే సాయి
నీ లీలలు విని నేను మాటలాడలేక మౌనం పాటిస్తే తండ్రీ
ఓ సాయి ఏమని వర్ణింతును నీ లీలలు
నా మది కోరిక వినపడలేదా ఓ సాయి
లేదా విని పరీక్షిస్తున్నావా ఓ నా ప్రభూ
తల్లివి తండ్రివి నీవేకదా సాయి
నీవు ఆలకించకపోతే ఎవరికి విన్నవించను
నా మది బాధ
నీ కధలు వింటే నీవేదిక్కని నీ చెంతకు వస్తి సాయి
నను దరిచేర్చవోయి నీ ఒడికి, ప్రేమ కురిపించఓయి నాపై
నిన్నే చూడగ నా మనస్సు స్థిరపడె, పాల ముంచిన తేనె ముంచిన భారము నీదేనయ నామొఱ ఆలకించి కనికరించరాదా ఓ సాయి ఈ సారి.
శ్రి నగేష్ గారు హైదరాబాదు నుంచి తమ అనుభవాని పంపించారు. ఆయన ఈ నెల 5 వ తారీకున షిరిడీని దర్శించడం జరిగింది. అక్కడ ఆయనకు కలిగిన అనుభవాలను కూడా ఆయన మాటలలోనే ఆలకించండి.
ఓం సాయిరాం
నా షిర్డీ సందర్శనం చాలా బాగా జరిగింది.4 సార్లు బాబా ను దర్శించుకోవడం జరిగింది
షిర్డీ లో నాకు కలిగిన అనుభవాలు
1 .షిర్డీ లో బస్సు దిగిన వెంటనే భూమాతకు మరియు బాబా కు నమస్కరించుకొని మాకు
కావలసిన అడ్రస్ కోసం చూస్తున్నాము అంతలో ఒక వ్యక్తి నాకు కావలసిన అడ్రస్ ను నాకు వినిపించి వినిపించనట్లు అడ్రస్ ను చెప్పుకొంటూ వెడుతున్నాడు. ఒక 10 సెకండ్స్ తరువాత నాకు విన్పించింది వెంటనే నేను వెళ్లి ఆ అడ్రస్ అడిగి తెలుసుకున్నాను .అలా బాబా నాకు అడ్రస్ చూపించడం జరిగింది.యిది నాకు చాల ఆనందాన్నిచ్చింది.
2
నేను ద్వారకామాయి దర్శనానికి వేరే లైను లో నిలబడి ఉన్నాను ,అప్పుడు ఒక నల్ల కుక్క ఒకటి నా పక్క నుండి వెడుతోంది.. నేను బాబా యే కనక వచ్చి ఉంటే ఆ కుక్క వెనకకితి రిగి నా వద్దకు రావాలి అనుకున్నాను
.అంతలోనే ఆ కుక్క నా పక్కకు వచ్చి కూర్చుంది. కూర్చుని తలను కిందికి మీదికి మూడు సార్లు ఊపడం జరిగింది.
౩.ద్వారకామాయి నుండి బయటకి వచ్చి ప్రసాదం పంచాలని యెక్కడ పంచుదాం లేక వేరే చోట పంచుదామా అని ఆలోచిస్తున్నాము, ఎవరు రావడం లేదు అంతలోనే ఒక గుంపు మా దగ్గరికి వచ్చి ప్రసాదం తీసుకోవడం జరిగింది
యివి నాకు కలిగిన అనుభవాలు ,బాబా నాకు యిచ్చిన అనుభవాలు
-సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు
0 comments:
Post a Comment